vaneetha reddy

స్నేహం

స్నేహం ఎక్కడ పుట్టమో తెలీదు.. ఎలా పెరిగమో తెలీదు.. కానీ ఒక రోజు ఇద్దరం కలిసాము.. నువ్వు నాకు పరిచయం అయిన క్షణం నుండి ఈ రోజు వరకు... నా వెన్నంటే ఉండి నాకు అన్ని విధాలుగా అన్ని వేళలా మంచి, చెడులో నాకు తోడుగా ఉన్నావు.. ఇలాగే ఇప్పటికీ ఎప్పటికీ నువ్వు నాతోనే ఉండాలి.. నన్ను విడిచి వెళ్ళకూడదు.. అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. ఏ స్వార్దం లేకుండా.. ఏ రక్త బంధం లేకుండా.. మన మంచి కోరుకునేది ఓకే ఒక్క బంధం స్నేహ బంధం.. అలాంటి బంధం దొరికితే ఎవరైనా అదృష్ట వంతులే.. మనల్ని కన్న వారితో కూడా అన్ని పంచుకొలేము.. తోడ పుట్టిన వాళ్ళతో అన్ని చెప్పుకోలేని... కానీ మన జీవితంలోకి వచ్చే స్నేహితులకి మాత్రం అన్ని పంచుకుంటాం... అదే స్నేహం యొక్క గొప్ప తనము.. కానీ ఇలాంటి స్నేహాన్ని.. కొందరు స్వార్దం కోసం ఉపయోగించుకుంటున్నారు.. అవసరాల కోసం…
Read More

భర్త ప్రేమ..

భర్త ప్రేమ.. భార్య కోసం భర్త రాసిన ఓ లేఖ నీవేవరో తెలీదు.. మా కన్నవాళ్ళు నిన్ను చూపించి ఇదిగో ఇదేరా నీకు కాబోయే భార్య అన్నారు.. నీ అందాన్ని మాత్రమే చూడగలిగాను.. నీ మనసు ఏంటో తెలీదు.. నువ్వు ఎలా ఉంటావు ఎలా నడుచుకుంటావో తెలీదు.. మా అమ్మ నాన్నలని ఎలా చూసుకుంటావో తెలీదు.. అసలు నువ్వేంటి నీరూపం ఎంటి నీ మనస్తత్వం ఎంటి.. ఇవేమీ తెలీదు.. కానీ మా వాళ్ళు నిన్ను చూపించారు అనే ఒక్క కారణంతో నీ నుదుటిన బొట్టు పెట్టి నీ చిటికెన వ్రేలు పట్టుకొని నీతో ఏడడుగులు నడిచాను.. మా ఇంట్లో అడుగు పెట్టిన క్షణం నుండి నిన్ను అర్దం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా.. కానీ నువ్వు నాకు ఏ మాత్రం అర్దం కావటం లేదు.. మా అమ్మ నన్ను ఎలా చూసుకుందో.. నేను నిన్ను అలాగే కంటికి రెప్పలా ప్రాణంగా ప్రేమిస్తూ వస్తున్నా.. కానీ నువ్వు…
Read More

బంగారు తల్లి

బంగారు తల్లి పుట్టింట్లో గారాబంగా పెరిగిన బంగారు తల్లి. పుట్టింటి మురిపాల తల్లి.. ఘల్లు ఘల్లు మని గజ్జెలు కట్టి ఇల్లంతా సందడిగా తిరిగే ఓ బుట్ట బొమ్మ... కాళ్ళకు పారాణి పెట్టీ అత్తింట్లో అడుగు పెట్టావు.. పుట్టింటి పరువుని అత్తింటికి గౌరవాన్ని కాపాడే ఓ ఇంటి దేవత... ఇంటికి దీపం ఇల్లాలు అంటారు.. ఆలీగా, కోడలిగా, ఆ ఇంటికి వారసులను ఇచ్చే ఓ మాతృమూర్తి.. నీవు ఎక్కడ ఉంటే అక్కడ సిరులు పండే సిరుల తల్లి.. ఎందుకమ్మా చినబోయావు.. ఎందుకమ్మా మూగబోయావు.. ఎందుకమ్మా తల్లడిల్లుతున్నవూ ఎటు పోయాయి నీ సందడి గంతులు.. ఎటు పోయాయి నీ చిరనవ్వులు.. ఎటు పోయాయి నీ కలలు.. కన్న వారి కల తీర్చాలని.. పెళ్లి చేసుకొని నీ కలలు మర్చిపోయావా..? అత్తింటి కట్టు బాట్లకు లోబడి.. నిన్ను నువ్వు కొల్పోయావా..? నిన్ను వంటింటికి పరిమితం చేసి ఇదే నీ సామ్రాజ్యం అని.. వంటింటి యువరానిగా…
Read More

యువత అబద్ధపు జీవితం

యువత అబద్ధపు జీవితం నన్ను మా అమ్మ నాన్నలు ఏ లోటూ లేకుండా పెంచారు. అన్ని సౌకర్యాలు దగ్గర ఉండి చూసుకునే వారు అల్లారు ముద్దుగా పెంచారు ఒక్క కొడుకునే అని.. నా ఇష్టాన్ని కాదు అనలేదు ఏ నాడూ.. నాకంటే ఒక అడుగు ముందే ఉండి అన్నీ సమకూర్చేవారు.. కానీ నాకు చదువు కంటే పాటలు పాడడం అంటే చాలా ఇష్టం.. అమ్మ వాళ్ళకు నేను గొప్పగా చదువుకోవాలి అని ఉండేది. అమ్మ నన్ను ఒకే ఒక్క కోరిక కోరింది.. నువు చదువులో ఫస్ట్ రావాలి అని.. నాకేమో అది అంతగా పట్టక పోయేది.. పాటల వైపు ఎక్కువ ఆసక్తి చూపే వాడిని.. ఇటు చదువు మీద ధ్యాస తగ్గుతూ వస్తుంది.. కానీ అమ్మకు ఆ విషయం చెప్పకుండా.. పాటలు అంటే ఇష్టం అంటే ఎక్కడ కోప్పడుతుందో అని భయంతో చెప్పేవాడిని కాదు.. అలా నేర్చుకోవడానికి అబద్దం చెప్పి చదువు…
Read More

డబ్బు – ప్రేమ

డబ్బు - ప్రేమ ఎవరో చేసిన పాపానికో.. వారి క్షణ కాల కోరికకు బలి అయ్యి.. అనాధగా మారిన బాలుడు. చెత్తకుప్పలో పడిన పసికందు.. ఎవరి పాపమో.. ఎవరి శాపమో..వీడికి శిక్ష.. అనాధగా పెరిగే పరిస్థితి.. చెరదీసింది ఓ ఆశ్రమం.. ఒడిన చేర్చుకుంది.. తల్లి,తండ్రి, గురువు అన్ని తానై నిలిచింది.. దేవుడు తల్లితండ్రులను దూరం చేసిన ఆ అబ్బాయికి ఈ ఆశ్రమం ఒడి చేర్చి కాస్త మేలు చేశాడు.. నారు పోసిన వాడు నీరు పోయడా అన్నట్టు.. రాత రాసిన వాడే గా దారి చూపేది.. అలా చూపాడు.. అయినా ఆ అబ్బాయికి ఇక అంతా మంచి చెడు అన్ని ఆ ఆశ్రమం అయి పెంచింది.. అక్కడే ఉంటూ చక్కగా చదువుకుంటూ.. గొప్ప స్థాయికి ఎదిగాడు..తనకంటూ సమాజంలో ఓ స్థాయి ఓ పేరు సంపాదించుకున్నాడు.. చిన్న వయసులోనే అన్ని విధాలుగా ఒక బ్రాండ్ లా తనని నిరూపించుకున్నాడు... అలా తను సొంతంగా…
Read More

ఆడవాళ్ళు మీకు జోహార్లు

ఆడవాళ్ళు మీకు జోహార్లు పుట్టింట్లో మొదలైన ఆడదాని జీవితం.. బిడ్డగా, చెల్లిగా, అక్కగా, ఆలిగా, తల్లిగా.. అన్ని బాధ్యతలు నెరవేరుస్తూ.. అన్నింటా అడుగడుగునా అవమానాలు మోస్తూ.. అర్ధంతరంగా చదువు ముగించి పెళ్లి చేసి అత్తారింటికి పంపిన ఓ స్త్రీ గాథ.. తను చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు అనుభవించింది.. తనకు చదువు లేదు.. ఇంట్లో పరిస్థితి బాలేక చదువుకోలేకపోయింది. అన్న, తమ్ములకి అండగా.. తల్లి తండ్రులకు భరోసాగా నిలిచింది.. ఏమి తెలియని అమాయకురాలు.. బయటి ప్రపంచం తెలియని ఓ పిచ్చి మాలోకం.. ఇల్లే ప్రపంచం. తన వాళ్ళే ముఖ్యం.. అని తన గురించి కూడా ఏమీ కోరుకోని ఓ మంచి వ్యక్తి.. తనకి పెళ్లి చేసి పంపాలని. ఇంట్లో వాళ్ళు నిర్ణయించుకున్నారు... రానే వచ్చింది సంబంధం.. కుదిరింది. చేశారు.. అప్పగింతలు అప్పుడు తలితండ్రులు ఆమెతో ఇలా అన్నారు.. అమ్మా ఇన్ని రోజులు మా ఇంటి మహాలక్ష్మిలా తిరిగావు.. ఇక నుండి అత్తరిల్లే…
Read More

న్యాయం కోసం ఎదురు చూసే ఆడపిల్ల

న్యాయం కోసం ఎదురు చూసే ఆడపిల్ల ఎక్కడ న్యాయం? ఎవరి దగ్గర జరుగుతుంది? అసలు న్యాయం ఎక్కడ ఉంది? ఎక్కడ దొరుకుతుంది? అసలు న్యాయమా.... నువ్వు ఎక్కడ ఉన్నావు? అన్యాయానికి తలదాచుకున్నవా? అదేంటి....? నిజం నిప్పు లాంటిది.. న్యాయం ముందు అన్యాయం ఆటలు చెల్లవు అంటారు కదా.. ఓహో అది కేవలం అన్యాయపు బాటలో న్యాయం ముసుగు వేసుకుని డబ్బుతో అన్యాయంగా న్యాయాన్ని కొనుక్కునే వారికి వర్తిస్తుందా.....? న్యాయంగా నిజాయతీగా న్యాయం అంటే రాదా....? రాబందులకు రక్షగా ఉంటావా.. రాక్షసులకు అండగా ఉంటావా..... అవినీతిపరులకు తోడుగా ఉంటావా..? అసలు ఎక్కడ ఉంటావు.. ఎందుకు బయటికి రావు.. అన్యాయాన్ని ఎదురుకొలేక పోతున్నావా? ఎందుకు నీవు ధైర్యంగా ముందుకు రాలేక పోతున్నావు... ఆడపిల్ల కష్టం అని వస్తె ఆసరాగా ఒకడు చూస్తాడు.. ఆపదలో ఉన్న అంటే అలుసుగా ఇంకొకడు చూస్తాడు..... అవసరం అంటే చులకన ఒకడికి . దుఖం అంటే ఓదార్పు పేరుతో అవసరం…
Read More

చీకటి రాత్రి

చీకటి రాత్రి కొందరికి కలల రాత్రి .. ఇంకొందరికి కల చెదిరే రాత్రి.. మరికొందరికి కల తీరే రాత్రి... ఇలాంటి రాత్రిని చూసి భయపడే పరిస్థితి ఒక ఆడపిల్లది. అందరూ కలలు గంటూ కలలు తీర్చుకునే రాత్రి.. ఒక ఆడపిల్ల కల చెదిరిన రాత్రి... నాకు నేనే తోడు.. ఏ చేయి నాకు సాయం చేయడం లేదు అని.. నేనే సమాజం లో ధైర్యంగా నిలబడాలి అని ముందడుగు వేసి బయటి ప్రపంచం లోకి అడుగుపెట్టి.. తన పని ముగించుకుని.. తన ఆశయాన్ని నెరవేరుస్తూ... తిరిగి ఇంటికి బయలుదేరే రాత్రి .. పడ్డాయి కళ్ళు దుర్మార్గులవి.. పడ్డాయి కళ్ళు లోకులవి కాకుళ్ళ... పడ్డాయి దుండగుల చేతులు.. ఆడపిల్ల శరీరం తన హక్కు అయినట్లు బలవంతంగా... రాలేదు ఏ చేయి ఆపగా . రాలేదు ఏ చేయి ఎదురించగా .. చూస్తుండగానే ఆ రాత్రి కాళరాత్రి అయింది ఆ ఆడపిల్ల కి.. ఆ…
Read More

ఆడపిల్ల

ఆడపిల్ల ప్రతి ఆడపిల్ల.. ఆడపిల్లే అంటే ఇంకో ఇంటి పిల్లే... పుట్టింట్లో అందరితో సరదాగ ఉండే ఆడపిల్ల... రేపు అత్తింట్లో బాధ్యతలతో భారం మోసే తల్లి.. ఈ ఆడపిల్లని అందరూ ఆడపిల్ల లాగా కాకుండా ఆటబొమ్మలా చూస్తున్నారు.. ఈ ఆడపిల్లే ఇంకో జీవికి ఊపిరి పోసేది.. ఆడపిల్ల లేని ఇల్లు అమ్మలేని ఇల్లు లాంటిది.. ఆడపిల్లని గౌరవిద్దాం.. రక్షిద్దాం... కాపాడుకుందాం.. ప్రతిఒక్కరూ ఆడపిల్లని ప్రేమించాలి ఒక తల్లిగా, చెల్లిగా.. అని భావిస్తున్నాం.. - వనీత రెడ్డి
Read More

నరకయాతన

నరకయాతన ఒక అబ్బాయి... మధ్యతరగతి కుటుంబం లో పుట్టి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ..వాళ్ళ తల్లితండ్రుల కన్నీరు చూడలేక.. తుడవలేక..  ఎం చేయాలో అర్థం కాక... చదువు పేరుతో బయటికి వచ్చేశాడు... అప్పటి నుండి అటు చదువుతూ.. తన ఖర్చులకు సరిపడు ఏదో ఒక పని చేసుకుంటూ గడుపుతున్నాడు.. ఇంట్లో అమ్మ నాన్నలకి చెప్పి ఏదో ఒక పని చేస్తూ చదువుకుంటానని అన్నాడు... అపుడు ఆ తల్లితండ్రులు మేము ఉన్న అన్ని రోజులు నీకు ఎలాంటి కష్టం కలగనివ్వము... మేము చదువుకోక ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నము.. నీకు చెల్లికి అలాంటి పరిస్తితి రాకూడదు అనే మాకు ఎంత కష్టమైన మీరు భారం అనుకోకుండా మా బాధ్యత అని చదివిస్తున్నము అని అంటారు అపుడు ఆ అబ్బాయి సరే అమ్మ అని ఫోన్ పెట్టేసాడు.. వెంటనే ఆమె భర్త పక్కనుండి, అదేంటే అలా అన్నావు.. వాడు ఏదో ఒక పని చేస్తూ చదువుకుంటానని అన్నాడు…
Read More