Month: November 2021

గాయం

గాయం అయ్యో అప్పుడే వెళ్లి పోయావా ఏమంత తొందర వచ్చిందని వెళ్ళావు మీతో ఎన్నో మాట్లాడాలని అనుకున్నానే మీతో ఎన్నో పనులు చేయించాలని అనుకున్నా నే ఎన్నో కబుర్లు చెప్పాలని అనుకున్నాం ఆ కబుర్ల లో నుండి అక్షర పదాలను కలుపుతూ మీలోని ఆవేశాన్ని బయటకు ఇంకా ఇంకా తేవాలని అనుకున్నా నే కదులుతున్న కాలం తీరు లను నిగ్గు తేల్చేందుకు , సిగ్గు లేని సమాజాన్ని మార్చేందుకు మీ మా అక్షరాల నీరాజనం జనాలకు అందించాలని అనుకున్నానే మీ తరాలన్ని ముందు తరాలకు ఆదర్శం కావటానికి మీతో కలిసి పని చేయాలని అనుకున్న నా ఆశలన్నీ ఆవిరి అయ్యేలా కాలం ఒక్క క్షణకాలం స్తంభించెలా చేసావే అవ్వన్నీ అవ్వక ముందే ... అందరికన్నా ముందే ఏమంత తొందర పడ్డావు , అవును లే మమల్ని మీరు ఒక్కసారి అయినా చూస్తే కదా తెలిసేది మేమనుకున్నవన్ని మీరు వింటే కదా మా…
Read More

అదే అబ్బాయిల గొప్పతనం 👰

అమ్మాయిలకి క్రష్ అంటే మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, ప్రభాస్ లాంటోళ్లు మాత్రమే గుర్తొస్తారు. అబ్బాయిలు మాత్రం పక్కింటి అమ్మాయి దగ్గర నుండి పాకిస్థానీ మోడల్ వరకూ ఎవ్వరు బావున్నా కూడా క్రష్ గా ఒప్పుకుంటారు. అదే అబ్బాయిల గొప్పతనం 8-)  8-) 
Read More

“పంచారామాలు” అనగా ఏమిటి ?

"పంచారామాలు" అనగా ఏమిటి ?   ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధమైన "శైవక్షేత్రాలను", "పంచారామాలు' అని పిలుస్తారు. 'పంచారామాలు' ఏర్పడుటకు, స్కందపురాణంలో ఇలా వివరించబడి యున్నది.. పూర్వం.. తారకాసురుడు అను రాక్షసుడు, 'శివుని' గురించి ఘోర తపస్సు చేసి 'శివుని' ఆత్మలింగము సంపాదిస్తాడు.     దీనితో వీర గర్వముతో, దేవతలను అనేక రకాలుగా హింసలు గురిచేయగా, ఇందుకు దేవతలు, విష్ణుమూర్తిని ప్రార్ధించగా, 'శివపార్వతుల' వల్ల కలిగిన కుమారుడు "కుమారస్వామి" వల్లనే తారకాసురుని వధించుట సాధ్యపడుతుందని తెలిపి "కుమారస్వామిని" యుద్ధానికి పంపుతారు. యుద్ధమునందు "కుమారస్వామి", తారకాసురుని కంఠంలో గల 'ఆత్మలింగమును' చేధిస్తేనే మరణము కలుగునని గ్రహించి ఆ 'లింగమును' చేధిస్తాడు. దీనితో తారకాసురుడు మరణిస్తాడు. చేధిoచే సమయంల్లో, ఆ.. 'ఆత్మలింగము' వేరై, ఐదు ప్రదేశములలో పడుతాయి. తరువాత వాటిని ఆయా ప్రదేశాలలో, దేవతలు లింగ ప్రతిష్ఠ కావిస్తారు.. కనుక ఈ అయిదు 'క్షేత్రాలను', 'పంచారామాలు' అని పిలుస్తారు..వాటిలో ముందుగా ,   1.…
Read More

కవిత

కవిత నిను ఈ క్షణం చూడాలనిపిస్తుంది, మరీ ఎలా,? అనంత తీరంలో చకోరపక్షిలా ఒక్కడినే ఎన్నాళ్ళు ఎదురుచూడను? ఇప్పటికే నామనస్సు చక్కలుమ్రుక్కలై చెల్లాచెదరై పోయింది అద్దం పగుల్లవలే, భవిష్యత్ అందాకారమై, నీవు కనిపిస్తావనే చిన్న ఆశ , అడుగంటిన నా ఆశలకు ఊపిరులూదుతుంది, క్షణమొకయుగంలా గడుస్తూవుంటే, దారంతెగిన గాలిపటంవలె మనస్సు ఊగిసలాడుతూ ఉంటే, చీద్రమైన నా ఉహాలపల్లకి ఊగిసలాటలో పయనిస్తూ ఉంటే, ఎక్కడో ఓ వెలుగురేఖ కనిపించిన ఆక్షణాన, అది నీవేనని, నానయనాలు జలాశయాలై వర్శిస్తూవుంటే, అది నీవుకావని తెలిసిన ఆమరుక్షణానా, ఇంకా మరణం రాలేదేమని? గొంతుచించి అరవాలని వున్న గొంతు పెగలని నిస్సాహయత ఎందుకో చెప్పవూ. - పోరండ్ల సుధాకర్
Read More

ఏ పురాణంలో ఏముందో తెలుసుకుందాం

ఏ పురాణంలో ఏముందో తెలుసుకుందాం 1. మత్స్యపురాణం 2. కూర్మపురాణం 3. వామన పురాణం 4. వరాహ పురాణం 5. గరుడ పురాణం 6. వాయు పురాణం 7. నారద పురాణం 8. స్కాంద పురాణం 9. విష్ణుపురాణం 10. భాగవత పురాణం 11.అగ్నిపురాణం 12. బ్రహ్మపురాణం 13. పద్మపురాణం 14. మార్కండేయ పురాణం 15. బ్రహ్మవైవర్త పురాణం 16.లింగపురాణం 17.బ్రహ్మాండ పురాణం 18. భవిష్యపురాణం   ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది. *మత్స్యపురాణం* మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు. *కూర్మపురాణం* కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది. *వామన పురాణం*…
Read More

సంక్రాంతి కథల పోటి

సంక్రాంతి కథల పోటి ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, కోడి పందాలతో ఎంతో సందడిగా జరుపుకునే సంక్రాంతి పండుగ విశేషాలను, మీ ఊర్లోని వింతలను తెలియ చెప్తూ కవితలు, కథలు రాయండి. ప్రతి కవితకి, కథకు ప్రశంసాపత్రం ఇవ్వబడును. మీ కవితలు కథలు పంపవలసిన ఆఖరు తేది 30/ 12/2021. కవిత కానీ, కథ కానీ ఆరువందల పదాలకు మించకుండా అక్షర దోషాలు లేకుండా, సరళ మైన బాషలో ఆకట్టుకునే విధంగా ఉండాలి. ఒకరు ఎన్ని కథలు, కవితలు అయినా పంపవచ్చు. కవితలు కథలు తిరిగి పంపబడవు, వచ్చిన వాటిని అన్నిటినీ ప్రచురిస్తాం. తిరిగి కోరే వారు పంపవద్దని మనవి. ఇందులో న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయం. ఎక్కడ ప్రచురించలేదు అని హామీ పత్రం తప్పని సరి. షరతులు వర్తిస్తాయి. దయచేసి కాపీ కంటెంట్ పంపకండి. మీ కవితలు, కథలు మెయిల్ చేయండి. మీ కవితలు, కథలు పంపవలసిన మెయిల్ AKSHARALIPI.OFFICIAL@GMAIL.COM
Read More