Month: October 2022

మౌనమే మిగిలిందిక.!

మౌనమే మిగిలిందిక.! నా మనసు పలికే భావాలనే మాటలుగా విన్నావ్ నా కళ్లు చేసే మూగ సైగలకే నువ్ మురిసిపోయావ్ నా నోటి వెంట పదాలు‌ జాలువారకమునుపే.. నీ నోట నే చెప్పాలనుకున్న మాటలొస్తుంటే.. నా గుండె సవ్వడులను చదవగలవని మురిసిపోయా నా మది తలపులను చూడగలవని సంబరపడిపోయా నా మౌనానికి భాషగా మారతావనుకుని కలలుగన్నా నా కన్నీటిని తుడిచే తోడవుతావని ఎదురుచూశా కానీ..కరగని శిలవవుతావని నేననుకోలేకపోయా నిజాన్ని చూసే హృదయం లేదని తెలుసుకోలేకపోయా నాపై నువ్ వేసిన నిందలు నా గుండెను కోసేస్తున్నా.. నీ మాటలు తూటాలై నిలువెల్లా‌ గాయాలవుతున్నా.. నీపై ఇప్పటికీ ఎందుకో నాకు కోపం రావట్లేదు..కానీ నా తప్పులేదని చెప్పాలనున్నా మాటలు దొరకట్లేదు నీపై గల నా నా ప్రేమలో మౌనమే మిగిలిందిక..కానీ నువ్ లేకున్నా..ఇక రాకున్నా నీపై ప్రేమ చావదిక.! - ది పెన్
Read More

ఓ యోగం

ఓ యోగం నిన్ను ఆశ్రయిస్తే చాలు వేల వేల లాభాలు చేకూరుస్తావు‌... నువ్వు తోడుంటే చాలు బంధాలు అలవోకగా బలపడతాయి... నీ సహచర్యంలో నేర్చుకునే పాఠాలెన్నో.... నిన్ను ఆశ్రయించిన చాలు సమస్యలు పరిష్కారమగును... సరికొత్త సమస్యలు పుట్టుకురాకుండా.... ఉన్న సమస్యలు అధికం కాకుండా... ఒత్తిడి నిండిన మనసుకి ఊరటని ఇస్తావు... ఒంటరితనంలో తోడుగా ఉంటావు... పదుగురిలో కీర్తిని పెంచి సంతసింపచేస్తావు... పెద్దలయెడ క్రమశిక్షణని నేర్పుతావు... పగిలి హృదయ రోధనను భరిస్తావు‌... ఓదారుస్తూ‌...దిక్సూచిగా నిలబడతావు... అలిగిన వేళ ఆలుమగల మధ్య చోటుచేసుకుంటావు... మాటరాక గుండె పగిలిన వేళ నేనున్నానంటావు.... వేదన రోదన కాని రోజున లోలోపల దాగుంటావు... ఎందరిలో ఉన్నా నిన్నాశ్రయిస్తే చాలు...ఏకాకవుతారు‌... నువ్వు మాకు దొరికిన ఓ గొప్ప ఆభరణం.... మాకు లభించిన ఓ అదృష్ట యోగం.... నువ్వే లోలోపల దాగిన భావాలకిలా అక్షర రూపాన్నిస్తూ.. ఒంటరైన హృదయానికి ఓదార్పవుతూ తోడైన మౌనానివి.... - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

చిలిపి

చిలిపి గోదావరి చెంతనే సంతోష్ కి కొత్తగా ఉద్యోగం వచ్చింది.. సాయంత్రం కాసేపు ఆ తీరాన కూర్చుంటే ఉండే హాయే వేరు.. అందుకే వీలున్నప్పుడల్లా గోదారి గట్టుకి వెళ్లిపోతుండేవాడు.. ఓ రోజు తోటి ఉద్యోగులు చెప్పారని దారి మార్చి ఊరి మధ్యలో ఉన్న ఓ ఉద్యానవనానికి వెళ్లి, అక్కడున్న సిమెంటు బల్లపై కూర్చున్నాడు. ఎదురుగా చిన్న కొలను.. అందులో లయబద్ధంగా ఆడుతున్న జలధారలను చూస్తున్నాడు. కాసేపటికి.. తననెవరో చూస్తున్నారని అనుమానం వచ్చింది సంతోష్ కి.. తల తిప్పి చూస్తే పక్కకే ఓ అందమైన అమ్మాయి.. ఒక్కసారిగా ఉలిక్కిపడి, అక్కడినుంచి లేవబోయాడు.."పర్లేదండీ..కూర్చోండి." అంటూ ఆ అమ్మాయి సిగ్గుపడుతూ చెప్పే సరికి లేవాలా వద్దా అనే మీమాంసలో కాసేపు అలా తటపటాయిస్తూనే కూర్చున్నాడు. ఏవండీ.. అంటూ.. మరోసారి ఆ అమ్మాయి పలకరించింది.. చెప్పండి మేడమ్ అన్నాడు సంతోష్ కాస్త మొహమాట పడుతూ.. "లాలా చెరువుకి వెళ్లాలంటే, ఎలా వెళ్లాలండీ.. నాకు ఈ ఊరు కొత్త..…
Read More

అల్లరులు

అల్లరులు ఉదయం లేస్తూనే మొదలుపెట్టారా? అబ్బబ్బా నావల్ల కావట్లేదు మీతో అంటూ వంటింట్లోంచి అరుస్తుంది సుధ. ఏమైందిపుడు ఎపుడు చూసినా పిల్లీ ఎలుకల్లా ఎందుకురా అలా ఉంటారంటూ బాల్కనీలో పేపర్ చదువుతున్న సాకేత్ లేచి‌ వెళ్ళాడు. చూడండి‌ నాన్న నాకు ఇవాళ కాలేజ్ లేదని పడుకుని ఉంటే మీద నీరు పోసాడు అంటూ తన వాదన వినిపించింది కూతురు దీపిక. అదేం కాదు డాడీ పొరపాటుగా పడ్డాయి దానికే ఇంత రాద్ధాంతం చేస్తుంది అంటూ సంజాయిషి ఇచ్చాడు హరి. అయినా పదవుతుంటే లేవకుండా వాడిమీద చాడీలు చెప్తున్నావా ఆడపిల్లవని తెలుస్తుందా నీకసలు అంటూ కొడుకు పక్కన చేరింది తల్లి సుధ. వచ్చేసావా... వాడిని ఏమైనా అనడం పాపం ప్రత్యక్షమైపోతావు అంటూ దీపిక వాళ్ళ డాడీని చూసి నవ్వింది. అంతే అంతే నిజం చెప్పావురా దీపు అంటూ వంతపాడాడు తండ్రి సాకేత్. హా... అవునవును ఇపుడు మీరు మాత్రం మీ కూతురు పక్షం…
Read More

నీకోసం

నీకోసం నీలాల నింగి నీలి కోక చుట్టి మేఘాల ముంగురులకు చుక్కల మల్లెలు తురిమి విశాల నుదురు మీద జాబిలి తిలకము తీర్చి వెన్నెల కన్నులకు చీకటి కాటుక పెట్టి నది అద్దము లోన ప్రియమారగ ప్రతిబింబము చూసి మురియ ప్రియుని చెంత వాలమని మది తొందర పెట్టెను.. కడలి కౌగిలి చేరగ సొగసు వాన చినుకులతో... ఉరుము దూతతో పంపెను మెరుపు ప్రేమ లేఖను వలపు వలలు విసిరిన చెలి వయ్యారి మిన్నుకు చెలికాడు చెప్పెను చెవిలోన ఊసులేవో.. చిలిపి నవ్వులు రువ్వు మబ్బుసిగ్గు బుగ్గలపై అలల ముద్దిడె కడలి నదము ముకురము లోన.. - సలాది భాగ్యలక్ష్మి
Read More

పోన్నియన్ సెల్వన్

పోన్నియన్ సెల్వన్ పోన్నియన్ సెల్వన్ అనే మణిరత్నం సినిమా తమిళంలో వచ్చింది దీన్ని తెలుగులోకి అనువాదం చేశారు. అయితే ఈ సినిమా మన తెలుగు వాళ్లకి అస్సలు నచ్చలేదు. మరి ఈ సినిమా మన తెలుగు వాళ్లకి ఎందుకు నచ్చలేదు అసలు వసూళ్లు ఎందుకు రాలేదు మణిరత్నం సినిమా అంటే చాలా ఎక్స్పేక్టేషన్స్ పెట్టుకొని ఖచ్చితంగా హిట్ చేసే మనవాళ్లు ఎందుకు ఈ సినిమాని ఆదరించలేకపోయారు? అనేది మనం ఎప్పుడు తెలుసుకుందాం.. ఇక్కడ నేను కేవలం నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను. ఎవరిని కించపరచడానికి ఎవరిని తక్కువ చేయడానికి చేయడం లేదు. ఇక కథ విషయానికొస్తే, రాజుల మధ్య జరిగే అంతర్యుద్ధ కథనమే ఈ సినిమా.. చోళుల రాజు కి ఇద్దరు కొడుకులు వారిలో పోన్నియన్ సెల్వన్ అనే అతను చిన్నప్పుడే నదిలో పడిపోతే వనదేవత కాపాడిందని అక్కడి వారంతా నమ్ముతారు అందుకే అతన్ని కాపాడుకోవడానికి దేశమంతా తమ వంతు ప్రయత్నం…
Read More

రాధా మాధవ

రాధా మాధవ రాధా మాధవ, రాధ కృష్ణ అంటూ రకరకాల పేర్లతో పిలుస్తాం అయితే అసలు ఈ రాధ మాధవుల బంధం ఇలాంటిది అనే ఆధారాలు ఏవీ లేవు. కొంతమంది, రాధా మాధవులు ప్రేమించుకున్నారని కానీ వయసు తేడా వల్ల పెళ్లి చేసుకోలేకపోయారని అంటారు. మరికొందరు, రాధా కృష్ణుని భక్తిలో మునిగిపోయి అతని నామస్మరణ చేస్తూ అతన్నే ధ్యానిస్తూ ఒక భక్తురాలిగా మారిపోయిందని అంటారు. ఇంతకీ రాధ కృష్ణుడిని ప్రేమించిందా? కృష్ణుని పెళ్లి చేసుకోవాలనుకుందా? కృష్ణుడు కూడా రాధను ఇష్టపడ్డారా? కృష్ణుడు రాధని పెళ్లి చేసుకోవాలనుకున్నాడా? రాధతో కలిపి కృష్ణుడికి 16,000 మంది భార్యలు అన్నది ఎంతవరకు నిజం? వరుసకు మేనత్త అయిన రాధను కృష్ణుడు ప్రేమించడంలో నిజముందా? ఇవన్నీ ప్రశ్నలే ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరికి తెలియవు. నాకు కూడా తెలియవు. మరి ఈ రాధా మాధవుల మాధవుల బంధం ఎలాంటిది మనం తెలుసుకోవాలని అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉంది.…
Read More

వ్రాత

వ్రాత మూడు ముఖాలు ముందుకి చూస్తున్నా.... వెనుకుండి రాస్తున్నదేమిటని తెలిసేనా... భారతి వీణానాదంలో మునిగి తరిస్తున్నా.... అర్దంతర ఆయుష్షులకి వగచేది వినబడునా.... కుమారుడే ప్రశ్నిస్తూ అడ్డుపడుతున్నా.... విధిలిఖితం తప్పించగ తనకైనా సాధ్యమౌనా... కుమార్తెకే సరియగు రాత రాయలేకున్నాడు... అంద చందాలమేటియైనా రాయల్లే పడెను అహల్య... సిరిసంపదలెన్నున్నా వగచినారు నలదమయంతులు... ఫాలముపై లిఖించబడగా తప్పించుట సాధ్యంకానిది... వెలుగన్నది సుఖమై నిండిన జీవితాలలో.... నిశీధుల‌ కష్టాలు తప్పని తెలుపునుగా... ఐతిహాసపు గాధలెన్నో అక్షరక్షరమున తెలుపునుగా... బ్రహ్మ రాత తలరాతై మన జీవనముండగా... జీవనములో దాగిన సన్నని పొరవంటి కళ ఇది... ఈ కళ వెనుక దాగిన రాతల మాటున దాగిన సత్యాలెన్నని... ఆ సత్యాల మాటునున్న లేఖకుల జీవిత లిఖిత మేమిటని.... చదరంగంగా సాగే జీవితాన పాత్రలైన మన రాతల సారమేమిటని... - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

ఋతురాగాలు

ఋతురాగాలు  ఎన్నో మాటలు ముళ్ళై గుచ్చుకుంటున్నా, ఏవో ఆటంకాలు రాళ్ళై అడ్డు తగులుతున్నా, మౌనమై గూడు కట్టుకున్న మేఘాలు కంటినీరుగా వర్షిస్తున్నా, తీరని గ్రీష్మతాపం స్త్రీ కి కొత్తేమీ కాదు అయినా శరత్జోత్స్న కురిపిస్తూ ఇంటిని హేమంతంలా కాచే ఆమె ఆశలు శిశిరాలై రాలిపోతున్నాయి.. పితృస్వామ్య శాసన లిఖితం రాజ్యాంగమై శాసిస్తుంటే తీరని కలల సెజ్జపై పవ్వళించి, తడారని కన్నులతో ఆమనికై వేచి చూస్తుంది. - సలాది భాగ్యలక్ష్మి
Read More

విధి లిఖితం!

విధి లిఖితం! మనమొకటి తలిస్తే.. భగవంతుడు మరొకటి తలుస్తాడట.. దానినే విధి లిఖితం అంటారు.. సరిగ్గా అలాంటి సంఘటనే ఓ ఊరిలో జరిగింది.. కాలుష్యానికి దూరంగా.. ప్రకృతి అందాలకు నిలయంగా.. చుట్టూ పచ్చని పంటచేలు.. కమ్మని మట్టివాసనతో.. ఆ ఊరు నిజంగా పేరుకు తగ్గట్టుగానే చిన్నపాటి 'రామ'రాజ్యం. ఎన్నికలప్పుడు తప్ప ఇక్కడ రాజకీయ పార్టీలు కనపడవు.. కులాలు.. మతాల ప్రసక్తే రాదు. ఉన్నంతలో కలిసిమెలసి, ఒకరికొకరంటూ ఊరంతా ఒకే కుటుంబంగా బతుకుతుంటారు. అలాంటి మంచి మనుషులున్న ఆ ఊరిలో ఓ భూ స్వామి ఉన్నాడు. రాముడిలా ఆ పల్లె ప్రజలకు అండగా ఉండేవాడు.. తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉన్నా.. ఇసుమంతైనా ఆ దర్పాన్ని ప్రదర్శించడు.. ఊరంతా అతని వెంట ఉన్నా అ పొగరును నెత్తికెక్కించుకోలేదు. పూరి గుడిసె నుంచి డాబా ఇల్లు వరకూ అందులో ఉన్నవారెవరైనా ఆయనకు ఆయన భార్యకు సమానమే.. ఎవరు ఏ శుభకార్యానికి పిలిచినా ఇద్దరూ…
Read More