Month: October 2022

వీడని‌ అనురాగం

వీడని‌ అనురాగం   పూవు తావిలా అల్లుకున్న అనురాగంలో... చిగురించిన ఆశలన్నీ ఆశయాలైన క్షణంలో... ఒకరికొకరంటూ మెసలుకునే సంసారంలో.... విడలేని స్మృతుల దొంతరలెన్నో..... కళకళలాడే కాపురాన నవ వసంత గానమై... కోయిల కుహు కుహు రాగమై అల్లుకుంటుంటే... నిత్యం నవ వసంతాలు విరబూయిస్తుంటే‌‌.... నిను వీడి నేను మనలేని తపనల తలపువు నీవైనావు.... పరిచయమే ప్రేమగా మారిన ఆనాటి రోజులు... ఆ ప్రేమలే పరిణయమై నిండిన ఆనందాలు... సరికొత్త ఉషోదయాలు నింపుకున్న క్షణాలు... మరపుకి రాని మధురోహల క్షణాలు... చెలిమిగా మసలుతూ అడుగడుగునా తోడుంటూ... కష్టనష్టాల తూకంలో సరిజోడుగా నీవుంటూ... చేయందించి చేయూతనిస్తన్న తరుణంలో... ఏం కావాలి ఏ మగువకైనా జన్మజన్మల బంధం నీ తోడుగా కాక.... ఎన్నో జన్మల అనుబంధం తొడుగా కోరుకోవడం తప్ప... వీడని అనురాగం సొంతం చేసుకోవడం తప్ప.... - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

ఈ జన్మకి ఈ బంధం చాలు.!

ఈ జన్మకి ఈ బంధం చాలు.! ఒకరోజు ఒక్కడినే.. చీకటిలో పొలం గట్టుమీద కూర్చుని ఏడుస్తున్నా.. చుట్టూ ఎవరూ లేరు.. నిర్మానుష్యంగా ఉంది ఆ ప్రదేశమంతా.. నా ఏడుపు ఎవరికీ వినిపించలేదు.. నా కన్నీరు ఎవరికీ కనిపించలేదు.. ఇంకోరోజు మళ్లీ ఒక్కడినే.. గోదావరి ఒడ్డున కూర్చుని వెక్కివెక్కి ఏడుస్తున్నా.. ప్రశాంతంగా ముందుకు సాగిపోతున్న గోదారితో సహా అప్పుడూ నన్నెవరూ పట్టించుకోలేదు. ఏమైందని ఓదార్చేవారెవరూ రాలేదు. ఒకసారి జీవితంలో ఎలాగైనా గెలవాలనే కసితో పనిచేస్తూ కష్టంలో ఏడ్చాను.. ఇంకోసారి ఒంటరిగా మిగిలిపోయినందుకు ఏడ్చాను.. తర్వాత ఎప్పుడూ ఏడవలేదు. కానీ నువ్ నా జీవితంలోకి వచ్చే వరకూ ఒక మనిషి కోసం ఇంతలా కన్నీరొలుకుతానని అనుకోలేదు. నిశీధిలో నా నీడైనా నాతో ఉండదేమోగానీ నీ తలపులు నాతోనే ఉంటాయి.. నిద్రలో శ్వాసనైనా ఆపుతానేమోగాని, నీ ఆలోచన వదలను.. లేస్తూనే నీ రూపం కళ్ల ఎదుట ఉందని ఊహించుకుంటాను. ఏ పనిచేస్తున్నా నిన్ను మరువకుంటాను. నాతో…
Read More

బంధం

బంధం   చెట్టుకు పూసిన పూలతో అనుబంధం పూటని తెలిసినా, పరిమళం వెదజల్లుతూ నవ్వుతూ ఉన్న పూలను చిగురుల చేతులతో తడిమి, కొమ్మల ఊయలూపి, మొగ్గల బుగ్గలుగీటి, తేనె ఉగ్గులు పోసి, ఎండిన ఆకులతో దిష్టి తీసి మురిసే చెట్టుకే తెలుసు జన్మల బంధం అంటే ఏమిటో.... తీరచెలిని చూచుటకు చెంగు చెంగున ఎగురుతూ, ఉత్సాహంగా ఉవ్వెత్తున ఎగసి ఉరకలు వేస్తూ, కెరటాల కౌగిలిలో కరిగించే సంద్రానికి తెలుసు అనుబంధం అంటే ఏమిటో.... గూటిలో గులాబీ రంగు వర్ణంలో నోరు తెరిచి ఎదురుచూసే పక్షి పిల్ల నోటిలో రోజంతా తిరిగి సేకరించిన ధాన్యపు పాలను పోసి రెక్కలతో పొదువుకునే పక్షికి తెలుసు జన్మల బంధం అంటే ఏమిటో... సూర్య,చంద్రుల కళ్ళతో పగలు, రాత్రి కంటికి రెప్పలా కాస్తూ, వలపు వాన చినుకులతో చుంబించి పుడమిని పులకింపచేసి సంబరపడే అంబరానికే తెలుసు బంధం అంటే ఏమిటో.... తాను ఎంత స్వేచ్ఛగా ఎగిరినా, తనని…
Read More

చరణ్ నీవెక్కడ ??

చరణ్ నీవెక్కడ ?? మాది మెదక్ జిల్లా లోని ఒక మండలం అక్కడ మా నాన్నగారు ఇంగ్లీష్ టీచర్ గా పని చేసే వారు నిజానికి మాది కరీంనగర్ జిల్లా కానీ నాన్నగారు టీచర్ గా అపాయింట్ అయ్యింది మొదలు ఆ ఊరే మాకు సొంత ఊరు అయ్యింది. అక్కడే మేము పుట్టడం వల్ల ఆ ఊరిలో ఉన్న అందరూ మా నాన్నగారు అంటే ఎంతో అభిమానం చూపేవారు అభిమానం చూపడానికి కారణం ఉంది. ఎందుకంటే మా నాన్న ఆ ఊరికి వచ్చినప్పుడు కరెంటు లేదట, ఇంకా రేడియో కూడా లేదట ఎవరో ఒక ధనవంతుల ఇంట్లో ఉండేది అట, అప్పుడు మా నాన్నగారి దగ్గర చిన్న ట్రాన్స్ సిస్టర్ ఉండేది అంట అందులో సేల్స్ వేసుకుంటే పని చేసేది నల్లగా చిన్నగా వైర్ లెస్ తో ఉండేది అంట అన్ని ఆట లేనా అంటారా మరి మేము వాటిని చూడలేదు…
Read More

దరి

దరి ఆ దరిని ఆగిపోయావేం నేస్తమా? రా ఈ దరికి వచ్చిచూడు ఆ దరికి ఈ దరి ఎంత దూరమో? ఈదరికి ఆ దరీఅంతే దూరం ఒకే గదిలో ఇమిడి ఆప్యాయతల నడుమ అందరూ కలిసి ఆవకాయతో తిని తృప్తి పొంది హాయిగా నిదురించే నిజమగు ఐశ్వర్యవంతుడైన రైతు కుటుంబం చూడ ఈ దరికి రావోయి స్వచ్ఛమైన పిల్లగాలులు పీల్చుతూ చిత్రమైన మట్టి వాసన ఆస్వాదిస్తూ పల్లె పక్షుల సంగీతాల నడుమ నిన్ను నీవు మైమరిచే క్షేత్రమైన పల్లెటూరున్న ఈ దరిని చూడరావోయి కృత్రిమ గాలి నిండిన గదిలో ఒక్కొక్కరుగా ఉంటూ ఎవరికి వారే యమునా తీరై మమకారపు మాధుర్యం మచ్చుకైన తెలియక అదే జీవితమనుకుని మరమనిషి లాగా జీవించకు.. నీటి బుడగ జీవితాన్ని స్నేహమయం చేసుకో అసలైన సంతోషం బ్రతుకులోన నింపుకో ఎప్పుడూ ఎడతెగక ప్రవహించే జీవనవాహినికి ప్రేమవంతెనవేసి మమతల తీరం చేరుకో ‌స్నేహమా!   - సలాది భాగ్యలక్ష్మి
Read More

ఆ మబ్బులను దాటి రా

ఆ మబ్బులను దాటి రా నీకే కనిపిస్తున్న అబద్దాల ఊహాలోకంలో అపార్థాల కోటలు కట్టి.. బండబారిన మనసుతో మూర్ఖత్వపు సింహాసనమెక్కి.. కళ్లుండీ నిజాన్ని చూడలేని.. మనిషైనా క్షమాగుణమెరుగని ఓ మహాజ్ఞాని.. ఇది కాదు నాకు తెలిసిన నీ విలువ.. ఇప్పుడు లేదు నీలో నా మగువ. నేస్తమా.. నేల మీద నువ్వున్నప్పుడు నేను నీకు చెలికాడినై చేయందించాను. నా మనసు నీకిచ్చి నీ కోసం రేయింబవళ్ళు పరితపించాను.. నా చేత్తో నీ జీవిత పరీక్షలు రాయించాను.. పడిగాపులను ప్రమోదంగా భావించి, నీ ప్రతి అడుగులో నేను తోడై నిలిచాను. నీ విజయమే నాదనుకున్నాను.. నీ సంతోషంలోనే నా ఆనందాన్ని వెతికాను.. ఆఖరికి నీ లక్ష్యాన్ని చేరుకున్నావని కొండంత సంబరపడి ఈ ప్రపంచానికి నా అక్షరాలతో చాటి చెప్పాను.. కానీ ఇవేవీ నీకు గుర్తులేవు.. నీకై గడిపిన క్షణాలేవీ నీకు అక్కరలేదు. వయసు ప్రభావమో.. నా గ్రహచారమో.. తెలిసీ తెలియక జరిగిన పలు…
Read More

అమర వీరులకు జోహార్లు

అమర వీరులకు జోహార్లు నిర్భీతికి ప్రతిరూపాలు వారు. నిస్వార్థమైన నిరుపమాన త్యాగానికి ప్రతీకలు వారు. రేయింబవళ్లూ.. కష్టాలకు వెరవక.. సమస్యలకు బెదరక.. సవాళ్లకు వెనుదీయక.. చివరికి మృత్యువుకూ వెరపక.. తుపాకీ గుండుకు గుండెను ఎదురొడ్డే ధీరులు.. శూరులు ఖాకీ ధరించిన మన పోలీసులు. ప్రజా క్షేమమే ధ్యేయంగా, కఠోర పరిస్థితులనూ తట్టుకుని శాంతి భద్రతలను కాపాడే సమాజ రక్షకులు వారే. దేశ అంతర్గత శాంతి భద్రతలను పరిరక్షించి, ప్రజా శ్రేయస్సుకు పాటు పడే ప్రజాహితులు వారే. సంఘ వ్యతిరేక శక్తులను అదుపు చేయడానికి విరామ మెరుగక పరిశ్రమిస్తూ.. నేరస్తులకు దీటైన సమాధానం ఇవ్వడమే కాదు.. వేదనతో ఉద్రిక్తమయ్యే ప్రజలను సంయమనంతో శాంతిపజేసే‌ గురుతర బాధ్యత వారిదే.. సాయుధ శక్తులతో సమరం సాగించాల్సిన తరుణంలో మరో ఆలోచన లేక ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేయడానికి సంసిద్ధులు కావాల్సిందీ కనిపించని ఈ నాలుగో సింహాలే.. మహత్తర బాధ్యతలో ప్రాణాలు త్యజిస్తూ.. వారి కుటుంబానికి కన్నీరు…
Read More

అప్పగింతలు

అప్పగింతలు కాలచక్రం బాటలో అలిసిపోయిన కాలిచక్రాలు ఆగమంటుంటాయి వెనక్కి తిరిగి చూస్తానా తిరిగి రాని లోకాలకు తరలివెళ్ళినవారంతా తారలై మెరుస్తుంటారు మసకబారిన కన్నులపై జ్ఞాపకాల పుప్పొడి కరిగిపోయే మంచుశిఖరంలా జీవితం తుది అంచుకు చేరుతుంది కోపాలు శాపాలు లోపాలు మురిపాలు కలిసికట్టుగా నవ్వుతుంటాయి ఏం సాధించావని తలెగరేస్తావని తోడులా నిలిచిన కుటుంబాన్ని మీగడలా మెసలిన మిత్రులను నా కలలమేడకు మెట్లులా కట్టిన అమ్మానాన్నలని తలుచుకోనందుకో వారిలా నన్ను మలచుకోనందుకో మాటరాక మౌనంతో సహజీవనం చేస్తున్నాను చరమాంకంలో చెదలు పట్టక పట్టుతప్పిన జీవితాన్ని అదుపులోకి తెస్తుంటే మాఘమాసపు మంచులా కాలం కాసేపు ఘనీభవించింది అప్పగింతలు చెప్పుకోమని - సి. యస్. రాంబాబు
Read More

మోసం

మోసం మోసం నీకు కొత్త కాదు నేస్తమా! మోహంలో మోసం అని తెలిసినా, క్షమించిన సందర్భాలెన్నో... అదే మోసం అదే వ్యక్తితో పదేపదే జరుగుతుంటే తెలిసి కూడా మోసపోవడం తెలివితక్కువే కదా! నా ప్రేమకు నీలి నీడలు క్రమ్మిన ప్రతిసారి గుండెల్లో గూడు కట్టుకున్న మొయిలు నీ పాదాలపైనే వేడుకోలుగా వర్షించాయి.. అప్పుడు నా ప్రేమొక గడ్డిపరక అప్పుడు నా ప్రేమొక దూదిపింజ అప్పుడు నా ప్రేమొక యాష్ ట్రే అందుకే అంత చులకనైన నా ప్రేమని నువు సమాధి చేసి ఒంటరిగా వదిలి వెళ్ళినప్పుడు నా కన్నీటి కడలి లోతెంతో నీ ఊహకు కూడా అందదు.. ఎడారిగా మారిన నా మనసుతో జీవచ్ఛవంలా నేనుంటే ఓదార్చే మనిషిలేక అర్ధరాత్రి వెర్రి కేకలు వేస్తూ పిచ్చిదాన్నయిన నాకు చేయందించి చేయూతనిచ్చింది అక్షరం. ఇప్పుడు ఆ అక్షరమే నా ప్రాణం నా ప్రణవం. కాల గురువు నా విలువను పాఠంగా చెప్పి నీకు…
Read More

నీలి నీడలు కమ్ముకున్న వేళ

నీలి నీడలు కమ్ముకున్న వేళ "వెంటనే ఆపరేషన్ చేయాలి.. లేదంటే చాలా కష్టం.. ప్రాణానికే ప్రమాదం." డాక్టర్ చెప్పిన మాటలు విని సంతోష్ ఉలిక్కిపడ్డాడు.. తన చుట్టూ ఉన్న ప్రపంచం ఒక్కసారిగా చీకటైపోయినట్టు కనిపించిందతనికి.. ఉన్నత చదువులు చదవాలని అతను కన్న కలలు.. విశ్వవిద్యాలయంలో చదవడం కోసం ర్యాంకు సంపాదించడానికి రేయింబవళ్లు పడిన కష్టం అంతా మర్చిపోవాల్సిందేనా.. అనారోగ్యానికి ఆశలను బలిచేయాల్సిందేనా.. "మనసుని‌ అనేక ప్రశ్నలు దొలిచేస్తుంటే డాక్టర్ తో.."సర్, చాలా కష్టపడి చదివాను.. నాకంటూ ఓ లక్ష్యం పెట్టుకున్నాను.. ర్యాంకు కూడా వచ్చింది.. ఇప్పుడేమో ఏడాది పాటు చదువు మానేయాలంటున్నారు, అది నా వల్ల కాదు." అనగానే డాక్టర్ కి కోపమొచ్చింది.. నీకేమైనా అర్ధమవుతోందా.. వెళ్తే పోతావ్".. గట్టిగా మందలించారు.. అయినా సరే.. సంతోష్ మనసు మారలేదు. "యూనివర్శిటీలో జాయిన్ అయి, సెలవుపెట్టి వస్తాను.. అలాగైతేనే ఆపరేషన్ చేయించుకుంటా.. లేదంటే లేదు.. చదువు కంటే నాకు ప్రాణం ఎక్కువేం కాదు..…
Read More