Month: October 2022

జరభద్రం

జరభద్రం దట్టమైన పొగలు ఒకచోట చేరి కచేరిపెట్టినట్లుంది ఆకాశం.. ఉరుముల మెరుపుల అరుపులతో ఆక్రోశిస్తుంది గగనం... ఎడతెగని వేదనేదో నిండబోతుందన్నట్లు ఆవేదనతో వర్షిస్తుందా నింగి... అంతే...హఠాత్తుగా నిశ్శబ్దమలముకుంది జగత్తున... సరికొత్త అరాచకానికి తెరలేచిందా గల్లీలో... చిరుతిండెరచూపి ఆరగించాడో కామాంధుడా బాలికను.... కంటికి మింటికి వర్షిస్తూంది కన్నీరు జగత్తను అమ్మ... రైతులంతా నడచి నడచి అలసి సొలసి విసిగి వేసారుతుంటే‌‌.. ఆదరించని సాయమివ్వని దుశ్చర్యలకి అనాదిగా దారిదొరకక దిక్కుకానక కార్చే కన్నీరు ఇంకిపోయినదీ చీకటిలోనే.... అన్యాయాలు..అక్రమాలు... జూలు విదుల్చుకుని ఠీవిగా రొమ్ము విరుచుకు తిరిగేదిపుడే.... మాటువేసిన మేకవన్నెలు దాడిచేసేదీవేళనే... ఇల్లు ఒల్లు కొల్లగొట్టబడి నడివీధినపడే ప్రజానీకాలిపుడే.. జర భద్రం కొడకా!!!! - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

వైకుంఠపాళి -కథ

వైకుంఠపాళి -కథ "అమ్మా.. నేను హైదరాబాద్ పోదామనుకుంటున్నా." "ఎందుకురా.. శానా కర్చయితది.. ఇప్పుడవసరమా?" "ఇక్కడ ఉద్యోగాలు దొరకటం లేదు కదా.. మనూరి మనోహర్ అక్కడే ఉన్నాడు.. అడిగితే రమ్మన్నాడు" "వాడంటే సినిమా పిచ్చితో పోయాడు.. నీ కెందుకురా అయ్యా. ఇక్కడ నీకేం కష్టమొచ్చింది.. మీ అయ్య ఎప్పుడో ఇల్లొదిలేసి పోయాడు. నువ్వు కూడా ఎల్తానంటే ఎలారా అయ్యా? " దీనంగా అడిగిన తల్లి ప్రశ్నకు ఓబులేసు దగ్గర సమాధానం లేదు. అలాగని అసలు విషయం చెప్పలేడు. "అమ్మా ఆర్నెల్లు టైమివ్వు.. ఉద్యోగం దొరికితే సరే. లేకపోతే తిరిగొచ్చేస్తా" తల్లిని బుజ్జగించే ప్రయత్నం చేశాడు. "నీ ఇష్టం రా అయ్యా.. నీకిష్టమైన జొన్న రొట్టె,చేపల పులుసు ఎట్టాను. తిందువు దా " కొడుకు ఎల్లిపోయినట్టే అనిపించింది కనకమ్మకు.. ఎమ్.బి.ఏ. చదివిన ఓబులేసుకు సినిమా అంటే వ్యామోహం. ఏదోకరోజు సినిమా ఫీల్డ్ లో సెటిలవటం అతని లైఫ్ యాంబిషన్. కలలు కనటంతో మాత్రమే కోరికలు…
Read More

అత్యాశలు

అత్యాశలు సామర్ధ్యం గుర్తించక భ్రమలోనే బ్రతికేస్తూ... ప్రగల్భాల కబురులెన్నొ అలవోకగ పలికేస్తూ... అందరాని తీరాలను అవహేళన చేసేస్తూ... అంతా నీ గొప్పేయని‌ అహంకరించి విర్రవీగుతూ‌.... పెద్దరికము చిన్నరికపు అంతరాలు మరిచేస్తూ... మాటల మాటున దాగిన పొగరును చూపిస్తూ... అత్యాసల పరుగులలో సహనమన్నది కోల్పోతూ... ఉరుకుల పరుగులు పెట్టేవు ఏ తీరాలకి చేరాలని.... భయమును భక్తిని‌విడనాడి చరించేవు... సులభపు దారులు వెతికి అడ్డగోలుగ తిరిగేవు... సత్యము ధర్మమ్ములు మరచిపోయినావు... సత్యము కాకలేక కన్నులున్న అంధుడయినావు... పగటిపూట కలలు కంటు కల్లలోన బ్రతుకుతు ఉన్నావు‌.. అత్యాశల దారుల్లో ఒంటరివై పయనిస్తున్నావు... ఎండిన చెట్టుమాదిరి బంధువులెరుగని ఏకాకివైనావు... గాలిమేడలెన్నొ‌కట్టి చివరకు చతికిలబడినావు‌... ప్రకృతి నిను నడుపునని.. సంస్కృతి నీ ఆరోగ్యమునకని... సంప్రదాయము నిను భవితలొ నిలుపునని... అత్యాసయె అగ్నికణమై నిను సాంతము దహించేయునని... తెలుసుకుని మసలుకుంటు కనులు తెరువు మానవుడా! - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

కల్మషం – కాలుష్యం

కల్మషం - కాలుష్యం కల్మషం లేని చెట్టు కి గాలి వస్తుంది.! కల్మషం లేని జంతువులు, చిన్న, ప్రాణులు, పక్షులు కి, గాలి వస్తుంది. కానీ, స్వచ్ఛమైన గాలిని కూడా కలుషితం చేసే మనుషులుకి కూడా గాలి వస్తూనే వుంది. దాన్ని కాపాడుకుందాం కాలుష్యాన్ని కొంచెం అయినా ఆపుదాం...!! - అంజి
Read More

సిరులమేను.. పైడితల్లి సిరిమాను

సిరులమేను.. పైడితల్లి సిరిమాను ఉత్తరాంధ్ర ఇలవేల్పు.. అమ్మలగన్న అమ్మ పైడితల్లి అమ్మవారి పేరిట ప్రతి ఏటా జరుపుకునే అమ్మవారి సిరిమానోత్సవం దేశంలోనే ఎక్కడా జరగని కనీవినీ ఎరుగని సంబరం. ఈ జాతర విశేషాలను స్మరించుకున్న ప్రతిసారి భక్తితో తనువు పులకిస్తుంది. అమ్మకు అచేతనంగానే మనసు నమస్కరిస్తుంది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా నెలరోజుల‌ ఈ జాతరలో ఈనెల 11న సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుంది... విజయనగరం రైల్వేస్టేషన్‌కి సమీపంలో పైడిమాంబ అమ్మవారి ఆలయం వనంగుడి ఉంది. వనం అంటే అడవి కనుక దీన్ని వనంగుడి అన్నారు. దీన్ని అమ్మపుట్టినిల్లుగా భావిస్తారు. ఊరి మధ్యలో చదురుగుడి ఉంది. దీన్ని మెట్టినింటిగా కొలుస్తారు. చదురుగుడిలో అమ్మవారికి ఇరువైపులా ఘటాలుంటాయి. దీనిలోని నీటిని అమ్మవారి తీర్థంగా భక్తులు పుచ్చుకుంటారు. ఈ గుడిలోనే రావి, వేప చెట్ల సంగమ వృక్షం ఉంది. దీని మొదట్లో పోతురాజు పూజలందుకుంటూ ఉంటాడు. ఉత్తరాంధ్ర కల్పవల్లి: విజయనగరంలో అమ్మవారు వెలిసిన…
Read More

ఛిద్రమైన బతుకు బండి

ఛిద్రమైన బతుకు బండి రెండు వేల ఇరవై విజన్ ట్వంటీ ట్వంటీ అందరి విజన్ మార్చింది బ్రతుకులు ఛిద్రం చేసింది బతుకు బండి‌దారితప్పింది బతికున్న శవమైన జీవితాలు ఎవరెలా బ్రతికారో ఆ బ్రతుకులు మారిపోయి పూర్తిగా గమ్యం తప్పాయి ముఖ్యంగా విద్యారంగం చదివిన చదువులు కూడు పెట్టక విధి వంచితులైన బతకలేని‌బడిపంతుళ్ళు పూలమ్మిన చోట కట్టెలమ్మినట్లు డిగ్నిటీ ఆఫ్ లేబర్ బోధన కాదు నేడు ఆచరణలో చూపుతున్నారు. బతుకు బళ్ళు గమ్యం తప్పి దిక్కులేని దారులలో దిశలేని పయనం చేస్తూ కుటుంబ బాధ్యతలను బరువు పరువులను మోస్తూ చదివిన చదువుకు చేసే పనులకి పొంతనలేనంతగా బతుకు బండి గతి తప్పింది సహనానికి మారు రూపులా ఓటమెరుగని జీవితంకోసం అలుపెరుగని పయనం చేస్తూ సిమెంటు పని చేసే పిహ్చ్ డీ డాక్టర్ చెప్పులు అమ్ముకునే లెక్కల మాస్టర్ ఇలా చెప్పుకుపోతే భవిష్యత్తేదీ విద్యార్ధులకి విద్యని బోధించేదెవరు అలుపెరుగని పయనమనాలా డిగ్నిటీ ఆఫ్ లేబర్…
Read More

కురిసే మేఘం

కురిసే మేఘం నీలాకాశంలో గున్న ఏనుగుల సమూహం ఒకచోట చేరినట్లు... లోకంలోని నిశీధులన్నీ ఒకచోట సమావేసమైనట్లు... అమావాస్య రాత్రులన్నీ కలసికట్టుగా వచ్చినట్లు... కళలు తప్పిన చంద్రుడు ఆ మేఘాల మాటున దాగినట్లు.... నల్లని చీకట్టు కమ్ముకుని చీకట్లు వ్యాపించగా..... చల్లని గాలులు సన్నాయి రాగమాలపిస్తున్నట్లు... వృక్షాలన్నీ కచేరిమేళం పెట్టుకున్నట్లు... లోకంలోని ఓంకార నాదమంతా వ్యాపించినట్లు... పక్షులన్నీ గూళ్ళు చేరి సంగీతవిభావరి నిర్వహిస్తున్నట్లు... హోరెత్తిన గాలులన్నీ ప్రళయమారుతంలా వీస్తుండగా.... ఆకాశం హర్షంతో వర్షిస్తున్నట్లు జల్లులు కురిపిస్తుండగా... ఆకాశమేమైనా చిల్లుపడిందాన్నట్లు.... ఆగి ఆగి కురుస్తున్నది కుంభవృష్టి వచ్చిపడినట్లు.... ఆగక కన్నీరు కారుస్తున్నది ఆ నీలాకాశమన్నట్లు.... కరగిన మేఘాలు చిటపట చినుకులను వర్షిస్తుండగా.... స్తంభించెను జనజీవనమంతా‌.... ఇండ్లకు పరిమితమాయెను ప్రజలంతా... కల్లోలాన చిక్కుకునెను సామాన్యులంతా...‌ ప్రకృతి ప్రకోపమన్నట్లున్నది ఈ స్థితి అంతా... గత నాలుగు రోజుల వాతావరణ చిత్రమిదంతా.... మనసంతా పరవశం నింపిన మధురోహలకి అక్షర రూపమిది.... - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

ఓ మనిషీ.!

ఓ మనిషీ.! *ప్రపంచాన్ని కూలదోసి ఎక్కడుందామనుకున్నావ్.? విలవిల్లాడుతున్నావిప్పటికే, సత్యం తెలుసుకో.. *జనం‌ చస్తుంటే జగత్తు మెరిసిపోతోంది..నీదీ అనుకున్న‌ ప్రదేశంలో నిశ్శబ్దం‌ అలుముకుంది.. *నీవైపే మృత్యువు పరుగుదీస్తుంటే.. ప్రాణం మోక్షమార్గం చేరుకుందని అంటావో.. బతికి బట్టకడితే నీవే పరమాత్ముడననుకుంటావో..నీ ఇష్టం కానీ.. *కనిపించని దైవమేదో పసి బిడ్డవలే ఈ ప్రపంచాన్ని మళ్లీ నీ చేతిలో పెడుతోంది.. కాపాడుకుంటావా.? *నీటిని స్వచ్ఛం చేసి.. గాలిని శుద్ధి చేసి.. నీ మనసునే ఒక గుడి చేసి మళ్లీ నిన్ను నమ్మి నీకందిస్తోంది.. రక్షించుకుంటావా.? *ఎక్కడేది ఉంచాలో దానిని అక్కడే ఉంచి ప్రకృతిని ఆస్వాదించు.. ప్రపంచాన్ని ఆనందించు. ప్రకృతిని, ప్రపంచాన్ని భావితరానికి కాస్తైనా మిగిల్చు. - ది పెన్
Read More

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి జగమేలు స్వామికి జయమంగళం కోనేటిరాయుడికి అభివందనం నినుచూడ కదిలేరు జనులందరు కృపచూపి కరుణించి కాపాడమనుచు చరణం కోరికలు కష్టాలు వెంటున్నా వేడుకను చేసేవు నీవంట మావెంట నీవుంటే చాలంట అదియే సంబరము మాకంట చరణం నీ నామ స్మరణే చేయగా మేము మేనంత పులకించి మురియదా స్వామి మా పుణ్యఫలము నీవేను అనుచు ఏడుకొండల నెక్కుతాము చరణం భూదేవి శ్రీదేవి తోడుగా నీవు భువనైకమూర్తివైనావు నీ సన్నిధానమ్ము మాకూ ఇలలోన వైకుంఠమయ్యా చరణం ఇహము పరము మరిచి నిను కొలుచు భాగ్యమే మాది రేపుందో లేదో కానీ నీ ఉనికి మాత్రం సత్యం - సి. యస్.రాంబాబు
Read More

ఈ వాన.. నాతోన.!

ఈ వాన.. నాతోన.! ఈ రోజు ఉదయం నుంచీ వర్షం కురుస్తూనే ఉంది.. ఏంటో ఈ వాన అస్సలు తగ్గేలా లేదు ఇప్పుడు బయటకెలా‌ వెళ్లాలి.. అనుకుంటూనే సాయంత్రం వరకూ ఇంట్లోనే ఉండిపోయాను.‌ అమ్మ పొద్దున్నే వేడిచేడిగా మినపదోశలు వేసి ఇచ్చింది.. కొబ్బరిపచ్చడి నంజుకుని గబగబా రెండు దోశలు తినేసరికి ఆకలితీరినట్టుంది.. ఇంక చాలమ్మా.. అన్నాను. .అప్పుడే చాలేంటి.. ఇంకోదోశ వేశాను.. వస్తోంది అదీ తినాల్సిందేనంది అమ్మ.. అమ్మ చెప్పాక మారు మాట్లాడకుండా వినాల్సిందే, తినాల్సిందే కదా. లేదంటే అమ్మ మనసు నొచ్చుకుంటుంది కదా. టిఫిన్లు అయ్యాక నాన్న సోఫాలో కూర్చున్నారు.. టీవీలో‌ ఏదో చూస్తుంటే, అదేం చూస్తారులే గానీ కొత్త సినిమా పెడతాను చూడండి నాన్న అన్నాను.. టిఫిన్ చేస్తున్నప్పుడే సెల్ ఫోన్ లో సినిమా డౌన్ లోడ్ చేసేశాలే. నిన్న విడుదలైన సినిమా అప్పుడే వచ్చేసిందా అని అడిగారు నాన్న అమాయకంగా.. నిన్ననే వచ్చేసింది నాన్న.. నేనే ఇంకా…
Read More