Month: November 2022

లేమి

లేమి మిత్రుడడిగాడు కవిత రాయలేదేమని అన్నింటా 'లేమి' చోటుచేసుకున్న వేళ కవితకూ 'లేమి' చుట్టుకుందని చెప్పాలనుకుని చుట్టూ పరికించి చూశాను రైలెక్కుదామంటే స్థలము లేమి అనుకున్నా ముసిరే చీకట్లలో వేలాడే జ్ఞాపకాల్లా తోసుకుంటూ రాసుకుంటూ మనుషులుంటే గుండెకో హామీ ఉదయాన్నే యమభటుల్లా వేధించే వార్తలతో మనసు తడిలేమితో సతమవుతుంటే తేమ నిండిన నేల తేనీరు పరిమళంలా పలకరిస్తుంది బస్సెక్కుదామంటే జనఘోషలో హారన్ వినిపించలేదు మంచు పేరుకున్నట్టు మనుషుల మనసులపై మౌనం పూశారెవరో! హేమంతం వెలుగుకిరీటాన్ని ధరించలేదెందుకో జంక్ ఫుడ్ తిన్నట్టు సూర్యుడూ జంకుతున్నాడు ఆకలే ఉన్న లోకంలో కలల ప్రస్తావనెందుకుంటున్నాడేమో! కలల తిమ్మిరి కరిగి చాలాకాలమైనా మనసు కళ్ళద్దాల రంగుమాత్రం మారలేదు పంచరంగుల ప్రపంచాన్ని చూద్దామనే ఆశమాత్రం చావలేదు ఆశకిప్పుడు లేమి సమస్య లేదు - సి.యస్.రాంబాబు
Read More

భారత రాజ్యాంగ దినోత్సవం

భారత రాజ్యాంగ దినోత్సవం మహనీయుల త్యాగ ఫలం మన భారత రాజ్యాంగం భావి భారత పౌరులకు దిశా నిర్దేశం మన రాజ్యాంగం పరిధులు చెప్పే పంచాంగం శాసనాల శంఖారావం ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అందరికీ సమ న్యాయం చట్టాల చిట్టాలు హక్కుల వివరాలు భాద్యతల వివరణలు పౌరులకోసం ప్రభుత్వాల రక్షణ హక్కులు భాద్యతలు అందరికోసం సమాజ సంక్షేమమే లక్ష్యం సంపదపంచడమేసమన్యాయం అందరికీ అవకాశాలు అనేది అభివృద్ధి పై ఆధారం చట్టాల సవరణలు వివాదాల కూర్పులు వ్యవస్థల నియమాలు నిరోధించే అంశాలు ప్రజల కోసం ప్రగతి పథంలో నడవడానికి లిఖించిన గ్రంధం నవభారత నిర్మాణానికి నాణ్యమైన రాజ్యాంగం మనది వర్ధిల్లుతోంది రాజ్యాంగం అంతటా బహుముఖ ప్రజ్ఞగా......? - జి జయ
Read More

బందీఖాన

బందీఖాన బతుకు బందీఖాన కావద్దు అంటారు పెద్దలు ఇష్టంతో బతకాలి కష్టపడి పనిచేయాలి అంటారు కాలం మనకోసం ఆగదు మన అన్వేషణ కాలాన్ని సద్వినియోగం చేయడమే పరుగెత్తే కాలంలో బందీవై బతక కుండా భావాలను బందీ ఖానాల్లో వేస్తే స్వేచ్ఛా వాయువులు మసక బడతాయి ప్రపంచం ముందుకు సాగితే మన ప్రయాణం ఆపకూడదు పొటీ ప్రపంచంలో ఎదగడం నేర్చుకోవాలి ఎలాగైనా ఆలోచనలు మెట్టు మెట్టుగా ఎక్కిబలవంతపు బందీ ఖానాల తలుపులు తెరవాలి అన్ని రంగాలలో అభివృద్ధిని చవిచూసే తరుణంలో మనుషులు మారిన యంత్రాలు గా కాకుండా సృష్టించు కోవాలి మనకు మనకుగా బలమైన అవకాశాల వేదికలు మరి ....? - జి జయ
Read More

నా జోహార్లు…

నా జోహార్లు... బ్రిటిష్ బానిసత్వం నుండి బయటపడిన.... తమలో తాము కులాల మతాల బానిసత్వం... పరిమితులు పెట్టే ప్రజానీకం.... అంటరానితనం అనే అడ్డగోడల మధ్య నలిగిన..... బడుగు వర్గాల బలహీనతలు మరింత బల పడిన రోజున.. పంచభూతాలకు లేని పక్షపాత ప్రయాణం.... ఎదురు నిల్వలేని ఎగసిపడే ఆక్రోశంలో... ఉద్భవించే పాల సముద్రాన పంచామృతం...... తమ హక్కులను దోగిలించే అధికారానికి అడ్డకట్టలా.. చట్టాన్ని వ్యతిరేకించే చుట్టాన్నిలా.... అంటరానితనాన్ని అణగ ద్రొక్కే ఆశాజ్యోతి ఆత్మబందువులా... సర్వసత్తాక, సామ్యవాద లౌకిక, ప్రజాస్వామ్య.... గణతంత్ర రాజ్యాన్ని తెచ్చిపెట్టిన..... బడుగు వర్గాల బలానికి పునాదిలా నిల్చిన.... డా.బి.ఆర్. అంబేద్కర్ కి నా జోహార్లు... - తోగరాపు దేవి
Read More

కరువైన మనశ్శాంతి

కరువైన మనశ్శాంతి సంధ్య ఇలా అయితే ఎలానే... ప్రాణమంటూ పెళ్ళి చేసుకున్నావు.. ఓక్షణమైనా విడిచి ఉండలేను అన్నావు. ఇపుడేమో అసల ఆ మనిషి ముఖం చూడను అంటున్నావు. ఇలా చెప్పాపెట్టకుండా వచ్చి గుండెల్లో బుల్లెట్స్ పేల్చుతున్నావేంటే... అంటుంది తల్లి సుధ. అవునమ్మా ఇంతకు ముందులా లేడమ్మా సుధాకర్. బాగా మారిపోయాడు. ప్రతీది ప్రశ్నిస్తున్నాడు. ఇది ఎందుకు ఇలా చేసావ్.. నిన్నెవరు డ్రాప్ చేసారంటూ ఆరాలు, అనుమానాలు నావల్లవట్లేదు అమ్మా... చూడమ్మా సంధ్య భర్తన్నాక ఆ మాత్రం వివరాలు అడుగుతారు. దానికి నువ్విలా వచ్చేయడం.. తిరిగి వెళ్ళను అనడం బాలేదురా... ఒకసారి ఆలోచించు అంటుంది సుధ. కానీ సంధ్య ఇపుడేమీ ఆలోచించే స్థితిలో లేదు. సుధ భర్తకి పోన్ చేసి జరిగినది అంతా చెబుతుంది. భర్త అంతా విని సరే సాయంత్రం ఇంటికి‌వచ్చాక మాట్లాడతాను. నువ్వేమీ అనకని చెప్పి పోన్ పెట్టేస్తాడు. చేసేదేమిలేక వంటింట్లో కాఫీ కలపడానికి వెళుతుంది సుధ. సంధ్య తలస్నానం…
Read More

నగుమోము

నగుమోము ఆ నటనం ఎందరి పెదవులకో నవ్వుల వరమిస్తుంది... ఆ వదనం మరెందరి మనసులనో తేలిక పరుస్తుంది... చూడగానే హాస్యం పంచే ఆకారమది.... ఆహార్యపు ఆటలతో సంతోషం నింపునది... దాచుకున్న ముఖానికి పరదావంటిది... కన్నుల్లో దాగిన వేల నిశీధులు కానలేము... అసలు ముఖము కానక సంతసించేము... తినను తిండి లేకున్నా నవ్వించడం మరువడు... కష్టాల కడలి ఈదుతున్నా మనల్ని నిరాశ పరచడు... జోకర్ గా నవ్విస్తూ నవ్వులపాలవుతుంటాడు.... మది మెచ్చి మనసారా నవ్వించు ముఖం.... నిశీధి కడలిలో ఆతని నివాసం... నవ్విస్తూ మురిసిపోవు వృత్తి అతనిది.. ఆ నవ్వే కరువైన జీవితం వాస్తవమిది... నిజమే ప్రతి నవ్వు వెనుక ఎన్ని విషాధాలో... ఏ నవ్వులో ఏ చీకట్లు దాగున్నాయో... ఏ నగుమోములో ఎన్ని విషాధాలున్నాయో.... ఏ జీవితం వెనుక ఎన్నెన్ని కడలి అలలు ఎగసిపడుతున్నాయో.... చూసేదంతా నిజం కాదు మరి వాస్తవమింకో సత్యం... - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

బందిఖాన

బందిఖాన పచ్చని చిలుక బంగారు బొమ్మ పెళ్లి అను బంధంతో బందిఖాన చేస్తిరి... మోసం చేసి. సంపాదన అనే ఉచ్చులో ప్రేమా, అనురాగాలను బందిఖాన చెస్తిరి... ఎన్నుకొన్న పాలకులు పాలనా అనే పేరుతో పాలితులను, అధికారులను బందిఖాన చేసిరి... విప్లవ కారులను స్వాతంత్ర యోధులను కవితలు, పాటలతో మేల్కొలిపే కవులను బంది ఖాన చేసిరి.... బందిఖాన ఏ ఒక్కరినీ నిలువరించలేక పోయింది కృష్ణుడితో సహా - హనుమంత
Read More

నీ మాయలో బంధీలమే!

నీ మాయలో బంధీలమే! చిన్న కణమే ఆయువు నింపుకుని నవమాసాల వ్యవధిలో బాహ్య ప్రపంచానికొచ్చి అనేకానేక సందర్భాలకి తగినట్లుగా ఎదిగి సుఖం దుఃఖం‌ అనే ఛట్రంలో పడి తిరుగుతూ బంధాలలో బంధీలయిపోతూనే మరుక్షణం ఒంటరులయిపోతూనే నీవాడే చదరంగంలో పావులమైపోతాము ప్రేమానురాగాలను పెనవేసుకుని ఆనందించేలోపు దూరంచేసే ప్రేమలకి అలవాటుపడలేక ఏడుస్తుంటాము కష్టాల కడలిని‌ ఈదలేక ఈదుతూ దరికి‌చేరేలోగా సృష్టించే ఆటంకాలకకి జడిసి మధ్యలో కథ ముగించుకుంటుంటాము ఇంకొన్నిసార్లు కసిగా పోరాడి ఫలితం‌పొంది ఆనందిస్తాము అంతలోనే ఏదోక నష్టాన్నిచ్చి నవ్వేస్తుంటావు ఇలా నీవాడే చదరంగంలో పావులుగా... కపట నాటక సూత్రధారివైన నీ మాయలో బంధీలమై బంధిఖానా వంటి‌ ఈ శరీరంలో చిక్కుకుని అనేకానేక అవస్థలలో పుడుతూ చస్తూ ఉంటాము జీవులుగా శాంతిలేక చస్తూనే పుడుతుంటాము నీ మాయలు తెలియ తరమా లీలా మానసచోరా! - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

మానవత్వం పరిమళించే క్షణం

మానవత్వం పరిమళించే క్షణం ముగిసిన అధ్యాయంలా ఉంది మానవత్వం అనే పదం ఎదుటి మనిషి కులం మతం ప్రాంతం అనేది లేకుండా స్పందించే తత్వం మనిషిది కావాలి డబ్బుతో మాత్రమే ముడిపెట్టిన సాగదుమానవత్వపు పరిమళం జీవమున్న ప్రతి ప్రాణి యందు చూపాలి మానవత్వపు విలువ సాటి ప్రాణికిసహాయంఅవసరం సదుద్దేశ్యంతో సహకరించడం సమాజపు రంగులను చూసి మానవత్వపుకోణాలమార్పులు మనిషి మనిషిగా ఎదగాలంటే మానవత్వం కొద్దో గొప్పో గుభాలించాలిమనసులలో ....? - జి జయ
Read More

బంధీఖానా

బంధీఖానా ఎన్నాళ్ళనీ... ఎన్నేళ్ళనీ... కట్టుబాట్ల ఇనుప కచ్చడాలతో... ఆచారాల ఆర్భాటాలతో... నీ ఆధిపత్యపు అహంకారాలతో.. నా కలలను నలిపేస్తావు..? అండదండల పేరుతో.. అరదండాలు వేసి.. నాలోని సంగీతాన్నంతా శాశ్వతంగా సమాధి చేస్తావు.. నీ కలల సాకారానికి ... నన్ను ఒక ప్రమిదను చేసి.. నీ ఆశల యజ్ఞానికి సమిదగా మారుస్తావు.. ఈ సాంప్రదాయ బంధనాలను ఛేదించుకొని... విశాల ప్రపంచంలోని అవకాశాలను... అందిపుచ్చుకోవాలని... నలువైపుల నుంచి నన్ను కమ్మేస్తున్న... కారు చీకట్లను చీల్చుకుంటూ... స్వేచ్ఛవిహంగాన్నై... దిగంతాలను స్పృశించాలని... నా అశ్రుపూరిత చక్షువులు.. ఆశగా వేచి చూస్తున్నాయి..! - శైలజ
Read More