Month: December 2022

భారతావనికి మొదటి బిడ్డ పుడమి తల్లి రైతు బిడ్డ

భారతావనికి మొదటి బిడ్డ పుడమి తల్లి రైతు బిడ్డ చెమట చుక్కల్లో స్నానం చేసేవాడే రైతు.. బురద సుగుంధంలో పరిమళించే వాడే రైతు.. నింగికి నేలకి ఆత్మ బంధువు రైతు.. తొలకరి జల్లులు నేలను ముద్దాడిన వేళ.. పుడమి తల్లికి పచ్చని పట్టుచీర కట్టి.. పసుపు కుంకుమల పూల వర్ణాల గుబాళింపు ఫలాల కమ్మదనాల పంటలతో భూమాతకి సింగారించి సీమంతం చేసి నేలమ్మకి పురుడు పోసి.. దేశమనే కుటుంబాన్నీ కాపాడుకుంటూ భారతావనికి కడుపు నింపి.. అప్పుల ఆర్తానాధాల్లో పక్కడొక్కలు విరిగిన కన్నీరు అనే కష్టాన్ని మోస్తూ తాను ఉరి కొయ్యల ఉయ్యాలలో ఊరిగే వాడే రైతు.. తాను దేశ బరువును మోసే బలిపశువు.. గింజ గింజగా మారి పక్షులకు ప్రాణం పోసేవు మెతుకు మెతుకు గా మారి ఆకలి ఆర్తానాదాలు తీర్చేవు.. సమస్త మానవాళికి రక్షకుడా. జీవకోటికి ప్రాణం దేవుడా వ్యవసాయం అనే సాయం నీది సాయం అనే వ్యసనం నీదే…
Read More

నూతన నిర్ణయం

నూతన నిర్ణయం నమస్తే అండి నా పేరు అంజలి. నేనొక ఒంటరి మహిళను నాకొక బాబు. నేను వాడి కోసమే బ్రతుకుతూ ఉన్నాను. పిల్లలుంటే చాలు అండి పిల్లల కోసమే కదా మనమేం చేసినా అందుకే నేను వాడు పుట్టినప్పటి నుండి ఏదో ఒక పని చేస్తూ ఉండేదాన్ని. అయితే వాడిని ఇంట్లో అమ్మ దగ్గర వదిలేసి పనికి వెళ్ళేదాన్ని టీచర్ గా నా ప్రయాణం మొదలైంది. పొద్దున్నే పాలు పట్టి వెళ్ళడం, మధ్యాహ్నం వచ్చి మళ్ళీ పాలు పట్టి వెళ్లేదాన్ని, అలా పని చేస్తూ వాడి చిన్న చిన్న అవసరాలు తీరుస్తూ ఉండేదాన్ని. నిజానికి వాడిని అమ్మే చూసుకునేది. అమ్మనే అన్ని విధాలా చేసేది. అలా గడుస్తూ ఉండగా ఒక రోజు మధ్యాహ్నం ఎప్పటిలా ఇంటికి వచ్చేసి అన్నం తిని వాడికి పాలు పట్టి వెళ్దాం అనుకునే లోపు ఏడుపు మొదలు పెట్టాడు. వెళ్లొద్దు అన్నట్టుగా నాకు కాస్త జాలిగా…
Read More

ఎదురుచూపు

ఎదురుచూపు వస్తున్నావా నువ్వు..? ప్రియమారా నువ్వు నా దరికి చేరే.. అపూర్వ క్షణం కోసం.. తరతరాలుగా, యుగయుగాలుగా.. కొడగట్టుకు పోతున్న ఆశలకు... కొత్త ఊపిరిలు అద్దుతూ... వేచి చూస్తున్న నాకోసం... ఆధిపత్యపు భావజాల నిగలాలను చేదించుకొని.. ఆర్తిగా హత్తుకోవడం కోసం.. ఇకనైనా వస్తున్నావా నువ్వు..? అర్ధాలు: నిగలాలు: సంకెళ్లు. ప్రియమారా: ప్రేమగా.. - మామిడాల శైలజ
Read More

సంధ్యా సూర్యుడు

సంధ్యా సూర్యుడు తూరుపు సూరీడు మా ఊరి కొచ్చాడు మేఘాల చెలిమితో రోజంతా వెలిగాడు ప్రకృతి సరస్సులో ప్రణయ జలకాలాడి సంధ్య వేళకు అలసిన సింధూర భానుడు ఆకాశ వీధిని వదిలి మా‌ ఇంట వాలాడు‌.! - ది పెన్
Read More

నిశబ్దం

నిశబ్దం ఈ తరానికి చెందిన ఒక ఆత్మకథ.... పగ తీర్చుకునే ప్రయత్నం కాదు ప్రాణాలు తీసే ప్రేతాత్మ... దానితో చెలగాటం అంటే కొలిమి తో ఆటలే మన పెద్దలు చెప్పే దానికి ఎప్పుడు ఒక అర్థం ఉంటుంది అది కాదని మనం అతిగా ప్రయత్నిస్తే జరిగేవి అనర్థాలే... అలాంటి ఒక ప్రమాదమే ఈ నా కథ. నా వర్ణనల ప్రకారం వర్ణిస్తాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి... ఊరికి అవతల ఒక చిన్న ఇల్లు ఉండేది. దానిలో ఒక బామ్మ, ఒక అందమైన అమ్మాయి ఉండేవారు ఆ అమ్మాయి పేరు మోనా. తను ఎప్పుడూ మౌనంగా ఉండేది. తనకి ఎక్కడికి వెళ్లడం ఇష్టం లేదు ఎప్పుడూ నిర్మానుష్యమైన అడవిలోనే ఉంటుంది. అక్కడికి వెళ్లాలంటేనే పిల్లలు భయపడి పోతారు కానీ తను మాత్రం భయపడదు చివరికి పెద్దలు కూడా తనను చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అది ఒక శవాల దిబ్బ ఒక్కోసారి తను ఒంటరిగా,…
Read More

సవరింపు

సవరింపు పూల పరిమళం ముక్కుపుటాలకు సోకినట్టు అల్లుకున్న జ్ఞాపకాలన్నీ పెనవేస్తుంటాయి తెలిమంచు స్పర్శ తాకుతుండగా వెచ్చని కిరణం నిను పలకరిస్తుంది! లక్ష్యాలు,గమ్యాల కూడికలు,తీసివేతల నిట్టూర్పుల సెగలు చుట్టుముడతాయి.. నవ్వుకుంటూ సాగిపోమని మనసు సముదాయిస్తుంటుంది! బాధలు, భయాలు ఓటమి, గెలుపుల పందేరాల తో సంశయాల కూడలిలో కూలబడుతుంటే కాలం కుదుళ్లు నిను కుదిపేస్తుంటే కుదురుగా ఉండనివ్వదని జీవితంపై అలుగుతుంటావు పోగేసుకునే క్షణాల ఆశల పల్లకి ఆమని పిలుపులా నీ గుండె తలుపు తడుతుంటే మనసులో ఓ చిన్న వెలుగు విస్తరిస్తూ నీ చూపును సవరిస్తూ ఉంటుంది! - సి. యస్ రాంబాబు
Read More

సంగీత సాహిత్య సమలం కృతే

సంగీత సాహిత్య సమలం కృతే ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నా స్వప్నం నా ముంగిట నిలిచింది, ఎన్నో పోరాటాలు, అలకలు, తిట్ల మధ్య నా కల నెరవేరింది అన్నం మానేసిన రోజులూ, అర్ధాకలితో గడిపిన క్షణాలు సూటి పోటి మాటలతో ఎత్తి పొడుపులు, అత్తగారి చివాట్లు, మామగారి మౌనం, భర్త గారు నిర్లక్ష్యం, ఆడపడుచు వేధింపులు, గొడ్రాలు అనే సమాజం చిత్కార చూపులు, బావగారి రహస్య బూతు మాటలు, మరిది గారు చూసే ఆకలి చూపులు, పక్కింటి బాబాయి గారు వేసే బూతు జోకులు, అవన్నీ అవన్నీ మర్చిపోయి, మారిపోయి ఇక భరించలేనంత బాధను కూడా అర్థం చేసుకోలేని తల్లిదండ్రులను వదిలి, నాకు నచ్చిన, నా జీవిత ఆశయం కోసం అందర్నీ వదిలి ఈ అనంత ప్రపంచం లోకి ఆశగా, స్వేచ్ఛగా అడుగులు వేస్తూ, నా ఆశ, శ్వాస అయినా సంగీత సాధనకై, పంజరం విడిచిన రామచిలుకలా ఎగిరిపోయి ఇదిగో ఇక్కడ ఈ…
Read More

కల

కల అమ్మోయ్.... నాకు ఉద్యోగం వచ్చిందంటూ అమ్మాయి అరుపు తో వంటింట్లో ఉన్న నేను బయటకు వచ్చాను. అబ్బా ఎన్ని రోజులకు మంచి శుభవార్త తెచ్చావు అంది అమ్మ మేటికలు విరుస్తూ. ఇక మనం ఈ చిన్న ఇంట్లో ఉండొద్దు. పెద్ద ఇంటికి మారాల్సింది అంటూ తనతో వచ్చిన మనుషులతో ఇంట్లో విలువైన సామాను తో పాటు కొత్త ఇంటికి మారిపోయారు సరితా వారి కుటుంబం. ఎందుకమ్మా ఈ ఇల్లు బాగుంది కదా అని అంటున్న నారాయణ గారితో నాన్న మీరు మాట్లాడకండి ఇన్ని రోజులూ ఇరుకుగా ఉన్న ఇంట్లో ఉన్నాం. ఇప్పుడైనా కనీసం పెద్ద ఇంట్లోకి మరదాం అంటూ తండ్రి నోరు ముయించి పెద్ద ఇంట్లోకి మారిన వెంటనే పెద్ద టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, కూలర్ లాంటివి అన్ని తెచ్చేసింది సరిత. తల్లి సంతోషించినా, తండ్రి వారించాడు. అయినా సరిత వినకుండా నేను కడతాను కదా అంటూ దబాయించింది. ఒకప్పుడు…
Read More

శ్రీ వేంకటేశ్వర మహత్యము

శ్రీ వేంకటేశ్వర మహత్యము వేంకటేశ్వర నీ లీలలు ఎంతో మధురం స్వామి అని పిలిచినా పలికే దైవం నీవు ఆపదలో అదుకునే ఆపద మొక్కుల వాడివి నీవు శరణన్న వారి బాధలు తీర్చే కల్పతరువు నీవు గోవిందా అని పిలిచినా చాలు జన్మ ధన్యం నీ నామ స్మరణ చేసినా తోలుగు పాపాలన్నీ నీ కళ్యాణం చూసినా కలుగు శుభాలన్ని నమో వెంకటేశ నమో నారాయణ శరణు శరణు.... - భవ్య చారు
Read More

కల

కల హమ్మయ్య ఆఫీస్ టైమ్ అయిపోయింది ఇంటికెళ్ళి అన్నం వండుకుని తిని కమ్మగా నిద్రపోవాలి. అబ్బా! ఈ మగవెధవలు ఒకటి రోడ్డు నిండా వాళ్ళే ఉంటారు. ఏది చూడాలన్న, ఎవర్ని చూడాలన్నా భయంగా ఉంటుంది అప్పుడే పక్కింటి పంకజం గారు బజారుకు కూరగాయలు తిసుకోవడానికి వెళ్ళి ఇటుగా వచ్చారు. ఏమిటి సీత ఇంతసేపు ఆఫీసులో ఉన్నావా?! నమ్మబుద్ధి కావట్లేదు. ఈ కాలం ఆడపిల్లలు మరీ చెడిపోతున్నారు అని గొణుక్కుంటూ... ఇదిగో సావిత్రి అక్కా ఈ అమ్మాయే మా ఇంటి పక్కన ఉండేది చాలా మంచిది. అన్నట్టూ నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా! ఇంట్లో ఏమైనా సంబంధాలు చూస్తున్నారా!? ఆ ఊరికే అడిగా మా చుట్టాలబ్బాయి ఉన్నాడు అందుకని అడిగా. “ఆ చూస్తున్నారు పంకజం గారు.... సరే మీ ఇల్లు వచ్చింది నేను వెళ్తాను. అదేంటి ఇంట్లోకి రాకుండా వెళ్తావా, సరేలే నేనే చక్కెర కోసం నీ గదికి వస్తాను. అంటూ…
Read More