Year: 2022

తొందర పాటు

తొందర పాటు మనిషి తన దైనందిన కృత్యాల్లోను, వివిధ కార్యక్రమ ప్రణాళికా రచనలోను రెండు సూత్రాలను ప్రధానంగా గుర్తుకు తెచ్చుకుంటాడు. ‘ఆలస్యం అమృతం విషం’ అని, ‘నిదానమే ప్రధానం’ అని... నిజానికి ఈ రెండు సూత్రాలూ కార్యసాఫల్యానికి అవసరమైనవే. ఆయా సందర్భాలు, సన్నివేశాలు, పరిస్థితులను బట్టి ఈ సూత్రాలను ఆచరణలోకి తేవాల్సి ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు తన బుద్ధితోనే గాక, తన హితం కోరేవారు, ఆత్మీయుల బుద్ధిని కూడా ఉపయోగించుకోవడం పురోగతి కోరుకునేవాడి లక్షణం. తనకు తోచిందే సరైనదని వెనకా ముందూ ఆలోచించకుండా అనుకున్న వెంటనే పని మొదలెట్టడం వైఫల్యానికి, అవమానానికి కారణభూతమవుతుంది. విపరీత ఫలితాలు ఎదుర్కొన్నాక పశ్చాత్తాపం చెందడం చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే అవుతుంది. ఈ తొందరపాటు ప్రతి మనిషి జీవితంలోనూ కనిపిస్తుంది. అదే శోక కారణమవుతుంది. అనుభవజ్ఞుల సలహాలు, సూచనలను విని విశ్లేషించుకుని అహంకరించక, వివేకంతో ముందడుగేసేవాడు కచ్చితంగా కార్యసాధకుడు కాగలడు. తొందరపాటు వల్ల జీవితంలో…
Read More

గతం

గతం గతమంతా ఒక పిడ కలగా గడిచిన రోజులు ఒక అనుభవంగా గడిపిన గడ్డు కాలం ఒక గుణ పాఠంగా గడిచిన జ్ఞ్యాపకాలు విషాదాలుగా గతం ఒక మారుతున్న కాలానికి గుర్తుగా అనుభవాల పాఠాలుగా బాధల మయంగా బ్రతుకుతున్నప్పుడు గుర్తుకు తెచ్చుకోలేని గురుతులుగా మారి భవిష్యత్తును భయపెడుతున్నప్పుడు రాబోయే కాలంలో అయినా ... గతం పడగ నీడ పడకూడదు అని గత పీడ కలలన్నీ మర్చిపోయి మారుతున్న కాలంతో పాటు కాస్తయినా సంతోషాన్ని వెతుక్కోవాలి అని ఉరుకులు పరుగులు పెడుతూ, ఉవ్విళ్లూరుతున్న కోరికలతో...... కొత్త సంవత్సరం కొత్తగా ఉండాలని కోరుకోని దేవ్వరు. భవిష్యత్తు అయినా బంగారు మయం అవ్వాలని అన్ని బాధలు పోయి, పీడ కలలన్నీ కలలే అని కొత్త కలలతో కొత్త జీవితాన్ని కోరుకుందాం... కొత్తగా ఉందాం.... - భవ్యచారు
Read More

శుభాకాంక్షలు

శుభాకాంక్షలు అక్షరలిపి  పాఠకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అక్షరలిపి యాజమాన్యం తరపున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు... ఈ సంవత్సరం మీరు మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో విలసిల్లాలని మీ లక్ష్యాలు, కోరికలు, ఆశలు, ఆశయాలు నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటుంది మీ అక్షరలిపి టీం...
Read More

అరుణారుణ వర్ణం

అరుణారుణ వర్ణం అరుణారుణ వర్ణం తో ఉదయించింది అందంగా కనిపించింది. అందరాను అన్నది అందరినీ అన్నది. అందరికీ కావాలనింది అందరితో కలిసి ఉంటానన్నది. అహం లేదన్నది. అంతు లేనిది. అందరికీ అర్ధం అయ్యేది. అందితే కాలేది. అంబరాన ఉన్నది. అలుపులేని చిన్నది. అదే అదే అదే అదిగో అదిగదిగో అగ్ని గోళం అరుణారుణ వర్ణంలో అంబరాన ఉన్నది అదే నా చిన్నది. అందమైన చిన్నది.
Read More