డిటెక్టివ్ ఎపిసోడ్ 4
డిటెక్టివ్ ఎపిసోడ్ 4 ష్యూర్ ష్యూర్ ముందు మనం మేటర్ కు వద్దాం "అంది యాంకర్" ముందు చల్లని వాటర్ తెప్పించండి.. మినరల్ వాటర్..." చెప్పాడు సిద్దార్థ లైవ్ లో ఇదంతా టీవీల ముందు కూచున్న జనం చూస్తున్నారు. స్టూడియో లో వున్న టీవీలో సుగాత్రి, జేమ్స్ చూస్తున్నారు... వీళ్ళతో పాటు మరో వ్యక్తి చూస్తున్నాడు. అతనే... మిస్టర్ " & ".. నేర ప్రపంచంలో చీకటిరాజు.. మాఫియా సామ్రాజ్యంలో "&" అంటే 'డి ఫర్ డెత్..: దయాళ్ కు ఎదురువెళ్తే చావు తప్పదు... పోలీస్ రికార్డ్స్ లో డి అంటే డెవిల్... డి అంటే దయాళ్... దయ అనే పదానికి అర్థం తెలియని అండర్ వరల్డ్ డాన్... డ్రగ్స్ ను ఆయుధంగా మార్చి దేశాన్నే కాదు ప్రపంచదేశాల్లో యువతను చిన్నారులను సైతం డ్రగ్స్ కు బానిసలుగా చేసే అతి ప్రమాదకరమైన వ్యక్తి.... ********** "మీరు హైద్రాబాద్ కు ఎందుకొచ్చారో తెలుసుకోవచ్చా?" అడిగింది…