ధరాభారం
ధరాభారం పక్కింటివాళ్ళు ఏదో బాస్కెట్ అంట అక్కడినుంచి కూరగాయలు తెచ్చుకుంటున్నారు. చూడు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో అంది అమ్మ. మనం కూడా అలా తెచ్చుకుందామా అంటూ అడిగింది.సరే వాళ్ళు ఏమేమి కూరగాయలు తెచ్చుకున్నారు ఎంత బిల్ అయిందో ఒకసారి అడగమ్మ అన్నాను నేను.అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుగా వెళ్లి ధరల పట్టికను తీసుకొని వచ్చింది.ఇప్పుడు ఆ ధరల పట్టిక తీసుకొని చూడు అన్నాను టమాట కేజీ 80 ఉల్లిగడ్డ కేజీ 60 ఉల్లిపాయ కేజీ 120 వంకాయ కేజీ 70 అంటూ మొత్తం ధరల పట్టికను చదివింది. అమ్మ ఇప్పుడు చెప్పు మొత్తం బిల్లు ఎంత అయింది అంటూ అడిగాను.మొత్తం కలిపి 2000 అంటూ కళ్ళు తేలేసింది అమ్మ. ఏమిటి కూరగాయలకు 2000 అది కూడా వారానికి సరిపోతాయి వాళ్ళు మనలాగే ఐదుగురు కదా అంది అమ్మ. అవునమ్మా వాళ్ళ ఇంట్లో అందరూ పని చేస్తారు కాబట్టి తీరిక ఉండదు…