ఉగాది ఊసులు
ఉగాది ఊసులు 1 ఆ.వె ఉప్పు.తీపి.కారముపకారమును చేయు చేదు.వగరు.పులుపు చేయు మేలు ఏవి యెక్కువైన ఇక్కట్లు వచ్చును మితము ఎప్పుడైన హితము గూర్చు 2 తే.గీ. కలిమి లేములు సంతోష కష్టసుఖము లన్ని అడ్డంకుల మనిషి అధిగమించి నీరస పడిపోకుండ యెదురు నిలువ వలెను పారిపోకుండ నిలబడు ఫలితమిచ్చు 3 తే.గీ. పుట్టి నప్పటి నుండియు గిట్టువరకు నరుని జీవిత మంతయు నాటకమ్ము కష్ట సుఖములే గాకయు కలిమి లేము లన్ని కలబోసి వచ్చును అందరకును - కోట