ankush writes

ధర్మం

ధర్మం ఏది ధర్మం... ఏది న్యాయం మనసులో మలినాన్ని నింపుకోని నీ.. స్వార్థమే ధ్యేయంగా తీయని మాటలతో... నంగనాచి నాటకాలతో... అవసరానికి ఆత్మీయంగా మాయతో మాటలు కలిపి... అవసరం తీరాక..... ఏరుదాటి తెప్పను తగిలేసినట్టు ఎంత స్వార్థం.. ఎంత మోసం... ఓ మనిషి...! ఇదేనా నీ ధర్మం.. ఇదేనా నీ న్యాయం..!? - అంకుష్
Read More

ఆకలి అంటే

ఆకలి అంటే    ఆకలి అంటే నాకు చాలా ఇష్టం... ఆకలి నాకు పరిపూర్ణత నేర్పింది... ఆకలి నాకు మమతలు పంచడం నేర్పింది... ఆకలి నాకు అందరిని దగ్గరగా చేసింది... ఆకలి నాకు జ్ఞానాన్ని ఇచ్చింది... ఆకలి నాకు అందరిలో దైవత్వాన్ని చూపింది... ఆకలి అంటే నాకు చాలా ఇష్టం... ఆకలి అంటే నాకెంతో గౌరవం... ఎందుకంటే...!? ఆకలి నాకు కొత్త ప్రపంచాన్ని చూపింది... ఆకలి నన్ను అజేయున్ని చేసింది... అందుకే ఆకలి అంటే నాకు మహ ఇష్టం... - అంకుష్
Read More

ఎవరు నీవు

ఎవరు నీవు గొప్పగొప్ప ఆదర్శాలు... గోప్పోళ్ళ  కోసం గప్పాలు పలుకుతూ... నాలుగు మాటలు నేర్చి... నలుగురు మధ్యలో మాటల మూటలతో... ఊకదంపుడు ఉపన్యాసాలతో... తోటి వారిని సాటివారిని.... దోచుకుంటూ.. దాచుకుంటూ.... స్వార్థపూరిత భావంతో... సమతా భావాన్ని సమాధిచేస్తూ... అసమానతలకు ఆజ్యం పోస్తూ... మేకవన్నే పులిలా మారిన నీవు... సంఘజీవివా..?... సంఘద్రోహివా..? - అంకుష్
Read More

ఎప్పుడైనా

ఎప్పుడైనా  ఎప్పుడైనా.... ఎక్కడైనా.... ప్రజలపై పాలకుల.... ఎత్తుగడల ఉక్కుపాదం.... నష్టమైనా.... కష్టమైనా కలసికట్టుగా కదలడమే.... సమరమైనా.... మరణమైనా పోరుబాటన.... సాగిపోవడమే -అంకుష్
Read More

అర్థ రాత్రి

అర్థ రాత్రి అర్థరాత్రి... గాఢ నిద్రలో నేను... ఇంటిబయట గేటును... లాటీలతో బాదిన చప్పుడు... వెళ్లిచూసాను... ఇంటిముందుంది ఒక జీపు... తెల్లవారేకాదు... మరెప్పుడు ఎవరికి తెలియదు... నేను ఏమైపోయానోనని... - అంకుష్
Read More

మాతృత్వం

మాతృత్వం *అమ్మ రుణం తీర్చలేనిది* *అమ్మ త్యాగం మరువలేనిది* *మరో జన్మంటూ ఉంటే* *అమ్మలా పుట్టాలని* *అమ్మలోని మాతృత్వపు అనుభూతి పొందాలని ఆశ* - అంకుష్
Read More