arjun

కెరటం

కెరటం పొద్దునైనా రానివ్వని నిదుర రాత్రైనా పడుకోనివ్వని కలలు రెండింటి మధ్య నలిగే నా తనువు ఎప్పటికీ తీరం చేరని కెరటంలాంటివి - అర్జున్
Read More

ప్రజ్వలించే….

ప్రజ్వలించే.... ప్రజ్వలించే నీ నగుమోము  ప్రజ్వలించే నీ నీలాల కళ్ళు ప్రజ్వలించే నీ కంటి కనుపాప ప్రజ్వలించే నీ వెన్నెల నవ్వు, ప్రజ్వలించే నీ చెక్కిళ్ళ చురుక్కులు... ప్రజ్వలించే నీ ముఖారవిందం... ప్రజ్వలించే నీ కురుల ముంగురులు  ప్రజ్వలించే నీ  నాభి నడుము ముడతలు.. ప్రజ్వలించే నీ నాభి అవలగ్నము సొగసులు            ప్రజ్వలించే నీ   కాలి అందెల చప్పుడు ప్రజ్వలించే నీ మెరుపులాంటి తనువు  ప్రజ్వలించే నీ ఆవేశపు ఉగ్రరూపం  ప్రజ్వలించే నీ కొరకై నా దేహము  - అర్జున్
Read More

మనసా

మనసా   మనసా నువ్వు చెప్పేది నేను వినేసా ఎన్నాల్లీ రభస ఇకనైనా ఇవ్వవా భరోసా నీ ఆజ్ఞాపనే నాకు శ్వాస - అర్జున్
Read More

ప్రేమ బానిస

ప్రేమ బానిస నీ వలపుల తోటలో శశినై, నీ ఎద లయలలో నిశినై, నీ సొగసుల వలలో నిధినై, నీ చూపుల్లో చిక్కిన కాటుక రవ్వనై , పడుతూ లేస్తూ నిన్ను అందుకోవడానికై తపించే పసిపాపనై, నీలాలా నింగిలో మెరిసే తారనై, ఎగసే నా హృదయపు అలల తాకిడిలో నిశీధినై, నిన్ను చేరాలనే చేరలేననే అలజడిలో మతిలేని ఒయాసిస్సునై, గతమైనా జతగా చెరపలేననే ఒంటరినై, ఎన్నటికీ నిన్ను చేరలేని శవమై... బ్రతికినా చచ్చి బ్రతకలేని బ్రతుకుతున్న నీ భాధితుడినై.. ఇదే ఇదే ఇదే నీ ఒప్పలేని ఒప్పుకోని తప్పుకోని ప్రేమకు సదా బానిసనైన నీ "వాలెంటైన్" ...💔💔💔💔 - అర్జున్
Read More