బంధం
బంధం చెట్టుకు పూసిన పూలతో అనుబంధం పూటని తెలిసినా, పరిమళం వెదజల్లుతూ నవ్వుతూ ఉన్న పూలను చిగురుల చేతులతో తడిమి, కొమ్మల ఊయలూపి, మొగ్గల బుగ్గలుగీటి, తేనె ఉగ్గులు పోసి, ఎండిన ఆకులతో దిష్టి తీసి మురిసే చెట్టుకే తెలుసు జన్మల బంధం అంటే ఏమిటో.... తీరచెలిని చూచుటకు చెంగు చెంగున ఎగురుతూ, ఉత్సాహంగా ఉవ్వెత్తున ఎగసి ఉరకలు వేస్తూ, కెరటాల కౌగిలిలో కరిగించే సంద్రానికి తెలుసు అనుబంధం అంటే ఏమిటో.... గూటిలో గులాబీ రంగు వర్ణంలో నోరు తెరిచి ఎదురుచూసే పక్షి పిల్ల నోటిలో రోజంతా తిరిగి సేకరించిన ధాన్యపు పాలను పోసి రెక్కలతో పొదువుకునే పక్షికి తెలుసు జన్మల బంధం అంటే ఏమిటో... సూర్య,చంద్రుల కళ్ళతో పగలు, రాత్రి కంటికి రెప్పలా కాస్తూ, వలపు వాన చినుకులతో చుంబించి పుడమిని పులకింపచేసి సంబరపడే అంబరానికే తెలుసు బంధం అంటే ఏమిటో.... తాను ఎంత స్వేచ్ఛగా ఎగిరినా, తనని…