bhavya charu

వారసుడు

వారసుడు ఒక్కగానొక్క వారసుడు వాడని అల్లారు ముద్దుగా పెంచాము. అడిగిందల్లా కొనిచ్చాము. నచ్చిన బళ్ళో వేసాము. నచ్చిన కాలేజీలో చేర్పించాము. అప్పటి వరకు చాలా బాగా చదివేవాడు. బాగానే ఉన్నాడు. కాలేజీలో చేరిన మొదటి సంవత్సరంలో కూడా బాగానే చదివాడు. ఇంట్లో చేసిన టిఫిన్ బుద్దిగా తినేసి, లంచ్ బాక్స్ తీసుకుని మరీ వెళ్ళేవాడు. నీట్ గా బట్టలు వేసుకుని బుద్దిగా రాముడు మంచి బాలుడు అనే విధంగా ఉండేవాడు. అలాంటి వాడి ప్రవర్తన ఒక్కసారిగా మారిపోయింది. పొద్దున్నే హడావుడిగా లేవడం రకరకాల బట్టలు కొత్తవి కొనడం, ఏ హీరో సినిమా రాగానే ఆ హీరో సినిమాకి మొదటి ఆటకి వెళ్లడం, టిఫిన్, లంచ్ లేకుండా ఇస్తున్నా, పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిపోవడం చేసేవాడు. సరేలే ఫ్రెండ్స్ ఎక్కువ అయ్యి ఉంటారు. చదువులో మాత్రం బాగానే ఉన్నాడు కదా అనుకున్నాం. మూడో సంవత్సరంలో మెల్లిగా లేట్ గా రావడం, కొద్దిగా తాగి రావడం లాంటివి…
Read More

స్నేహ హస్తం పార్ట్ 1

స్నేహ హస్తం పార్ట్ 1 అన్నపూర్ణ కాలనీలోకి లారీ ఒకటి పచ్చి తాగింది అందులోంచి దిగిన రామారావు, "తొందరగా దింపండి సామాను మళ్లీ అన్ని సర్దుకోవాలి" అని చెప్పాడు లారీ డ్రైవర్ క్లీనర్ తో... "అలాగే సార్ గంటలో వేస్తాం కానీ కొంచెం చాయి ఇస్తారా?" అంటూ ఆశగా అడిగాడు డ్రైవర్. "అదేంటయ్యా వచ్చిందే ఇప్పుడు ఇంకా పాలు పొంగించలేదు ఇక్కడెమో ఎవరూ తెలియదు మాకు అప్పుడే టి అంటావేంటి? అంతగా కావాలనుకుంటే వెళ్లి ఎక్కడైనా టీ కొట్టులో తాగేసి రండి" అని జేబులోంచి డబ్బులు తీయ పోయాడు రామారావు. "అయ్యో ఎందుకండీ డబ్బులు ఇవ్వడం మేము లేమా ఏంటి...!? అంటూ వచ్చింది పక్కింటి వనజ. "అయ్యో మీకు ఎందుకండీ శ్రమ" అన్నాడు ఆమె పక్కింటి లోంచి రావడం చూసి. "అదేంటి అన్నయ్యగారు... మనం ఎప్పటికీ ఉండేవాళ్ళం ఆ మాత్రం చేయకపోతే ఎలా అయినా మా ఇంట్లో ఎప్పుడూ టీ రెడీగానే…
Read More

మా వోడు

మా వోడు నేను అంటే మాలచ్చ ని ఇక్కడ నాలుగు ఇళ్లలో పని చేసుకుంటూ నాకున్న ఒక్కగానొక్క కొడుకును సాదుకుంటు ఉన్నాను. ఇదిగో ఈ అమ్మ నా కథ ఎదో రాస్తా అంటే ఆ అమ్మకు నా ఈవరం చెప్తున్న, మా వోడు అదే నా బిడ్డ తండ్రి నాకు మొగుడు నారడు, ఆడి పేరు నరయ్య కానీ అందరూ అన్ని నారాన్ని సేశారు, నను అలాగే పిలుత్తా అన్ని అప్పుడప్పుడు అంటే మీకు తెలిసి పోయిoది కదా అప్పుడే మా వోడు కాస్త నా మాట ఇనుకుంటూ ఉంటాడు... అప్పుడే కదా మగాడు పెళ్ళాం మాట వినేది, నన్ను అలా పిలవమని కూడా అంటాడు. నేను అలా పిలిస్తే వాడికి ఇష్టం అని అంటూ ఉంటాడు ఆ సమయానికి వాడికి ఏదీ తోస్తే అది మాట్లాడుతూ ఉంటాడు, వాడి నోరు, వాడి ఇష్టం ఆ రాత్రికి వాడు చెప్పింది వింటూ,…
Read More

ఓ రమ్య కథ

ఓ రమ్య కథ భారీగా కట్నం, నగలు ఇచ్చి రమ్య పెళ్లి చేశారు పెద్దలు వద్దన్నా వినకుండా, రమ్య డిగ్రీ చేసి, ఐ ఏ ఎస్ కావాలని అనుకుంది. కానీ పెద్దలు మాత్రం చదివిన డిగ్రీ చాలు అంటూ పెళ్లి చేశారు. రమ్య ముందుగానే నెమ్మది మనిషి దానికితోడు పెద్దలంటే గౌరవం కాబట్టి తు.చా తప్పకుండా వింటుంది వారి మాటలను. పెద్దలు తన గురించే చెప్తారు కాబట్టి తను అందుకు ఒప్పుకుంది.. పెళ్లి జరిగాక కానీ అసలు విషయం బోధపడలేదు రమ్యకి. భర్త, మామ ఇద్దరూ కలిసి కూర్చుని తాగడం, అత్త కిట్టీ పార్టీలు అంటూ బయట తిరగడం. ఆడపడుచులు ఏమి పట్టించుకోకుండా 24 గంటలు ఫోన్లలో తలదూర్చి చాటింగ్స్, ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటూ ఉండడం గమనించింది. తాను ఉన్న వాతావరణం వేరు ఇప్పుడు ఈ వాతావరణం వేరు కాబట్టి ఎలాగైనా తనే సర్దుకుపోవాలి అని మనసులో గట్టిగా నిర్ణయించుకుంది.…
Read More

అమ్మాయి అబద్ధపు జీవితం

అమ్మాయి అబద్ధపు జీవితం ఫేస్బుక్ లో స్క్రోల్ చేస్తుంటే ఒక అందమైన అమ్మాయి ఫోటో కనిపించింది వెంటనే అది ఈ అమ్మాయి చాలా బాగుంది అని అనుకుంటూ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాను. నేను రిక్వెస్ట్ పెట్టడం ఆలస్యం వెంటనే తను యాక్సెప్ట్ చేసింది. ఆహా ఏమి నా భాగ్యము ఇన్నాళ్లకు ఒక అందమైన అమ్మాయితో మాట్లాడబోతున్నాను అనే నా ఉత్సాహం ఉరకలు వేస్తూ హాయ్ అని మెసేజ్ పెట్టాను తను వెంటనే హాయ్ అంటూ మెసేజ్ రిప్లై ఇచ్చింది. మీరు ఎక్కడ ఉంటారు అంటూ అడిగాను నేను బెంగళూరులో ఉంటాను అంటూ చెప్పింది. మీరు ఎక్కడ ఉంటారు అని అడగడంతో నేను హైదరాబాదులో ఉంటాను అని ఆమె అడగకపోయినా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను నా జీవితం అంటూ నా వివరాలన్నీ వెంటనే చెప్పేశాను. నా విషయాలన్నీ చెప్పాను కదా మరి మీ విషయాలు చెప్పరా అంటూ అడిగాను. అప్పుడు…
Read More

మోసపోయిన అబ్బాయి జీవితం

మోసపోయిన అబ్బాయి జీవితం సిద్దూ మంచివాడు అందరిలా చదువుకుంటూ ఉన్నాడు. తల్లిదండ్రుల కలలు తీర్చే ప్రయత్నం చేస్తున్నాడు. అనుకోకుండా ఒక రోజు అతని జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చింది అదెలా అంటే తల్లిదండ్రులు సిద్దూకి ఫోన్ కొని ఇచ్చారు తన చదువుకోసం. అయితే ఒక రోజు ఒక ఫోన్ కాల్ ఆ సిద్దు జీవితాన్ని మార్చింది. ఒక తెలియని నంబర్ నుండి ఫోన్ వచ్చింది అది చేసింది ఒక అమ్మాయి. అది తెలియని నంబర్ అని చెప్పి ఫోన్ పెట్టేసాడు. తర్వాత కొన్నాళ్లకు మళ్ళీ అదే నంబర్ నుండి ఫోన్ వచ్చింది. ఈ సారి ఆ అమ్మాయి సిద్దూతో నువ్వు మంచివాడిలా ఉన్నావు. వేరే వాళ్ళు అయితే ఈపాటికి ఎన్నో సార్లు తిరిగి ఫోన్ చేసేవారు. కానీ నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు మంచి వాడివి అందుకే నేనే చేశాను అంటూ మాటలు కలిపింది. అలా సిద్దూ ఆమె పేరు తెలియక…
Read More

తెగింపు సినిమా సమీక్ష

తెగింపు సినిమా సమీక్ష అజిత్, మంజు వారియర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో మిగతా వాళ్ల గురించి తప్ప ముగ్గురు గురించి మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను వాళ్లు హీరో హీరోయిన్స్ అలాగే సముద్ర ఖని. సినిమా మొత్తం ఒక గ్యాంగ్ స్టర్ గురించి అయినా సమాజంలో జరిగే లోటు పాటలను అలాగే ప్రజల అమాయకత్వం గురించి దేన్నైనా నమ్మి బలి పశువుల్లా చూపిస్తూ అలాగే కొందరు తప్పని పరిస్థితులలో పై అధికారులకు లొంగిపోవడం లాంటివి ఈ సినిమాలో చూపించారు. హీరో గ్యాంగ్ స్టర్ గా ఎలా మారాడు అనేది చూపించలేదు కానీ హీరో ఒక గ్యాంగ్ స్టర్ అని సినిమా మొదట్లోనే చూపిస్తారు. అలాంటి హీరో దగ్గరికి ఒక డీల్ వస్తుంది. కానీ దానికి హీరో ఒప్పుకోడు దాంతో వాళ్ళు వేరే వాళ్ళకి అప్పగిస్తారు. వాళ్లు ఒక పదిమంది గ్యాంగ్ కలిసి ఒక బ్యాంకు దోచుకోవాలి అందులో 500 కోట్లు…
Read More

ప్రేమ

ప్రేమ ప్రేమ ఎప్పుడూ ఎలా ఎవరికీ పుడుతుందో తెలియకపోవచ్చు కానీ ప్రేమలో ఉన్నప్పుడు అన్నీ అందంగానే కనిపిస్తాయి. తప్పులన్నీ ఒప్పులుగా, ఒప్పులన్నీ సరదాగా సాగుతాయి. కొన్నాళ్ళు గడిచాక అసలు రూపాలు బయట పడతాయి. తప్పులు ఎంచుతూ ఒప్పులని కూడా తప్పుగా చూపిస్తూ ద్వేషం పెంచుకుంటూ, ఒకరికొకరు ఆకర్షణ అనే మోజు నుండి బయటకు వచ్చి నిజాలను గ్రహించే లోపు జరగాల్సింది అంతా జరిగిపోతుంది. ఇంకా వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా శూన్యమే తప్ప ఇంకేమీ కనిపించదు. నిజమైన ప్రేమకు ఇవేవీ అడ్డు రావు. - భవ్యచారు
Read More

మా వోడు – ఇంటింటి రామాయణం

మా వోడు - ఇంటింటి రామాయణం మగాడి ప్రతి విజయం వెనక ఆడది ఉంటుంది అంటారు. కానీ ఆడదాని ప్రతి కన్నీటి బొట్టు వెనక ఒక మగాడు ఖచ్చితంగా ఉండి తీరతాడు. అది భర్తనా, ప్రియుడా, లేదా స్నేహితుడో ఇలా ఎవరైనా కావచ్చు, కానీ మగవాడు ఆడదాని శరీరంతోనూ, మనసుతోనూ రెండు విధాల ఆడుకుంటే ఆడది ఆ బాధని ఎవరితో చెప్పుకుంటుంది. మగాడికి ప్రతి విషయం లోనూ ఆడది లేకుండా గడవదు, కానీ ఆ విషయం అతనికి అదే మగాడికి తెలియదు. తెలిసినా అంతగా పట్టించుకోడు, నా పైనే అది అంటే ఆడది ఆధారపడి ఉందనే ఒక భ్రమలో బతుకుతూ ఉంటాడు, అయితే మగాడిని ఎప్పుడూ ఆడది పేరు తెస్తూనే ఉంటుంది, అది ఎలాగో ఇప్పుడు చూద్దాం... తల్లి కడుపులో ఉన్నది ఏ బిడ్డ అయినా ఆ తల్లి బిడ్డను చూడకుండానే నా బిడ్డ బంగారం అని మగాడిని బంగారంతో పోలుస్తుంది.…
Read More

కాలం నేర్పిన పాఠం

కాలం నేర్పిన పాఠం పిల్లాడు బాగున్నాడు ప్రభుత్వ ఉద్యోగం అంటూ ఎనిమిదో తరగతిలోనే పెళ్లి చేశారు. అప్పుడు నా వయసు ఎంతో కూడా నాకు గుర్తులేదు. పెళ్లయ్యాక మామూలే అత్తారింట్లో అత్త, నలుగురు ఆడపడుచులు, నలుగురు మరుదులు ఇదే మామూలే. వండడం, వార్చడం, పెట్టడం, మళ్ళీ కడగడం, వండడం, వార్చడం, ఇదే జరిగింది. దాంతో పాటు ముగ్గురు పిల్లలు కూడా పుట్టుకొచ్చారు. ఉద్యోగరీత్యాచాలా దూరం వెళ్లాల్సి వచ్చింది. మా అత్తగారు మిగిలిన వారు ఎవరు ఒప్పుకోలేదు ఎందుకంటే ఉన్న పనిమనిషి పోతుంది అనే బాధ తప్ప వాళ్ళకి నా మీద ప్రేమ, అభిమానాలు ఏమీ లేవు కాబట్టి.. అయినా పిల్లల చదువులు కాబట్టి 20 ఏళ్ల తర్వాత ఆ ఇంటి బయట అడుగుపెట్టాను. పెట్టింది మళ్ళీ వెనక్కి తీసుకోలేదు. ప్రతి పండక్కి వచ్చిన ఆ పండగ అయిపోయేంతవరకు ఉండడం ఆ తర్వాత వెళ్లిపోవడం జరిగేది పండగ ముందు పది రోజులు వచ్చి…
Read More