chedu aksharalipi

చేదు

చేదు చేదు అనగానే గుర్తు వచ్చేది వేప చెట్టు . ముక్కోటి దేవతలు ఒక్క చెట్టులో వుంటారు అని అంటారు. అదే వేప చెట్టు చేదుకు ఒక ప్రత్యేకత ఉంది చేదు అనుభవాలతో తీయని అనుభూతులు అందుతాయి అందరికి . మా వేప చెట్టు కథ చేదు అంటే వేప అంటారు కానీ మా వేపచెట్టు మాత్రం నాకు తీపి కన్నా ఎక్కువ విలువ కలది . చల్లని గాలి నిచ్చింది సేద తీరే వారికి హాయి నిచ్చింది. ఆరోగ్యానికి నేస్తంలా వుంది డాక్టర్ అవసరం లేకుండా కాపాడింది. పండగల రోజులు అందరికి పూతనిచ్చింది చెట్టు కింద వనభోజనాలు చేసేము ఇంటికి అందాన్నిచ్చింది బంధువుల మన్నన పొందింది పక్షుల కిల కిలా రావాలను వినిపించింది మా పిల్లలకు చెట్టు నీడన ఆటలు ఇచ్చింది . అమ్మతల్లి అయినవాల్లకి పొత్తిలి అయింది . పల్లుతోముకోడానికి పుల్ల అయింది. వాహనాలు పెట్టడానికి నీడ అయింది…
Read More

చేదు

చేదు నరేందర్ కథ గుర్తుందా అదే అండి మొన్న షుగర్ అని తెలిసిన నరేందర్. ఇప్పుడు అతను ఎట్లాంటి పాట్లు పడుతున్నాడు చూద్దాం ... ఏమండీ లేవండి అంటూ లత నిద్ర లేపే వరకు మెలకువ రాలేదు నరేందర్ కు. ఆకలితో నకనకలాడుతు యెప్పుడూ నిద్ర పట్టిందో గానీ ఇప్పుడు లేచేసరికి సమయం పది దాటింది. అమ్మో నా ఆఫీసు అంటూ గబుక్కున లేవబోయాను అతన్ని అపుతూ లత, మీ ఆఫీసర్ గారు రెండు రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత రమ్మన్నారు గానీ ముందు బ్రెష్ చేసి రండి అంటూ బాత్రూం లొకి నెట్టింది. సరే సరే వెళ్తున్న అంటూ ఫ్రెష్ అయ్యి వచ్చి టేబుల్ ముందు కూర్చున్న నరేందర్ ముందు లత రెండు గ్లాస్ లు పెట్టింది. అవి చూసి అందులో ఉన్న ద్రవాన్ని చూస్తూ ఎంటే ఇది హాయిగా ఏ అట్టో తేకుండా ఇవేంటి అన్నాడు బిత్తర పోయి.…
Read More