edureetha

ఎదురీత

ఎదురీత దిన దిన గండంగా గడిచే మధ్యతరగతి జీవితాలు రోజు కూలితో దినం గడిపే నిరుపేదలు కూడూ గుడ్డా వంటి కనీసవసరాలైనా తీరక రోడ్డు పక్కనే నివాసనేర్పరచుకుని ఈసురో మని కాలం గడిపే ఎందరికో తప్పదు కాలానికి ఎదురీదుతూ పోరాడడం ర్యాంకుల కోసం పోటీలతో పరుగెడుతూ అమ్మానాన్నల కృత్రిమ హోదాల కోసమని పిల్లలపై రుద్దే చాదస్తంలో పులిని చూసి‌ నక్కవాత చందాన పోలికలతో చిన్ని మనసుని సతమతం చేస్తుంటే తప్పదు చదువుల వెంట పరిగెత్తే ఎదురీత ఆలు మగల ఉద్యోగాలలో క్షణమైనా తీరిక లేక మితిమీరిన ఒత్తిడికి గురి అవుతూనే ఆలు మగల సత్సంబంధం‌ చిద్రం చేసుకుంటూ మమతానురాగాలని మరచి చరిస్తూ అహాలతో కూడిన సంబంధాలు నిలవవంటూ విడివడి వేరైన నేటి తరాలకి తప్పదు ఎదురీత అడుగడుగునా జీవితమనే రహదారిలో ఎదురయ్యే ఎత్తు పల్లాల స్పీడుబ్రేకర్లు అలలు అలలుగా ఎగసి పడే మనో ఉద్విగ్నతలు అదిమి‌ పట్టి సర్దుకుపోతూ బంధాలను కాపాడుకుంటూ…
Read More

ఎదురీత

ఎదురీత ఏటికి ఎదురు ఈదగలమా అని ఒక శాస్త్రం వుంది. కానీ ఎన్నిటికైనా ఎదురొడ్డి నిలిచిన వారే విజేతలుగా నిలబడతారు. అని అన్నింట్లా ఋజువవతూ ఉంటుంది. ఉదాహరణకు ప్రపంచ బాక్సింగ్ క్రీడాకారిణి (నిఖత్ జరీన) పట్టుదల ఆమె ఎంచుకున్న రంగం ఎదురీత విజయం అని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళా బాక్సింగ్ క్రీడాకారిణి కావడం మనం అందరం అభినందించాల్సివిషయం. చిన్నతనం నుండి క్రీడలలో ఆసక్తి వున్నా వారి మత, సాంప్రదాయాలను సమాజపరంగా కూడా ఎన్నో సమస్యలు ఉన్నా, నీఖత్ జరీన పట్టుదల ముందు అవేవి సమస్యలు కావు అని నిరూపించిన దైర్యమున్న క్రీడాకారిణి. దానికి తోడు కుటుంబ సహాయ సహకారాలు, వారు ఆమెను ప్రోత్సహించిన విధానము. తెలంగాణ రాష్ట్ర తోడ్పాటు ఈరోజు ప్రతిష్టాత్మకమైన ప్రపంచ ఖ్యాతిని ఆమె తెచ్చిపెట్టింది. (కష్టం, క్రమశిక్షణ, దైర్యం, ఆత్మ విశ్వాసం) కొన్నిసార్లు ఓడినప్పుడు గమ్యాన్ని లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ దిశగా అడుగులు వేసి పోటీ…
Read More

ఎదురీత

ఎదురీత ఏ సమస్యకైన ఎదురీత తప్పదు పారిపోకు పిరికి పంద వోలె మనసు తలచినట్లు మౌనంగ పోరాడు నీకు జయము కలుగు నిశ్చయముగ - కోట
Read More