hanumantha

బందిఖాన

బందిఖాన పచ్చని చిలుక బంగారు బొమ్మ పెళ్లి అను బంధంతో బందిఖాన చేస్తిరి... మోసం చేసి. సంపాదన అనే ఉచ్చులో ప్రేమా, అనురాగాలను బందిఖాన చెస్తిరి... ఎన్నుకొన్న పాలకులు పాలనా అనే పేరుతో పాలితులను, అధికారులను బందిఖాన చేసిరి... విప్లవ కారులను స్వాతంత్ర యోధులను కవితలు, పాటలతో మేల్కొలిపే కవులను బంది ఖాన చేసిరి.... బందిఖాన ఏ ఒక్కరినీ నిలువరించలేక పోయింది కృష్ణుడితో సహా - హనుమంత
Read More

ఉదయం

ఉదయం పువ్వులు వికసించే నవ్వులు విరబూసే చెలి మోమును చూడగ ఈ ఉదయకాంతిలో... పూలను కిరణం తాకగా నా చెలి బుగ్గను నిమరగా పక్షులు కిల కిల నవ్వేను ఈ ఉదయ కాంతిలో.... ఎర్రగ పండేను తూర్పు దూడలు చేరెను పొదుగున జీవన చక్రం మొదలగున ఈ ఉదయకాంతి తో.... అలసిన మనసు చెదిరిన సొగసు వాడిన పువ్వ కోరెను ఉదయకాంతిని. - హనుమంత
Read More

ప్రేమ

ప్రేమ నీళ్ళ బావి కాడ నాకోసం ఉండావు బస్టాండు కాడ నాకోసం ఉండావు ఆరోజు గుడికాడ ప్రసాదం కూడా ఇచ్చినావు మొన్న కొట్లాటలో నా సెయ్యి పట్టుకున్నావు పిల్లలతో ఆడుకుంటుంటే నన్ను సూసి నవ్వినావు గడ్డివాము కాడ గడ్డిమోపు ఎత్తనీకి పిల్చినావు రెడ్డిగారి పొలంలో నాకు బువ్వ లేకుంటే నువ్వేగా పెట్టింది సంతకు పోయినపుడు పెద్ద వానవొస్తే నువ్వేగాగొడుగు పెట్టింది మా అమ్మకు ఒంట్లో బాలేదు అంటే నువ్వే సాయం సేసింది ఏమో అవన్నీ నాకు తెలీదు నువ్వు కావాలంతే ఇదిగో ఇప్పుడు కూడా అటు తిరిగి నవ్వుతాండావు ఈరోజు పిల్లని సూడనికి మీ ఇంటికి వచ్చినారంట సారాయి దాసప్ప సెప్పినాడులే ఒరే నీ ఎదవ నన్ను సూసుకొనేకి కాదురా మాయక్కను సూడనికి - హనుమంత
Read More

బండబారిన గుండె

బండబారిన గుండె బండ బారిన గుండె నిప్పులు చెరిగే చూపు కొండను పిండే దేహం గర్జించే కంఠం.... ఇంటికి కంచైతాను కంటికి కునుకైతాను గుండెకు భారోసానైతాను ఎదిరించే కోడె గిత్తైతాను... నేలను దున్నే నాగలై మొలకెత్తే గింజకు మట్టినై నెచ్చలి ప్రేమకు అంకితమై వ్యసనాలకు బానిసలై.... నావను నడిపే తెడ్డునై యంత్రాన్ని నడిపే ఇందనమై ఆలికి వెచ్చని కావుగిలినై బిడ్డలకు నెత్తిన గొడుగునై... కానరాని భాదను మనసునదాచి చిరునవ్వులు చిందే బొమ్మనై బ్రమ్మరాసే రాతలకు బలై కఠినమైన మాటల వెనక ఖరీదైన వెన్నముద్ద లైన మహానుభావులందరికి అంతర్జాతీయ పురుషుల దినత్సవ శుభాకాంక్షలు - హనుమంత
Read More

బాటసారి

బాటసారి దప్పిక తీరని ఎడారిలా ఆకలి తీరని పులిలా బ్రమణం చేసే భూమిలా ఉవ్వెత్తున ఎగసే కెరటంలా భాద్యతలు మోసే నాన్నలా ప్రేమను పంచే అమ్మలా సాగిపో బాటసారి గుడిసెను కమ్మిన అమావాస్యను రైతులను పీడ్చే దళారులను అఘాయిత్యాలకు పాల్పడే హంతకులను ఓట్లను దొంగిలించే నాయకులను ప్రశ్నించడానికి సాగిపో బాటసారి అంతంలేని ప్రశ్నలకు అర్థంలేని ఆవేశాలకు ఆకలైన అన్నార్తులకు అనంతమైన దైవాన్ని ప్రశ్నించడానికి సాగిపో బాటసారి - హనుమంత
Read More

పాత్రికేయుడు

పాత్రికేయుడు నిర్భయంగా నిర్మొహమాటంగా నిస్సందేహంగా సమాజాన్ని మేల్కొలిపి... ఆనందాన్ని అవసరాన్ని సంస్కృతిని ప్రగతిని ప్రతిభను తెలిపేది..... నలుమూలల నుండి పాలకుల నుండి ప్రజలకు ప్రజల నుండి విన్నపాలను వివరంగా తెలిపేది.... అరాచకాలను అఘాయిత్యాలను నిరసనలను ఆదేశాలను ప్రశ్నించేది.... "పాత్రికేయుడు" - హనుమంత
Read More

అశ్రునయనాలు

అశ్రునయనాలు ఎందుకు ఇంత బాధపెడతారు.. మీరెప్పుడు మా మాట విన్నారని... ఇన్నిరోజులు మిమ్మల్ని చేరుకోవాలని ఆశ... తీరా చేరే సరికి మిగిల్చారు నిరాశ... రంగుల ప్రపంచాన నమ్మకం లేని సమూహన కావాలని కిందపడేసిన జనాలకు ఆదర్శమైన మీరూపం మాకు అపురూపం..... కష్టం వచ్చిన కన్నిల్లోచ్చిన పడిలేచిన ప్రతీక్షణాన మీస్మృతులే మెదిలే మదిలోన మీ మాటే వేదవాక్కు ప్రతిక్షణానా.... మీతో ఊసులాడాలని మీ కరచాలనం కావాలని మీతో మరిన్ని కార్యక్రమాలు చేయాలని మీ ఆశీర్వాదం కావాలని మీ దాక వచ్చేసరికి నిశ్చలముగా.... నిట్టూర్పుగా..... నిర్జీవంగా.... దర్శనం ఇచ్చావా! నిన్ను ప్రేమించే మమ్మును కాదని నువ్వు ప్రేమించే నీవాళ్ళ దగ్గరికి వెళ్ళావా ఆత్మీయుల హృదయాన కన్నీటి సంద్రమై పెళ్లుభికే భావోద్వేగాలతో కడ సారి వీడ్కోలు మీ అభిమానిగా సదా మీ సేవలో...... - హనుమంత
Read More

పిల్లలు

పిల్లలు పిల్లలం పిడుగులం రేపటి భవితలం ఆడుతూ పాడుతూ కాలాన్ని గడిపేస్తాం భవిష్యత్తు బాటలకు వెలుగునిచ్చే ప్రమిదలం భూగోళాన్ని చుట్టే బుజ్జి అడుగులు నింగినితాకే మా కేరింతలు భయమేస్తే అమ్మఒడిన చేరేములే బామ్మపక్కజెరి కథలు వింటూ బడికెళ్ళము అంటూ మారంచేస్తూ ఆదివారమొస్తే గట్టుమీద చేరి మట్టి ఆటలు ఎన్నో ఆడుకుంటాము అలసటనంతా తీరుస్తాము నవ్వులతో చాచా నెహ్రూ ఇష్టపడెంతగా తప్పటడుగులుసరిచేసుకుంటూ భావి భారతాన్ని నిర్మిస్తాం - హనుమంత
Read More

పెంపకం

పెంపకం అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు కావడం వల్ల అందరూ ఒకచోట చేరి కబుర్లు చెప్పుకునేవారు పైగా చిన్న గుడిసెలు కావడం వల్లా ప్రతిదీ పరిరక్షించుకునేవారు కానీ ఇప్పుడు హోదాల కోసం పెద్ద పెద్ద భవనాలు అందులో చేరోగది ఎవరిగదిలో వారు ఉండడమే గానీ పెద్దలతో ఎంకలుస్తారు పెద్దలే చోరువతో ఎదైన చెప్తే చాదస్తం, మాకుతెలుసులే అనే అహంకారం నాటి కాలంలో పెద్దల మాటలను గౌరవించే వారు అలాగే ఆచరించే వారుకూడా. నాడు తల్లిదండ్రి చేసే పనులే పిల్లలు చేసేవారు ప్రతి పనిలోనూ ప్రతీది క్షుణ్ణంగా నేర్పేవారు నేటి పెద్దలు ఊహాత్మక జీవితంలో ర్యాంకులని కొలువులని పరిణతి చెందిన కూనలకు ప్రేరణలుగా నింపి విలువలు సాంప్రదాయాలను మరిపిస్తున్నారు తత్ఫలితముగా వృద్ధాశ్రమాలు శరణాలయాలు పెరుగుతున్నాయి పెద్దలను కడవరకూ చూసుకునే బాధ్యత పిల్లలపై ఉండేది కానీ స్వేచ్ఛా స్వాతంత్రాల పేరుతో, లక్ష్యాలను గమ్యాలను చేరుకునే క్రమంలో పెద్దలనే కాకుండా తమ బిడ్డలను కూడా కేరింగ్ వెంటర్లలో…
Read More

ముత్యాలు

ముత్యాలు నులివెచ్చని కిరణాల తాకిడికి విచ్చుకున్న పూలు సుగంధ పరిమళాలను వెదజల్లుతూ దేవుని చెంతకు, స్త్రీల కొప్పున చేరడానికి నువ్వా నేనా అన్నట్టుగా ఆరాట పడుతున్నాయి..... సాయంత్రానికి వాడిపోతు కూడా ప్రకృతికి అందానిస్తున్నయి.. నింగిలో చుక్కల్లాగ భువిపై మెరిసే ముత్యాలు నిరంతరం కాంతినింపడానికి వికసిస్తున్నయి - హనుమంత
Read More