మధురం
మధురం జగత్తు లోని మహిమే మకరందపు మాధుర్యం రసాస్వాదన ఓ మధురం అమ్మ లాలిపాట మధురం మృధు భాషణం మధురం నయనానందకర దృశ్యం ఓ మధురం పవిత్ర ప్రేమను పంచే హృదయం ఓ మధురం ప్రతిస్పందించే స్పర్శ ఓ మధురం అలరించే ఆట పాట ఓ మధురం రమణీయ దృశ్యం కమనీయ కావ్యం ఓ మధురం పరవశించే ప్రకృతి పరుగులు తీసే జలపాతం ఓ మధురం శ్రేష్ఠ మైన క్షీరం చిన్న నాటి జ్ఞాపకాలు ఓ మధురం తీయని కలలు వూహించని స్వప్నం ఓ మధురం క్షమించే క్షణం వేచి చూచిన ఫలితం ఓ మధురం నీకు తెలియని నిజం నీ భావనే నిజమైన మధురాతి మధురం. - జి జయ