విజ్ఞానం -వివేకం
విజ్ఞానం -వివేకం "ఏ పుస్తకం నీ జీవితంలో ఏ సమయంలో నీ ప్రపంచాన్ని కుదిపివేసి నువ్వు అంతకుముందెన్నడూ ఊహించని మార్గాలలో నువ్వు అభివృద్ధి అయ్యేందుకు ఉత్తేజపరుస్తుందో నీకు ఎన్నటికీ తెలియదు.."అన్నారు వర్క్ హెడ్జెస్. పుస్తకం యొక్క గొప్పతనం చెప్పాలంటే మనము చదివిన అందులోని ఒకే ఒక వాక్యం మన జీవితాన్ని మార్చగలదు. అక్షరానికి ఉన్న శక్తి అవధులు లేనిది. అనంతమైనది. అది ఒక్కోసారి మనల్ని మన మార్గంలో ఆగేలా చేసి మన జీవిత ప్రయాణ దిశను పూర్తిగా మార్చివేయవచ్చు. మనం వెళుతున్న దారి సరైనది కాదు అని చెప్పవచ్చు. మనల్ని జీవిత పర్యంతం వేధిస్తున్న సమస్యలకు ఒక్క వాక్యం ద్వారా పరిష్కారం చూపించవచ్చు. మన రంగంలో మనం ఇంకా ఉన్నతంగా ఎదగడానికి సోపానాలను నిర్మించవచ్చు. మనమున్న రంగంలో చేయబోయే పొరపాట్లు మన కంటే ముందే ఆ మార్గంలో నడిచినవారు చేసేసి వుంటారు. అందుకే మనం పుస్తకాలు చదవడం ద్వారా మనం ఎదుర్కొంటున్న…