నమ్మకం
నమ్మకం "హాయ్! కీర్తి ఎలా ఉన్నావే? ఎంత కాలం అయిందే" అని ఎంతో సంతోషంతో చెప్పుతుంది రమ్య. "అవునే చాలా ఆనందంగా ఉంది మన చిన్నతనంలో ఎక్కడికి వెళ్ళినా మన కలిసే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావ్. నీకు పెళ్లి అయ్యిందా?" అని అడిగింది కీర్తి. "నీకు మన చిన్ననాటి విషయాలు చాలా బాగా గుర్తు ఉన్నాయే... ఈ గుడికి కొద్ది దూరంగా ఉంటున్నాము. మన చదువు పూర్తి అయిన తర్వాత నాన్న అనారోగ్యం కారణం వల్ల చనిపోయారు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. నేను అమ్మని తీసుకొని సిటీకి వచ్చేశాము. తమ్ముడిని హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాను. నీకు పెళ్లి అయ్యిందా?" అని అడిగింది రమ్య. "అవునా! ఇంత జరిగిందా? అని చెప్పి కొంచం బాధ పడింది. నాకు పెళ్ళి అయ్యి ఆరు నెలల అయింది. మేము కూడా పక్కనే ఉంటున్నాము. రా మా ఇంటికి తీసుకొని వెళతాను" అని చెప్పింది కీర్తి.…