sai charithamu by c s rambabu

సాయి చరితము 

సాయి చరితము  పల్లవి మావెంటే ఉండు సాయి మా సర్వము నీవే సాయి మాదైవము నీవే సాయి తనివితీరని రూపము నీది సాయి చరణం మా గమనములోన గగనము నీవేనయ్యా బతుకే గండము అని భావిస్తే అండగ తోడుంటావు తోబుట్టువుగా వెంటే ఉండే మమతల కోవెల నీవు నీ నామమునే నిత్యము తలచి ధన్యులమైతిమి మేము చరణం నీ చరితమునే చదివిన మాకు సంతసమంతా కొలువైయుండును నీ దర్శనమే చేసిన చాలును ఊపిరాడని క్షణములు తొలుగును వేడుకచేసే ఉదయకిరణములు వెంటే వచ్చును సాయి చీకటినిండిన జీవితమ్మున వెన్నెల సోనలు కురియును కాదా సాయి - సి.యస్.రాంబాబు
Read More

సాయిచరితం

సాయిచరితం పల్లవి: మా తనువు మనసును కాపాడవయ్యా మార్గమే చూపి ఆదుకోవయ్యా సాయే శరణం..సాయే దైవం చరణం: నీ చరితే నింపును మాలోన ధైర్యము నీవే మావెంటుండే పోరాడే సైన్యం షిరిడీయే మనకు ఇలవెలిసిన స్వర్గం నిన్నేమో చూడాలని మనసుదో స్వప్నం చరణం: అందరీ దైవమూ ఒకటే అంటావు భేదభావనలు వలదే వలదంటావు ఓపికే లేని బతుకులు మావయ్యా బతిమాలుకుంటాము నీ బాటను చూపమని చరణం: బంధమై మావెంట ఉంటేను నీవు ఊరడిల్లుతాము.. సేదదీరుతాము వర్తమాన వెలుగువై మా గుండె నుండు సందేహ బతుకుల్లో సందడే విరియును చరణం: ఊపిరై నీవుంటే ఊయలే ఊగేము వెన్నెలై నీవుంటే వెతలన్నీ దూరమిక వన్నెచిన్నెల రేడు మా సాయినాధుడు మా కోసం వెలసిన సద్గురుమహరాజువే - సి. యస్. రాంబాబు
Read More

సాయి చరితము

సాయి చరితము పల్లవి నీ సేవయే మా భాగ్యము నీ చరితము మాకు అండ నిను కొలిచే భాగ్యము నిరతమూ ఇయ్యవయ్య లోకాలను గెలిచేటి శక్తివయ్య నీవు పాపాలను కడిగేటి భుక్తినివ్వు మాకు చరణం సకల జీవులందు ప్రేమ పంచుతావు ప్రేమతో మాకేమో దారిచూపుతావు అల్పులమూ మేమయ్యా మన్నించు సాయి నీ బాట నడవలేని లేమి బాధనున్నాము చరణం గురువుబాట మరచినచో బాగుపడడు ఎవ్వడు ఈ సత్యము తెలుపుటకు లీలలెన్నో చూపితివి మాన్యుడు సామాన్యుడు అన్న భేదమసలె లేదు అందరొకటె దైవానికి అన్నమాట నీదయ్యా చరణం ఆపదలో మేముంటే తోడు మాకు నీవయ్యా నీ నామస్మరణతో కలతలన్ని తీరిపోవు దేహచింత వదిలి మేము దైవబాట సాగేందుకు ధైర్యమివ్వు సాయి మావెంటవుండవోయి - సి. యస్. రాంబాబు
Read More

సాయి చరితము

సాయి చరితము పల్లవి దర్శనమీయవ సాయి మనసును శుభ్రము చేయగ దర్శనమీయవ సాయి జీవిత పాఠము నేర్పగ దర్శనమీయవ సాయి ఈ జగతిని మార్చివేయగ చరణం కలలెన్నో కంటామయ్యా అవి తీరక దుఃఖం కలిగితే చిరునవ్వును కానుకచేసి విజయాన్నే మాకుచూపి ధైర్యాన్నే తోడుగ నిలిపి బాటంతా మల్లెలు పరిచి నిరాశల వెన్ను విరిచి మము నడిపే గురువువు నీవు చరణం నీవైపే అడుగే వేస్తే భయమంతా తొలగగ మేము అభయాన్నే పొందుతాము అనుకున్నది సాధించేందుకు మావెంటే నీవు ఉంటావు మా తనువు మనసు నీది నీ నామము ప్రాణము మాకు నిన్నే నమ్మిన మాకు నీ చరితము మార్గము చూపు - సి.యస్.రాంబాబు
Read More