Month: November 2022

న్యాయం

న్యాయం న్యాయానికే న్యాయం చేయాల్సిన రోజులు ఇవి చట్టానిది ఒక న్యాయం ధర్మానిది ఒక న్యాయం డబ్బున్నవారికి ఒక న్యాయం సామాన్యుడికి ఒక న్యాయం రాజకీయానికి ఒక న్యాయం స్వార్థానికి ఒక న్యాయం చెప్పడానికి ఒక న్యాయం ఆచరణకి ఒక న్యాయం సొంతవారికి ఒక న్యాయం పక్కవారికి ఒక న్యాయం సమాజానికి ఒక న్యాయం అవకాశానికి ఒక న్యాయం పరిపాలకులకు ఒక న్యాయం ప్రజలకు ఒక న్యాయం ప్రశ్నిస్తే ఒక న్యాయం బదులిస్తే ఒక న్యాయం న్యాయం ఆయుధం అనేది ప్రశ్నగానే మిగులుతుంది న్యాయం నాలుగు పాదాల్లో నడిస్తేబావుండుఅనిఅనుకోవడం మనవంతు అయ్యింది...? - జి జయ
Read More

అభివృద్ధి

అభివృద్ధి సంస్కృతిలో దాగిన సంప్రదాయపు ఆచారాలు అనాదిగా దాగిన విజ్ఞానపు గనులుకదా పెరుగుతున్న అభివృద్ధిలో అనాదిగా వస్తున్న శాస్త్రములే ఆధారమవగా సాంకేతికతలు ఆపాదించి అభివృద్ధంతా మనదేనంటూ అజ్ఞానంలో బ్రతికేస్తున్న మానవుడా కనులు తెరువు! వంట ఇంటి సరంజామాలో దాగిన శాస్త్రీయత తెలుసుకో పెరటి చెట్ల ఔషధగుణాలు గురుతెరిగి మసలుకో గుమ్మములో ముగ్గులలో దాగున్నది దయాగుణం మామిడాకుల తోరణము ఇచ్చునుగా ప్రాణవాయువు జీవరాశులే ఆధారముగా కనుగొంటిమిగా సాధనములు దయాగుణము మాటున దాగున్నదిగా మానవత్వము ఆచారము వెనుక నిండినదిగా శాస్త్రీయత సంస్కృతి మాటున నిలిచెనుగా వైజ్ఞానికత చెట్ల బెరళ్ళు వేరులు ఆకులు ఔషధములే అగును పెరుగుతున్న జనాభాతో సమసిపోయే ఆచారము విజృంభించెను అనారోగ్యాల కాలుష్యపు సెగలు ఇకనైనా తెలుసుకుని మసలుకో మానవుడా! నీ వంటిల్లే ఔషధాగారమని పెరడే మూలికావనమని ఆచార సంప్రదాయములు మూఢనమ్మకాలు కావని అనాదిగా ఋషులు మునులు అందించిన వివిధ శాస్త్ర సాంకేతిక బాంఢారమని... - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

న్యాయం.. ఆనవాళ్ళు

న్యాయం.. ఆనవాళ్ళు అడుగడుగునా అన్యాయం.. అంతటా అన్యాయం.. అన్నింటా అన్యాయం.. న్యాయపు వెలుగు రేఖలు చూడని సూర్యోదయం.. న్యాయపు ఆనవాలు లేక అస్తమిస్తోన్న సూర్యాస్తమయం.. న్యాయం ఓ భరోసా.. న్యాయం ఓ ఆశ.. న్యాయం ఓ వెలుగు రేఖ న్యాయం ఓ విశిష్టత న్యాయం ఓ విప్లవం న్యాయం ఓ సామాజిక బాధ్యత.. న్యాయం కోసం విలవిలలాడుతూ, అన్యాయపు శృంఖలాలో నలిగి రాలిపోతున్న వారందరికీ మరియు న్యాయ స్థాపన పోరాట వీరులకు/ధీరులకు చేస్తున్నాను లాల్ సలాం ‌ - కిరీటి పుత్ర రామకూరి
Read More

న్యాయ సమీక్ష

న్యాయ సమీక్ష ధర్మదేవత కన్నులు కప్పిన దేశంలో చట్టాలు చుట్టాలుగా మారిన సమాజంలో డబ్బుకు అమ్ముడు పోతున్న స్వరాజ్యంలో స్వార్ధం రాజ్యమేలుతున్న ప్రజాస్వామ్యంలో కన్నులున్న గ్రుడ్డిది కాదా న్యాయవ్యవస్థ అనేక ఉదంతాలు కనులముందున్నా కానక సాక్ష్యాలు తప్పొప్పుల పరిశీలన జరగక డబ్బుకులోకం దాసోహమన్న క్షణాన అన్యాయమే విజయం పొంది అట్టహాసం చేస్తుంటే బక్కచిక్కిన న్యాయానికి మనుగడెక్కడ నిజమని మొత్తుకున్నా వినలేని ధర్మదేవత అడ్డదారిలో పయనించే న్యాయవ్యవస్థ ధర్మమెరుగని స్వార్ధపరత్వములో అణగారిపోయిన బలహీనుడి మొరవినేదెవరని కాసులవర్షంలో కనకాభిషేకాలలో పార్టీల పబ్బుల సుఖాల సహచర్యంలో స్వర్ధమే రాజ్యమేలుతూ అడుగంటిన మానవత్వంలో న్యాయమని గొంతు పెగల్చినా కానరాదు కదా..! నీ ఉనికిని కోల్పోయి మనుగడ సాగిస్తూ... చూడలేక కనులున్న గుడ్డిదానవై... వినలేక చెవులున్న చెవిటిదానవై.. అన్యాయం కోరలకి చిక్కి శల్యమైన న్యాయమా... నీ ఉనికిని కాపాడుకుని జనులని కాపాడేదెపుడమ్మా.... అన్యాయమని అరచినవారి గోడు వినేదేనాడమ్మా... - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

న్యాయం

న్యాయం నల్లకోటు తాంబూలం తిని ఎర్రగా మారింది న్యాయం ముసుగులో అన్యాయం నల్ల రంగు పులుముకుని న్యాయానికి గంతలు కట్టింది న్యాయం రాజకీయం చేస్తుంది పక్షపాతం లేకుండా అన్యాయం పక్షాన - సలాది భాగ్యలక్ష్మి
Read More

న్యాయదేవత కళ్లకు గంతలు.!

న్యాయదేవత కళ్లకు గంతలు.! కామాంధుల‌ రాక్షస క్రీడా వినోదానికి నాశనమైన ఓ స్త్రీ న్యాయం కోసం‌ న్యాయస్థానంలో మొరపెట్టుకుంటే.. సూధుల్లాంటి ప్రశ్నలతో..న్యాయమూర్తి ఎదుటే హింసిస్తే చట్టం‌ కొందరిచుట్టమని సరిపెట్టుకోమనడం‌ న్యాయమా కన్నవారి కలలపంటగా పుట్టి..బతుకుపై ఎన్నో అశలతో కాయకష్టం చేసి తల్లిదండ్రులు కడుతున్న ఫీజులతో.. కళాశాలకు వెళ్లి శ్రద్ధగా చదువుకునే ఆడపిల్ల తప్పేంటి, మృగాల్లా మారిన మనుష్యరూప పశువులకు శిక్షేంటి రెక్కాడితేగాని డొక్కాడని‌ నిరుపేద కుటుంబంలో పుట్టి రోజంతా ఎండనకా, వాననకా పనిచేసే మహిళలు.. కార్యాలయాలు, దుకాణాల్లో కష్టపడుతున్న పడతులు మగాళ్ల కళ్లకు ఆటవస్తుల్లా కనిపిస్తుంటే ఆపేదెవరు ముక్కుపచ్చలారని పసి గుడ్డును సైతం చిదిమేస్తున్నా.. తరతరాలకు సేవలు చేసిన అవ్వనూ వదలకపోయినా ఎందరో స్త్రీ మూర్తుల‌ ఆర్తనాదాలకు న్యాయం జరగదా కోర్టులో న్యాయదేవత కళ్లకు కట్టిన గంతలు తెగిపడవా - ది పెన్
Read More

న్యాయం

న్యాయం న్యాయం ఈ పదం వింటుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే ఈరోజుల్లో న్యాయం జరిగేది ఎక్కడ? డబ్బుకు అమ్ముడుపోయిన న్యాయవాదులు, మీడియా, డాక్టర్లు, ఇతర రంగాలలోని వాళ్లు అమ్ముడుపోతే ఇక న్యాయం అనే పదానికి అర్థం లేదు. ఏ వ్యక్తికైనా తనకు అన్యాయం జరిగిందని న్యాయం కోసం వెళ్లాడంటే అతని జీవితం అంతం అయ్యేవరకు అతనికి న్యాయం అనేది జరగదు. ఎక్కడో నోటికో కోటికో ఒక్క నిజాయితీపరుడు ఉండడమే గగనమైన ఈ రోజుల్లో ఇక న్యాయానికి విలువ ఎక్కడుంది? ఉదాహరణకి ఒక రైతుని తీసుకుందాం. ఆ రైతు దగ్గర్లో ఉన్న ఒక ఎరువుల షాపులో విత్తనాలు కొన్నాడు అనుకుందాం ఆ విత్తనాలు నమ్మకంతో అతడు తన పొలంలో వేశాడు కానీ ఆ విత్తనాలు నకిలీవి కాబట్టి అతనికి పంట అనేది రాలేదు దాంతో అతడు పోలీస్ స్టేషన్లో నకిలీ విత్తనాల గురించి కంప్లైంట్ చేశాడు. ఆ విత్తనాలు అమ్మే అతను…
Read More

ఒంటరి

ఒంటరి "నేనస్సలు వెళ్ళను. నాకసలు హాస్టల్ ఇష్టం లేదు."అంటూ అమ్మ దగ్గర మారం చేస్తున్నాడు పదేళ్ల వినయ్. "మరి నీకేమిష్టం?" అడిగింది తల్లి.  "మరేమో నాకు నువ్వంటే ఇష్టం. నాన్నతో బజారుకు వెళ్లడం ఇష్టం. ఇంటి పక్కన ఫ్రెండ్స్ అందరితో క్రికెట్ ఆడుకోవడం ఇష్టం. నువ్వు అన్నం తినిపిస్తే ఇష్టం. చెల్లితో గొడవ పడడం ఇష్టం. మన జూలితో (పెంపుడు కుక్క) ఆడడం అంటే ఇష్టం. ఎక్వేరియంలో చేపలతో మాట్లాడడం ఇష్టం. నేను దగ్గరుండి నాటిన మొక్కలకు నీళ్లు పోయడం ఇష్టం. బాల్కనీలో కూర్చుని ఉయ్యాల ఊగుతూ ఆకాశంలో చుక్కలు చూడడం ఇష్టం. అమ్మమ్మ ఊరు అంటే ఇష్టం. మరేమో ఇంకా..." అంటూ ఆలోచిస్తూ ఏవో చెప్పబోతున్న కొడుకును వారించి "అలా అంటే ఎలా చిన్నోడా! నువ్వు హాస్టల్ కి వెళ్ళను అంటే ఎలా చెప్పు? మా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నాం. నువ్వు హాస్టల్ కి వెళ్లి చక్కగా చదువుకోవాలి.…
Read More

తల్లి మనసు.!

తల్లి మనసు.! అప్పుడు సమయం రాత్రి 11.35 నిమిషాలు.. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి.. ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది.. ఆఫీస్‌ పనిలో పడి ఎప్పట్లాగే తినడం మర్చిపోయాడు సంతోష్.. వర్షం కాస్త తగ్గడంతో బైక్ తీసుకుని బయటకు వచ్చాడు.. అప్పుడు ఆకలి గుర్తురావడంతో బయట ఏదైనా దొరుకుతుందేమో చూద్దామని బయలుదేరాడు. వీధి చివరకు వచ్చే సరికి ఎవరో పిలిచినట్టు అనిపించి‌ వెనక్కి తిరిగి చూశాడు సంతోష్.. ఓ పెద్దావిడ.. అప్పటికే వర్షంలో‌ బాగా తడిసిపోయింది.. బాబూ అంటూ తన వద్దకు రమ్మని పిలుస్తోంది.. కాసేపు సంతోష్ కి ఏమీ అర్ధం కాలేదు.. అయినా, బైక్ యూ టర్న్ తీసుకుని ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆ అమ్మ చాలా ఆందోళనగా కనిపిస్తోంది.. ఎందుకో కంగారు పడుతోంది. "ఎవరమ్మా మీరు ఇంత రాత్రి వేళ ఇక్కడున్నారేంటి?" అని అడిగాడు సంతోష్.." మా బాబు సినిమాకు వెళ్ళాడయ్యా, ఫోన్ చేస్తున్నా తీయడం లేదు.. ఈ వర్షంలో…
Read More

ప్రేమ పాశం

ప్రేమ పాశం మాటల కందని భావన మనసును బందీచేస్తుంది ప్రేమ పాశం! ఆశ ఉన్నంత సేపు అనుభవం వచ్చినంత వరకు ప్రాణానికి ప్రాణం అంటోంది సర్వస్వం త్యాగమని మదిలో అలజడి వున్నా అంతరంగాన్ని ఆదమరిచైనా మాయం చేస్తుంది బంధం మాటలకందని భావనతో తలచే జ్ఞాపకమై తనవారి కోసం హద్దులు చేరిపేసిన ఆలోచనతో వర్ణించలేని అర్థమై దాచుకున్న రూపం కోసం పట్టిపీడిస్తుoటది ప్రేమపాశమై ఎన్నిజన్మలైనా మరి.......? - జి జయ
Read More