Month: December 2022

ప్రణయ పూల వాన

ప్రణయ పూల వాన నీలి గగనాలలో నిండు చందురుడు.. నీలాకాశ వీధుల్లో నీకై వేచిన తారకలు.. నీలిమేఘాల పానుపువేసిన మెరుపులు.. పారిజాత సుగంధ పుష్ప పరిమళాలు.. నీ రాకకోసం ఎదురుచూస్తున్నాయి కృష్ణా.. నీల మోహనా..నీ రాధ మొర వినరా.. ప్రణయ పూల వానలో నిను అభిషేకించెదరా.. ముగ్ద మనోహరరూపా నన్ను‌ బ్రోవగ రారా.. ముకుందా..నీవులేని నా బతుకే చీకటి రా.. మాధవ..నీవే నా లోకంగా జీవిస్తున్నానురా.! - ది పెన్
Read More

మాటిస్తున్నా.!

మాటిస్తున్నా.! నిశీధిలో నా నీడైనా నాతో ఉండదేమోగానీ నీ తలపులను విడువను నిద్రలో శ్వాసనైనా ఆపుతానేమోగాని, నీ ఆలోచనను వదలను వేకువనే నీ రూపం కళ్ల ఎదుట ఉందనే ఊహతోనే మేల్కొంటాను నాతో నువ్ లేకున్నా నీకోసం నిత్యం ప్రేమతో కన్నీరొలుకుతుంటాను నువ్ నాతో ఉంటే చాలు దేన్నయినా ఎదిరించగలననే ధైర్యం నాదంటాను నీతో మాట్లాడితే చాలు ఆనందంలో ఎగిరిగంతేస్తుంటాను నీతో గడిపే ప్రతి నిమిషం అలా కరిగిపోకుండా ఆగిపోవాలని కోరుకుంటాను కలల తీరం దాటని నా ఈ కన్నీటి ప్రేమను నీకు చెప్పాలనుకుంటాను ఇలా కలలు కనే నా కళ్లు జీవితమంతా నీ కోసం ఎదురుచూస్తుంటాయని మాటిస్తున్నాను.! - ది పెన్
Read More

కలలు

కలలు కంటున్నాయి కలలు నా కళ్ళు .. నిన్ను చూడాలని... నిన్ను చేరాలని... నీ చేయి పట్టాలని... నీ జత లో నడవాలని... కంటున్నాయీ కలలు నా కళ్ళు... నీతో ఏడడుగులు నడవాలని.. కలలు కళ్ళ ముందు నిజమయ్యాయి... నీతో మూడు ముళ్ళ బంధంతో కానీ.. ఆ కలలను... కలలు గానే మిగిల్చావు.. కారు చిచ్చుని రగిల్చావు.. కన్నా కలలు కళ్ళలైపాయే.. నీ రాకతో... నా నూరేళ్ళ జీవితానికి జతగా, తోడుగా, నీడగా, దైర్యం గా, అండగా.. ఉంటావు అని కన్నా కలలు.. కాళ్ల పారాణి కూడా ఆరక ముందే ఆర్పేసావు... ఎంతో అందమైన భవిష్యత్తు కోసం కలలు కన్నాయి నా కళ్ళు... - వనిత రెడ్డీ
Read More

వీరనారి

వీరనారి స్త్రీ జననాగమందే జన్మించి స్తనాంబులతో దప్పిక తిరినన్, కామముతో చరిచేదవు అంగమే ఆడదనమునే. జన్మమించ్చేనుగా జననీ కోర్కెలు తీర్చేనుగా పడతి ఆలనాపాలనా జేసే సోదరి ఆక్రోశాన్ని అరికట్టేనుగా వీరనారి - హనుమంత
Read More

కనువిప్పు

కనువిప్పు బరణి కార్తె మొదలయింది. వానలు బాగకురిసాయి. రైతులంతా నేలను దుక్కి దున్నుతున్నారు. నాణ్యమైన వేరుశనగ విత్తనాల కోసం వేరుశనగ కాయలను పరిశీలిస్తున్నారు. కాయలను మిషన్ ఆడించి మంచి, నాసిరకం విత్తనాలను వేరుచేసి విత్తడానికి తయారుగా పెట్టుకున్నారు. నేను కూడా గొర్రు, గుంటుక మొదలగు వాటిని సర్ధిపెట్టుకున్నాను. మరుసటి రోజు అందరం విత్తనాలు విత్తుకున్నాం. పంటవేసి 4 నెలల సమయం కావడం వల్ల పంట కోయడానికి నిశ్చయించుకున్నాము. పోలేరమ్మ జాతర చేసి పంట కోయడం ప్రారంభించాము. తరువాత పంటను కల్లము లోకి వేసి, కాయలను విడిపించి ఎండబెట్టి సంచులకు నింపడం మొదలుపెట్టాము. పక్క సేను రామయ్యది 1 పల్లా విత్తనాలకు 20 సంచుల కాయలు కాసింది నాది 5 సంచుల కాయ మాత్రమే కాసింది. ఇది ఏదో మోసం జరిగిందని ఊరిలోని పెద్దమనిషిని న్యాయం చేయాలని కోరాను. దండోరా వేయించి నన్ను, రామయ్యను పంచాయితీ దగ్గరికి పిలిపించారు, జనాలంతా గుంపుగా చేరుకున్నారు.…
Read More

విషబీజాలు

విషబీజాలు లాలియనుచు జోలపాడ నిద్ర పోవు చిన్నారులు! చందురుణ్ణి పిలువగనే మురిసిపోవు చిన్నారులు! తల్లిపాలు త్రాగుచూనె రొమ్ముతోన ఆడేరుగ! తల్లితనము పూర్తిగాను మరచిపోవు చిన్నారులు! ఎదురుతిరిగి చరించుచూ ఆడేరుగ స్ర్తీలతోను! మృగాళ్ళుగా మారిపోయి కూడేరుగ స్ర్తీలతోను! ఆడదనగ మాతృసమము తెలుసుకోవు ఏనాడూ విషబీజము మదినింపుకు తిరిగేరుగ స్ర్తీలతోను! - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

అమ్మ- అమ్మాయి

అమ్మ- అమ్మాయి తల్లి గర్భంలో పురుడు పోసుకుని.... తల్లికి మరుజన్మ నిచ్చి భూమ్మీద పడ్డ పసిబిడ్డ... తల్లి రక్తపు చుక్కలతో తయారయిన చనుబాలను తాగి... తల్లి ఎద పైన తన్నిన ఆ తల్లి ప్రేమగా బిడ్డ పాదాలను ముద్దాడుతుంది.... అలా చిన్నప్పుడే తల్లి ఎద పైన తన్ని ఎదుగుతూ వచ్చాక ఆ తల్లి గుండెలపై తన్నుతున్నాడు... తనకి కడుపు నింపిన ఆ స్థానాలను.. ఇంకో అమ్మాయిలో కామంగా చూస్తున్నాడు... మగాడు అది వాడికి అవసరంగా అవకాశంగా చూస్తున్నాడు... ప్రాణాలను సైతం తీస్తున్నాడు... ఒక్కసారి తను ఆలోచించగలిగితే బాగుండు... నీ తల్లి దగ్గర కడుపు నింపిన అవయవం... ఇంకో తల్లి దగ్గర ఎందుకు అది ఇంకోలా కనపడుతుంది.... నీ తల్లి దగ్గర లేనిది కనిపించే బయటి ఆడదాని దగ్గర ఏముంది... ఆలోచించు ఒక్కసారి మానవా... కనిపించే అమ్మాయిలో ఒక అమ్మను చూడు.. ఒకటి పురుడు పోస్తే... ఇంకోటి నీ కడుపు నింపింది. దయచేసి…
Read More

గాలిలో దీపం

గాలిలో దీపం నేనూ పాసయ్యానోచ్ అంటూ ఆనందంగా వచ్చాడు నాని. ఏరా నాని నిజమా? కంగ్రాట్స్ రా అన్నాడు వేణు. థాంక్స్ రా అనగానే వేణు అనుమానంగా అవును రా నువ్వసలు బుక్స్ పట్టనే లేదు ఎలా పాస్ అయ్యావు రా అంటూ అడిగాడు. అరే ఏన్ని రోజులూ ఆ పుస్తకాలతో కుస్తీలు పడుతూ మీరెంత చదివినా వచ్చేవి ఆ మాత్రం పాస్ మార్కులే కదా, నేను పుస్తకం పట్టుకున్నా, పట్టుకొక పోయినా పాస్ అవుతానని మా ఊరు పూజారి చెప్పారు రా నువ్వు దేవుణ్ణి నమ్ముకుని నాలుగు వారాలు ఒంటి పూట భోజనం చేస్తూ ఉపవాసం ఉంటె చాలు నువ్వు తప్పకుండా పాస్ అవుతావు అని అందుకే రా నేను మీలాగా బుక్ పట్టుకోకుండా దేవుణ్ణి నమ్మాను అన్నాడు నాని సంతోషంగా... దానికి వేణు మొహం చిరాకుగా పెడుతూ ఏంటి దేవుణ్ణి నమ్మి ఉపవాసాలు ఉంటే నిన్ను పాస్ చేశాడా?…
Read More

కసాయిగా మారకు ఓ నేస్తం

కసాయిగా మారకు ఓ నేస్తం ప్రతి జననం ఒక యుద్ధం.. అమ్మలే అందులోని సైన్యం నవమాసాలు కంటికి రెప్పలా కాచుకున్న పసిగుడ్డు.. పొట్టలోనే కాలితో తన్నుతున్నా ఏ జనని నొప్పి అనదు బాధ్యతల భారం ఎంతున్నా బిడ్డ బరువును కాదనదు కడుపున మోసి.. పేగు బందాన్ని ముడివేసి.. తన ఊపిరినే ఆయువుగా పోసి.. బిడ్డకు జన్మనిస్తుంది బతుకు సమరంలో నిత్యం పస్తులుంటున్నా.. తన‌ రక్తాన్నే పాలగా మార్చి కన్నవాళ్ల ఆకలి తీరుస్తుంది పుడుతూనే పొట్ట చీల్చి.. పెరిగి పెద్దయి పాలు తాగిన రొమ్మునే గుద్దే నీచులుగా మారుతున్నారు మృగాళ్లు.. తల్లి ఒడిలో పెరిగింది మరచి పడతి ప్రాణం తీస్తూ.. సృష్టికి మూలమైన స్త్రీ శీలాన్ని దోస్తున్నారీ దుర్మార్గులు కనిపించే ప్రతి ఆడది మన అమ్మకు ప్రతిరూపం నీలాగే మరో మగవాడిని పుట్టించే మాతృస్థానం కసాయిగా మారకు ఓ నేస్తం.. గుర్తించు ఈ సత్యం లోకంలో 'ఆమె' ను మించి కనిపించదు మనకు…
Read More