Month: January 2023

నా మదిలో శ్వాసిస్తున్నా నిన్నే.!

నా మదిలో శ్వాసిస్తున్నా నిన్నే.! సరికొత్తగా ఉంది నీతో నాకు ఈ బంధం నాకెంతో ఇచ్చింది ఎన్నడూలేని ఆనందం నీకోసం నాలో ఏమిటో ఈ అంతర్మథనం నిత్యం నిన్ను తలుస్తూనే ఉన్నా ఇది నిజం కొత్తగా నాలో పుట్టుకొచ్చే భావ జలపాతం నా మనసుని ఊయలూపే నీ గానమాధుర్యం మత్తుగా నిద్రపుచ్చే నీ మాటల మాయాజాలం హాయిగా జోకొట్టే నీ ఊహల ఇంద్రజాలం విడదీయలేనిది మన ఈ పేరులేని బంధం ఎన్నటికీ మాయనిది మనిద్దరి అనుబంధం ఒంటరి బతుకులో నాకు తోడయ్యావు నా మనసులోని వేదనను పోగొట్టావు నాలో గత జ్ఞాపకాలని పూర్తిగా చెరిపేశావు సరికొత్తగా నువ్ నా మదిలో కొలువయ్యావు అందుకేమో..నీ అక్షరాలని ప్రేమిస్తున్నాను నీరూపాన్నే నా మదిలో శ్వాసిస్తున్నాను.! - గాయత్రీ భాస్కర్
Read More

నిజానికి నిందలెక్కువ

నిజానికి నిందలెక్కువ ఈ మధ్య ఒక సోషల్ మీడియా లో ఒక ఆవిడ పరిచయమైంది. ఆమెకు అంతకుముందు ఒక ఫ్రెండ్ ఉండేవాడట అతనికి ఇంకో ఫ్రెండ్ ఉండేదట. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న విషయం అతను ఆమెకి చెప్పాడు అతను ఆమె కన్నా చిన్నవాడు కాబట్టి తన ఫ్యామిలీ గురించి తన సమస్యల గురించి చెప్పుకున్నారు. ఆమె కూడా అతన్ని ఒక స్నేహితుడు లాగా భావించి తన కుటుంబ సమస్యలు కూడా చెప్పుకుంది. వాళ్ల పరిచయం అలా సాగుతూ ఉండగా అంతకుముందు మాట్లాడే ఆవిడకి ఈ విషయం తెలిసింది అప్పుడు ఆవిడ అతనితో నువ్వు ఆమెతో మాట్లాడకు నువ్వు నాతోనే మాట్లాడాలి అంటూ కండిషన్స్ పెట్టడం మొదలుపెట్టింది. ఇలా కండిషన్స్ పెట్టడానికి ఆమె అతని భార్య కాదు ఇంకొకరి భార్య ఆమెకి పిల్లలు ఉన్నారు అతనికి పిల్లలు ఉన్నారు. స్నేహితుల భావించే ఆమెకి కూడా పిల్లలు ఉన్నారు. వీరి పరిచయం మూడేళ్ల వరకు సాగింది…
Read More

నిజానికి ఆయుష్షు ఎక్కువ

నిజానికి ఆయుష్షు ఎక్కువ నీ గురించి నాకు తెలిసి నిజాన్ని ఎవరికి చెప్పిన నమ్మరు.. పైగా నన్ను అపార్థం చేసుకుంటారు నాకు తన మీద కోపంతో నేను లేని పోని నిందలు వేస్తున్నాను అని చెప్పకుంటారు... కానీ నేను చెప్పిన దాని గురించి మాత్రం ఒక్కరైనా ఆలోచించడం లేదు... నాకు అదే బాధగా ఉంది... నా దగ్గర కూడా సాక్షాలు లేవు అని వాళ్ళు కూడా తెగ నటిస్తున్నారు... నిజానికి నిందలు ఎక్కువ అని మా బామ్మ చెప్పింది... తన గురించి పూర్తి సాక్షాలు సంపాదించి అందరి ముందు దోషిలా నిలబెట్టాను... నా వాళ్ళు ఇంకెప్పుడు నన్ను అపార్థం చేసుకోరు... మంచితనం అనే ముసుగులో అందరిని సులువుగా మోసం చేయచ్చు అని అనుకోవడం చాలా తప్పు... అందరూ ఒకేలా నమ్మిస్తాను అని అనుకోవడం తప్పు.... మనం చేసిన తప్పులు ఎవరికి తెలియదు అని అనుకోవడం మన ముర్ఖతత్వం... నిజానికి ఆయుష్షు ఎక్కువ...…
Read More

మనిషికి మరో గ్రహంలో చోటు దొరికితే

మనిషికి మరో గ్రహంలో చోటు దొరికితే అబ్బో ఇదేంటి ఇలా ఉంది. అమ్మ అక్కడ అరె ఎవరూ కనిపించడం లేదేంటి, హా నేనేంటి అక్కడ కనిపిస్తున్న అదేంటి అలా ఉంది. అరెరే నా మాటలు నాకే వినిపిస్తున్నాయి ఏంటి. వామ్మో ఇలా మాట్లాడితే నా లోపల ఉన్న భావాలన్నీ బయటకు తెలిస్తే అమ్మో అయ్యో రామ ఇవి కూడా వినిపిస్తున్నాయి ఏంటిది బీప్ అంటూ సౌండ్ వస్తుంది. నీకు ఆకలి వేస్తుంది. ఇదిగో టాబ్లెట్లు తీసుకో అంటూ ఒక రోబో వచ్చి టాబ్లెట్లు ఇచ్చింది. ఇదేంటి నువ్వు ఎవరు అంటూ అడిగాను నేనా నేనేరా మీ అమ్మను గుర్తుపట్టడం లేదా అంటూ అంది ఆ రోబో, ఏంటి నువ్వు మా అమ్మవా నీకేమైనా పిచ్చి పట్టిందా మా అమ్మ నాలాగే ఉంటుంది అన్నాను. ఇదిగో కావాలంటే మీ నాన్నని అడుగు నేనే మీ అమ్మ ఏమండీ చెప్పండి వీడికి నేను వీడు…
Read More

పేరు లేని బంధం

పేరు లేని బంధం అన్ని మంచి విషయాలు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది. జీవితం అంటేనే ఒడిదుడుకుల ప్రయాణం. అలాంటి సమయం లో నాకున్న ఏకైక బంధం నాన్న. నాన్న అనారోగ్య సమస్యల వల్ల ఆయన్ని కోల్పోవాల్సి వచ్చింది. నాన్న చేసేది చిన్న ఉద్యోగమే, ఆస్తులు కూడా లేవు. అమ్మకు ఇల్లు తప్ప వేరే ఏమి తెలియదు. అన్ని చూడాల్సింది నేనే. ఊర్లో ఉన్న పెద్ద మనుషులు తలా కాస్త చెయ్యి వేయడంతో నాన్న అంతక్రియలు నిర్వహించారు. ఆ తర్వాతే మొదలైంది అసలు సమస్య. ఇల్లు ఎలా గడవాలి అన్నది ఆ సమస్య ఇది లేని వారికి పెద్ద సమస్య అయితే ఉన్నవారికి చాలా చిన్న సమస్య అసలు సమస్య కాదు. ఇక ఇంటిని అమ్మని చూసుకోవడానికి నేనే పెద్దదిక్కు కాబట్టి ఉన్న ఊర్లో ఆస్తులు ఏమీ లేవు ఉన్నదొక ఇల్లు అమ్మను ఒక దాన్ని వదిలి వెళ్ళలేక తనని…
Read More

విధి వంచిత విలాప విచిత్రం

విధి వంచిత విలాప విచిత్రం ప్రేమని గుడ్డిగా నమ్మింది నమ్మిన వాడి వెంట గుడ్డిగా నడిచింది కొన్నాళ్లు సంసారం సాఫీగా సాగింది ఆ తర్వాతే మొదలైంది అసలు సమస్య నీది తక్కువ కులం అందుకే తక్కువ బుద్ధులు అంటూ చీటికిమాటికి గొడవలు పడుతూ కొడుతూ తిడుతూ నీతో నాకేమీ లాభం లేదు నా కులం దాన్ని చేసుకున్నా కట్నం వచ్చేది అంటూ అటు ఇటు కాని స్థితిలో వదిలేసి వెళ్లాడు ఏం చేయాలో అర్థం కాక కన్నవారికి మొహం చూపించలేక బ్రతికే దారి తెలియక చేసుకుందామన్నా ఏ పనికి దొరకని పరిస్థితిలో చుట్టూ కాకుండా మృగాలు పొడుస్తుంటే కానరాని చీకటిలో పరిఎత్తుతున్న తనని కాపాడింది ఒక దేవత దేవత అనుకునే లోపు దయ్యంలా మారి ఆమె జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకుంటూ ఆమెని నిర్ధాక్షిణ్యంగా అమ్మేసింది అంగట్లో బొమ్మలా మారింది ఆ క్షణం ఆమె చచ్చిపోయింది. వచ్చేవాడు పోయేవాడు గిల్లే వాడు…
Read More

పేరులేని బంధం

పేరులేని బంధం అమ్మానాన్నలను వదిలి ఉండటం అదే మొదటిసారి. నన్ను హాస్టల్ లో చేర్పించి వారం అవుతూవుంది, కానీ నేను మాత్రం ఇంటిని తలచుకుంటూ ఒక్కడినే దిగాలుగా ఉండేవాడిని. రోజూలాగానే స్కూల్ కి వెళ్లి, అక్కడ చెప్పే పాఠాలు అర్థంకాక, ఆడుకోవడానికి స్నేహితులు లేక చాలా విచారంగా చెట్టు కింద కూర్చొన్నాను. చెట్టు పై నుండి “భూమ్” అంటూ ఉలిక్కిపడేలా క్రిందకు దుమికాడు. భయంతో నివ్వెరపోయి, గట్టిగా అరిచాను. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు, ఉపాధ్యాయులు ఏమిటా అని పరుగున వచ్చారు. కానీ వాడు అక్కడ లేడు, నాకు ఏమి చెప్పాలో అర్థంకాలేదు, అంతమంది చుట్టుచేరగానే నోట్లోనుంచి మాటరాలేదు. కానీ అంతమంది నాతో మాట్లాడటం మొదటిసారి. మరుసటి రోజు సాయంత్రం వాడు హాస్టల్ లో కనిపించాడు, చూడగానే నాకు భయమేసింది. పిల్లలతో గొడవ పడుతూ, స్కూల్ కి రాక, అల్లరిగా తిరిగేవాడు. రానురాను నా గదిలోని వస్తువులను వాడుకునేవాడు, అక్కడే పడుకునేవాడు. కానీ…
Read More

డిటెక్టివ్ ఎపిసోడ్ 8

డిటెక్టివ్ ఎపిసోడ్ 8 కెనడాలోని మనిటోబోకు చెందిన మిషెల్లీ క్రెయిగ్టన్ (44) కి ఓ నీడ కనిపించింది. అప్పటి వరకు బంధుమిత్రులు ఎంత ఓదార్చినా ఆమె మనసు శాంతించలేదు. తెరల మాటున కనిపించిన నీడ ఆమెకు సాంత్వన ఇచ్చింది. మిషెల్లీ ఆత్మీయంగా పెంచిన కుక్క ఓక్లీ ఏప్రిల్ లో ప్రాణాలు విడవటంతో ఆమె తట్టుకోలేకపోయారు. క్షణక్షణం ఓక్లీనే గుర్తు చేసుకుంటూ రోదించారు. అయితే ఇటీవల ఓ రోజు ఆమెకు తన లివింగ్ రూమ్ లో కర్టెన్స్ వెనుక ఓక్లీ లీలగా కనిపించింది. దీంతో ఓక్లీ తనకు దూరంగా లేదని, ఆత్మ రూపంలో తనకు దగ్గరగానే ఉందని చాలా సంతోషించారు. బంధుమిత్రుల రూపంలోని ఆత్మీయులు ఎంతగా ఓదార్చినా ఆమె మనసు కుదుట పడలేదు కానీ, దయ్యం రూపంలో తన పెంపుడు కుక్క కనిపించేసరికి ఆమె గొప్ప శాంతి పొందారు. మిషెల్లీ మాట్లాడుతూ తాను మొదటిసారి ఓక్లీ నీడను చూసినపుడు తన కళ్ళు తనను…
Read More

నేటి తరం యువశక్తి

నేటి తరం యువశక్తి ఎదురులేని యువశక్తి ఏదైనా సాధించే దేశానికి పెట్టుబడి! ఎంచుకున్న రంగంలో ఎంతో గొప్ప ధైర్యంతో ముందుకు నడపాలి! స్వయంకృషి నీ సొంతమైనప్పుడు మార్గానికి అడ్డు లేదు! అపార జ్ఞానంతో అంతులేని విజయాలు యువతకే సొంతం! సమాజమే ప్రమాణంగా సరిచేసే మార్గాలైహద్దులు లేని అవకాశాలు అందిపుచ్చుకోవాలి యువత! గూగుల్ అమ్మ గురువుగా ఉన్నా నీకు నీవుగా గురువైన రోజు మంచి రోజు ముందుంటుంది ప్రలోభాల పాత్ర లేకుండా దురలవాట్లకు దూరంగా మేల్కొనక తప్పదు ఇప్పటి యువత! సంస్కారాల సామ్రాజ్యం నిర్మించి సరికొత్త సవాళ్లు అదికమించాలి ఎన్నో! వినూత్నపు ఆలోచనతో భావి భారత పౌరులై సిరుల సంపదకు శ్రీకారం చుట్టాలి ! వెన్ను తట్టి మేధస్సుకు పదును పెట్టి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే యువత కావాలి ! వివేకానందుని స్ఫూర్తితో వివేకవంతులుగా అనునిత్యం ఆత్మవిశ్వాసంతో వెలుగులు నింపాలి.... - జి జయ
Read More

యువత.. కొక్కరకో…

యువత.. కొక్కరకో... యువతా మేలుకో... నీ దేశాన్ని కాపాడుకో.. నీ మార్గాన్ని మార్చుకో నీ తరాన్ని అర్ధంచేసుకో.. నీ స్త్వైర్యాని పెంచుకో.. దేశ వనరులను వాడుకో.. సొంత లాభం కొంత మానుకో.. వాటిని దేశ ప్రగతికి మలచుకో.. దేశభివృద్ధిలో నీ ప్రేమ ను చాటుకో.. ఓ శక్తి గా మారడం నేర్చుకో.. ఏ దేశమేగినా నీ దేశాన్ని గుర్తుంచుకో.. భరతమాత ముద్దుబిడ్డడు గా మసలుకో.. ఈ దేశం నీదేనన్న భావన అలవరచుకో.. దేశ ఔన్నత్యాన్ని పొగడుకో .. నిన్ను నువ్వు గెలిపించుకో.. చరిత్ర లో నీ పేరు లిఖించుకో.. మరణించిననూ బ్రతకడం తెలుసుకో... మంచి మనిషి గా మరణించాలని కోరుకో.. - కిరీటి పుత్ర రామకూరి
Read More