Month: February 2023

నువ్వు నేను

నువ్వు నేను ప్రియమైన శ్రీవారికి ప్రేమతో మీ అర్ధాంగి వ్రాయు ప్రేమలేఖ. ఇదేదో కొత్తగా ఉంది నాకే, భర్తకు ప్రేమలేఖ రాయటం. కానీ ప్రేమలేఖ ప్రేమించే వారికెవరికైనా రాయొచ్చు అని నా నమ్మకం అందుకే ఇలా..! చెప్పడం కంటే రాయడమే ఎంతో ఆనందాన్ని ఇస్తుంది నాకు. ఇందులో రాసే ప్రతి మాట నా మనసు పొరల్లో నిండిన మీ జ్ఞాపకాల నుండి వచ్చినవే. మీ ముందు ఎదురు పడి చెప్పే ధైర్యం లేదు ఎందుకంటే మిమ్మల్ని చూసిన మరుక్షణం నా గొంతులో మాటలే తప్ప మనసులో భావాలు పలకలేను కాబట్టి. నా జీవితంలో మొదటి సారిగా వ్రాస్తున్న ప్రేమలేఖ ఇదే తప్పులుంటే మాన్నిస్తారని ఆశిస్తూ... మిమ్మల్ని పెళ్లిచేసుకొనే వరకు ప్రేమంటే తెలియదు నాకు, నిజం చెప్పాలి అంటే మీరు నా జీవితంలోకి వచ్చిన తరువాత కూడా కొంత కాలం వరకు తెలియలేదు అనే చెప్పాలి. కానీ మన ఈ 5 సంవత్సరాల…
Read More

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి అండగ నిలిచేవాడిని ఏమని మే కోరెదెము కొండలపై ఉన్నవాడిని ఎంతని మే వేడెదెము చరణం దారే తెలియని వారము నిను చేరాలని వేచెదము నీవుంటే మాకు వేడుక అనుమానము లేనే లేదిక చరణం లేనివారికి నీవేగా ఉన్నవారికీ నీవేగా నీకృపనే కోరేవారికి ఇంకెవరు లేరుగా చరణం మాలోనే నీవుంటే ఏ భయము చేరదుగా గోవిందా అని పలికితిమా నీవే మమ్ము వెతికేవు చరణం నీ తలపే సాక్షిగా నిను చూసే భాగ్యానికి కన్నులు కాయలు కాచినవి కాలము పరిగెడుచున్నది -సి.యస్.రాంబాబు
Read More

అనగనగా ఓ చిన్న ప్రేమ కథ!!!

అనగనగా ఓ చిన్న ప్రేమ కథ!!! ఒక్క ఊరిలో ఒక అబ్బాయి, ఆ అబ్బాయికి ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం ఎంతలా అంటే, ఒక్క రోజు కూడా చూడకుండా ఉండలేనంత ప్రాణం. కానీ అమ్మాయి కదా! తన బాధ ,తన ప్రేమ అన్ని,తన కష్టాలు, ఇష్టాలు అన్ని తనలోనే ఉంచుకునీ బయటకి ఎవ్వరికీ చెప్పుకోకుండా చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి కోరుకుంది ఏది దొరకక పోవడం తో ఇష్టపడింది అందలేని భావన లో ఆ అమ్మాయికి ఇష్టం అయినవారు... మధ్యలోనే దూరం అవ్వడం జరుగుతూనే ఉండడం తో  తన జీవితం తనకు నచ్చినట్టు ఒక్క క్షణం కూడా లేదు చివరకి మంచి రోజులు వచ్చాయి అనుకునే లోపే ..... పాపం ఆ అమ్మాయి ఆ విషయం తెలిసిన ఆయువు నిండిపోయింది అమ్మాయికి ఒక్కరోజే మిగిలి ఉంది.... అదే తనకి, ఆ అబ్బాయికి చివరి రోజు... ఈ విషయం తెలియని అబ్బాయి...…
Read More

ఉసరవెల్లి

ఉసరవెల్లి ఊసవెల్లి గ్యాంగ్ వార్ భావోద్వేగ అండర్కవర్ పోలీసులు  కంబోడియాలో గ్యాంగ్ స్టర్ శ్రీధర్ ధనపాల్ మర్మమైన మరణం తరువాత మూడు సంవత్సరాల తరువాత, అతను వదిలిపెట్టిన శూన్యత కాంచీపురం జిల్లాలో ముఠా యుద్ధం పెరగడంతో పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. కాంచీపురం పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయానికి 60 మంది యువకులను పిలిచి మూడు వారాల తరువాత, ఎస్పీ శామ్యూల్ జోసెఫ్ హెచ్చరించారు, ఎక్స్‌ప్రెస్ వారిలో కొంతమందిని కలుసుకున్నారు, వారు హింస యొక్క శీర్షంలోకి ఎలా ప్రవేశించారో అర్థం చేసుకోవడానికి. ది దావూద్ ఆఫ్ ది సౌత్ ఒకప్పుడు దక్షిణ భారతదేశానికి చెందిన దావూద్ ఇబ్రహీం అని పిలుస్తారు, 2017 లో శ్రీధర్ ధనపాల్ మరణం తన ముఠాను రెండు వర్గాలుగా విభజించింది, ప్రతి ఒక్కరూ అతని స్థానాన్ని పొందటానికి పోటీ పడుతున్నారు. ఒక వర్గానికి నాయకత్వం శ్రీధర్ వ్యక్తిగత డ్రైవర్ అయిన దినేష్ మరియు అతని భాగస్వామి త్యాగరాజన్…
Read More

ప్రాణం ఖరీదు

ప్రాణం ఖరీదు మన తరాలు మారుతున్న కొద్దీ సాంకేతికత మారుతూ వచ్చింది. నాటకాలు, తర్వాత సినిమాలు ఇలా ఎన్నో రకాలుగా మారాయి. ల్యాండ్ ఫోన్స్ మారి కాయిన్ బాక్స్ లు వచ్చాయి తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. అలా స్మార్ట్ ఫోన్ లో ఎన్నో రకాల టెక్నాలజీ వాడుతూ మనుషులు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు అవి కొంత మంచికి అయినా మరి కొంత చెడుకి ఉపయోగిస్తున్నారు అనడం లో సందేహం లేదు. ఆ టెక్నాలజీ వల్ల ఇద్దరు అబ్బాయిల జీవితాలు ఎలా మారాయి అనేదే ఈ కథ... రాము, రాజేష్ ఇద్దరు రూం మేంట్స్ కాలేజీలో చదువుకుంటూ ఉన్నారు. అయితే రాము ఎక్కువగా ఫోన్ వాడుతూ పాటలు వింటూ గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. రాము వారిది మధ్యతరగతి కుటుంబం అయినా తండ్రిని ఇబ్బంది పెట్టి మరీ ఫోన్ కొనిపించాడు. రాజేష్ దగ్గర కూడా ఫోన్ ఉంది కానీ రాజేష్ దాన్ని…
Read More

ఓ.. విశ్వ మానవా

ఓ.. విశ్వ మానవా విశ్వ మానవా... ప్రపంచాన్ని చూస్తున్నావా... భూకంపాలే ప్రకంపాలే చంపుతున్నాయి ఇంకా..... మన మధ్య యుద్దాలెందుకు... బిడ్డల్ని పోగుట్టుకున్న అమ్మల్ని చూస్తే మనసు మరిగి మానవత్వం పెరిగి మతాలు కొట్టుకుపోతున్నాయి మేలుకో.... ఇప్పటికయినా.... దేవుడు మనిషిని భువి పైకి పంపిందే ప్రేమించాడానికి..... కలిసి మెలిసి జీవించు ఎవరు ఎక్కువ తక్కువ ఎవరు అందరం ఒకటే మాన్వాత్వాన్ని ముందుకు తీసుకెళదాం..... ఓ.. విశ్వ మానవా ముందుకు వెళదాం..... - అల్లావుద్దీన్
Read More

అందమైన ఆకాశం

అందమైన ఆకాశం అందమైన ఆకాశంలో అందరాని చంద్రుడు అతన్ని అందుకోవాలనుకోవడం అత్యాశ అయినా, అందితే బాగుండు అనే కోరిక దహించి వేస్తుంది. నిన్న అయినా పున్నమి రాత్రిలో ఒంటరిగా నీతో ఊసులాడాలని నా మదిలోని మాటలు ఎన్నో చెప్పాలని, నా హృదయాన్ని అంతా నీ ముందు పరచాలని అనుకుంటాను. కానీ అదేంటో నన్ను చూడగానే నువ్వు మబ్బుల చాటుకు జారుకుంటావు. నా హృదయాన్ని పరిస్తే కరిగిపోయి కిందికి వస్తానేమోనని నీ భయం కాబోలు... అందుకే మెల్లిగా మబ్బుల చాటుకు దాక్కొని నన్ను ఏడిపిస్తావు, అయినా వదులుతానా నా అక్షరాలని కవనాలుగా మారలుగా కూర్చి గుచ్చి, ఇదిగో ఇలా నీ ముందు పరుస్తున్నా... కనీసం అక్షరాలు అయినా చూసి నా మది మాటలు తెలుసుకుంటావని ఆశతో ఇప్పటికి శుభరాత్రి చెప్తూ రేపటికి నిన్ను స్వాగతిస్తున్నా.. - భవ్య చారు
Read More

ఆనందమైన జీవితంలో అపశృతి

ఆనందమైన జీవితంలో అపశృతి అపశృతి తరువాత బాధాకరమైన జీవితములో తోడు నీడ గా ఉండే వాళ్ల స్వచ్చమైన ప్రేమ ఆప్యాయతలను గుర్తించి నిజమైన శ్రేయోభషులను పరిచయము చేయడానికి ఇది ఆ దేవుడు ఆడిన లీల. లోకానికి బాగా పరిచయము అయిన నీకు ఇప్పుడు లోకము పరిచయము అవుతుంది. ⁠- హరీశ్వర
Read More

ఆనందమైన జీవితంలో అపశృతి

ఆనందమైన జీవితంలో అపశృతి నేను నా జీవితంలో ఎంతో ఆనందంగా ఉన్న రోజులే ఎక్కువ. ఒక శుభవార్త తరువాత మరొకటి విన్నప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. ఎలా నా సంతోషాన్ని ముందుగా ఎవరితో పంచుకోవాలో నాకే అర్దం కావడం లేదు. ఆలోచిస్తుండగా మదిలో నా స్నేహితురాలు మెదిలింది. నా ఆనందాన్ని తనతో చెప్పుకొని ప్రయోజనం కలుగుతుంది. నాకు కొన్ని విషయాలలో స్ఫూర్తిగా తీసుకొని నాకు తోడుగా ఉండేది. అందరూ ఒక చోటు కలిసి ఆనందంగా ఉన్న సమయంలో నా జీవితంలో ఒక అపశృతి చోటుచేసుకుంది. అందులో ఉండి నేను బయటకు రావడానికి ఎన్నో సార్లు ప్రయత్నం చేసినా అసలు బయటకు రాలేకపోయాను. ఎప్పుడు నేను నా ఆనందమైన జీవితంలో ఒక అపశృతి జరగడం వల్ల నేను కోలుకోవడానికి చాలా టైం పట్టింది. అందరిలో కలవడానికి చాలా టైం పట్టింది. నన్ను నేను గతంలో ఉండనికి చాలా ప్రయత్నం చేస్తాను. కాలం…
Read More

మజిలీ

మజిలీ గతుకులతో ఉన్న మట్టి రోడ్డు మీద దుమ్ము రేపుకుంటూ వెళుతోంది బస్సు. అసలే వేసవి కాలం, అందులో మిట్టమధ్యాహ్నం కావడంతో ఎండ అదిరిపోతోంది. బస్సులో క్రిక్కిరిసి ఉన్న జనం వడగాల్పులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతూ బస్సు ఆగిన ప్రతిసారీ గాలి ఆడక తొందరగా స్టార్ట్ చేయమని డ్రైవర్ పై విసుక్కుంటున్నారు. తొందరగా తమ గమ్యం చేరుకోవడం కోసం అసహనంగా ఎదురుచూస్తున్నారు. బస్సులో కిటికీ పక్కన దూరంగా చూపులు సారించి, బాహ్య ప్రపంచంతో సంబంధం లేనట్లు కూర్చునివున్న తులసి "టికెట్ ఎక్కడి వరకు ఇవ్వాలి? " అంటూ కండక్టర్ రెట్టించి అడిగితేగానీ వర్తమానంలోకి రాలేదు. "ఈ బస్సు ఎక్కడ వరకు వెళ్తుందండి?" అడిగింది. "దేవపురం వరకు" అసహనంగా చూస్తూ చెప్పాడు. "అక్కడికే ఒక టికెట్ ఇవ్వండి". టికెట్ తో పాటు చిల్లర ఇచ్చిన కండక్టర్ "టికెట్.. టికెట్" అంటూ ముందుకు సాగిపోయాడు. బస్సు వేగం పుంజుకుంది. దగ్గరగా వచ్చినట్లే వచ్చి స్థిరంగా…
Read More