Month: February 2023

కష్టే ఫలి

కష్టే ఫలి రాము మరియు లోకేష్ ఇద్దరు మంచి స్నేహితులు వాళ్ళు ఒకే గ్రామంలో నివసిస్తున్నారు. రాము మతపరమైన వ్యక్తి మరియు దేవుడిని చాలా బలంగా నమ్మేవాడు. లోకేష్ చాలా కష్టపడి పనిచేస్తాడు. ఒకసారి ఇద్దరూ కలిసి ఒక పెద్ద భూమిని కొన్నారు. ఆ భూమిలో వారు పంటను పండించి ఫలితం వచ్చాక సొంత ఇంటిని కట్టుకోవాలి అని అనుకున్నారు. లోకేష్ పొలంలో చాలా కష్టపడ్డాడు కాని, రాము ఏమీ చేయలేదు. కాని అతడు దేవుని గుడికి వెళ్లి పంట మంచిగ పండటానికి దేవుడిని ప్రార్థించాడు. అదేవిధంగా, సమయం గడిచిపోయింది. కొంత సమయం తరువాత, పొలంలో పంట పండి, అమ్మడానికి సిద్ధంగా ఉంది. రెండింటినీ మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మిన తరువాత వారికి మంచి డబ్బు వచ్చింది. ఇంటికి వచ్చారు, లోకేష్ రాముతో మాట్లాడుతూ, "నేను ఇందులో ఎక్కువ కష్టపడ్డాను, కాబట్టి ఈ డబ్బును నేను ఎక్కువగా పొందుతాను". అని అంటాడు. ఇది…
Read More

నాలోని…. నీకు

నాలోని.... నీకు బింబమా... ప్రతి బింబమా సింధువా.. సిందూరమా.. సున్నిత హృదయమా... మనసు స్వేచ్ఛకే అంతమా... అనంతమా!!!!!! జన్మా... ఇంకో జన్మా చిన్న చిన్న కర్మలు అవుతాయే ఖర్మలు అమ్మాయే కదా అనుకోవద్దు జన్మ ఇచ్చే అమ్మే కదా.... అమ్మ కడుపున కణమైన వేళ తృంచి వేయలే... అయ్యో.. ఎంత కరుణ కన్నా... నా కణమే అన్న అమ్మ మతి లేని మగాళ్లు స్వేచ్ఛకు అర్థం చెపుతారా మనసనే.. కొమ్ములనే నెత్తిన మోస్తూ హృదయాన్ని కసాయి కమ్మితే సమాజం ఒక వింత భ్రమలా మిగిలితే... పగలదా...... తల్లి ఒడికి... దూరమై ఎలా బ్రతుకుతావు... మాయకుడా... అమాయకుడా... మేలుకో ఇకనైనా... మేలుకో.. మనస్వని... మనస్వినే.... భవిశ్వత్తు.. భాద కావొద్దు అణువులో చూడు పరామణువులో చూడు తననీ... తనలోని మనని ప్రేమ శక్తిని..... సాధించు, ఆస్వాదించు జీవితం ఒక నందన వనమే భావించు... పరిపూర్ణంగా జీవించు.... - అల్లావుద్దీన్
Read More

పలుకే బంగారమాయెనా

పలుకే బంగారమాయెనా ప్రియా ఇన్నాళ్లు నీ వెనకాల తిరిగాను... నీతో మాట్లాడాలని ఎంతో తహతహలాడాను.... నీ కళ్ళలో ఒక్కసారి అయినా పడాలని అనుకున్నా... నీ మదిలో చోటు దొరుకుతుంది అని ఆశ పడ్డాను... నీ మనసు కరగక పోతుందా అని ఎదురుచూసాను... నీ హృదయంలో ఈ ధీనుడికి ఛోటిస్తావని కలలు కన్నా.... మా మనసులోని మాటను నీతో చెప్పాలని మన ఇద్దరి జీవితాలని రంగుల మయం చేయాలని అనుకున్నా... మన ఇద్దరి మధ్య దూరం ఉండకూడదు అని ఆ దేవుణ్ణి కోరుకున్నా... అనుకున్నట్టే నీ మనసు కరిగింది నా ఆశ నెరవేరింది... మన ఇద్దరి జీవితాలు రంగులమయం అయ్యాయి... మన ఇద్దరి మధ్య దూరం తగ్గింది. కానీ మన మనసులోని మాటలు బయటకు వినిపించవు... నీ కళ్ళలో భావం, నా మదిలో తెలుస్తుంది... నా మౌనం నీకు అర్థం అవుతుంది... పెద్దల వల్లనే నా కల నెరవేరింది... కానీ మన పలుకులు…
Read More

నా ప్రేమ

నా ప్రేమ "ప్రేమ ఈ సంవత్సరం మన చదువులు అయిపోయాయి కదా మనకు జాబ్స్ కూడా వచ్చాయి. ఇంకా ఎందుకు ఎదురుచూడటం, ఇంట్లో మన ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకుందాం. అప్పుడు ఇలా దొంగతనంగా కలుసుకోవలసిన అవసరంగాని, ఒకర్ని విడిచి ఒకరం దూరంగా ఉండవలసిన అవసరం గాని ఉండదు. ఏం అంటావ్ " అని అడిగాడు హృత్విక్. "ఏం లేదు హృత్విక్ నాకు ఈ పెళ్లి మీద అంత నమ్మకం లేదు. పెళ్లికి ముందు ఉన్న ప్రేమ పెళ్లి తర్వాత ఉండదు మీ మగవారికి. పెళ్లి అవ్వడంలేటు ఇంక నేనేమి చేసినా నన్ను విడిచి ఎక్కడికి వెల్లదులే అనే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది మీకు. తాళి అనే ముడుముళ్ల బంధంతో మమ్మల్ని కట్టి పడేస్తారు. ఏమైనా అంటే నువ్వు ఆడదానివి భర్తని ఎదిరించకూడదు తొక్క తోటకూర కట్ట అని అందరూ సిద్ధమైపోతారు నీతులు చెప్పడానికి. అదే పెళ్లి చేసుకోకుండా ఇలానే…
Read More

ఉదయం

ఉదయం తెలవారే వెలుగుల్లో జగతేమో మెరిసేను కలతీరే సమయంలో సంబరమే ముసిరేను ఉదయమే నినుతలచింది నానీడవు నువ్వంటూ ఊపిరిగా నిలిచింది నీ ఊహను విడనంటూ శ్రుతిచేస్తూ మనసేమో నీ మోమును వెతికింది పదమేమో పాడింది పలుకేమో కులికింది పురివిప్పిన పుడమేమో నగరాన్ని నిమిరింది కాఫీల గమకాలే కానుకలే మనకింక - సి.యస్.రాంబాబు
Read More

లవ్ స్టొరీ

లవ్ స్టొరీ శాన్వి, నరేన్, సంగీత, రేవంత్ నలుగురూ ఇంజనీరింగ్ కాలేజీలో మంచి ఫ్రెండ్స్ ... ఆ సంవత్సరం కొత్తగా చేరింది ప్రియ... తెల్లని చుడీదార్లో బాందినీ ప్రింట్ ఎర్ర చున్నీతో తగు సన్నమూ, పొడుగుతో చాలా అందంగా, హుషారుగా ఉంది... స్కూటీ ఆపి క్లాస్ లోకి వెళుతోంది ప్రియా.. రేవంత్ స్వతహాగా అల్లరోడు.. సరదాగా చిలిపి మాటలతో ఉత్సాహంగా ఉంటాడు.. ప్రియాని చూడగానే రేవంత్ మదిలో కొత్తరాగాలు మెదిలాయి... ఎంత సక్కగున్నవే అని పాడేసుకున్నాడు... అరేయ్ పదండ్రా కొత్తగా చేరినమ్మాయిని ర్యాగింగ్ చెయ్యాలి కదా అని ఫ్రెండ్స్ ని బయలుదేరమన్నాడు ప్రియాని ఆట పట్టించటానికి.. శాన్వి చెప్పింది.. తనేమి ఫస్ట్ ఇయర్ అమ్మాయి కాదు.. మనలానే థర్డ్ ఇయర్ స్టూడెంట్ .. వాళ్ళు వేరే ఊరినించీ ట్రాన్స్ఫర్ అయి వచ్చి ఇక్కడ చేరింది.. ర్యాగింగ్ ఇప్పుడేందిరా అర్ధం లేకుండా అని రేవంత్ ని వారించింది.. అయితే సరే ఫ్రెండ్షిప్ చేసుకుందాం పదా అని వెళుతున్నాడు.. ఏంట్రోయ్ అని విజిల్…
Read More

వారసుడు

వారసుడు ఒక్కగానొక్క వారసుడు వాడని అల్లారు ముద్దుగా పెంచాము. అడిగిందల్లా కొనిచ్చాము. నచ్చిన బళ్ళో వేసాము. నచ్చిన కాలేజీలో చేర్పించాము. అప్పటి వరకు చాలా బాగా చదివేవాడు. బాగానే ఉన్నాడు. కాలేజీలో చేరిన మొదటి సంవత్సరంలో కూడా బాగానే చదివాడు. ఇంట్లో చేసిన టిఫిన్ బుద్దిగా తినేసి, లంచ్ బాక్స్ తీసుకుని మరీ వెళ్ళేవాడు. నీట్ గా బట్టలు వేసుకుని బుద్దిగా రాముడు మంచి బాలుడు అనే విధంగా ఉండేవాడు. అలాంటి వాడి ప్రవర్తన ఒక్కసారిగా మారిపోయింది. పొద్దున్నే హడావుడిగా లేవడం రకరకాల బట్టలు కొత్తవి కొనడం, ఏ హీరో సినిమా రాగానే ఆ హీరో సినిమాకి మొదటి ఆటకి వెళ్లడం, టిఫిన్, లంచ్ లేకుండా ఇస్తున్నా, పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిపోవడం చేసేవాడు. సరేలే ఫ్రెండ్స్ ఎక్కువ అయ్యి ఉంటారు. చదువులో మాత్రం బాగానే ఉన్నాడు కదా అనుకున్నాం. మూడో సంవత్సరంలో మెల్లిగా లేట్ గా రావడం, కొద్దిగా తాగి రావడం లాంటివి…
Read More

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి జగతికి వెలుగువి నీవే మా జీవనగతివీ నీవే ఏడుకొండలను దాటి మా హృదయకోవెలను చూడు చరణం కలియుగమందున వెలసీ కష్టాలన్నీ తీర్చీ బతుకే కానుక చేసి బాధ్యత మాకు నేర్పే బంధువు నీవేనయ్యా చరణం చిరునవ్వుతో మములను చూసి వింతలు వంకలు చూపి తోడుగ మాకు నిలిచే సుందర రూపము నీదే చరణం కలలే లేని మాకు కలతలు మాత్రం మిగిలె కొండల రాయుడు ఉంటే సకల శుభములు కలుగు చరణం నిను చూసే భాగ్యము లేక తపియించితిమయ్యా మేము కన్నీరే చిందగ మేము పిల్లలమైతిమి స్వామి నిను చూసే భాగ్యం కోసం నీ జాడను వెతికేమయ్యా - సి.యస్.రాంబాబు
Read More

యోధ ఎపిసోడ్ 15

యోధ ఎపిసోడ్ 15 అలా తనలో తానే అనేక ప్రశ్నలు సంధించుకుంటున్న పార్ధు, తేరుకుని "ఛీ.. ఛీ... అయినా నేనిలా ఆలోచిస్తున్నాను ఏంటి..!" అని అనుకుంటూ తన ఫ్రెండ్స్ లో ఒకరైనా అవేశ్ కి కాల్ చేసి "తను ఒకప్పుడు ప్రేమించిన ఆ అమ్మాయి గురించి, వారి లవ్ బ్రేకప్ టాపిక్ తీస్తూ... కాస్త జాగ్రత్తగా ఉండరా? " అంటూ హెచ్చరిస్తాడు పార్ధు... "అసలేమైంది రా నీకు ..? ఎందుకిలా మాట్లాడుతున్నావ్..?" అంటూ అవేష్ అడగగా. రాత్రి తనకొచ్చిన ఆ కల గురించి వివరించి చెప్తాడు పార్ధు..! పార్ధు చెప్పినదానికి పగల బడి నవ్వుతాడు అవేశ్... "నేనింత సీరియస్ గా చెప్తుంటే, నీకు జోక్ గా ఉందా..?" అంటూ కోపంగా కసురుకుంటాడు పార్ధు. "జోక్ కాకపోతే ఏంటి మరి! పద్మను నేను మోసం చేయడం ఏంటి? తను చనిపోవడం ఏంటి? ఆత్మగా మారి నన్ను చంపడమేంటి..? అసలు పద్మతో లవ్ ట్రాక్ గురించి నేను చెప్తేనే కదా! నీకు మా గురించి తెలిసింది.…
Read More

స్నేహ హస్తం పార్ట్ 1

స్నేహ హస్తం పార్ట్ 1 అన్నపూర్ణ కాలనీలోకి లారీ ఒకటి పచ్చి తాగింది అందులోంచి దిగిన రామారావు, "తొందరగా దింపండి సామాను మళ్లీ అన్ని సర్దుకోవాలి" అని చెప్పాడు లారీ డ్రైవర్ క్లీనర్ తో... "అలాగే సార్ గంటలో వేస్తాం కానీ కొంచెం చాయి ఇస్తారా?" అంటూ ఆశగా అడిగాడు డ్రైవర్. "అదేంటయ్యా వచ్చిందే ఇప్పుడు ఇంకా పాలు పొంగించలేదు ఇక్కడెమో ఎవరూ తెలియదు మాకు అప్పుడే టి అంటావేంటి? అంతగా కావాలనుకుంటే వెళ్లి ఎక్కడైనా టీ కొట్టులో తాగేసి రండి" అని జేబులోంచి డబ్బులు తీయ పోయాడు రామారావు. "అయ్యో ఎందుకండీ డబ్బులు ఇవ్వడం మేము లేమా ఏంటి...!? అంటూ వచ్చింది పక్కింటి వనజ. "అయ్యో మీకు ఎందుకండీ శ్రమ" అన్నాడు ఆమె పక్కింటి లోంచి రావడం చూసి. "అదేంటి అన్నయ్యగారు... మనం ఎప్పటికీ ఉండేవాళ్ళం ఆ మాత్రం చేయకపోతే ఎలా అయినా మా ఇంట్లో ఎప్పుడూ టీ రెడీగానే…
Read More