Month: February 2023

అమ్మాయి అబద్ధపు జీవితం

అమ్మాయి అబద్ధపు జీవితం ఫేస్బుక్ లో స్క్రోల్ చేస్తుంటే ఒక అందమైన అమ్మాయి ఫోటో కనిపించింది వెంటనే అది ఈ అమ్మాయి చాలా బాగుంది అని అనుకుంటూ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాను. నేను రిక్వెస్ట్ పెట్టడం ఆలస్యం వెంటనే తను యాక్సెప్ట్ చేసింది. ఆహా ఏమి నా భాగ్యము ఇన్నాళ్లకు ఒక అందమైన అమ్మాయితో మాట్లాడబోతున్నాను అనే నా ఉత్సాహం ఉరకలు వేస్తూ హాయ్ అని మెసేజ్ పెట్టాను తను వెంటనే హాయ్ అంటూ మెసేజ్ రిప్లై ఇచ్చింది. మీరు ఎక్కడ ఉంటారు అంటూ అడిగాను నేను బెంగళూరులో ఉంటాను అంటూ చెప్పింది. మీరు ఎక్కడ ఉంటారు అని అడగడంతో నేను హైదరాబాదులో ఉంటాను అని ఆమె అడగకపోయినా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను నా జీవితం అంటూ నా వివరాలన్నీ వెంటనే చెప్పేశాను. నా విషయాలన్నీ చెప్పాను కదా మరి మీ విషయాలు చెప్పరా అంటూ అడిగాను. అప్పుడు…
Read More

యువత అబద్ధపు జీవితం

యువత అబద్ధపు జీవితం నన్ను మా అమ్మ నాన్నలు ఏ లోటూ లేకుండా పెంచారు. అన్ని సౌకర్యాలు దగ్గర ఉండి చూసుకునే వారు అల్లారు ముద్దుగా పెంచారు ఒక్క కొడుకునే అని.. నా ఇష్టాన్ని కాదు అనలేదు ఏ నాడూ.. నాకంటే ఒక అడుగు ముందే ఉండి అన్నీ సమకూర్చేవారు.. కానీ నాకు చదువు కంటే పాటలు పాడడం అంటే చాలా ఇష్టం.. అమ్మ వాళ్ళకు నేను గొప్పగా చదువుకోవాలి అని ఉండేది. అమ్మ నన్ను ఒకే ఒక్క కోరిక కోరింది.. నువు చదువులో ఫస్ట్ రావాలి అని.. నాకేమో అది అంతగా పట్టక పోయేది.. పాటల వైపు ఎక్కువ ఆసక్తి చూపే వాడిని.. ఇటు చదువు మీద ధ్యాస తగ్గుతూ వస్తుంది.. కానీ అమ్మకు ఆ విషయం చెప్పకుండా.. పాటలు అంటే ఇష్టం అంటే ఎక్కడ కోప్పడుతుందో అని భయంతో చెప్పేవాడిని కాదు.. అలా నేర్చుకోవడానికి అబద్దం చెప్పి చదువు…
Read More

అబద్ధపు జీవితం

అబద్ధపు జీవితం నేను నిజం.. నా జీవితం అబద్ధం నా నవ్వు నిజం.. నా సంతోషం అబద్ధం నా పుట్టుక నిజం.. నే గిట్టుట నిజం నట్టనడుమ ఉన్న నా అనే నడవడిక అబద్ధం. నా జీవితం అంతా పరులకోసం ఆలోచించి నా అనే పదానికే అర్థం లేకుండా బతికాను. మగాడిలా పుట్టి తల్లితండ్రులను సంతోషపెట్టాను. వాళ్ళ కలల దర్పణంలో నన్ను నేను చూసుకోవడమే మరిచిపోయాను. చదువైతే చదవగలిగాను. కానీ అది నా ఇష్టానుసారం కాదు. పుత్తడి బొమ్మ లాంటి అమ్మాయిని ప్రేమించాను. కానీ ఇత్తడికి పట్టినట్టు మరకలతో ఆమె మనసు స్వయం ప్రకాశాన్ని కోల్పోయి, ఇతరుల మాటలు నమ్మి నన్ను నిందించి నా ప్రేమనే అబద్ధం చేసింది. అయినా నన్ను నేను తమాయించుకుంటూ.. జీవితంపై దృష్టి సారించాలనుకున్నాను. కానీ అరిష్ఠం నన్ను పటిష్ఠంగా ఆలింగనం చేసుకొని నా చదువుతో.... అభిరుచితో సంబంధం లేని కొలువులో నన్ను కూర్చోబెట్టింది. తల్లిదండ్రులు అయితే…
Read More

అలంకారం

అలంకారం జీవితం ఎలా ఉంటుంది అంటే అన్ని తానే అనుకుంటాం.... భూమి ఒక్క సారిగా అగి వెనక్కి వెళ్తే ఎంత అల్లకల్లోలం అవుతోంది అలా జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కొత్త అలవాట్లు, దానికి తోడు భయం, ఒంటరిగా కూర్చొని ఏడ్చే ఏడుపు కొన్ని వర్ణించలేము... ఊహల్లో తన కోసం కట్టిన కోటలో జ్ఞాపకాలు గూడు కడతాయి.... తన కోసం ఎదురు చూసే కళ్ళకి మబ్బులు కమ్ముకుంటాయి.... మరో తరం కోసం దాచిన రక్తమే నా ఇంటి గోడలకు అలంకారం అవుతాయి మా పెళ్లి కోసం కొన్న పువ్వులే నా సమాధి అలంకారం అవుతాయి మా పెళ్లి బాజలే నా చావు ముందు మేళాలు అవుతాయి - సందీప్
Read More

అబద్ధపు జీవితం

అబద్ధపు జీవితం నేను గతంలో ఎన్నో అబద్ధాలు చెప్పాను. రోజులు గడిచే కొద్దీ నా జీవితంలో గతంలో నేను చేసిన తప్పులకు ఇప్పుడు నేను నా పేరు మార్చుకొని ఒక అబద్ధపు జీవితం గడుపుతున్నాను. ఎప్పుడూ అనుకోలేదు నేను ఇలాంటి జీవితం గడుపుతున్నానని. ఈ అబద్ధపు జీవితంలో కొత్త పరిచయాలు, కొత్త సమస్యలు, కొత్త సవాళ్ళను ఎదుర్కొంటున్నా. నేను గతంలో చేసిన తప్పులను సరిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఆ తప్పులు నా మీద పగతో వేరు వాళ్ళు చేసి నింద నా మీద వేశారు. నేను అందరి దృష్టిలో దోషిగా మిగిలిపోయాను. ఈ అబద్ధపు జీవితంలో నా మీద చేసిన కుట్రలను నేను తెలుసుకున్నాను. వాళ్లకి వాళ్ల దారిలోనే బుద్ది చెప్పాను. ఒక మనిషి ఒక స్థాయికి ఎదగడం ఇష్టంలేక అసూయ, పగ పెంచుకొని తప్పు చేసి నా మీద నింద వేశారు. మన పక్కనే ఉంటూ మనకి వెన్ను పోటు…
Read More

యోధ ఎపిసోడ్ 11

యోధ ఎపిసోడ్ 11 శనివారం... అప్పటికే వాళ్ళు ఆ గెస్ట్ హౌజ్ కి వచ్చి అయిదు రోజులు గడిచాయి. యధావిధిగానే ఆ రోజు కూడా తెల్లారింది. సరిగ్గా అప్పుడే కృతికి మెళుకువ వచ్చింది. తన తలంతా కొంచెం బరువుగా, ఏదో పట్టేసినట్లుగా ఉంది. అసలు తను ఎక్కడుందో, ఎలా ఉందో కూడా తనకి తెలియడానికి చాలా సమయమే పట్టింది. అలా కాసేపటికి తేరుకున్న తను, ఆ రూం మెయిన్ డోర్ దగ్గర పార్ధు పడి ఉండడం గమనించింది. తన (పార్ధు) దగ్గరికి వెళ్ళి, పార్ధుని లేపే ప్రయత్నం చేస్తుంది కృతి.. "పార్ధు... పార్ధు... లే పార్ధు... నీకేమైంది పార్ధు!" అంటూ తనని తట్టి లేపుతుంది. అలా కాసేపటికి, కృతి పిలుపుకి మెలుకువ తెచ్చుకున్న పార్ధుకి కూడా స్పృహలోకి రావడానికి టైం పట్టింది. స్పృహలోకి వచ్చినా తన కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు. (బహుశా రాత్రి కమ్మిన పొగ వల్ల అనుకుంటా) ఆ మసక కళ్లతోనే పక్కనే…
Read More

డబ్బు – ప్రేమ

డబ్బు - ప్రేమ ఎవరో చేసిన పాపానికో.. వారి క్షణ కాల కోరికకు బలి అయ్యి.. అనాధగా మారిన బాలుడు. చెత్తకుప్పలో పడిన పసికందు.. ఎవరి పాపమో.. ఎవరి శాపమో..వీడికి శిక్ష.. అనాధగా పెరిగే పరిస్థితి.. చెరదీసింది ఓ ఆశ్రమం.. ఒడిన చేర్చుకుంది.. తల్లి,తండ్రి, గురువు అన్ని తానై నిలిచింది.. దేవుడు తల్లితండ్రులను దూరం చేసిన ఆ అబ్బాయికి ఈ ఆశ్రమం ఒడి చేర్చి కాస్త మేలు చేశాడు.. నారు పోసిన వాడు నీరు పోయడా అన్నట్టు.. రాత రాసిన వాడే గా దారి చూపేది.. అలా చూపాడు.. అయినా ఆ అబ్బాయికి ఇక అంతా మంచి చెడు అన్ని ఆ ఆశ్రమం అయి పెంచింది.. అక్కడే ఉంటూ చక్కగా చదువుకుంటూ.. గొప్ప స్థాయికి ఎదిగాడు..తనకంటూ సమాజంలో ఓ స్థాయి ఓ పేరు సంపాదించుకున్నాడు.. చిన్న వయసులోనే అన్ని విధాలుగా ఒక బ్రాండ్ లా తనని నిరూపించుకున్నాడు... అలా తను సొంతంగా…
Read More

ఇంకా మిగిలే ఉన్నారు బానిస సంకెళ్లు గా…

ఇంకా మిగిలే ఉన్నారు బానిస సంకెళ్లు గా... న్యాయం లేని నీచమైన మనుషులు, ప్రేమ లేని బంధాల ముసుగులో పెళ్ళనే పవిత్ర బంధం అడ్డేసుకునున్న మృగాలు.... ఒళ్లు మరచి‌ మైకంలో, ఆడ ఊపిరి బిగబెట్టే పైశాచిక పురుగులు ఇంకా మిగిలే ఉన్నారు ఈ భూమ్మీద.. అతివ మనసు అర్థం చేసుకునేది ఎవరు..? ఆడ కన్నీరు తుడిచేదెవరు..? ఆడపిల్ల ఆశయాలను వ్యక్తిత్వాన్ని గుర్తించేదెవరు..? పాతికేళ్ల జీవితం వీడి డెబ్బై యైదేళ్ళ భవిష్యత్తులో భర్తే ప్రపంచంగా చేసుకుని పుట్టింటిని పరాయింటిగా, అత్తింటని సొంత ఇంటిని చేసుకుని అమ్మ నాన్న లను వీడి తెలియని ప్రపంచ లో అడుగు పెట్టి ఓర్పుగా అన్ని తానైయ్యది మగువ... పుట్టిల్లు వీడటం ప్రతి అమ్మాయి కి శిక్షే... కానీ అత్తారిల్లు వరంగా మారడం అనేది అది భర్త పంచే ప్రేమ మీద ఉంటుంది.. కానీ ఇది ఎంతమందికి వరంగా ఉంటుంది నేటి సమాజంలో.. పెళ్ళంటే మూడు ముళ్ళు నాలుగు…
Read More

అబ్బాయిల జీవితం

అబ్బాయిల జీవితం పితృస్వామ్య వ్యవస్థ ద్వారా మగవాళ్ళు ఆడవాళ్ళని అనాది కాలం నుండి అన్ని విధాలా అధఃపాతాలానికి అణగద్రొక్కుతూనే ఉన్నారు ఈరోజుకి కూడా. చదువు ప్రసాదించిన తెగువతో ప్రపంచాన్ని అర్థంచేసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు మహిళామణులు. ఇది ఇలా సాగుతున్న తరుణంలో కొంతమంది స్త్రీలు స్త్రీ వాదాన్ని తమ స్వంత ప్రయోజనాల కోసం చెడు మార్గంలో ఉపయోగించుకుని ఆడజాతి అభివృద్ధికి అహర్నిశలూ కృషి చేస్తున్న ఎందరో మహనీయుల పోరాటాలకు అర్థం లేకుండా చేస్తున్నారు. మరి ఇది మగవారి దురదృష్టమో లేక ఆడజాతికి పితృస్వామ్య వ్యవస్థ ద్వారా వాళ్ళు చేసిన అన్యాయానికి తగిన ప్రతిఫలమో తెలీదు కానీ చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల చేతిలో మోసపోతూ ఉండడం మాత్రం బాధాకరం. పూర్వపు రోజుల్లో ఎత్తిన తల దించకుండా, అమ్మ, నాన్న మాట జవదాటకుండా పెంపకాలు ఉండేవి. నిజానికి లోకం తెలీకుండా సమాజమనే భయం చూపించి పెంచేవారు. టెక్నాలజీ వృద్ధికి నోచుకోకపోవడం ఒక…
Read More

నేను అనే వెలుగు

నేను అనే వెలుగు కళ్ళు మూస్తే చీకటి కనిపిస్తోంది... చీకట్లో ఎక్కువసేపు ఉండటమే చాలా కష్టం... కానీ కొన్ని సందర్భాల్లో చీకట్లోనే బతకాల్సి వస్తుంది.... కానీ ఆ చీకట్లోనే మనం బాధపడకుండా ధైర్యంగా ఆ చీకటితో స్నేహం చేసి వెలుగు అనే నిచ్చెన ఎక్కాలి.. మన గమ్యం ఏంటో మర్చిపోకుండా ప్రతిసారి గుర్తు చేస్తూ బాటలు వేయడానికి సహాయపడుతుంది. చీకట్లో ఒక రోజంతా ఉండడం చాలా కష్టమే కానీ ఆ చీకట్లోనే నేను బతుకుతూ ఉండి నా గమ్యం ఏమిటో తెలుసుకొని కొత్త కొత్త విషయాలు గురించి తెలుసుకొని ఆ చీకట్లోనే వెలుగు అనే నిచ్చెన ఎక్కుతూ నేను ఆ చీకటిలో కోయిల ఉంటున్నాను.. చీకటి లో నేను ఒదిన నా మనసు... నా అనే ప్రపంచంలో నేను అనే వెలుగుతో ఉన్నాను. ⁠- మాధవి కాళ్ల
Read More