అక్షర లిపి ఫౌండర్ తో ఇంటర్వ్యూ
అక్షర లిపి ఫౌండర్ తో ఇంటర్వ్యూ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకం, అక్షరలిపి ఫౌండర్ శ్రీ శారదా దేవి గారి ఇంటర్వ్యూ మీకోసం అర్చన:- అమ్మ నమస్తే మీరు పుట్టింది ఎక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నారు ? అమ్మ:- అమ్మా నమస్తే, నేను పుట్టింది పెరిగింది ఒక మోస్తరు పట్టణంలో అయినా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే, అంటే పల్లెలో పెరిగాను. మాది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం. నేనొక మామూలు మధ్య తరగతి సగటు ఇల్లాలిని. చదువుకున్నది తక్కువే, అయినా ఎంతో,కొంత తెలుసుకున్నాను. అనుభవం అన్ని నేర్పిస్తుంది అమ్మ. ఇప్పుడు నేను ఏమి చేయడం లేదు అంతా నా పిల్లలే చూస్తున్నారు. కాకపోతే కొన్ని విషయాల్లో నేను సలహాలు ఇస్తూ ఉంటాను, పిల్లలు కూడా నన్ను అన్ని అడుగుతూ ఉంటారు. అర్చన:- అసలు ఈ అక్షరలిపి అనేది మీరు ఏలా మొదలు పెట్టారు ? అమ్మ:- దీని గురించి మీకు…