Family Stories

మోసపోయిన అబ్బాయి జీవితం

మోసపోయిన అబ్బాయి జీవితం సిద్దూ మంచివాడు అందరిలా చదువుకుంటూ ఉన్నాడు. తల్లిదండ్రుల కలలు తీర్చే ప్రయత్నం చేస్తున్నాడు. అనుకోకుండా ఒక రోజు అతని జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చింది అదెలా అంటే తల్లిదండ్రులు సిద్దూకి ఫోన్ కొని ఇచ్చారు తన చదువుకోసం. అయితే ఒక రోజు ఒక ఫోన్ కాల్ ఆ సిద్దు జీవితాన్ని మార్చింది. ఒక తెలియని నంబర్ నుండి ఫోన్ వచ్చింది అది చేసింది ఒక అమ్మాయి. అది తెలియని నంబర్ అని చెప్పి ఫోన్ పెట్టేసాడు. తర్వాత కొన్నాళ్లకు మళ్ళీ అదే నంబర్ నుండి ఫోన్ వచ్చింది. ఈ సారి ఆ అమ్మాయి సిద్దూతో నువ్వు మంచివాడిలా ఉన్నావు. వేరే వాళ్ళు అయితే ఈపాటికి ఎన్నో సార్లు తిరిగి ఫోన్ చేసేవారు. కానీ నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు మంచి వాడివి అందుకే నేనే చేశాను అంటూ మాటలు కలిపింది. అలా సిద్దూ ఆమె పేరు తెలియక…
Read More

ఆడవాళ్ళు మీకు జోహార్లు

ఆడవాళ్ళు మీకు జోహార్లు పుట్టింట్లో మొదలైన ఆడదాని జీవితం.. బిడ్డగా, చెల్లిగా, అక్కగా, ఆలిగా, తల్లిగా.. అన్ని బాధ్యతలు నెరవేరుస్తూ.. అన్నింటా అడుగడుగునా అవమానాలు మోస్తూ.. అర్ధంతరంగా చదువు ముగించి పెళ్లి చేసి అత్తారింటికి పంపిన ఓ స్త్రీ గాథ.. తను చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు అనుభవించింది.. తనకు చదువు లేదు.. ఇంట్లో పరిస్థితి బాలేక చదువుకోలేకపోయింది. అన్న, తమ్ములకి అండగా.. తల్లి తండ్రులకు భరోసాగా నిలిచింది.. ఏమి తెలియని అమాయకురాలు.. బయటి ప్రపంచం తెలియని ఓ పిచ్చి మాలోకం.. ఇల్లే ప్రపంచం. తన వాళ్ళే ముఖ్యం.. అని తన గురించి కూడా ఏమీ కోరుకోని ఓ మంచి వ్యక్తి.. తనకి పెళ్లి చేసి పంపాలని. ఇంట్లో వాళ్ళు నిర్ణయించుకున్నారు... రానే వచ్చింది సంబంధం.. కుదిరింది. చేశారు.. అప్పగింతలు అప్పుడు తలితండ్రులు ఆమెతో ఇలా అన్నారు.. అమ్మా ఇన్ని రోజులు మా ఇంటి మహాలక్ష్మిలా తిరిగావు.. ఇక నుండి అత్తరిల్లే…
Read More

ప్రియా

ప్రియా నా స్నేహితురాలు.... ప్రియా.... చాలా మంచి అమ్మాయి.. చాలా బాగా చదువుతుంది తన 10వ తరగతి వరకు... తన జీవితం సంతోషంగా సాగుతుంది 10వ తరగతి పాస్ ఆయింది. పై చదువులు చదవడానికి వాళ్ల అమ్మానాన్నలు కూడా ఒప్పుకున్నారు కానీ వాళ్ళ మేనత్త ఆడపిల్లకి ఇంకా చదువు ఎందుకు అని వాళ్ల అమ్మానాన్నలతో మాట్లాడింది మా అబ్బాయ్ కి మీ అమ్మయికి పెళ్లి చేద్దాం అని చెప్పింది. మా అబ్బాయ్ తాగుతూ ఊరు పైనా బలాదూర్ గా తిరుగుతున్నాడు వీళ్ళ ఇద్దరికీ పెళ్లి చేస్తే మారుతాడు అని చెప్తుంది అప్పుడు ప్రియా వాళ్ల నాన్న ఆలోచనలో పడతాడు మా అక్క వచ్చి అడుగుతుంది ఎప్పుడైనా చేసేదే కదా అప్పుడు ఆ విషయం ప్రియకి చెప్పాడు తండ్రి మాట కి విలువ ఇచ్చి ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకుంది పెళ్లి తరువాత.... ఒక్క వారం బాగానే ఉన్నాడు ఆ అబ్బాయ్ వారం…
Read More

మా వోడు – ఇంటింటి రామాయణం

మా వోడు - ఇంటింటి రామాయణం మగాడి ప్రతి విజయం వెనక ఆడది ఉంటుంది అంటారు. కానీ ఆడదాని ప్రతి కన్నీటి బొట్టు వెనక ఒక మగాడు ఖచ్చితంగా ఉండి తీరతాడు. అది భర్తనా, ప్రియుడా, లేదా స్నేహితుడో ఇలా ఎవరైనా కావచ్చు, కానీ మగవాడు ఆడదాని శరీరంతోనూ, మనసుతోనూ రెండు విధాల ఆడుకుంటే ఆడది ఆ బాధని ఎవరితో చెప్పుకుంటుంది. మగాడికి ప్రతి విషయం లోనూ ఆడది లేకుండా గడవదు, కానీ ఆ విషయం అతనికి అదే మగాడికి తెలియదు. తెలిసినా అంతగా పట్టించుకోడు, నా పైనే అది అంటే ఆడది ఆధారపడి ఉందనే ఒక భ్రమలో బతుకుతూ ఉంటాడు, అయితే మగాడిని ఎప్పుడూ ఆడది పేరు తెస్తూనే ఉంటుంది, అది ఎలాగో ఇప్పుడు చూద్దాం... తల్లి కడుపులో ఉన్నది ఏ బిడ్డ అయినా ఆ తల్లి బిడ్డను చూడకుండానే నా బిడ్డ బంగారం అని మగాడిని బంగారంతో పోలుస్తుంది.…
Read More

కాలతీతo

కాలతీతo జీవితంలో బాల్యం ఒక మధుర జ్ఞాపకం. ఆ వయసులో ఏం చేస్తున్నామో తెలియదు. ఏం చేసినా అందరికీ ముద్దుగా బాగుంటుంది అందరూ దగ్గరికి తీసుకుని ముద్దులాడతారు. ఆ తర్వాత మెళ్లిగా బాల్యం కరుగుతూ, జరుగుతూ పాఠశాలలోకి మారుతుంది. అక్కడా సంతోషమే. తోటిపిల్లలతో పాటు ఆడుకోవడం. కొత్త పరిచయాలు. కొత్త తరగతులు. ఒక్కో తరగతులు మారుతూ ఒక్కో విషయాలను ఒక్కో రకమైన జీవితాన్ని చూస్తూ సంతోషంగా గడుపుతూ ఉంటాం. అక్కడ కొన్ని రోజుల వరకు మనమేం చేసినా ఎవరూ ఏమి అనరు ఎందుకంటే పసి వాళ్ళు తెలియదు అనే ఆలోచనతో, ఒక్కో తరగతి పెరుగుతూ ఉంటే అప్పుడు అంటుంటారు ఇంకా చిన్నపిల్లాడివా? ఆ మాత్రం తెలియదా అంటూ మొదలు పెడతారు. అప్పుడు కూడా ఏమి పట్టించుకోము. ఆలోచన లేదని వేరే పెద్దలు సర్ది చెప్తారు. తెలియనివి తల్లి తండ్రి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తూ ఉంటారు. వాటిని ఆకళింపు చేసుకొని ముందుకు వెళ్తాం.…
Read More

కూతురు లేఖ

కూతురు లేఖ ప్రాణ సమానమైన నాన్నకు.. తమ కూతురు ఆత్మఘోషతో వ్రాయు లేఖ. నాన్న! నువ్వు నన్ను నీ కంటి పాపలా కాపాడుకుంటూ.. నిలువెత్తు ప్రేమ మూర్తిగా మారి నన్ను పెంచావు. చిన్నతనం నుండే ఎన్నో ఆదర్శ వ్యక్తుల కథలు, ఉన్నత వ్యక్తత్వాల జీవిత కథలు నాకు వెన్నముద్దలుగా పెట్టావు. నీతో పాటు ఎన్నో సాంఘిక కార్యకలాపాలలో పాల్గొనేలా చేసి సంఘటితమే సగం బలం అని నేర్పించావు. నైతిక విలువలనే గొప్ప ఆస్తులుగా ఇచ్చావు. దేశ ఔన్నత్యాన్ని చెబుతూ నాలో దేశభక్తి బీజాలను నాటావు. నన్ను అన్ని రంగాలలో రాణింపజేసేలా నాలో ఉత్సుకతను నింపావు. సంఘంలో నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునేలా నన్ను తీర్చిదిద్ధావు. నీలాగే నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మంచి వారే అని, ఎదుటి వారు మన ప్రవర్తనకి దర్పణాలు అనుకొని మధ్యవర్తుల మాయమాటలు నమ్మి, పుతికా వియోగ నరకంతో, నీ శక్తికి మించి కట్నమిచ్చి, ఖర్చు…
Read More

ఆమె

ఆమె ఆమెకి 18 యేళ్లు అప్పుడే తన ఇంటర్ చదువు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చింది... అప్పటివరకు తన స్నేహితులతో సంతోషంగా ఉన్న ఆమె.. ఇంటికి రాగానే తన జీవితమే మారిపోయింది అన్నట్టు ఉండేది... ఎందుకంటే ఆమె నవ్వినా, చూసినా, ఏడ్చిన ఆఖరికి ఏ పని చేసినా ఆమె తల్లిదండ్రులు పరువు పోతుంది అని ఆమె సంతోషాలను దూరం చేసేవారు.... ఒకరోజు ఆమె తండ్రి ఆమె దగ్గరకు వచ్చి నీకు ఇంకో నెల రోజులలో పెళ్లి చేయబోతున్నాం అని చెప్పాడు... అప్పుడు ఆమెకీ ఏం చేయాలో తోచక నేను చదువుకుంటా అని వాళ్ల నాన్న గారితో చెప్పింది.... దానికి ఆ పెద్దమనిషి ఆడపిల్ల అని కూడా చూడకుండా చెంప చెళ్లుమనిపించారు.... నా మాటకి కట్టుబడి ఉండటమే నీకు మంచిది అని చెప్పి వెళ్ళిపోయారు.... పెళ్లి రోజు రానే వచ్చింది.... పెళ్లి కొడుకు చూడటానికి ఒడ్డు పొడవు బాగానే ఉన్నాడు.... పెళ్లి ముస్తాబు అంత…
Read More

సోషల్ మీడియా పరిచయాలు

సోషల్ మీడియా పరిచయాలు ఒకరోజు నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లాను. చాలా కాలం తర్వాత కలిసాం అని ఎంతో ఆనందపడ్డాము. తను చూస్తే చాలా బాధగా అనిపించింది. "ఏంటే అలా ఉన్నావు? కొంచెం నీరసంగా కనిపిస్తున్నావ్ ఏమైంది?" అని అడిగాను. "తను మాత్రం ఏం కాలేదే మొన్నటి వరకు ఒంట్లో బాలేదు అందుకని నీరసంగా ఉన్నా అంతే" అని కవర్ చేసింది. "సరే ఇక నేను వెళతాను" అని కోపంతో చెప్పాను. అంతే తను కన్నీళ్లు పెట్టుకుంది. "ఏంటే ఏం అయింది" అని నేను కంగారుగా అడిగాను. "నాకు సోషల్ మీడియాలో ఒకతను పరిచయం అయ్యాడు. మొదట్లో ఫ్రెండ్స్ గా ఉన్న తరువాత మా మధ్య ప్రేమ ఏర్పడింది. ఆరునెలలు గడిచిపోయాయి. కాలం ఎంతో వేగంగా గడిచిపోయింది. ఒక రోజు మా ఇంటి పక్కన అబ్బాయి కలిస్తే మాట్లాడుతున్నాను అది చూసి నన్ను అనుమానించడం ప్రారంభించాడు. అతను నాకు…
Read More

రైతు గొప్పదనం

రైతు గొప్పదనం "నా దగ్గర ఈ డబ్బే ఉంది మిగతాది నా పంట పండిన తర్వాత కడతాను" అని రిక్వెస్ట్ గా అడుగుతాడు బ్యాంక్ మేనేజర్ ని రైతు. "లోన్ తీసుకున్నప్పుడు లేని బాధ బ్యాంక్ కి ఎందుకు తక్కువ సమయంలో కట్టకపోతున్నారు" అని కోపంగా అడుగుతాడు. "ఈ ఏడాది పంటలు బాగా దెబ్బతిన్నాయి. అందుకే టైంకి డబ్బులు కట్టలేకపోయను" అని చెప్పాడు రైతు. "ఎందుకు ఋణం తీసుకొని పంట పండిస్తున్నారు. ప్రపంచం మారుతుంది. మీరు ఎప్పుడు మారతారు" అని చులకన భావంతో మాట్లాడతాడు. "మీ వల్లే దేశానికి చెడ్డ పేరు వస్తుంది అని ఇంకా ఎన్నో మాటలు మాట్లాడాడు." అప్పుడే మేనేజర్ పై ఆఫీసర్ వచ్చి "మీరు చేస్తుంది ఏమైనా న్యాయంగా ఉందా?" అని అడిగారు మేడం. కొంచం కంగారుగా తడపడుతూ "అది మేడం పంట పండించడం కోసం మా బ్యాంక్ లో ఋణం తీసుకున్నారు. కానీ ఇప్పటివరకు ఒకసారైనా…
Read More

ఒక చీకటి రాత్రి

ఒక చీకటి రాత్రి నాన్నగారి సంవత్సరికం వస్తూ ఉండటం వలన ఊర్లో ఉన్న ఇంటికి వెళ్లి బాగు చేయించాలని రెండు నెలల ముందే అన్ని సర్దుకుని వెళ్ళాం అమ్మ, నేను, బాబు, అటు నుండి అమ్మమ్మ కూడా వచ్చింది. ఇద్దరు తమ్ముళ్ళు వారి ఉద్యోగాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి అన్నీ నేనే చూసుకోవాల్సి వచ్చింది. పొద్దున్నే లేవడం, వంట చేయడం పక్కకు పెట్టుకోవడం ఆ తర్వాత వచ్చిన కూలీలతో పని చేయించడం వాళ్లకి మధ్య మధ్యలో టీ పెట్టి ఇస్తూ ఉంటే వాళ్లు బాగా పని చేస్తారని అనుకుంటూ అది పెంకుటిల్లే కాబట్టి గుణపింకలు కొనుక్కు రావడం అవి పగలకుండా జాగ్రత్తగా ఓ పక్కకు పెట్టడం ఓ పక్కకు బాగు చేయిస్తూ మరో పక్కన మేము ఉండడం జరిగింది. ఇల్లంతా బాగా అయిపోయింది. ఇంకా సంవత్సరికానికి 15 రోజులు ఏమో ఉంది రావలసిన వాళ్ళందరికీ ల్యాండ్ ఫోన్ నుంచి ఫోన్లు చేసి…
Read More