Trending Now

నా రచనలు పూవులు

నా రచనలు పూవులు

నా రచనలు పూవులు నా రచనలు ప్రాణేశ్వరి సిగలో తురుముకునే పూవులు. శతకోటి వీణలలో అంతరంగం పలికే సన్నని రాగాలు.హృదయంలో ఏదో తీయని అలజడి.విరిసిన కలువ పూవులో తేనీయల కోసం తుమ్మెదలు తాపంతో తాపత్రయం. లేత గులాబీ రంగుపూవుల చీరలో మగువ హొయలొలికించే అందాల సురభామిని. వీక్షణళ్ళో వేడెక్కిన యువకులు పాడే ప్రేమ గీతాలు అంజలిలో కుసుమాలు.ఇహలోకం మరచిన భావుకతలో కవి కవనాలు. జనం గొంతుల్లో ఓ వెర్రివాడు కవి సౌందర్యముట్టిపడే గీతాలు. - అపరాజిత్
Read More
తాగి తప్పు చేయకు

తాగి తప్పు చేయకు

తాగి తప్పు చేయకు పల్లవి తాగకురన్నా తప్పు చేయకురన్నా "2వ" తాగిన మైకంలో తప్పులెన్నొచేస్తావు " 2వ" తాగకురన్నా తప్పు చేయకురన్నా "2వ"చరణం తాగి తాగి మత్తెక్కి తడబడుతూ ఉంటావు నడవలేక వణుకుతూ నేల పాకుతుంటావు నడిబజారులో పడుకొని నవ్వులపాలవుతావు చుట్టుమూగి జనమంతా "ఛీ"కొట్టుతుంటారు తాగకురన్నా తప్పు చేయకురన్నాచరణం ఆలివచ్చి ఏడ్చుకుంటు నిన్ను లేపజూస్తుంది ఇంటికొచ్చి బువ్వదిని గమ్ముగుండు మంటుంది డబ్బులిత్తె వత్తానని అక్కడె పడి ఉంటావు ఇంటికి పోదామంటు బ్రతిమిలాడుతుంటది తాగకురన్నా తప్పు చేయకురన్నాచరణం జాలిపడి సాయపడు జనమును తిడుతుంటావు మత్తుదిగి పోవాలని మంచినీళ్ళు చల్లుతుంది బుజ్జగించు భార్యను గని బుద్ధిలేక తిడతావు ఆసరిచ్చి లేపబోతె కసురుకుంటు ఉంటావు తాగకురన్నా తప్పు చేయకురన్నాచరణం డబ్బులకొరకింటికొచ్చి ఇల్లంతా వెతుకుతావు వండుకునే గిన్నెలను తీసుకొన జూస్తావు అడ్డగించు ఆలిని కొట్టి పట్టుకెళతావు అయ్య అవ్వ పేరు జెప్పి అప్పులెన్నొ జేస్తావు తాగకురన్నా తప్పు చేయకురన్నాచరణం ఏమీ తోచక పెండ్లము ఏడుస్తూ వుంటది తిండి…
Read More
మాటల మంత్రాలు…

మాటల మంత్రాలు…

మాటల మంత్రాలు... ఎన్నెన్నో మాటల మంత్రాలు ఈ సృష్టిలో.. కొన్ని గుండెని గుచ్చే తూటలైతే... ఇంకొన్ని ఊరట నిచ్చే తామరలు.. ఇవి ఆప్తులై ఆదుకుంటాయి.. రగిలించే నిప్పు కణికలై యెదనుకోస్తాయి... కొన్ని ధృడమైన బలాన్ని ఇచ్చి ధైర్యం చెపుతాయి.. ఇంకొన్ని బలహీన పరిచి క్షీణింపచేస్తాయి. ఉత్తేజాన్ని కలిగించే ఉద్యమమై నడిపిస్తాయి.. ఉగ్రరూపం దాల్చి ఉనికిని చాటుతాయి.. స్పూర్తి నిచ్చే సూచనలు అవుతాయి ఓదార్పు పంచే అనురాగం అవుతాయి... ప్రేమను అందించే పలకరింపు అవుతాయి అభిరుచులు తెలిపే అభిప్రాయాలు అవుతాయి.. ఉదయించే ఉషస్సు లా మారి కవ్విస్తాయి.. అస్తమించే కిరణంలా మదిని తొలుస్తాయి.. వీటికి అడ్డు, అదుపు, కొలమానం, కొలతలు లేని మాటల బాణాలు.. మనిషిని బతికించే మందులు.. మరణాన్ని సైతం రుచిచూపించే ఆయుధాలు.. బంధాలను కలిపే మనోహరాలు.. భావాలను తెలిపే మదిఉల్లసాలు... బాధలను పెంచుకునే ఊరటలు. జ్ఞాపకాలను తలుచుకునే తీపి మధురాలు... ప్రపంచాన్ని గడగడలాడించే అణుబాంబు లేని వైరస్ లు... లోకాన్ని…
Read More
ఉపవాస దీక్ష

ఉపవాస దీక్ష

ఉపవాస దీక్ష ఉపవాస దీక్ష అంటే ఉప అంటే సగం దీక్ష అంటే దీక్షగా చేసేది. అంటే మనం చేసే ఉపవాస దీక్షను దీక్షగా సంకల్పం చెప్పుకుని చేయాలి. సంకల్పం అంటే మనం ఏ దేవతకు చేస్తున్నామో వారికి తల్లి నా కోరిక ఇది అందుకు నేను ఈ దీక్షను చేస్తున్నాను. నా కోరిక నెరవేర్చు అంటూ చేయాలి. ఇక ఇలా దీక్ష చేయడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. లోపల ఉన్న మలినం అంతా చెమట రూపంలో పోయి శరీరం, ఆత్మ శుద్ది అవుతుంది. ఇది మామూలు భక్తులకు ఆచారాలు, సంప్రదాయాలు పాటించే వారికి. మరి పేదల మాటేమిటి? రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో సగం రోజు లేదా ఒక రోజు అంత కూడా అసలేమీ తినకుండా పస్తులు ఉంటున్న ఆ పేదల కోరికలను భగవంతుడు తీరుస్తాడా? తిర్చడా? తీరిస్తే మరి వారింకా పేదలుగా ఎందుకు ఉన్నారు? ఒక్క పూట…
Read More
మంత్రము

మంత్రము

మంత్రము మాటకు ఎంతో శక్తి ఉంటుంది. మామూలు మాటలుగా మనం అనుకుంటాం కానీ అవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. మాటలు నోట్లోంచి వచ్చేటప్పుడు ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించి మాట్లాడాలి. అయితే కొన్ని సార్లు మనకు తెలియకుండానే మనం మాట్లాడతాం. ఉదాహరణకి ఒక తెలిసిన వ్యక్తి వయసులో పెద్దవాడు ఉన్నాడు అనుకుందాం. అతని గురించి మనకేవరో చెప్పారు. ఏదో విషయం అతని గురించి మాట్లాడుకున్నాం అనుకుందాం ఆ మాటల్లో. అరె అతను ఇంకా ఉన్నాడా అని అంటాం అంటే ఇది కావాలని అనే మాట కాదు మామూలుగా తెలియకుండా వచ్చే మాట కాబట్టి అలా మనం అనుకున్నా తర్వాత వారం రోజుల కే అతను చనిపోయాడు అనుకోండి. అప్పుడు మనకు ఎలా ఉంటుంది. అయ్యో నేను అనడం వల్లనే చనిపోయాడు ఏమో అనే అనుమానం వస్తుంది. మనం మాట్లాడినప్పుడు ఉన్న వారు కూడా నిదెం నోరు రా ఇలా…
Read More
టెన్త్ క్లాస్ లవ్ స్టోరీ

టెన్త్ క్లాస్ లవ్ స్టోరీ

టెన్త్ క్లాస్ లవ్ స్టోరీ నేను ఎదురుచూస్తున్న తన కోసం.. బస్ రానే వచ్చింది.. తనకోసం ఎక్కువ ఎదురుచూడలేకపోయాను.. బస్ దగ్గరకి వెళ్ళి నిల్చున్న.. అందరూ బస్ దిగుతున్నారు.. అందులో మా వాసు సర్ కూడా ఉన్నారు.. తెలుగు పండితులు.. పాఠాలని కథలులా మాకు చెప్పి నాకు తెలుగు పైన అంత మమకారం పెంచారు... ఈరోజు నేను ఇన్ని కథలు, కవితలు రాస్తున్నా అంటే దానికి కారణం మా గురువు గారు మా వాసు సర్.. అలా అందరూ బస్ దిగారు ఒక్క మానస తప్ప.. బాధ వేసింది... ఎంత ఎదురు చూసాను తనని చూడాలని.. కానీ ఇలా నిరాశే మిగులుతుంది అనుకోలేదు... దిగాలుగా క్లాస్ రూమ్ కి వెళ్లి నా బ్యాగ్ అక్కడ పడేసి... యధావిధిగా అసెంబ్లీకి మైక్ సెట్ సిద్ధం చేద్దాం అని స్టేజి పైన ఉన్న... నా చూపులు ఎప్పుడు తనని వెతుకుతూ ఉంటాయి.. తన ఊపిరిని నేను పసిగట్టగలను..…
Read More

గాయం

గాయం బాధను దాచిన మొహానికి నవ్వును అద్ది కిరణాన్ని అడిగాను నీ వెలుగుకు కారణమేమని జీవించాలనే కోరిక అంది ఈసారి నక్షత్రాలను అడిగాను ఆకాశంలో తారలెలా అయ్యారని బతికిన క్షణాలను దాచుకోవటంతో అన్నాయి తేరిపారచూస్తూ ఆకాశాన్నడిగాను తనువంతా శూన్యమేగా, బాధలేదా! మేలుచేసే సూరీడు వెంటే ఉంటే శూన్యమైనా వెలుగు తోటే అంది తనువంతా చీకటి గాయాలని వగచేవేందుకు నన్నడిగాయన్నీ! గాయాలను ఆశతో కడిగేయన్నాయ్ అని ఫక్కున నవ్వాయ్ కలచెదిరింది.. ఉదయం విచ్చుకుంది.. - సి.యస్.రాంబాబు
Read More

ఉపవాస దీక్ష

ఉపవాస దీక్ష వ్యక్తి కి, మానసిక వ్యక్తిత్వానికి మార్పు తీసుకువచ్చే క్రియ, ప్రక్రియ ఈ ఉపవాస దీక్ష.. మనం చాలామంది చాల రకాల ఉపవాస దీక్ష చేస్తుంటారు.... సంకల్పంతో మనోవాంఛ తీరటానికి చేసే విధానం ఈ ఉపవాస దీక్ష... ఎన్ని రకాలుగా చేసినా తిండి తినకుండా నిద్ర లేకుండా చేస్తే దీక్ష చేయటం కన్నా ఒక స్థితికి వచ్చేసరికి మన వల్ల మరొకరిని ఇబ్బంది, బాధ పెట్టే పరిస్థితి వస్తుంది. మన మనోస్థితిలో మార్పు మంచికి వస్తే పరవాలేదు కానీ మార్పు బంధాలు, బంధుత్వాలు దూరం చేసేట్లు వస్తే దీక్ష యొక్క ఫలితం లేదా మన మనోవాంఛ తీరదు, తరగదు. వ్యక్తి గా మన బలం, మనోవ్యక్తిత్వం చేజారిపోకుండా ఎలాంటి ఎటువంటి దీక్ష చేసినా తప్పు లేదు. - సూర్యక్షరాలు
Read More

మాటే మంత్రము

మాటే మంత్రము ప్రపంచంలో మాటలతో పరిష్కరించలేని సమస్య అంటూ లేదు. ప్రపంచ యుద్ధాలు కూడా మంచి మాటలతో కూడిన చర్చల వల్ల నివారించవచ్చు. మరికొన్ని సందర్భాలలో దేశాల మధ్య మన్నన లేని మాటల వల్ల యుద్ధాలు సంభవించవచ్చు. మాట తీరు అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. దానిని ఉపయోగించే విధానాన్ని బట్టి దాని ఫలితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎదుటి వ్యక్తి అంతరంగాన్ని తెలుసుకొని వారి ఆలోచన విధానాన్ని బట్టి మాట్లాడితే పెద్ద సమస్యలకు కూడా గొప్ప పరిష్కార మార్గాలను కనుగొనవచ్చు. ఉదాహరణకు ఎప్పుడో చదివిన ఒక చిన్న కథ చెబుతాను. ఒక స్త్రీ ఆత్మహత్య చేసుకోవడం కోసం ఊరి చివర ఉన్న బావి వైపు ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వస్తోంది. ఆమెను ఆ ప్రయత్నం నుంచి విరమించడానికి దారిన వెళ్లే వాళ్ళందరూ ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక సాధువు ఆమెతో ఇలా అన్నాడు.. "అమ్మాయి జీవితం ఎంతో విలువైనది అది…
Read More

మాటల మంత్రం

మాటల మంత్రం మాటలే మంత్రాలు చూపులే సూత్రాలు అంటారు పెద్దలు మాటల శక్తి చెప్పలేనిది అద్భుతాలను సృష్టిస్థాయి భావాలనుతెలుపుతాయి మనిషి గౌరవాన్ని పెంచుతాయి సంస్కారాన్ని తెలియజేస్తాయి హాస్యాన్ని పండిస్తాయి చమత్కారాన్నికలిగిస్తాయి మాధుర్యాన్ని వలకబోస్తాయి ప్రేమను కురిపిస్తాయి కన్నీళ్లు తెప్పిస్తాయి సమస్యలను సంధిస్తాయి సలహాలుగా మారుతాయి చిరునవ్వు ని చిందిస్తాయి అసూయలను పెంచుతాయి ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి ధైర్యాన్ని పెంచుతాయి బాధల్ని మరిపింపజేస్తాయి సంతృప్తిని కలిగిస్తాయి అనుభవాలను తీసుకొస్తాయి నమ్మకాలు కుదురుతాయి మాటలయుద్ధాలు జరుగుతాయి స్నేహాన్ని పెంచుతాయి అనుభవాన్ని తీసుకొస్తాయి ఆదర్శాలకు మూలమవుతాయి అవకాశాలను అందు కొస్తాయి ఆలోచనలో పడేస్తాయి సంతృప్తి కలగజేస్తాయి ఆశీస్సులు గా మారుతాయి అపార్ధాలకు ఆరంభమవుతాయి విమర్శలుగా మిగులుతాయి మాటల విన్నపమే జీవిత పరిష్కారం అవుతాయి మాటలుమాయచేసి జీవితానికి వన్నెలద్దుతాయి పాఠాలు గుణపాఠాలు నేర్పుతాయి మంచిమాటలు మహా శక్తివంతంగా మారవచ్చు ఎంతైనా మాటలు జాగ్రత్తగా పలకడమే మేలు... - జి జయ
Read More