స్నేహం ఏవో ఊసులాడి ఎన్నో పంచుకొని ఏదో హాయినిచ్చే స్నేహాన్ని తెలుపగలమా అప్రయత్నంగా. అనుకోని దారిన కలిసి నిస్వార్థంగా. ఆపదలో సాయం చేసే స్నేహాన్ని తెలుపగలమా అపార్థ భావనలకు ఈర్ష, ద్వేషాలకు చోటివ్వని దారిలోని స్నేహాన్ని తెలుపగలమా సంతోషం. భరువనిపించే భాదలో అడగకుండానే జత కట్టే అడుగుల్లోని స్నేహాన్ని తెలుపగలమా ధనిక, పేద కులము, మతము భాషా, వేషాలనే గతుకుల్లేని వంతెన స్నేహం. - హనుమంత
స్నేహం
స్నేహం స్నేహం చెరగనిబంధం విశ్వాసానికి నాంది సంతోషాల సారం స్వార్థానికి తావులేనిది కష్టాలను కడతేర్చేది కన్నీటిని తుడిచి పెట్టేది ఆలోచనలు పంచుకునేది అంతరంగానికి అర్థమయ్యేది అనుమానానికి తావులేనిది దాపరికానికి దారిలేనిది కులమతాలకతీతమైనది ఆపదలో నిలబడేది మనసువిప్పి మాట్లాడుకునేది ఆటంకాలను అధికమించేది అవసరాలను గుర్తించేది ఇష్టాలను తెలుసుకునేది జ్ఞాపకాలను దాచుకునేది ఫలితాన్ని ఆశించనిది నిజాయితీని రుజువుచేసేది అందరిని ఆకర్షించేది ఆనందాలను అందించేది మోసానికి చోటు లేనిది బలహీనతలను భద్రపరిచేది బలాన్ని నిరూపించేది సహాయానికి వెనకాడనిది అంతరంగాన్ని అర్థం చేసుకునేది ఇష్టాలను తెలుసుకునేది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేది చిరునవ్వుకు చిరునామాగా నిలిచి నిన్ను నిన్నుగా గుర్తించేది స్నేహమే చెరిగిపోని బంధానికి మధురమైన అనుభూతి....... - జి జయ
స్నేహం
స్నేహం స్నేహమనేది ఓ మధురభావన... స్నేహానికి అవధులు ఉండవు... లింగ బేధాలు అసలే ఉండవు... వెలకట్టలేని బంధం స్నేహం... సృష్టిలో స్వచ్ఛమైనది... భావనల పరంపరకీ ఓ నిధి వంటిది... దేవుడు సృష్టించిన గొప్ప బంధాల్లో స్నేహం ఒకటి... స్నేహం అనిర్వచనీయమైనది... నమ్మిన వ్యక్తికీ నేనున్నాను అంటూ భరోసా ఇచ్చే గొప్ప బంధం స్నేహం... ఓ వ్యక్తి స్నేహం దొరకడం ఓ గొప్ప వరంలాంటిది... అనుభవిస్తేగానీ తెలియదు స్నేహం యొక్క విలువ... నమ్మకానికి స్నేహం అమ్మవంటిది... ౼ గోగుల నారాయణ