allauddin

ఓ.. విశ్వ మానవా

ఓ.. విశ్వ మానవా విశ్వ మానవా... ప్రపంచాన్ని చూస్తున్నావా... భూకంపాలే ప్రకంపాలే చంపుతున్నాయి ఇంకా..... మన మధ్య యుద్దాలెందుకు... బిడ్డల్ని పోగుట్టుకున్న అమ్మల్ని చూస్తే మనసు మరిగి మానవత్వం పెరిగి మతాలు కొట్టుకుపోతున్నాయి మేలుకో.... ఇప్పటికయినా.... దేవుడు మనిషిని భువి పైకి పంపిందే ప్రేమించాడానికి..... కలిసి మెలిసి జీవించు ఎవరు ఎక్కువ తక్కువ ఎవరు అందరం ఒకటే మాన్వాత్వాన్ని ముందుకు తీసుకెళదాం..... ఓ.. విశ్వ మానవా ముందుకు వెళదాం..... - అల్లావుద్దీన్
Read More

సంక్రాంతి ఉదయం

సంక్రాంతి ఉదయం ప్రకృతి ప్రేమ లో పరువళ్ళు త్రోక్కుతూ మకర సంక్రాంతి మసక వన్నెల్లో మనసు మంత్ర ముగ్ద మైన ముగ్గుల రంగుల్లో... వెచ్చని పచ్చని ఉదయం స్వాగతం చెప్పిన వేళలో వసంత గాలి, తాటి చప్పుళ్ళు బసవన్న అమాయకపు ఎదురు చూపు... ఏదో ఇస్తూ.... తీసుకుంటూ.... మౌనంగా మాట్లాడుతుంటే సత్యమే శివమైతే.... అదే సుందరం... కదా... మంచు పొగల్లో.... మెత్తగా మకరాదిత్య కిరణాలు హృద్యంగా పలకరించే.... వసుధ్యేక కుటుంబం లో కల కాలం సుఖ సంతోషాలతో కలిసిఉండాలని దీవిస్తూ.... చిగురించే కొత్త విజయాలను సాధించి ఆస్వాదించాలని ప్రసాధించే ఉదయం... మకర సంక్రాంతి ఉదయం అందుకే పూజ్యులు, పెద్దలు, పిన్నలు స్నేహితులు అందరికి పేరు పేరున మకర సంక్రాంతి హృదయ పూర్వక శుభాకాంక్షలు. - అల్లావుద్దీన్
Read More

మార్పు నిత్య నూతనం

మార్పు నిత్య నూతనం జీవ కణాలు వింతగా చూస్తూ వెన్న లా కరిగి సెలయేటి గల గలలు చేస్తూ ముందా వెనుకా తెలియని కాలాన్ని... లెక్కించే మనసులా మెల్లగా జారుకుంటుంటే ఆశ పడే..... అదే మనసు ఆగుతుందా!!! వెలుగు వసంతాలను ఊరిస్తూ కొత్త సంవత్సరం సుఖ సంతోషాలకు దారి చూపిస్తూ శ్వాస ఒక ప్రభంజనంలా నిశ్వాస ఒక ప్రకంపనంలా పదండి ముందుకు...... పదండి ముందుకు అంటూ ప్రత్యుష ప్రశాంత వెలుగుల్లో.... కొంగ్రొత్త వెలుగుల్లోకి ..... పిలుస్తుంది నూతన సంవత్సరం 2023 పెద్దలకు, పూజ్యులు పిల్లలు, స్నేహితులు మరియు అందరికి పేరు పేరున హృదయ పూర్వక శుభాకాంక్షలు. - అల్లావుద్దీన్
Read More

మనస్విని

మనస్విని హృదయ లయలు వరాలయ్ పాలపుంతల్లో వెదజల్లే పూలలా దొర్లుకు పోతుంటే విజయ రాగాల సప్పుడొస్తదా.... నిశి రాత్రి లో మూగ వేదన ఎవరికి తెలుసు దూరంగా ఉన్నా......ప్రార్ధన తో దేవునికి దెగ్గర గా ఉందాం సాదన చేయాలి విజయాలు వరదలై ఎరుగా పారేలా... మానవత్వంనే మనసులో క్రొవత్తి గా వెలిగించి... విశ్వ శాంతి కొలనులో సేద తీర్చుకొని సూర్యోదయం సృష్టిద్దామా!!! PS: నా ప్రియ గురువు గారు శ్రీ సూర్యనారాయణ గారికి సమర్పిస్తూ.... - అల్లావుద్దీన్
Read More

నిశిరాత్రి

నిశిరాత్రి పూలు దొర్లుకు పోతుంటే సప్పుడొస్తదా నిశి రాత్రి లో మూగ వేదన ఎవరికీ తెలుసు దూరంగా ఉన్నా దేవుడికి దెగ్గర గా ఉంటాం ప్రార్ధన చేయాలి కన్నీళ్లు వరదలై పారగా ఎరుగా మానవత్వం నే మనసులో క్రొవత్తి గా వెలిగించి నిశిరాత్రి అనే శాంతి కొలనులో పాల పొంతల సాక్షి గా సేద తీర్చుకొని సూర్యోదయం సృష్టిద్దామా!!! - అల్లావుద్దీన్
Read More

నా దేశం

నా దేశం జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి.... ఆకాశం నిండా మన భారతీయ జెండా రెప రెప లాడాలి ఎల్లపుడు మన మనసు నిండా ప్రేమ సాగరం.... నా దేశం విశ్వ కుటుంబం... నా దేశం పది వేల సంవత్సరాల సంస్కృతి... నా దేశం శాంతి నిలయం..... నా దేశం చల్లని చక్కని కాల ప్రవాహం..... నా దేశం కోటాను కోట్ల త్యాగ మూర్తుల పోరాట ఫలితం స్వేచ్చ.... స్వాతంత్రాల దేశం.... నా దేశం భారత మాత ఒడి లో స్వేచ్చా శ్వాసలు వెచ్చ వెచ్చగా... పీలుస్తూ..... వజ్ర ఉత్సవాల స్వాతంత్ర సంబరాలు చేసుకుందాం.... ఇంకా ఉందిలే మంచి కాలం ముందు ముందున అంటూ అనుకుంటూ.... ఆరోగ్యంగా.... ఆనందంగా .... కలిసి పోదాం... ముందు తరాలకు ఆదర్శంగా.....మార్గదర్శులం.... అవుదాం ఆనందంగా...... ప్రియమైన పూజ్యులు,మిత్రులు, అందరికి, నా హృదయ పూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. - అల్లావుద్దీన్
Read More

స్నేహమేరా…. జీవితం….

స్నేహమేరా... జీవితం... భావనే నీవైతే భావం నేను భుజం మీద నే వాలి పూల వానలా రాలి నీవుంటే వేరే కనులెందుకు లేకుంటే వేరే బ్రతుకేందుకు మురిపించే మురళి గానం లా బాపు రమణ, కుచేల కృష్ణ లా స్నేహం ఒక భావుకత అయితే నీ లో నేను నా లో నీవు చేయీ చేయీ కలిపి ఓల్గా నది ఇసుక తిన్నల్లో కిన్నరసాని పరువళ్లు లలో పెన్నా నది ఒడ్డున గండి కోట గుండెల్లో ఓ ప్రియ మిత్రమా అని పలకరిస్తే మళ్ళీ మళ్ళీ ఎన్ని సార్లో పులకరించే, పలకరించే స్నేహమా.... అందుకే నీవుంటే వేరే కనులెందుకు అనిపించే దేర్యమా.... స్నేహం రుచి చూపడానికి భువి కి దిగిన భగవంతుని రూపమా.... ఇదే వందనాలు విశ్వం లో వెదజల్లి నా వెన్నెల వందనాలు. స్నేహితుల దినోత్సవం సందర్బంగా అందరికి హృదయ పూర్వక శుభాకాంక్షలు. - అల్లాఉద్దీన్
Read More

వెన్నెల తో మాట

వెన్నెల తో మాట గువ్వనే నేను గూటి లో దాగి నింగి లో వెన్నెల తో మాట కలిపాను సైభీరియా లో స్నేహితుల మంచి మంచు ముంచు సుఖమేనా అని ఎడారి లో ఇసుక ను అడిగావా చందమామ చల్లని వెన్నెల చిన్న పాపలకు చిరు నవ్వు నిచ్చిందా అని అమెజాన్ అడవుల్ని కదల్చి తట్టి మరీ అడిగావా తల్లి దరిత్రి కి స్వచ్ఛమైన శ్వాస నీలా మెల్లగా మెల్లగా వెదజల్లావ అని.... నేనే.... వెన్నెల్లో గూటి గువ్వను చీకట్లో నే ...కాని నా కంటి చూపుకాంతి వెన్నెల్లో విశ్వ శాంతిని చూసింది మరి పగలే వెన్నెల వెలుగు అయితే విశ్వ కాంతిని కంటి చూపుగాచేసి ఓ వన్నెల వెన్నెలా... నీలో నేనై విహారిస్తా - అల్లావుద్దీన్
Read More

నావ

నావ పచ్చ పచ్చని వనము లో విర బూసిన వన కన్య లా అంబరానా వెదజల్లిన వెన్నె లా మల్లెల నురుగు ఒడ్డు నే ముద్దాడేనా నది ప్రవాహం ఎన లేని ప్రేమ లో.... ప్రకృతి పులకరించే....... ఓ మనిషి, జీవితం అనే నావ లో..... ఏటి జలాన్ని వెనక్కి తోసి ఎదురీదే దేర్యం ఉందా... దేవుడే తోడుగా ముందుకె వెళ్ళు మనసు నిండే శాంతి నిచ్చే కలిసి వచ్చే నీడ లా హృదయ దేవత తోడుగా, చేతూడుగా జీవన తరంగాల పై హాయిగా హాయిగా హాయిగా హాయిగా.. - అల్లాఉద్దిన్
Read More

మృధు మధుర మాయ

మృధు మధుర మాయ కొత్త ఆశలు కళ్ళలో మెరిసే పెదవుల చిరు నవ్వే పది వేల కోట్లు.... ఇంత ఆశా భావమా ముఖారావిందం లో.... మది చలించిందా... హృదయ లోయలో పసి పాప అమాయక రూపం శక్తి స్వరూపం.... అవధులు లేని ప్రేమ బింబమే జీవితంలో తన వారి కోసం త్యాగాల ప్రతిబింబమే తానే కదా సత్యం శివ సుందరం అందమే సంతృప్తి అయి మెరిసింది మది లో యదలో.... - అల్లాఉద్దీన్
Read More