archana

ఈ ప్రశ్నకు బదులేది?

ఈ ప్రశ్నకు బదులేది? బాలికా దినోత్సవమంటారు పసికూనలనీ కూడా చూడకుండా నెలల పసి పిల్లల పై కన్నేసి ఆకృత్యాలు చేస్తారు కండలేని చిన్నారులను కండకావరంతో కామంతో కళ్ళు మూసుకుపోయి చెరచి రక్తాలు కారుతున్నా వదలక గొంతు నులిమి చంపేసి గోతి లో పాతి పెడతారు. తొంభై ఏళ్ల ముసలిదైన, పంతొమ్మిది ఏళ్ల పడుచైన ఇరవై తొమ్మిది ఏళ్ల జవ్వని అయినా, ముప్పై తొమ్మిదేళ్ళనా, తొమ్మిది నెలల పసిపాపైన వారి కామాగ్నికి బలై పోవడమే బాలికా దినోత్సవమా స్వతంత్రం అంటూ స్వేచ్ఛ అంటూ సమాన హక్కులంటూ అంతరిక్షంలోకి వెళ్తున్న నవ నాగరిక సమాజంలో నివసిస్తున్న బృణ హత్యలను, ఆపలేనిది బాల్యవివాహాలను ఆపలేనిది పసి పిల్లలపై ఆకృత్యాలను అదుపు చేయలేనిది బాలిక దినోత్సవం అంటారా ? ఈ ప్రశ్నకు బదులేది? - అర్చన
Read More

మది

మది నీ మదిలో చోటిచ్చావు నీ హృదయంలో పదిలపరిచావు నేను నీ దాన్నంటూ మాటలెన్నో చెప్పావు ఎన్నో కథలను కళ్ళ ముందు చూపావు జీవితం నందనవనం అన్నావు మన ప్రేమ అంతం లేనిదంటూ పూల నావలో నడిపించావు కథలెన్నో అల్లావు కదిలి వదిలి వెళ్లావు కాని రానిలోకానికి అదే పూల వానలో కనబడకుండా పోయావు నిశీధిలో నన్ను ఒంటరిగా చేసి నీ దోవన నువ్వెల్లావు నా గురించి ఆలోచించకుండా నా ఆశలు తీరకుండా మన నందనవనం చూడకుండా నీ దోవ నువ్వు చూసుకుంటే ఆ బడబాగ్నిని మోయలేక, మోసే ఓపిక లేక జీవితాన కోరింది రాదని వచ్చింది వెంట ఉండదని అర్థమయ్యే లోపు అంతమయ్యింది జీవితం.... - అర్చన
Read More

ముసుగు

ముసుగు మనుషుల్లో మంచితనం ముసుగు వేసుకున్న రాబంధువులు ఎన్నో వెకిలిగా నవ్వుతూ వెంట పడే వాడొకడు ప్రేమ నటిస్తూ ముంచే వాడొకడు సీటు కింద నుండి కాళ్ళు రాసే వాడొకడు రద్దియైన బస్సులో భుజాలు రాసే వాడొకడు కాలేజీ లో వెంట పడే వాడొకడు బాగున్నావామ్మ అంటూ కన్ను గిటే వాడొకడు ఆటో అద్దం లోంచి చూస్తూ వస్తావా అని అడిగే వాడొకడు, అన్నా అని పిలిచినా చున్ని లాగే వాడొకడు మీ అమ్మాయి బాగా చదువుతుంది అంటూ బుగ్గలు పిండే వాడొకడు, ఆరేళ్ల పసి పాపను ఆడిస్తున్నా అంటూ మీద కి వచ్చే వాడొకడు తాతయ్య నంటూ శరీరాన్ని నలిపే వాడొకడు మీ పాప చాలా తెలివి గలది అంటూ భుజాలు నొక్కే వాడొకడు. ప్రమోషన్ కావాలా అంటూ పళ్ళు ఈకిలించే వాడొకడు జీతం పెంచాలంటే ఇంకేదో ఇవ్వాలనే వాడొకడు ఉద్యోగం కావాలని వస్తె అన్ని పనులూ చేయాలనే వాడొకడు…
Read More

అర్చన

అర్చన రెక్కలు తెగిన ఆశ కూలిపోతుంటే మనసు చేష్టలుడిగి కూలబడింది వర్తమానం వేగుచుక్కని వేలమేసింది నిరాశ కలలన్నీ నిస్సహాయంగా చూసే కథలయ్యాయి కల్పతరువనుకున్న కాలం కాలు దువ్వుతోంది కాలు కదలదు..నోరు మెదపదు జీవితం మదుపులో ఉన్నట్టుంది రిక్త హస్తంలా మస్తిష్కం శూన్య దేవతగ మారింది చుట్టూ బంధనాల్లాంటి కందకాలు విరిసే బాట విధ్వంసమయింది వీరుల ప్రమాణాలన్నీ వీథిన పడ్డాయి వెడలిపోయిన వసంతంలా వడలిపోయిన ఆలోచనలు కల్లోల్లాన్ని కానుక చేస్తుంటే మనసు కుదుర్లను బిగించి శూన్యాన్ని ఆత్మవిశ్వాసంతో అర్చిస్తేకానీ అస్థిరతల పొగమంచును దాటేలాలేను - సి. యస్. రాంబాబు
Read More

బాలల దినోత్సవo

బాలల దినోత్సవo బాలలము మేము బాలలము రేపటి తరo పౌరులం భవిష్యత్తు తరాలకు మేధావులo భావి భారత నిర్మాతలము చాచా నెహ్రూ ముద్దు బిడ్డలం తల్లిదండ్రుల రేపటి ఆశలం కన్నవారి కలలు నిజం చేసే వారసులం ప్రజలకు సేవ చేస్తూ భావి తరాలకు ఆదర్శంగా నిలిచే వాళ్ళం అల్లరి చేస్తూ అందర్నీ అలరించే పిల్లలం అనుకుంటే ఏదైనా చేసే అల్లరి పిడుగులo బుద్ధిగా చదివి తల్లిదండ్రుల పేరు నిలబెట్టే దివ్య జ్యోతులం ... బాలలము మేము బాలలము రేపటి తరం పౌరలం... మా పండగ నేడు మాదే పండగ అల్లరల్లరి చేయక బుద్దిగా ఉంటాం దేశానికి వన్నె తెచ్చే భావి తారలం మేము - అర్చన
Read More

నిన్ను చేరని

నిన్ను చేరని నా గెలుపు కోసం నా సుఖం కోసం నా సంతోషం కోసం నా ఆశలు నెరవేరాలని కోరుకుంటూ నా కోసం ఎన్నో త్యాగాలు చేసి, నాకంటూ ఒక ఉనికిని ఏర్పరిచి, నా గెలుపు లో భాగమై , నా ప్రతి కదలికలో తోడువై నిన్ను నీవు మరచి, నాకోసం శ్రమిస్తూ నిన్ను నువ్వు పట్టించుకోకుండా నాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నీ వద్దకు ... ఇదిగో వస్తున్నా... నేను గెలిచాను అంటూ నా గెలుపును చూపాలని, నా ఆశ నెరవేరిందని అంటూ గెలుపు గుర్రాలపై నిను చేరాలని పరుగులు తీస్తూ వస్తున్నా నేనీ ఉదయానా... - అర్చన
Read More

నీ తోడు కోసం

నీ తోడు కోసం నీ మాట వినిపించని క్షణానా నీ నవ్వు కనిపించని క్షణనా నీ రూపాన్ని మదిలో దాచుకుని నీ మాటలన్నీ ప్రోగు చేసుకుంటూ నీ పలుకులన్ని మననం చేస్తూ నీలో నన్ను చూసుకుంటూ నాలో ఉన్న నిన్ను, నీలో ఉన్న నా కోసం నీ మాటల కోసం నీ తలపుల నావ నాలోనా ప్రవశింపగా నే వేచి చూస్తున్నా నీ కోసం నీ తోడు కోసం... - అర్చన 
Read More

సఖి

సఖి చెలీ నీలో నన్ను కలుపుకుని నాలోని స్నేహ మాధుర్యాన్ని నింపి నీతో ఉన్న సమయాన్ని అంతా గుర్తుగా దాచుకునేలా చేసి ఎన్నో అనుభూతులు నింపి నాతో సాగుమా నేస్తమా అంటూ నాలో అలజడి రేపుతూ ఎన్నో జ్ఞాపకాల దారుల్లో నిన్ను ఇప్పటికీ ఎప్పటికీ తలుచుకునేలా చేసి కాస్త సమయం చిక్కగానే కనుమరుగై పోయావే ... ఏటు పోతివే నా సఖీ... - అర్చన
Read More

ఓటమి

ఓటమి చదువుకునే చదువులో ఓటమి, రాసే పరీక్షలో ఓటమి, తల్లికి కూతురిగా ఓటమి, తండ్రికి ముద్దుల పాప గా ఓటమి, తమ్ముడికి మార్గనిర్దేశం చేసే అక్కగా ఓటమి, పెళ్లయ్యాక భార్యగా ఓటమి, భర్తకు స్నేహితురాలిగా, అత్తకు కూతురిగా, మామకు తగ్గ కోడలిగా, మరిది కి హితురాలిగా, ఆడపడుచు అక్కగా, బిడ్డకు తల్లిగా, ఇలా ప్రతి దానిలో ఓటమే నాది, అయినా నాది ఓటమి అని ఒప్పుకోను నేను, ఎందుకంటే..... తప్పు నాది కాదు అంటాను అప్పటి నా మానసిక స్థితిది, అప్పటి నా వయస్సు లేమి, అప్పటి నా పరిస్థితులు అని నేను గట్టిగా చెప్పగలను... నిజం కూడా అదే... - అర్చన
Read More

తేడా

తేడా సృష్టికి జీవం పోసినది రెండక్షరాల పదం అమ్మ అంటూ పెద్ద పదాలు కాకుండా అమ్మ అని పిలిస్తే ఎంత రాత్రి అయినా ఏమైంది బిడ్డా అంటూ లేచి వచ్చేది తల్లి మాత్రమే. ప్రతి అమ్మాయి పెళ్ళి అయ్యాక తల్లిగా మారిన క్షణం నుండి బాధ్యతను పెంచుకుంటూ, బిడ్డను కాపాడుతూ చెడు దార్లో వెళ్లకుండా మంచి మార్గాన్ని సూచిస్తుంది. కానీ తల్లి బిడ్డను కనగలదు కానీ వారి రతాను కనలేదు. బిడ్డ కు అన్ని మంచి మాటలే చెప్తుంది. కానీ పుట్టిన ప్రతి బిడ్డ. మంచి దార్లో వెళ్ళాలని లేదు. స్నేహాల వళ్ళో, వేరే విషయాల వల్ల లెడ్ a చెడు అలవాట్లు వల్లనో ఒక్కొక్కరు ఒక్కో విధంగా వారి రాత ను రాసుకోవడం  జరుగుతుంది అని అనుకుని వుంటే  దానికి ఆ  తల్లెం చేయదు . కానీ ఎవడో ఒకడు తప్పు చేయగానే తల్లి పెంపకం బాగా లేదంటూ నిందలు…
Read More