ప్రేమ లోకం అంటే?
ప్రేమ లోకం అంటే? లోకం లో ప్రేమ అనేది ఎక్కడా లేదు. స్వార్థం తప్ప, ఎక్కడ చూసినా స్వార్థమైన ప్రేమ తప్ప మంచి మనసున్న ప్రేమ ఎక్కడా లేదు. రకరకాల ప్రేమలు రంగు పులుముకున్నాయి. ఒకవేళ నిజంగా ప్రేమ లోకం అంటే ఎలా ఉంటుందో అనే ఊహా తో రాస్తున్న.... ప్రేమ లోకం లో ఒకరిని ఒకరు దూషిoచుకోరు. ప్రేమ లోకం లో ఒకరి పై మరొకరికి అంతులేని ప్రేమ ఉంటుంది. ఆ లోకం లో ఎలాంటి భేషజాలు ఉండవు. ఎలాంటి కక్షలు, కార్పణ్యాలు ఉండవు. ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఆప్యాయత, అనురాగాలు కలగలిపి ఉంటుంది. డబ్బు కోసం ఒకర్ని ఒకరు చంపుకోవడం ఉండదు. సాటి మనిషిని ప్రేమ తో చూస్తారు. మనిషి మనుగడ కోసం ఎవర్నీ అణచి వేయడానికి చూడరు. అందంగా ఉంటుంది ఆ లోకం. సప్త వర్ణాల కలయికగా, ఏడేడు లోకాలకు ఆదర్శంగా నిలుస్తుంది. అంతటి…