bhavya charu

తల్లిదండ్రులను గౌరవించాలి

తల్లిదండ్రులను గౌరవించాలి   తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు పుట్టనేమి! వాడు గిట్టనేమి! పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ !   కన్నవారికి విలువ ఇవ్వని వాడు పుట్టిన ఒక్కటే చచ్చినా ఒకటే అని పై పద్యం యొక్క తాత్పర్యం. పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అందరూ ఒకే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను గౌరవీస్తూ వారి మాటలకు కట్టుబడి వారు చెప్పినట్టు చేయడమే తమ పనిగా భావిస్తూ వచ్చారు. ఏ పని చెయ్యాలన్నా తల్లిదండ్రులతో చర్చించి వారికి గౌరవమిచ్చి వారు చెప్పినట్టే చేస్తూ వచ్చారు. తల్లిదండ్రులు అంటే ప్రత్యేక గుర్తింపు దైవంలా భావించేవారు. వారు చూసిన అమ్మాయిలను పెళ్ళిళ్ళు చేసుకుని, వారికి అత్యంత గౌరవం ఇచ్చేవారు. వారిలో ఏమైనా గొడవలు, అలకలు ఉన్నా కూర్చుని మాట్లాడుకుని వారిలో వారు సర్దుబాటు చేసుకునేవారు. తప్ప ఇంటి గడప కూడా దాటనిచ్చేవారు కాదు. ఇళ్లలో అన్నదమ్ముల గొడవలు, తోటి కోడళ్ళ గొడవలు ఏవైనా…
Read More

సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి సంబరాలు చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళింట్లో పండగ నెల రోజుల ముందు ఉంది అనగానే బియ్యం ఆరబోసి, ఇసురాల్లతో కాస్త పచ్చి ఆరక ముందే వాటిని ఇసిరి పిండి చేసేవారు. దానికోసం ఒకరింటికి ఒకరు సహాయంగా వెళ్ళేవారు. అలా వాడకట్టులో అందరికీ సాయం చేశాక పిండిని ఆరబెట్టి ముందుగా ఆరబెట్టిన వారింటికి పక్కింటి వాళ్ళు సహాయానికి వచ్చేవారు. ఇదంతా ఎందుకంటే సకినాలు చేయడానికి... మరి అవే పెద్ద వంటకాలు ఆ రోజుల్లో ఒక్కొక్కరు పది కిలోల వరకు చేసుకునేవారు. అప్పట్లో అడ్డెడు, మానేడు అనే కొలతలు ఉండేవి. అలా కాల్చుకుని పిండి తడిపి, అందర్నీ పిలిచేవారు. తాతయ్య వాడని ధోతి ఒకటి నీటిలో తడిపి ఈత చాపపై పరిచి ముందుగా మా నాన్నమ్మ బొట్టు పెట్టుకుని అందరికీ బొట్టు, పసుపు ఇచ్చి గౌరమ్మను చేసేది పిండితో దానికి పసుపు, కుంకుమ పెట్టి పూజించి ముందుగా దాని చుట్టూ అయిదు సకినాలు…
Read More

బాలికా దినోత్సవ అశుభాకాంక్షలతో

బాలికా దినోత్సవ అశుభాకాంక్షలతో అదొక పెద్ద గురుకులం అందులో వెయ్యి కి పైగా ఆడపిల్లలు చదువుకుంటున్నారు. అందులోనే హాస్టల్ వసతి కూడా కల్పించింది ప్రభుత్వం గిరిజన ఆడపిల్లలు ఖచ్చితంగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో. పేరుకే అది గురుకులం కానీ అక్కడ సరియైన ఉద్యోగులు, వంటవాళ్ళు తక్కువే... వసతులు తక్కువే అయినా తమ పిల్లలు బాగా చదవాలంటే అవన్నీ చూడకుండా సర్డుకొమ్మని తల్లిదండ్రులు చెప్పడం వల్ల ఆ బాలికలకు కూడా చదువంటే ఉన్న ఇష్టంతో ఏమి లేకపోయినా కూడా అన్నిటికీ సర్దుకుపోతూ చదవడమే ధ్యేయంగా ఉంటున్నారు. ఉడికి ఉడకని అన్నం, పురుగులు పట్టిన పప్పు, మురిగిపోయిన కూరగాయలతో ముద్దగా అయిన అన్నం గొంతు దిగక పోయినా కూడా దిగమింగుతూ చదువుకోవాలనే తపనతో కష్టం అయినా ఇష్టంగానే చదువుతున్నారు. చలికి గజగజ వణుకుతున్నా, వర్షానికి పై కప్పులు కురుస్తున్నా, చాలి చాలని దుప్పట్లు ఇచ్చినా, ఎలాగో సర్దుకుంటూ, ఇంటి దగ్గర అయితే ఈ మాత్రం తిండి…
Read More

పుస్తక జ్ఞానం – లోక జ్ఞానం

పుస్తక జ్ఞానం - లోక జ్ఞానం తరుణ్ వరుణ్ ఇద్దరూ ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు. ఇద్దరివి పక్కపక్క ఇళ్ళే, ఇద్దరూ చాలా తెలివిమంతులు. తరుణ్ వాళ్ళ నాన్నగారు బ్యాంకు మేనేజర్ అవడంతో తరుణ్ని తనలాగే బ్యాంకు మేనేజర్ గా చేయించాలని ఎప్పుడూ చదువుకోమంటూ ప్రొద్దున ఆరు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రకరకాల ట్యూషన్స్ పెట్టించేవారు. తరుణ్ కి ఆడుకోవడానికి అసలు సమయం ఉండేదే కాదు. ఇక వరుణ్ విషయానికి వస్తే వరుణ్ వాళ్ళ నాన్నగారు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినా వరుణ్ ని ఎప్పుడు చదువుకోమని అనగా చూడలేదు ఈ విషయం తరుణ్ వాళ్ళ నాన్నగారికి ఏమాత్రం నచ్చేది కాదు. అప్పుడప్పుడు వరుణ్ వాళ్ళ నాన్నగారిని మండలిస్తూ ఉండేవాడు పిల్లలకి చదువు చాలా ముఖ్యం. మీరు మీ వాడిని సరిగ్గా పెంచడం లేదు వాడికి ట్యూషన్స్ పెట్టించండి 24 గంటలు గ్రౌండ్ లోనే ఆడుకుంటూ ఉంటాడు…
Read More

నిలకడ లేని మనుషులు

నిలకడ లేని మనుషులు ఈ మధ్యన స్నేహితుడు బిటెక్ పాస్ అయ్యాడు. వాడిని మంచి కంపెనీ ఆఫర్ ఇచ్చి మరీ తీసుకుంటాను అంటూ ముందుకు వచ్చింది కానీ వాడు మాత్రం నేను వ్యాపారం చేస్తాను అంటూ వ్యాపారంలోకి దిగాడు. కానీ అక్కడ కూడా కొన్ని రోజులు నిలబడలేకపోయాడు. వ్యాపారానికి పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. ఆరు నెలల వ్యాపారం చేసి ఆ తర్వాత తన వల్ల కాదని చేతులెత్తేశాడు.. ఈలోపు మళ్లీ అదే కంపెనీ మేము మీకు ఆఫర్ ఇస్తాం అంటూ మళ్ళీ వాడిని పిలిచింది అప్పుడు కూడా వీడు వెళ్లకుండా నేను వేరే కోర్సులు నేర్చుకుంటాను లేదా అమెరికా వెళ్తాను అంటూ హంగామా చేసి అమెరికా వెళ్లడానికి ప్రయత్నం చేశాడు వీసా లో ఏదో పొరపాటు వచ్చింది వెళ్ళకుండానే వెనక్కి వచ్చాడు. ఆ తర్వాత నాకు వ్యవసాయం అంటే ఇష్టం అంటూ వాళ్ళ నాన్నగారి చేత బలవంతంగా పొలం కొనిపించి…
Read More

ఓ నాన్న

ఓ నాన్న భారమంతా మోస్తావు, పైకి మాత్రం నవ్వుతూ ఉంటావు , నలుగురిలో ఒకరిగా కలుస్తావు అందరికీ ప్రేమను పంచుతావు అందరితో బాగుంటేనే మంచిదని అంటావు అందరూ నా వాళ్ళే అనుకుంటావు కానీ సొంతవారే మోసం చేశారని తెలిస్తే ఓ నవ్వు నవ్వి నా వారే కదా, తెలియక చేసారంటావు, బాధ్యతలన్నీ మోసి కనపడకుండా వెళ్లావు కన్నీళ్ళను గుండెల్లో దాచవు కారు మబ్బులు కమ్ముతున్న గుండె ధైర్యం తో బతికావు ఇలాగే బ్రతకాలంటూ దారి చూపుతూ, దాటి వెళ్ళావు... ఓ నాన్న నీ జ్ఞాపకాలను నిన్నూ మరవగలమా..   - భవ్యచారు
Read More

నిజానికి నిందలెక్కువ

నిజానికి నిందలెక్కువ ఈ మధ్య ఒక సోషల్ మీడియా లో ఒక ఆవిడ పరిచయమైంది. ఆమెకు అంతకుముందు ఒక ఫ్రెండ్ ఉండేవాడట అతనికి ఇంకో ఫ్రెండ్ ఉండేదట. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న విషయం అతను ఆమెకి చెప్పాడు అతను ఆమె కన్నా చిన్నవాడు కాబట్టి తన ఫ్యామిలీ గురించి తన సమస్యల గురించి చెప్పుకున్నారు. ఆమె కూడా అతన్ని ఒక స్నేహితుడు లాగా భావించి తన కుటుంబ సమస్యలు కూడా చెప్పుకుంది. వాళ్ల పరిచయం అలా సాగుతూ ఉండగా అంతకుముందు మాట్లాడే ఆవిడకి ఈ విషయం తెలిసింది అప్పుడు ఆవిడ అతనితో నువ్వు ఆమెతో మాట్లాడకు నువ్వు నాతోనే మాట్లాడాలి అంటూ కండిషన్స్ పెట్టడం మొదలుపెట్టింది. ఇలా కండిషన్స్ పెట్టడానికి ఆమె అతని భార్య కాదు ఇంకొకరి భార్య ఆమెకి పిల్లలు ఉన్నారు అతనికి పిల్లలు ఉన్నారు. స్నేహితుల భావించే ఆమెకి కూడా పిల్లలు ఉన్నారు. వీరి పరిచయం మూడేళ్ల వరకు సాగింది…
Read More

మనిషికి మరో గ్రహంలో చోటు దొరికితే

మనిషికి మరో గ్రహంలో చోటు దొరికితే అబ్బో ఇదేంటి ఇలా ఉంది. అమ్మ అక్కడ అరె ఎవరూ కనిపించడం లేదేంటి, హా నేనేంటి అక్కడ కనిపిస్తున్న అదేంటి అలా ఉంది. అరెరే నా మాటలు నాకే వినిపిస్తున్నాయి ఏంటి. వామ్మో ఇలా మాట్లాడితే నా లోపల ఉన్న భావాలన్నీ బయటకు తెలిస్తే అమ్మో అయ్యో రామ ఇవి కూడా వినిపిస్తున్నాయి ఏంటిది బీప్ అంటూ సౌండ్ వస్తుంది. నీకు ఆకలి వేస్తుంది. ఇదిగో టాబ్లెట్లు తీసుకో అంటూ ఒక రోబో వచ్చి టాబ్లెట్లు ఇచ్చింది. ఇదేంటి నువ్వు ఎవరు అంటూ అడిగాను నేనా నేనేరా మీ అమ్మను గుర్తుపట్టడం లేదా అంటూ అంది ఆ రోబో, ఏంటి నువ్వు మా అమ్మవా నీకేమైనా పిచ్చి పట్టిందా మా అమ్మ నాలాగే ఉంటుంది అన్నాను. ఇదిగో కావాలంటే మీ నాన్నని అడుగు నేనే మీ అమ్మ ఏమండీ చెప్పండి వీడికి నేను వీడు…
Read More

పేరు లేని బంధం

పేరు లేని బంధం అన్ని మంచి విషయాలు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది. జీవితం అంటేనే ఒడిదుడుకుల ప్రయాణం. అలాంటి సమయం లో నాకున్న ఏకైక బంధం నాన్న. నాన్న అనారోగ్య సమస్యల వల్ల ఆయన్ని కోల్పోవాల్సి వచ్చింది. నాన్న చేసేది చిన్న ఉద్యోగమే, ఆస్తులు కూడా లేవు. అమ్మకు ఇల్లు తప్ప వేరే ఏమి తెలియదు. అన్ని చూడాల్సింది నేనే. ఊర్లో ఉన్న పెద్ద మనుషులు తలా కాస్త చెయ్యి వేయడంతో నాన్న అంతక్రియలు నిర్వహించారు. ఆ తర్వాతే మొదలైంది అసలు సమస్య. ఇల్లు ఎలా గడవాలి అన్నది ఆ సమస్య ఇది లేని వారికి పెద్ద సమస్య అయితే ఉన్నవారికి చాలా చిన్న సమస్య అసలు సమస్య కాదు. ఇక ఇంటిని అమ్మని చూసుకోవడానికి నేనే పెద్దదిక్కు కాబట్టి ఉన్న ఊర్లో ఆస్తులు ఏమీ లేవు ఉన్నదొక ఇల్లు అమ్మను ఒక దాన్ని వదిలి వెళ్ళలేక తనని…
Read More

విధి వంచిత విలాప విచిత్రం

విధి వంచిత విలాప విచిత్రం ప్రేమని గుడ్డిగా నమ్మింది నమ్మిన వాడి వెంట గుడ్డిగా నడిచింది కొన్నాళ్లు సంసారం సాఫీగా సాగింది ఆ తర్వాతే మొదలైంది అసలు సమస్య నీది తక్కువ కులం అందుకే తక్కువ బుద్ధులు అంటూ చీటికిమాటికి గొడవలు పడుతూ కొడుతూ తిడుతూ నీతో నాకేమీ లాభం లేదు నా కులం దాన్ని చేసుకున్నా కట్నం వచ్చేది అంటూ అటు ఇటు కాని స్థితిలో వదిలేసి వెళ్లాడు ఏం చేయాలో అర్థం కాక కన్నవారికి మొహం చూపించలేక బ్రతికే దారి తెలియక చేసుకుందామన్నా ఏ పనికి దొరకని పరిస్థితిలో చుట్టూ కాకుండా మృగాలు పొడుస్తుంటే కానరాని చీకటిలో పరిఎత్తుతున్న తనని కాపాడింది ఒక దేవత దేవత అనుకునే లోపు దయ్యంలా మారి ఆమె జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకుంటూ ఆమెని నిర్ధాక్షిణ్యంగా అమ్మేసింది అంగట్లో బొమ్మలా మారింది ఆ క్షణం ఆమె చచ్చిపోయింది. వచ్చేవాడు పోయేవాడు గిల్లే వాడు…
Read More