c s rambabu

మౌనముని

మౌనముని పోరాటం అతనికి కొత్తేమీ కాదు తీరని ఆరాటాలను చూసి తీరికగా నవ్వుతుంటాడు తీరం చేరని జీవితాల కథ అలాగే ఉంటుందంటాడు పేదరికమే అతని ఆస్తి దాన్ని కాపాడుతూ కొడుక్కు పంచాడు మూడుపూటల భోజనాన్ని కలగంటుంటాడు కలతీరలేదు కానీ నడుమొంగిపోయింది అలా అని దిగులు చెందాడా బతుకుబాటకు కొత్త దారులు వేయటం మానడు అక్షరం విలువ తెలియదు కానీ జీవితం విలువ తెలుసతనికి కర్మను నమ్ముతాడో లేదో కాళ్లు చేతులే అతనికి ప్రత్యక్ష దైవాలు ఆకలిని అభిషేంచాలంటే శ్రమను తాకట్టుపెట్టాలని తెలుసు కాబట్టే ఇల్లిల్లూ తిరుగుతాడు కానీ దేహీ అనడు అతనికి ఆత్మ గౌరవమే చేతికర్రలా తోడుంటుంది కంటిచూపే దారిచూపే నేస్తం అతని పాదాలు నేలతో సంభాషిస్తుంటే ఆశే ముచ్చటపడి ఈ మౌనముని కి తోడవుతుంది (ఫొటో కర్టెసీ: ఆకుల మల్లేశ్వరరావు) - సి. యస్. రాంబాబు
Read More

నడకే నాదం

నడకే నాదం వేసేయ్ నాలుగడుగులు వీచే గాలితో నాలుగు ముచ్చట్లు రుచికోరే నాలుకకు నాలుగు కాఫీ చుక్కలు చేసేయ్ ఉదయంతో జ్ఞాపకాల కవాతు రోజంతా మనుషులతో కుస్తీ వేకువతో విరబూసే దోస్తీ అనుభవాల గల్లీలో అనుభూతుల గస్తీ అదే మన ఆస్తి కదా నిస్సార జీవితాన ఉదయమో కలల కాసారం వేకువలోకి ప్రయాణం శరీరానికో కానుక కినుక వహించక నడకే నాదంగా సాగాలోయ్ - సి. యస్. రాంబాబు
Read More

అలజడుల స్మృతి గీతాలు

అలజడుల స్మృతి గీతాలు గజల్ గాయనిగా జ్యోతిర్మయి మళ్ల మనకు సుపరిచితులు. కవితాత్మక కథనంతో బాల్య స్మృతులుగా కొద్ది కాలం కితం ఆవిష్కరించిన వారు ఇటీవలే కథల పుస్తకాన్ని వెలువరించారు. మొత్తం పదిహేను కథలుంటే వాటిలో ఎనిమిది కథలు రోజుకూలీల జీవితాల కష్టాలను, కడగండ్లను చూపుతాయి. భావం, శైలిలకు సమన్వయం కుదిరితే ఆ కథ మంచి కథవుతుందంటారు విమర్శకులు. ఆ సమన్వయం చాలా కథలలో కనిపిస్తుంది. చెమటచుక్కలను సిరా చేసి రాసినట్టనిపించే కథలివి. ఎక్కువ కథల్లో వృద్ధుల వెతలు కనిపిస్తాయి. అందుకు కారణం నిరాశ్రయులయిన ఎందరో పెద్దవారిని తమ తల్లి ఆశ్రయమిచ్చిందని, వారి వెతలే కథలుగా ప్రాణం పోసుకున్నాయంటారు రచయిత్రి. శ్రీకాకుళం యాస తీయగా పలకరిస్తుందీ కథలలో. మోతాదుకు మించిన నాటకీయత, సినిమాటిక్ మలుపులు లేకుండా సహజంగా కథలివి.కథల్లోని పాత్రలతో మనమూ ట్రావెల్ చేస్తాం. మొక్కజొన్న పొత్తులు కొంటామేమోనని ఎదురు చూసే మనుషులు రైల్వే క్రాసింగ్ ల వద్ద, బస్టాండ్ల్లోను తారసపడుతుంటారు.…
Read More

సీనియర్ సిటిజన్

సీనియర్ సిటిజన్ రిటైర్మెంట్ పెద్దరికమిస్తుందని ఈ మధ్యే తెలుసుకున్నాడు సీతారాముడు. మనుషులందు రకరకములు కలరు అని తెలుసుకున్నాడు. ఓహో రిటైరయ్యారా అని అడిగేవాళ్ళు, జాలిగా చూసేవారు, జెలసీతో చూసేవారు (వీళ్లు ఆఫీసు బాపతు) ఇలాంటి నానాజాతి సమితి చూపులు అలవాటయిపోయాయి. అయితే మనవాడు. టంఛనుగా తలకు రంగేస్తాడు. నలగని బట్టల నిగనిగలతో టకాపీతో మెరిసిపోతుంటాడు. "మీరు సీనియర్ సిటిజన్ అయారు మర్చిపోకండి " భార్యామణి చురక చురుక్కుమంటుంటే చిరచరలాడుతుంటాడు సీతారాముడు. ఈమధ్యే ఇల్లు మారాడు మనవాడు. ఎక్కడికి వెళ్లాలన్నా మెట్రో లో వెళ్ళటం అలవాటు చేసుకున్నాడు. హైదరాబాద్ అందాలను ఆస్వాదించటం నేర్చుకున్నాడు. సీనియర్ సిటిజన్ కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయించారని తెలిశాక మహదానందపడి వెతుక్కుంటూ వెళ్ళాడు మెట్రో ప్రయాణంలో. ఆ సీట్లన్నీ నిండిపోయిన్నాయి. చెరువులో పద్మాల్లా ఒకరిద్దరు సీనియర్ సిటిజన్లు ఉన్నారు. ముగ్గురు, నలుగురు స్టూడెంట్స్ ఆ సీట్లలో కూచోటంతో కోపం నషాళానికంటుకుంది తన ముందున్న మరో సీనియర్ సిటిజన్ ని…
Read More

420

420 తనింకా యూత్ అని ఫీలయిపోతూ చిన్న వాళ్ళతో కలిసి పోతుంటాడు సీతారాముడు. యంగ్ జనరేషన్ తో ఎక్కువ కాలం గడపాలని ఆతని కోరిక. సాయంత్రం పూట కాఫీ తాగడానికి తన బ్యాంకు పక్కనే ఉన్న తాజ్ మహల్ హోటల్ కి రోజూ వస్తూ ఉంటాడు. ఆ సాయంత్రమూ అలానే వచ్చాడు. "హలో అంకుల్ " పక్కింటి పున్నారావు కొడుకు వినాశ్ పిలుస్తూ కనిపించాడు. ఆ యంగ్ తరంగం పిలుపుకు ఫిదా అయిపోయి అటెళ్ళాడు సీతారాముడు "ఏం చేస్తున్నావమ్మా" "బ్యాంకు ఎగ్జామ్స్ ప్రిపేరవుతున్నా అంకుల్" "నైస్" వీళ్లు మాటల్లో ఉండగానే టీ తెచ్చాడు బేరర్. "ఓహో నువు చెప్పేశావా. బేరర్ నాకో కాఫీ" తన ఆర్డర్ చెప్పేశాడు. "ఏమిటోయ్ విశేషాలు క్రికెట్ చూస్తుంటావా విరాట్ ను టీంలో ఉంచాలంటావా! పంత్ ఓపెనర్ కరెక్టేనా! సీతారామం చూశావా భలే తీశాడయ్యా.." ఇలా క్రికెట్ నుంచి సినిమాల వరకు తన పరిజ్ఞానాన్ని ప్రకటిస్తూ బేరర్…
Read More

ఏది నిజం

ఏది నిజం ఇంకో యాభై ఇవ్వండంటున్న ఆటో డ్రైవర్ వంక చురచుర చూసి ఓ ఇరవై చేతిలో పెట్టి లక్డీకాపూల్ స్టేషను మెట్లెక్కసాగాను. మెట్రో స్టేషను కు ఒకవైపు మెట్లు ఒకవైపు ఎస్కలేటర్, లిఫ్ట్ఇంకోవైపు ఉండటం వలన కొంత లాభం. నడిచే దూరం తగ్గుతుందనుకుంటే కొంత నష్టం. మెట్లెక్కాలి. తప్పదు. అలా మెట్లెక్కుతుంటే ఓ పెద్దాయన రైలింగ్ పట్టుకొని ఆగి ఆగి ఎక్కుతున్నాడు. అయ్యయ్యో అనుకుంటూ చేయి పట్టుకొని నడిపించాను. చూస్తే కొంచెం అయోమయంగా కనిపించాడు. ఆయనెందుకో నా వెంటే వస్తుంటే చెప్పొద్దూ కాస్త ఇబ్బంది అనిపించింది. ఫోన్ పే పని చేయకపోవటంతో టికెట్ కౌంటర్ వైపే వెళుతుంటే నా వెంటే వచ్చాడాయన. కౌంటర్ లో  మియాపూర్ కు టికెట్ అడిగాను. ఆ పెద్దాయన అలాగే నిలబడ్డాడు. కౌంటర్ కుర్రాడు అడుగుతున్నాడు టికెట్ ఎక్కడికి ఇమ్మంటారని. తెలుగు అర్థం కాలేదని ఈసారి హిందీలో అడిగాడు. "ఎల్. బి. నగర్" అని అలాగే…
Read More

ముసిరిన చీకట్లు

ముసిరిన చీకట్లు ఖాళీ అయిన సభావేదికలా చిక్కని చీకటి అంతుచిక్కని తత్వవేత్త అంతేలేని ఆకాశంలో పొడిచే చుక్కలు ఆకుదాచిన వానచినుకులై మురిపిస్తుంటాయి వంటరితనానికి జ్ఞాపకాల దుస్తులేసి చీకటి ముద్దు చేస్తుంటుంది కాలం జారిపోతుంటుంది ఆలోచనలన్నింటిని దండచేసి మనసును దండించే ప్రియ శత్రువు చీకటి స్పర్శ చల్లగా తాకుతుంటే వెళ్లిపోయిన అమ్మ వళ్ళంతా తడిమినట్టుంటుంది - సి. యస్. రాంబాబు
Read More

డిజిటల్ ధర్మం – కథానిక

డిజిటల్ ధర్మం - కథానిక "సర్, బిల్లు నూటఏభై రూపాయలయింది కార్డా, క్యాషిస్తారా" కౌంటర్ కుర్రాడడిగాడు. "ఫోన్ పే చెయ్యొచ్చా" అడిగాను. మాట్లాడకుండా స్కానర్ ముందుకు తోశాడు. స్కాన్ తిరుగుతోంది. రెండు నిముషాలు దాటిపోయింది. మనీ డిడక్ట్ అవలేదు. "సార్, నేను రిజెక్ట్ ఆప్షన్ పెట్టాను. ఇక ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్. మీరు క్యాష్ పే చేయండి" నా ఫోన్ నంబర్ ను బిల్ తో జతచేసి చేతిలో పెట్టాడు. "ఒకవేళ తరవాత మనీ డిడక్టయితేనో" నా అనుమానాన్ని వ్యక్తపరచాను. "అవ్వదు సార్" తడుముకోని సమాధానం మొహాన్ని తాకింది. అనుమానంగానే ఐదొందలు చేతిలో పెట్టాను. చిల్లరతోపాటు మందుల కవర్ ముందుకు తోశాడు. ఈ మియాపూర్ లో అంతా మాయే అనుకున్నాను. ఆ మెడికల్ షాప్ ఒక బ్రాండెడ్ చెయిన్ ది. అందుకేనేమో జనం కూడా గొడవ చేయకుండా క్యూలో నిలబడ్డారు. నేనెక్కువ సేపు టైం తీసుకోవటంతో నెమ్మదిగా రుసరుసలు మొదలయ్యాయి. అక్కడనుండి…
Read More

మధ్యతరగతి జీవి

మధ్యతరగతి జీవి మబ్బులు మనసులు విహారాన్ని ఆపనంటాయి మౌనం ఆలోచనను ఎగరేస్తే మాట నిష్టూరాన్ని వదుల్చుకోలేకపోతుంది పాట పరవశాన్ని చుట్టుకుంటే అక్షరం సృజనలో ఇమిడిపోతుంది ఆకలి అవమానాన్ని దిగమింగితే అసమానత పోరాటాన్ని దించుతుంది వైరుధ్యాలన్నీ లాగటం మనిషికి కొత్తేమీ కాదు కానీ సాగక కొన్ని,మనసాగక మరికొన్ని మోహమాటపెడుతుంటాయి ఉన్నవాడు ఉన్నది చాలక లేనివాడు దారే తోచక కలలకు పాలిష్ చేస్తుంటే మొహందాచుకోలేని మధ్య తరగతి జీవి మాత్రం జీవితం నుంచి పారిపోతుంటాడు - సి. యస్. రాంబాబు
Read More

స్నేహపరిమళం

స్నేహపరిమళం ప్రయత్నిస్తే దొరకదు ప్రతిఘటిస్తే ఉండదు ప్రతిధ్వనించే స్వరమై పలకరించాలంటే హృదయం పులకించాలంటుంది జీవితాన్ని తడిమి వేదనలను తరిమి వాదనలను పొదిగి త్యాగాన్ని నిలిపే స్నేహం నిత్యమై నిలిచేటి సత్యం దాపరికాలొద్దని రాచరికాలొద్దని పరాచికమై పరవశమై సురభిళ పరిమళమై వ్యాపించేదే స్నేహం మిత్రులకు మైత్రీదినోత్సవ శుభాకాంక్షలతో - సి. యస్. రాంబాబు
Read More