c s rambabu

విహారం

విహారం వంటరి ఆకాశాన్ని ఈదే విహంగం ఆశను మోసే సారంగం విను వీధుల విహారియై ఊపిరి పోసుకుంటుంది రేపటి ధ్యాస లేదు నిన్నటి చింతా లేదు నేటి పలుకై రాగాలు పోతుంది భవిష్యత్తు బెంగున్న మనదేమో దిగులు విహారం - సి. యస్. రాంబాబు
Read More

ఊరట ఏదీ?

ఊరట ఏదీ? ఎవరో నిశ్శబ్దాన్ని మీటినట్టు మౌనం మూతి బిగించుకుందక్కడ దూరంగా కదిలే నల్లమబ్బు ఆలోచనల కేన్వాసుపై అనుభవాలను గీస్తోంది చెట్టు పుట్ట తమ ఏకాంతాన్ని సంబరం చేసుకుంటున్నాయి మిణుకుమనే లైట్లు ఆరిపోతున్న ఆశల్ని వెలిగించాలని తాపత్రయం లో ఉన్నాయి మౌనం, ఏకాంతం లేని మనిషెంత దురదృష్టవంతుడు జనసందోహం చిక్కుముడుల సందేహమై దిగాలుపడుతుంటే దేహబాధకు మందేసే దృశ్యాన్ని వెతికే మనసుకు ఊరట ఏదీ? - సి. యస్. రాంబాబు
Read More

కాస్త చెబుతారూ!

కాస్త చెబుతారూ! "ఏమండీ వీటిల్లో బెండకాయలేవీ. మీరు కొనటం చూశాను." పక్కనే బాంబు పడ్డట్టు ఉలిక్కిపడ్డాడు రామారావు. ఇల్లు మారి నెల రోజులవలేదింకా భార్యామణి పోరు పడలేక శుక్రవారం కూరగాయల సంతకొచ్చాడు భార్యతో సహా. ఇలాంటి సంతలు ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట జరుగుతుంటాయి. పాతిల్లున్న ఏరియాలో ఆ బరువంతా రామారావే మోసేవాడు. రెండుసార్లు ఫోన్ పోయాక తనకచ్చిరాలేదని ఇలాంటి వీక్లీ కూరగాయల సంతకు పోవడం మానేసి మోర్ లోనే వన్స్ మోర్ అనుకుంటూ తెచ్చేస్తున్నాడు. అలాంటిదివాళ భార్యామణిని తోడు తీసుకుని బయల్దేరాడు, కానీ దృష్టంతా సెల్ ఫోన్ కాపాడుకోవటమ్మీదే.. భార్యమణి ఉత్సాహం గమనించి నవ్వుకున్నాడు, ఎంతకాలమీ సంబరం అనుకుంటూ.. కొన్న కూరలకు డబ్బులు వీలుంటే ఫోన్ పే లేకుంటే క్యాష్ తో చెల్లిస్తున్నాడు. మొదటిసారి కాబట్టి ఈ ఉత్సాహముంటుంది, రెండువారాలు పోతే మళ్ళీ నేను  పడాల్సిందే ఈ తిప్పలు అనుకున్నాడు. కూరలు బేరమంతా భార్యే చేస్తోంది. ఒక్క బెండకాయలు మాత్రం రామారావు…
Read More

నమ్మకం – కథ

నమ్మకం - కథ అర్జంట్ పనిమీద అమీర్ పేట వెళదామని మియాపూర్ మెట్రో స్టేషను కు వచ్చాను. మెట్రో రైలు ప్లాట్ఫామ్ లోకి వస్తోంది ట్రైనప్పుడే. స్టార్టింగ్ పాయింట్ కావటంతో సీటు ఈజీగానే దొరికింది. ఒక నలభైఏళ్ల నడి వయస్కుడు నావంక తేరిపార చూస్తున్నాడు. కొంచెం ఇబ్బంది గా కదిలాను. నా ఇబ్బంది గమనించినట్టున్నాడు. తాత్సారం చేయకుండా విషయంలో కి వచ్చేశాడు. "మీరు ప్రసాద్ అంకుల్ కదా!" అంటూ నా రెస్పాన్స్ కోసం చూశాడు. "నన్ను గుర్తుపట్టలేదా! మోహన్ ని. మా బాబాయ్ వెంకట్రావు మీరు కొలీగ్స్ బి. హెచ్.ఇ.ఎల్ లో గుర్తుకొచ్చారా మీకు ఆయన!" "ఆ..ఆ..గుర్తుకొచ్చారు" ఆలోచిస్తూనే అన్నాను. వెంకట్రావు ఎందుకు గుర్తులేడు. రోజూ మాట్లాడుకుంటూనే ఉంటాం. ఇతను ఎవరు! తెలీకుండానే మనసు లెక్కలేస్తోంది.. "అంకుల్ ఒకసారి మిమ్మల్ని నేను, అక్కడ కీర్తి మహల్ హోటల్ దగ్గర కలిశాను గుర్తుందా!" కీర్తి మహల్ అనగానే నా బుర్ర కోటికాంతులు వెలుగుతాయి.…
Read More

కవి చిరునవ్వు

కవి చిరునవ్వు కీబోర్డు మీద నర్తించాలని వేళ్ళు ఉబలాట పడుతు భావాల తోడును వెతుకుతుంటాయి భావాలన్నీ ముడుచుకొని అలిగినట్టున్నాయి ఆలోచనలేమో పోస్టింగ్ కోసం ఎదురుచూసే అధికారిలా దీనంగా ఉన్నాయి కవితయినా వచనమయినా వేదన తప్పదు మస్తిష్కాన్ని వేధిస్తాం కానీ హృదయం స్పందించాలిగా ఎటుచూసినా వ్యధలు వధ్యశిలపై అమాయకులు అధోగతిలో అధోజగత్ సోదరులు గడ్డకట్టిన హృదయ స్పందన అందుకే హృదయాన్ని బతిమాలు కుంటున్నాను ఎగసిపడే నీ కవాటాలు నాకు అక్షర కపోతాలంటూ దయతలచి లబ్ డబ్ లను డీ కోడ్ చేసుకోమంటుంది డీకోడ్ అయిన భావాలన్నీ ఆలోచన మత్తడి దాటి అక్షరాల్లో ప్రవేశించగా కీబోర్డు కదులుతుంది కవి తనతో తాను చేసే యుద్ధమే అతని కవితా ప్రసవవేదన మనీని వదిలి మనిషిగా మిగిలినవాడే ఆ వేదనకు చిరునవ్వుతో చేరువవుతాడు - సి.యస్.రాంబాబు
Read More

సందేహాల మబ్బు

సందేహాల మబ్బు తమ తేజస్సు పంచుతామంటున్నాయి మేఘాలు మనిషి మేకవన్నె పులని తెలీక! తేనీరులా వనరులను సేవించే వాడికి ఆకాశమొక్కటే మిగిలింది మొక్కుతూనే మోసాల దారులు వెతుకుతుంటాడు! వేటువేసే కాలం ఉపేక్షిస్తుందా ఆపేక్షగా ఆదరిస్తుందా సందేహాల మబ్బులు తరుముతుంటే కిసుక్కుమంటూ సమాధానాన్ని తలలో తురుముకుంది ఎదురుగా ఉన్న చెట్టు! - సి. యస్. రాంబాబు
Read More

సరిచేసేదెవ్వరు!

సరిచేసేదెవ్వరు! నిజాల నీడల్లా నల్ల మబ్బులు భయంగొలుపుతుంటాయి చినుకు తడిపిన నేలేమో చిలిపిగా నవ్వుతుంటుంది జీవితమూ అంతే నిరాశలోంచి ఆశను మొలిపిస్తుంది చిక్కుముడులు వేస్తుంది ఏడిపించి మరీ విప్పదీస్తుంది అంతేకదా అనుకుంటుంటే దూరంగా వినిపిస్తుంటాయి ఆకలి ప్రపంచం ఆర్తనాదాలు జాలిగా చూసే నిరాశల నీలి నీడలు సమతుల్యం లేక ప్రకృతి సమభావన లేక మనిషి ప్రమాదంలో పడిన వేళ విధ్వంసాల లోయనుంచి లాగేదెవ్వరు! సరిచేసేదెవ్వరు! - సి. యస్. రాంబాబు
Read More

కలలసాగు

కలలసాగు వర్ణ రాగరంజితమై జీవితం వెలగాలనుకుంటాడతను వేపుకుతిన్న క్షణాల సాక్షిగా వేడుకను వెతుకుతుంటాడు వలపుమాయ డబ్బు మాయ అధికారహంకారం నా అనుకున్నవాళ్ళందరి దగ్గర చూసేశాడు ఎదిగామనుకున్నారు ఎగిరిపోయారంటాడు అందరికీ దూరంగా నదీగమనాన్ని చూస్తూనో ఏటిపాట వింటూనో తనలోకి తాను ప్రయాణిద్దామనుకుంటాడు పాడు జీవితం పట్టి ఆపేస్తుందంటాడు కాడెద్దులా బాధ్యతల బండిని లాగేవాడికి శాంతెక్కడ.. విశ్రాంతెక్కడ అంటాడు అందుకే ఆకాశం కప్పుకింద సంతోషాల మగ్గం నేస్తుంటాడు మగ్గుతున్న నిరాశను విడుదల చేస్తుంటాడు జారే వాన నీటిబొట్టులో కలలసాగు చేస్తుంటాడు - సి. యస్. రాంబాబు
Read More

ఉనికి

ఉనికి నీలికిరణాలతో నులివెచ్చని వెలుగుతో వచ్చేశాయొచ్చేశాయి మేఘరాజాలు స్తంభించిన జీవనం సంకెళ్ళు వీడాయి విచ్చుకుంటూ ఉదయం మళ్లీ నవ్వటం మొదలెట్టింది! తెలివి నేర్చిన మనిషి తేడాలను తట్టుకోలేడు కానీ తేడాలను సృష్టిస్తాడు కాలమందుకే తన ఉనికిని గుర్తుచేస్తూ ఉంటుంది - సి యస్ రాంబాబు
Read More

జనగోస

జనగోస దిగులు పడిన ఆకాశం శోకధారలా ఉంది వాన చినుకై నేలను ముంచేసింది ఎటుచూసినా నీటి బీభత్సమే ఎక్కడయ్యా భానుడా నీకోసం జగతి ఎదురుచూపుల అమ్మలా మారి బిడ్డా నువ్వెక్కడంటోంది ఉగ్రరూపమై ఏరులు రుద్రమ్మలై నీటిఖడ్గాలను దూస్తుంటే పోటెత్తుతూ నదులు జనజీవనంపై జలప్రళయంతో విలయతాండవమాడుతున్నాయి వానొచ్చినా దుఃఖమే రాకున్నా దుఃఖమే రైతుకు అన్న నానుడి లిఖించాడేమో విధాత అన్నదాతకు ఆరనిమంటైందీ వాన సూరీడా..మారేడా.. నువ్వలిగితే గుండె పగిలేనిక్కడ నిక్కమైన సత్యమే నీవు దయచూపి వెలుగివ్వు జనగోస వినవయ్య భానుడా..రావయ్య మా దేవుడా.. - సి. యస్. రాంబాబు
Read More