g jaya aksharalipi

వెన్నెల రాత్రులు

వెన్నెల రాత్రులు నిండు పున్నమి వెన్నెల హాయి గొలుపుతూ ఆహ్వానించింది మది నిండుగా వెండికొండల మెరుపులుగా బింబమై ప్రతి బింభమై నీటిలో నిన్నే చూస్తూ అందానికి చందమామవై వెలిగిపోతున్న రూపం నది వొడ్డున నగిషీలు వెన్నెల రాత్రులు చందమామ బంతిని తెచ్చి పెట్టిన రీతిలో నిన్నుచూసిన కనులకు నిజమైన అనుభూతి ఆహా వెన్నెలంతా చల్లని వెలుగులా...... - జి జయ  
Read More

డియర్

డియర్ ఈ రోజు ఈ అంశం మీద కాకుండా వేరేది రాయలేను ఈ రోజు నా డియర్ 4వ సంవత్సరికం చాలా బాధగా వుంది చెప్పడానికి.     ఎందుకంటే మా అమ్మ తర్వాత ఆమె నాకు మార్గదర్శి ఇంకా సహణశీలి ఆమె. నేను అంటే ఆమెకు చాలా ఇష్టం నాకు ఆమె అంటే గౌరవం అంతే ఆమెకు కూతురు లేదు. ఆమెను నేను అర్ధంచేసుకున్నాను నన్ను ఆమె నన్ను ఆదరించింది. ఆమెకి నేను రెండవ కోడలు. డియర్ అంటే మా అత్తగారు నేను అత్తయ్య అంటాను. మా కూతురు వాళ్ళ నానమ్మని డియర్ అని పేరు పెట్టింది అప్పటినుండి నన్ను మీ డియర్ ఎం చేస్తుంది అని అంటూ వుండేది. ఎందుకే అలా అంటావ్ అంటే మీ అత్త కదా అమ్మ అంటూ ఉంటుంది. 28 ఏళ్ల లో ఆమె నేను ఒక్క మాట కూడా అనుకోని బాధ పడ్డ సంఘటనలు…
Read More

మజిలీ

మజిలీ నా మజిలీ ల ప్రయాణం నీ కంటే ముందే వేచిన అరుణోదయాన్ని అబ్బా దీనికోసమే ఎదురుచూపు శ్రుతి కలిపిన లోయ లైనా పలికే చిరుగాలైనా ఎక్కే ఏ మెట్టు అయినా నిను చూసే ఆశా కిరణం నీ లక్ష్యం నిన్ను నిలిపింది నిండు గా నీ ముందు తలుపు తెరచింది అదిగో అదిగదిగో - జి జయ
Read More

అపూర్వ రామాయణం

అపూర్వ రామాయణం విలువ కట్టలేని అరుదైన సందేశాలు సాటిలేని చరిత్రలు రామాయణం అపూర్వ గ్రంధం రాముడి వ్యక్తిత్వం అపూర్వం దశరథ రాముడి తండ్రీ కొడుకుల సంబంధం అపూర్వం అయోధ్య నగరం అపురూప కట్టడము రామ లక్ష్మణులు అపూర్వ సహోదరులు సీతా రాముల బంధం అపూర్వ అనుబంధం రాముడి విలువిద్య అపూర్వ నైపుణ్యం రాముడి త్యాగము అపూర్వ ఆదర్శం హనుమత్ రామ సాన్నిహిత్యం అపూర్వం రాముడికి ఉడుత సహాయం అపూర్వం ఆహాల్య శాపం అపూర్వ గాథ సీతమ్మ అన్వేషణ అపూర్వ విజ్ఞానం రావణ సంహారం ఒక అపూర్వ ఘట్టం త్రేతా యుగం ఒక అపూర్వ కాలం రామాయణం అపూర్వ కాల మాన పరిస్థితులకు శాసనాలు .... - జి జయ
Read More

పాపం పసివాళ్ళు

పాపం పసివాళ్ళు పాపం పసివాళ్లు అనేదానికన్నా సమాజపు దుస్థితి అంటే బావుంటుంది బాలకార్మిక వ్యవస్థను రద్దు చేసినా ఎన్ని చట్టాలు తెచ్చినా ఎన్ని సంఘాలు వచ్చినా పూర్తిగా నిర్మూలన కావటం లేదు దానికి కారణం. నిరక్షరాస్యత ఆకలి బాధ లింగ వివక్షలు, ప్రభుత్వాల పనితనం, చట్టాల అవగాహన కలిగి వుండడము ఉపాధి అవకాశాలు, ప్రజల ఆర్థిక స్థితి గతులు, అన్నింటిపై ఆధారపడి వుంటుంది . ముఖ్యంగా జీవన విధానం విద్య ఉద్యోగం ప్రత్యక్ష నిదర్శనం కొన్ని దేశాల్లో ఆకలి కేకలు తప్పడం లేదు ప్రతి దినం బ్రతకడానికి పోరాటం తప్పనిసరి కాని కనీస ఆదాయ మార్గాలు లేక పిల్లలు వలస కూలీలుగా మారుతున్నారు శారీరక మానసిక పరిపక్వత లేకుండా వారు విద్యకు దూరంగా ఉండటం వలన వారిలోని నైపుణ్యాలు బయట పడక వారిలో అత్యధికులు వివిధ వృత్తులలో రానించరు ప్రతిభ బయట పడే అవకాశాలు తక్కువ అదే బాలలు నిర్మాణ రంగం…
Read More

మౌనం

మౌనం మనసు పలికే మౌన గీతం మౌనం అర్ద అంగీకారం అంటారు పెద్దలు. మౌనం ఒక మూగ భాష మౌనం ఒక ధర్మ సందేహం మౌనం ఒక ఆవేదన మౌనం ఒక ఆరాధన మౌనం ఒక ఆవేదన మౌనం ఒక సంఘర్షణ మౌనం ఒక నొప్పించే బాధ మౌనం ఒక కొట్టని దెబ్బ మౌనం ఒక వ్యధ మౌనం ఒక హెచ్చరిక మౌనం ఒక సన్నద్ధత మౌనం ఒక తెలుపని యుద్దం మౌనం ఒక తెలిపే నిరసన మౌనం ఒక చప్పుడు లేని అడుగులు మౌనం ఒకఎదుటివారికి శిక్ష మౌనం ఒక ఆపిన వేగం మౌనం ఒక పరిణామం మౌనం ఒక సందేశం మౌనం ఒక ప్రతిస్పందన మౌనం ఒక ఆలోచనల సుడిగుండం మౌనం ఒక దీక్ష మౌనం ఒక ప్రార్థన మౌనం ఒక సన్నద్ధత మౌనం ఒక సత్య శోధన మౌనం ఒక తెలుపని భావాల రూపం . మౌనం…
Read More

చేదు

చేదు చేదు అనగానే గుర్తు వచ్చేది వేప చెట్టు . ముక్కోటి దేవతలు ఒక్క చెట్టులో వుంటారు అని అంటారు. అదే వేప చెట్టు చేదుకు ఒక ప్రత్యేకత ఉంది చేదు అనుభవాలతో తీయని అనుభూతులు అందుతాయి అందరికి . మా వేప చెట్టు కథ చేదు అంటే వేప అంటారు కానీ మా వేపచెట్టు మాత్రం నాకు తీపి కన్నా ఎక్కువ విలువ కలది . చల్లని గాలి నిచ్చింది సేద తీరే వారికి హాయి నిచ్చింది. ఆరోగ్యానికి నేస్తంలా వుంది డాక్టర్ అవసరం లేకుండా కాపాడింది. పండగల రోజులు అందరికి పూతనిచ్చింది చెట్టు కింద వనభోజనాలు చేసేము ఇంటికి అందాన్నిచ్చింది బంధువుల మన్నన పొందింది పక్షుల కిల కిలా రావాలను వినిపించింది మా పిల్లలకు చెట్టు నీడన ఆటలు ఇచ్చింది . అమ్మతల్లి అయినవాల్లకి పొత్తిలి అయింది . పల్లుతోముకోడానికి పుల్ల అయింది. వాహనాలు పెట్టడానికి నీడ అయింది…
Read More

పండు వెన్నెల

పండు వెన్నెల పండు వెన్నెల లాంటిది ఆడపిల్ల అందం అంటారు వెన్నలను వర్ణించడానికి పదాలు సరిపోవు కాని పండువెన్నల ను చూడాలన్నా పాత రోజుల పల్లెటూళ్ళ కు వెళ్లాల్సిందే పల్లెటూరి అందాలల్ పున్నమి జాబిలి చెప్పాల్సిందే . ఇప్పటి విద్యుత్ కాంతుల వెలుగులు లేవు కాని గుడ్డు దీపాల వెలుతరు వెన్నలరోజులకోసం ఎదురు చూపులు దీపాలలో నూనె పోయకున్న చిమ్మెలు తుడవక పోయినా వెన్నెల రోజుల్లో పనిలేదు అందులోనూ ఎండాకాలంలో చల్లదనం కోసం ఆరుబయటే అన్ని పనులు నిజంగా చెప్పాలంటే ఆ రోజులు అనుభవిస్తే గాని తెలియదు దాని తియ్య ధనం . పసి ప్రాయపు ఆటలు మనసుకు హత్తకునేలా కల్మషం లేని మనుషులు చెంత చేరే జీవరాసులు పశు పక్ష్యాదులు మూగ జీవాలు ఎండాకాలం ప్రతికొమ్మ ఆకురాల్చి పూత సంతరించు కొని ఆహ్లాదాన్ని పంచుతాయి ఆ అందాలు అనుబంధాలు వేరే రోజులు కరెంటు లేని రోజులు పండు వెన్నల కోసం…
Read More

తియ్యదనం

తియ్యదనం పండగరోజు పరమాన్నం ప్రతి శుభ సందర్భం తీపి తోనే మొదలుపెడతాం ఉగాది పచ్చడి విశిష్టత షడ్రుచుల సమ్మేళనం జీవన సారం భావాల కలయిక ల తో ముడిపడి వుంది. ప్రతి రోజు కు అన్వయించి చూసుకోవచ్చు. తియ్యదనం విశిష్టత అంత మరి శాంతికి చిహ్నం గా వుంటుంది. తీపి నే అమృత తుల్యమైన ఆహారంగా తీసుకోవడం మన ఆచార వ్యవహారాల లో భాగం సత్వగుణ లక్షణాలు ఉంటాయి తియ్య దనంలో . మనసు ప్రశాంతినిస్తుంది మానసిక అలజడిని సానుకూల పరుస్తుంది . కాలానుగుణంగా ఋతువులు రుచులు మారుతూ వుంటాయి మన సంస్కృతి లో భాగంగా తీపి కి ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంది . అన్ని వేడుకల్లో చక్కర బెల్లం తో తయారు చేసిన వంటకాలు చేసుకుంటారు . జీవన విధానాన్ని అనుకూలంగా మారుతుంటాయి. ముందు తరాలవారికి పండగలు వారధిగా మారుతాయి. - జి జయ
Read More

తపన

తపన మనిషి జీవితం మాయా ద్వీపం కాదు దేవుడు ప్రత్యక్షమై కోరుకున్నది ఇవ్వడానికి తపన లేనిదే ఏది సాధ్యం కాదు తపనను తూచి మరీ ఫలితం కనిపిస్తుంది మట్టిలో మాణిక్యం అని వూరికే అంటారా మరి ఆ ప్రయత్నం వెనుక తపన తల్లి తండ్రులు మార్గం చూపాలని తపన ఆపన్నహస్తం అందించాలని మానవతావాది తపన ఆటల్లో రాణించాలని ఆటగాళ్ళ వొరవడి తపన గాయకులు మాధుర్యాన్ని పండించాలని తపన అందాల మేడలు కట్టాలని ఇంజనీర్ల తపన సందేశాన్ని ఇవ్వడానికి శాసన కర్తల తపన కదిలేప్రపంచాన్ని చూపడానికి కళాకారుల తపన పోయే ప్రాణం నిలపడానికి వైద్యుల తపన ఊహకందని విషయాల కోసం శాస్త్ర వేత్తల తపన చావు పుట్టుకల మర్మమేమిటి అని సన్యాసి తపన భగవంతుని లీలలు ఏమిటో అని భక్తుడి తపన ఈ తరం ఇలా జీవిస్తుంది అంటే జ్ఞాన కోవిదులు వెలుగు పూవులు పూయించడమే నిత్య ప్రయత్నంతో నిరంతర సాధనతో తపన…
Read More