jokes

హాస్యానందం!

హాస్యానందం! జంధ్యాల గారు కొన్నాళ్ళు ఆంధ్ర ప్రభ లో "జంధ్యా మారుతం " అన్న శీర్షిక నిర్వహించేవారు అందులో పాఠకుల ప్రశ్నలకి విట్టీ గా సమాధానం ఇచ్చేవారు.. అందులో ఒక పాఠకురాలి ప్రశ్న : - జంధ్యాల గారూ! మామూలుగా మగవాళ్ళు "నా భార్య" అనీ, ఆడవాళ్ళు " మా ఆయన " అని అంటూంటారు కదా!! మరి మగవాళ్ళు " మా భార్య " అని ఆడవాళ్ళు " నా ఆయన" అని ఎందుకనరు ??? దానికి జంధ్యాల గారి సమాధానం: - ఎందుకనరూ!! పరభాష వాళ్ళు తెలుగు మాట్లడేప్పుడు అంటూ ఉంటారు.. 1985 వ ప్రాంతంలో నేను, గాయకులు బాలసుబ్రమణ్యం గారు, ప్రముఖ హైప్నోటిస్ట్ బి.వి పట్టాభిరాం గారు మరి కొందరం అమెరికా వెళ్ళాం.. మేము దిగిన ఇంటాయన అరవాయన.. ఆయన, ఆయన భార్య ఉద్యోగానికి వెళుతూ - నేను, మన పెండ్లాం పనికి పూడుస్తా ఉండాం.. ఫుడ్…
Read More

జోక్ – దోమ – లీగల్ పాయింట్

జోక్ - దోమ - లీగల్ పాయింట్   మొదటి దోమ: ఈ భూమిమీద పుట్టిన ప్రతీ జీవికి బ్రతికే హక్కుంది గదా! రెండవదోమ: అవును. మొదటి దోమ: మరి మనకెందుకు లేదు! గుడ్డుకూడా వుండకూడదని నాశనంచేయటానికి పరిశోధనలు చేస్తున్నారు! రెండవడోమ: మనం వీళ్ళని పీక్కుతింటాం అందుకని. మొదటి దోమ: మరి మేన్ ఈటర్స్ అయిన సింహాలు, పులులు ఇవి కూడా పీక్కు తింటాయి గదా మరి అవి హాయిగా బ్రతకటానికి అడవులకు అడవులే వదిలేస్తున్నారు! రెండవదోమ: ఏమో! నాకు తెలియదు. - రమణ బొమ్మకంటి
Read More

జోక్

వడ్లగింజలో బియ్యపుగింజ 2వ భాగం (మర్నాడు) భర్త : ఈవేళ చాలా ప్రశాంతంగా వుంది. భార్య: నాకు కూడా చాలా ప్రశాంతంగా వుంది. భర్త : ఏమోయ్! కాఫీ తీసుకురావోయ్! మరి భార్య కాఫీ యిస్తూ, భార్య: అడవి మృగాలేక్కడైనా కాఫీ తాగుతాయా! భర్త :అడవి మనుషు లిస్తే తాగుతాయ్! భార్య : హహహ!  భర్త : హాహాహా! - రమణ బొమ్మకంటి 
Read More

వడ్ల గింజలో బియ్యపు గింజ

వడ్ల గింజలో బియ్యపు గింజ   భార్య : భార్య భర్తలన్నాక ఏవో చిన్న చిన్న కీచులాటలు పొట్లాటలు ఎవరి అహం వారు నిలబెట్టుకోవాలనే తాపత్రయంలో వస్తుంటాయి గదా! అది సహజమేగదా!వడ్ల గింజలో బియ్యపు గింజ. చివరికి అంతే అని మనకు తెలుసు. కాని చిలికి చిలికి గాలివాన అయినట్లు కొంతమంది కోర్టులకి కూడా పోతూ వుంటారు ఇది అసహజం గదా!                  కాబట్టి,ఇకనుంచి నా అహం మీరు నిలపెట్టటానికి  ప్రయత్నించండి,నేను మీ అహం నిల పెట్టటానికి  ప్రయత్నిస్తాను ఇంక ఏ గొడవలు వుండవు.ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకొందాం!ఏ చీకు చింత  లేకుండా ప్రశాంతంగా ఉందాం! భర్త : నీ ఉపన్యాసం బాగుంది.కాని ను          వ్వేదోఒకటి అంటూ ఉంటావు, ప్రశాంతంగా           ఉండనివ్వవుగ దా!  భార్య : మీరే ఎదో…
Read More

నాథ నాదం

నాథ నాదం భర్త (వికటకవి) :  ద్వారంబులు మూస్తిని,                        కపిలంబు ఇంట జొచ్చ. భార్య (కవయిత్రి) : నాకు లేని భయంబు,                        నీ కేల నాథా.                        భరించునది భర్త యనియా? భర్త : పీల కపిలంబు నొక్కటి,          నా కలలో జొచ్చె నిన్న రాతిరి.          కనులార నిండిన నా నిద్ర          గాంచెన్ దాన్ని తేరిపార.          భయము నాది,          దాని పీలత్వం యందు.      …
Read More

జోక్ – నవ్వోస్తేనే నవ్వండి

జోక్ - నవ్వోస్తేనే నవ్వండి వధువు తరపు వాళ్ళు : టిఫిన్ చేసి వెల్దురుగాని వుండండి! వరుని తరపు వాళ్ళు : ఆ!ఎందుకు లెండి కతికితే అతకదంటారు! వధువు తరపు వాళ్ళు : అందుకేగా టిఫిన్ చేసి వెళ్ళమనేది! - రమణ బొమ్మకంటి  
Read More