meghamala

ఇల్లాలు జీవితం

ఇల్లాలు జీవితం ఇల్లాలు ఇంటికి దీపం అంటారు... కానీ ఇల్లాలు జీవితంలో ఎలాంటి వెలుగు ఉండదు.. ప్రతీ రోజూ, ప్రతీ క్షణం తను తన కుటుంబం కోసం బతకాలే కానీ తన గురించి ఏ రోజూ తను ఆలోచించదు. బరువు, బాధ్యత కలిగిన ఆమె జీవితం.. పిల్లలు, భర్త, అత్త, మామలతోనే సాగిస్తూ ఉంటుంది.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కూడా పొందదు.. ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి ఆమె ప్రతి పనిలోనూ తను ఎంతో ఓర్పు, సహనం పాటిస్తూ ఉంటుంది.. తనకు ఉన్ననెర్పరితనంతో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటుంది ఇల్లాలు.. ఇంట్లో సంతోషాల పండగ ఇల్లాలి ఆనందంతోనే మొదలు... కానీ ఇల్లాలు ఎప్పుడూ ఆ వంటింటికి మాత్రమే పరిమితం. అందరి అవసరాలు తీర్చే యంత్రంలా తనని తాను మార్చుకుంటుంది. అందరి సంతోషాల కోసం తన సంతోషాన్ని త్యాగం చేస్తుంది.. చివరికి తనకంటూ ఆ ఇంట్లో ఒక స్థానం ఉంది అని మర్చిపోతుంది...…
Read More

ఆమె

ఆమె ఆమెకి 18 యేళ్లు అప్పుడే తన ఇంటర్ చదువు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చింది... అప్పటివరకు తన స్నేహితులతో సంతోషంగా ఉన్న ఆమె.. ఇంటికి రాగానే తన జీవితమే మారిపోయింది అన్నట్టు ఉండేది... ఎందుకంటే ఆమె నవ్వినా, చూసినా, ఏడ్చిన ఆఖరికి ఏ పని చేసినా ఆమె తల్లిదండ్రులు పరువు పోతుంది అని ఆమె సంతోషాలను దూరం చేసేవారు.... ఒకరోజు ఆమె తండ్రి ఆమె దగ్గరకు వచ్చి నీకు ఇంకో నెల రోజులలో పెళ్లి చేయబోతున్నాం అని చెప్పాడు... అప్పుడు ఆమెకీ ఏం చేయాలో తోచక నేను చదువుకుంటా అని వాళ్ల నాన్న గారితో చెప్పింది.... దానికి ఆ పెద్దమనిషి ఆడపిల్ల అని కూడా చూడకుండా చెంప చెళ్లుమనిపించారు.... నా మాటకి కట్టుబడి ఉండటమే నీకు మంచిది అని చెప్పి వెళ్ళిపోయారు.... పెళ్లి రోజు రానే వచ్చింది.... పెళ్లి కొడుకు చూడటానికి ఒడ్డు పొడవు బాగానే ఉన్నాడు.... పెళ్లి ముస్తాబు అంత…
Read More

ప్రకృతి అందాలు

ప్రకృతి అందాలు నా పేరు అంజలి.. నేను హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నా... ఇక్కడ ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా... ఎప్పుడూ ఉరుకుల పరుగుల తోనే కాలం గడిచిపోయేది... ఈ హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కి ఏమాత్రం లోటు లేదు... ఈ కాలుష్యం, ఆ వెహికల్స్ నుండి వచ్చిన శబ్దాలు కర్ణబేరిని చెడగొట్టేస్తున్నాయి.. నా జీవితం కూడా అలాంటిదే పొద్దున్నే లేచి, ఫ్రెష్ అయ్యి, ఆ ట్రాఫిక్ లో ఆఫీస్ కి వెళ్లి... మళ్ళీ సాయంత్రం తిరిగి రావడం... వచ్చేసరికి ఎలా అయ్యేదానిని అంటే నలిగిపోయిన గులాబీలా నా మొహం వాడిపోయేది. పోనీ జాబ్ మానేద్దాం అనుకుంటే..." ఈ లోకంలో మనీకి ఉన్న విలువ మనిషికి" ఉండదు... అలా అలా రోజులు గడుస్తండగా... ఒకరోజు మా ఫ్రెండ్ కి పెళ్లి కుదిరింది అని చెప్పింది.... మొదటగా అంతగా ఆసక్తి చూపించలేదు వెళ్ళడానికి... కానీ మా ఫ్రెండ్ అప్పుడప్పుడు వాళ్ల ఊరు గురుంచి…
Read More

మార్పు

మార్పు ఎన్నో ఆశలతో... కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన నాకు... దేవుడు నిజంగానే... చాలా కొత్తగా నా జీవితాన్ని మలిచాడు అనిపించింది.... కానీ ఎన్నో ఒడుదుడుకులు ఎదురుకుంటూ... ఈ సంవత్సరాన్ని పూర్తి చేశాను రోజులు చాలా అందంగా గడుస్తున్నాయి.... అలా నాలుగు నెలలు గడిచాయి... ఆరోజు నాకు ఇంకా చాలా బాగా గుర్తుంది...  ఏప్రిల్ 30 ఆదివారం సాయంత్రం 3:10 గంటలు...  నేను నా ఆఫీస్ వర్క్ ఉంది అని ఆరోజు ఆఫీస్ కి వెళ్ళాను.... ఆఫీస్ వర్క్ పూర్తి చేసి.. కాసేపు మా ఫ్రెండ్స్ తో సరదాగా కబుర్లు కాకరకాయలు చెప్పుకుంటున్నా... ఇంకా ఇంటికి వెళ్ళాలి అని వాళ్ళకి బై చెప్పి మెట్రో స్టేషన్ కి వెళ్లాను మాదాపూర్ మెట్రో స్టేషన్: నేను మెట్రో కోసం వెయిట్ చేస్తున్న... 3 గంటలకి మెట్రో వచ్చింది.. నేను మెట్రో ఎక్కి కూర్చున్నా.. నెక్స్ట్ స్టాప్ లో తను మెట్రో ఎక్కాడు... తనని చూడగానే…
Read More

నీరిక్షణ

నీరిక్షణ 5 యేళ్లు అయింది తను నాకు పరిచయం అయ్యి.. కానీ ఇప్పటి వరకు మేము కలుసుకోలేదు... కానీ... వచ్చే సంవత్సరం అయన తనని కలవాలని.... మనసు ఆరాట పడుతుంది... అప్పుడే తను నాకు ఒక విషయము చెప్పాడు.... తనకి ఢిల్లీ లో జాబ్ వచ్చిందని.. ఇంకా మనం సరిగా మాట్లాడటం కుదరదు అని.. ఆ మాట విని నేను తట్టుకోలేక పోయాను... కనీసం రోజుకి ఒక్కసారి అయినా మెసేజ్ కానీ కాల్ కానీ చేయమని అడిగాను... తను సరే అన్నాడు... అలా అలా రోజులు గడుస్తున్నాయి.... మా మధ్య మునపటిలా ఉన్నటువంటి మాటలు కూడా కరువు అయ్యాయి.... అయినా తనని ఏ రోజు ఏం అనలేదు... బిజీ ఉంటారు కదా అని లైట్ తీసుకున్న.... రోజులు కాస్త నెలలు అయ్యాయి.... నెలలు కాస్త సంవత్సరం అయ్యింది.... అయిన ఏ మార్పు లేదు.... సడెన్ గా ఒక రోజు నైట్ కాల్…
Read More

చిగురాశ…

చిగురాశ... "ఒకరోజు".. పొద్దున్న లేవగానే.... నీకు ఫోన్ చేయను, మెసేజ్ చేయను... ఆరోజు ఉదయం నుండి రాత్రి వరకు ఏం జరిగింది అనేది కూడా చెప్పను... ఏం తింటున్నాను, ఎలా ఉంటున్నాను. అనేది కూడా చెప్పను... ఎందుకో తెలుసా ఆరోజు... పొద్దున్న లేవగానే నువ్వు నా పక్కన ఉంటావని.... ఆరోజు మొత్తం నువ్వు నాతోనే ఉంటావని... ఎన్నో మైళ్ళ దూరాన్ని... నువ్వు చెరిపేసి.. నాతోనే ఉంటావు అని... నా ప్రతి కదలికలో నాకు తోడుగా నిలుస్తావని... ఆరోజు నుండి నా ప్రయాణం నీతోనే మొదలు అని.... చిగురించేను నాలో ఒక చిన్న ఆశ - మేఘమాల
Read More

అనుకోకుండా ఒక రోజు

అనుకోకుండా ఒక రోజు పిల్లగాలి చల్లగా వీస్తుంటే... ఆమె కురులు ఆ కారు మబ్బులను తలపిస్తుంటే... ఆమె కళ్ళు సంద్రానికి.... అసలేమీ తక్కువ కాదు అన్నట్టుగా.... వర్షిస్తున్నాయి... అప్పుడు ఎక్కడినుండి వచ్చాడో తెలీదు కానీ ఆరు అడుగుల ఆజానుబాహుడు... చక్కటి మేని ఛాయతో... కత్తుల లాంటి కళ్ళతో.. ఆమె ఎదురుగా వచ్చి నిల్చున్నాడు.... అతడిని చూసి ఆమె కళ్లు... రెప్ప వేయడం కూడా మర్చిపోయి.. అతడినే చూస్తున్నాయి... రెప్ప వేస్తే అతను మళ్ళీ ఆమెను వంటరిని చేస్తాడేమో అని.... అతను ఆమె మనసులో జరుగుతున్న సంఘర్షణ తెలుసుకున్నవాడు వలె ఆమెను అతని కౌగిల్లో బంధించి... ఆమెకు నేను ఉన్నా అన్న దైర్యన్ని ఇచ్చాడు.... అలా వాళ్ళిద్దరూ... ఈలోకంతో సంబంధం లేకుండా ఒకరి కౌగిలిలో ఒకరు ఉండిపోయారు..... ఆమె పేరు అంజలి అతని పేరు అక్షిత్ ఇద్దరు చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు గా కలిసి మెలిసి పెరిగారు...పై చదువులు కోసం అక్షిత్…
Read More