motivational quotes

ఎదురీత

ఎదురీత ఏటికి ఎదురు ఈదగలమా అని ఒక శాస్త్రం వుంది. కానీ ఎన్నిటికైనా ఎదురొడ్డి నిలిచిన వారే విజేతలుగా నిలబడతారు. అని అన్నింట్లా ఋజువవతూ ఉంటుంది. ఉదాహరణకు ప్రపంచ బాక్సింగ్ క్రీడాకారిణి (నిఖత్ జరీన) పట్టుదల ఆమె ఎంచుకున్న రంగం ఎదురీత విజయం అని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళా బాక్సింగ్ క్రీడాకారిణి కావడం మనం అందరం అభినందించాల్సివిషయం. చిన్నతనం నుండి క్రీడలలో ఆసక్తి వున్నా వారి మత, సాంప్రదాయాలను సమాజపరంగా కూడా ఎన్నో సమస్యలు ఉన్నా, నీఖత్ జరీన పట్టుదల ముందు అవేవి సమస్యలు కావు అని నిరూపించిన దైర్యమున్న క్రీడాకారిణి. దానికి తోడు కుటుంబ సహాయ సహకారాలు, వారు ఆమెను ప్రోత్సహించిన విధానము. తెలంగాణ రాష్ట్ర తోడ్పాటు ఈరోజు ప్రతిష్టాత్మకమైన ప్రపంచ ఖ్యాతిని ఆమె తెచ్చిపెట్టింది. (కష్టం, క్రమశిక్షణ, దైర్యం, ఆత్మ విశ్వాసం) కొన్నిసార్లు ఓడినప్పుడు గమ్యాన్ని లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ దిశగా అడుగులు వేసి పోటీ…
Read More

వెలిగే రంగు

వెలిగే రంగు రంగులన్నీ కలిసిపోయేది నలుపులోనే. రంగులన్నీ వెలిసిపోతే మిగిలేది తెలుపే. రోజు ముగిసినా, ఊపిరి ఆగినా! మిగిలేది చీకటే. బుద్ధి వికసించినా, బుద్ధితో నేర్చుకున్నా, వెలిగేది జ్ఞాన దీపమే! -బి రాధిక
Read More

జీవిత ప్రయాణంలో…

జీవిత ప్రయాణంలో... డబ్బుల వెంట పరుగులు తీసే వారు అలా డబ్బుల కొరకు పరుగులు తీసి తీసి అలిసి పోయి చివరికి వెనుతిరిగి చూసుకుంటే మిగిలేది వయసు పైబడ్డ శరీరం దూరమైన బంధాలు దూరమైన ప్రేమ అనురాగాలు. జీవితానికి డబ్బు అవసరమే కానీ డబ్బే జీవితం కాదు అని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. ఒకతను వున్నంతలో భార్యా పిల్లలతో ఆనందంగా బతుకుతుంటాడు.. ఒకరోజు అతడు బజార్లో నడుస్తూ వుంటే ఒక నాణెం దొరుకుతుంది.. మకిలి పట్టి మధ్యలో చిల్లు వున్న రాగి నాణెం అది...!! అతడు దాన్ని రుద్ది చూస్తాడు..ఆశ్చర్యం..!! ఇంకో రాగి నాణెం వస్తుంది.. మళ్ళీ రుద్దుతాడు.. మరోటి వస్తుంది.. మళ్ళీ రుద్దితే మళ్ళీ ఒకటి..!! అప్పుడు ఆకాశవాణి వినిపిస్తుంది.. ఓ మనిషీ..! ఇది మాయానాణెం.. దీన్ని ఎన్నిసార్లు రుద్దితే అన్ని నాణేలు ఇస్తుందీ.. అయితే మధ్యలో ఒక్కసారి ఆపినా ఆమాయ పోతుందీ...!! అని చెప్తుంది.. అంతే ఆ మనిషి తన…
Read More

ఇది యాపారం

ప్రపంచంలో తెలివితో దేన్నయినా సాధించొచ్చు అనేదానికి ఈ తెలివైన కొడుకు ప్లాన్ ఏ ఒక పెద్ద ఉదాహరణ : ఆ కొడుకు తండ్రుల మధ్య సంభాషణ ఇలా జరుగుతుంది "   కొడుకు :- నాన్న, నేను నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను ? తండ్రి : నేను ఒప్పుకోను 😠 కొడుకు : నాన్న అమ్మాయి బిల్ గేట్స్ కూతురు ! తండ్రి : అవునా అయితే నాకు ఓకే రా చేసుకో  😊  అని తండ్రి వెంటనే బిల్ గేట్స్ దగ్గరకు వెళ్ళాడు ? తండ్రి బిల్ గేట్స్ తో ఇలా అంటున్నాడు : నీ కూతురు నా కొడుకుని పెళ్లి చేసుకోవాలి అని నేను అనుకుంటున్నాను అని అన్నాడు ! బిల్ గేట్స్ : నో నేను ఒప్పుకోను అని అన్నాడు , అపుడు ఆ తండ్రి తండ్రి : నా కొడుకు ఎవరు…
Read More