saidachary mandoju

ఈ వేళ

ఈ వేళ ఈ..వేళా...నాతో  పకృతి జత కట్టి నాతో సహజీవిస్తూ నాలో మమేకమై నన్ను తన గాఢ పరిష్వంగనా కౌగిలిలో అలుముకుంది నాతో శుభ సాయంత్రమునా ఏవో ఊసులు కొన్ని చెప్పుకుంటూ తన వడిలో సేద తీర్చింది అలా ఊహల్లో తెలుతూ గగనం వైపు అలా చూస్తున్న నాకు చల్లని వింజామర గాలులతో కాస్త నిద్ర పుచ్చింది స్వప్నంలో పచ్చని చీర కట్టి నాకు స్వాగతమిచ్చింది నాకు ఎన్నో మధురానుభూతులు ఈ వేళా శుభ సాయంత్రాన మిగిలించింది...!! శుభ సాయంత్రం మిత్రులారా - సైదాచారి మండోజు
Read More

తొలి పొద్దు

తొలి పొద్దు తొలిపొద్దు విరిసింది రవికిరణం పొడిచింది అవనిని ముద్దాడింది పకృతి కాంత మేల్కొంది నవకమలం పూసింది మధుపం తాకి, మందారం మురిసింది శుభోదయం పలకరించింది గగన విధుల్లో పక్షులు విహారంచేస్తూ చెలిమిజట్టు కట్టి కలిమి బంధంతో వసంత గానం ఆలపించాయి..!! శుభోదయం                      -సైదా చారి మండోజు
Read More

నేను పేదవాడిని

నేను పేదవాడిని అరిగిన చెప్పు చేదిరిన బొచ్చు మాసిన గడ్డం మురికి దేహం ఎండిన డొక్క  చినిగిన గుడ్డ వాడిన మొఖం ఆకలి స్వరము పస్థుల భారం కన్నీటి శోకం గతుకుల అతుకుల మెతుకుల బతుకుల బాటసారిని ఆ..నేను  పేదవాడిని....! -దినుడిని హినుడిని రోగినిని లోకం దయ లేని అభాగ్యుని మంచి వాడిని కంపువాడిని లోకం నిందించే వెర్రివాడిని ఆరాటాన్ని పోరాటాన్ని అర్భాటాని ఆశత్వాన్ని అల్పసంతోషాన్ని మురికివాడలో కంపురోతలో కరుకుమనుషుల్లో ఇంపుగా.., బ్రతికే పేదవాడిని చెల్లని రూపాయి నోటుని వాడి పడేసే ఆకుని - విస్తరి ఆకుని నలిగి మాసిన గుడ్డని దరిద్రపుగొట్టు ఎదవని లోకం రీతి తెలియని వాడని భూస్వాములకు పెత్తందారులకు బల్సిన నా కొడుకులకు నేనో గులాంగిరిని -నేనో చెంషాగిరిని రాజకీయ రాచకీయ నాయకులకి నేను ఓటుని ఉచిత పథక హామీని బడా సాబ్  కి వ్యాపారస్తుడుకి నేనో కూలీని నేనో కూలీని భారత జనాభా లెక్కల్లో నేనో…
Read More

ఓ వేశ్య

ఓ వేశ్య   ఓ వేశ్య సమాజానికి, నువ్వో రోత '' కానీ ఎవరికి తెలుసు..? నీ కడుపు కేక నీ ఆకలి బాధ నీ బ్రతుకు ఆట జానెడు పొట్ట కోసం మూరెడు మల్లెలు కొప్పులో పెట్టి, తెలియని విషాద రంగు మొఖానికి అందంగా అదిమి' మెరుపు లాంటి ఎరువు చీర ఒకటి కట్టి బిగుతూ లాంటి రవిక ముడి ఒకటి విప్పి 'తళుక్కుమంటూ తాజాగా మెరుస్తూ ' కలవరంతో కాటుక కనుల- కన్నీళ్లను ఇంపుగా చేసి సొంపుగా అందాలను పరిచేస్తూ చిరునవ్వులు చిందిస్తూ, విషాదాన్ని గుండెల్లో దాచేస్తూ ఆనందాన్ని పంచి విటులకు విందు భోజనంలా నీ శరీరాని అప్పజెప్పి, కటిక చీకటి నీ బ్రతుకులో వెన్నెల వసంతం కురిపించి కామము పురుష లోకాన్ని నీ తనువు కన్నీళ్ళ చల్లదనంతో చల్లార్చి - అతిధి విటుడికి కామమర్యాద చేసి, నొప్పులతో పొట్లతో అలసి తోలసి -- సర్దుకుంటూ మనసులేని, మట్టిబొమ్మల…
Read More

నా ప్రేమకథ

నా ప్రేమకథ ♥️♥️️♥️♥️♥️♥️♥️♥️♥ అటు నువ్వే ఇటు నువ్వే ఏ వైపు చూసినా నువ్వే మనసంతా నువ్వే నా మనసులో ఉంది నువ్వే నీతో పరిచయం స్నేహమై ఆప్యాయత అనుబంధమై' నా అనురాగం నువ్వేయి నా అనురాగ దేవత నువ్వేయి, నా హృదయంలో నిలిచిపోయి చెదరని బొమ్మవయి నా హృదయంలో పదిలమయి నిలిచిపోయావు నీతో ప్రేమలో పడ్డాను' అవును ప్రేమలో పడిపోయాను మునిగిపోయను, ప్రేమసాగరంలో ఈదుతున్నాను ఎంత ఈదినా దరికి రాలేకపోతునాన్ను... అంతలా పడి, మునిగిపోయాను నీ ప్రేమలో ఎంతలా అంటే నన్ను నేను మరిచిపోయి నాలో నిన్ను చూసుకునే అంతా..! ఏదో తెలియని ఆనందం చెప్పలేని సంతోషం.... ఎగిరి గంతులేస్తున్న' అద్దంలో లో నాకు నేనే కొత్తగా కనిపిస్తున్న నీ ముఖ చిత్రాన్ని చూసి మురిసిపోతున్న... పడుకుని దుప్పటి ముసుగేసుకుని ' కలల లోకంలో విహరిస్తున్న' వెచ్చని ఊసులతో జాగారం చేస్తున్న ప్రేమ చలి మంటలు మనసుకు తగిలి తనువులో…
Read More