Month: November 2022

నీకునీవే

నీకునీవే బ్రతుకు రంగుల రాట్నం పై ఎక్కేది నీవే దిగేది నీవే ఎత్తుపల్లాల నడుమ ఊగిసలాడేది నీవే కష్టం నీవే సుఖం నీవే కష్టసుఖాల మధ్య సంపద నీవే. ఆనందం నీవే బాధ నీవే సుఖదుఃఖాల మధ్య పయనం నీవే గెలుపు నీవే ఓటమి నీవే గెలుపు ఓటముల మధ్య పోరాటం నీవే పరుగు నీవే పందెం నీవే పరుగు పందెంలో విజయం నీవే భయము నీవే ధైర్యం నీవే రెండిటి నడుమ అడుగులు నీవే ప్రశ్న నీవే బదులు నీవే ప్రశ్న జవాబుల మధ్య విషయం నీవే కోపం నీవే తాపం నీవే కోపతాపాలు నడుమ రాజీ నీవే పాపం నీవే పుణ్యం నీవే పాపపుణ్యాల నడుమ ఓరుపు నీవే బరువు నీవే బాధ్యత నీవే బరువు బాధ్యతల నడుమ జీవితం నీదే నాయకుడు నీవే ప్రతి నాయకుడు నీవే రెండిటికీ ఒరవడి పెట్టే నటన నీవే దర్శకుడూ నీవే…
Read More

ఐక్యమవనీ!

ఐక్యమవనీ! నీవే ప్రాణమనుకుని నమ్ముకున్న క్షణంలో... మనసంతా నిండిన ప్రేమ పులకింతలో.. ఇసుమంతైనా భయమన్నది లేదు మదిలో... ఒంటరయ్యానన్న భావన కలగలేదు హృదిలో... మమేకమైన బంధానికి మురిసిపోయా తలపులో... నేడదంతా గతమై స్మృతిలో తొలిచేస్తుంటే.... క్షణక్షణం తనువున గాయాలని రేపుతుంటే... మనోసంద్రంలో వేదనంతా ఇంకి కన్నీరు రాకుంటే... క్షణమొక యుగముగ గడుస్తుంటే.... వంచించబడిన మనసు మూగగా రోధిస్తుంటే‌.... నిత్యం నమ్ముకుని వచ్చే పుంగవులకి తనువర్పించి... మనసున కారే కన్నీటిని అదిమిపడుతూ... ముఖాన రంగులు పులుముకుంటూ... అధరాలకి నవ్వుల రంగులు అద్దుకుంటూ... పూట తిండికై నీ వంచన సాక్షిగా బ్రతికేస్తున్నా... నిన్ను చేరని నా కన్నీరుని నిందిస్తూ... నిన్ను నమ్మిన నా మూర్ఖత్వానికి దుఃఖిస్తూ... అవసరాలకి నాకు ప్రేమ పరిచయం చేసి... డబ్బుకోసమని అంగట్లో అమ్ముకున్న నీవు... మరుజన్మలోనైనా నీ నిజప్రేమతో నీలో ఐక్యమైపోనీ.... - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

నిన్ను చేరని నిశీధి.!

నిన్ను చేరని నిశీధి.! వీధి చివరన... ఓ మూలన ముడుచుకుని కూర్చున్న ముదుసలి, రాత్రిలో గత కాలపు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాడు. అల్లారు ముద్దుగా గడిచిన తన బాల్య స్మృతులను నెమరు వేసుకుంటున్నారు. జీవన సమరంలో తానోడినా నిలబడ్డ తీరును తలుచుకుంటున్నాడు. కన్నవారి కలల పంటగా పుట్టి కలత లెరుగక ఎదిగి.. ఓ పడతిని మనువాడి.. బిడ్డలకు తండ్రిగా మారి.. వారి ఉన్నతికి పరిశ్రమిస్తూ ఉన్నదంతా ఖర్చు చేసినా.. రెక్కలొచ్చిన బిడ్డలు ఎక్కడెక్కడికో ఎగిరిపోయారు. ఆ వృద్ధ తండ్రిని భారమంటూ నడి వీధిలో వదిలేశారు.. చావలేక, చావురాక వీధి చివరన గుప్పెడు మెతుకుల కోసం దేహీ అని పరుల ముందు చేయి చాచాల్సిన దుస్థితిని మరిచిపోయి ప్రశాంతంగా కూర్చున్నాడతడు. తనలాంటి వారెందరో తనతో ఉన్నారన్న ధైర్యమే తోడుగా.. అవును‌, సంస్కృతికి నిలయమైన.. సంప్రదాయాల సంగమమైన మన ఈ సమాజంలో సంపదకు కొదవలేకున్నా.. నేటికీ గూడులేక, నిలువ నీడ లేక.. నడి రోడ్డును…
Read More

సంకెళ్లు

సంకెళ్లు అప్పుడెప్పుడో నీ గురించి విన్నాను నువ్వు కనబడకుండా నీకు నచ్చిన వారికి ఎన్నెన్ని కిరీటాలు పెడతావో తెలుసుకుని అబ్బుర పడిపోయాను. నిన్ను చేరుకోవాలని ఎన్నెన్ని కలలు కన్నానో... నీ దృష్టిలో పడాలని నక్క తోక తొక్కడానికి ఎన్ని విన్యాసాలు చేసానో.. నువ్వు తోడు లేక ఎందరి జీవన ప్రయాణం రాళ్లు రప్పల మధ్య నల్లేరు మీద నడకలా సాగుతోందో... ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాల, కులమతాల బేరీజులు వేయకుండానే కాలంతో జతగూడి రాజునైనా సరే రాజీ లేకుండా రోడ్డున పడేసే రాతి గుండె నీది బికారికి కూడా పదవి కట్టబెట్టి పూలదండ వేయించే పెద్ద మనసు నీది అందరికీ కనిపించకుండా కవ్విస్తూ కొందరినే కౌగిలి లో కరిగిస్తావు.. ఎంత విజ్ఞానం ఉన్నా, ఆవగింజంత నీ ఆదరణ లేక అణగారి పోయిన అభాగ్యులేందరో.. నిను చేరని జీవితం వెన్నెలకు నోచుకోని గుహలోని గుండ్రాయే... అందుకే ఎంతో ఆబగా నా చేతిని సుంతైనా తాకమని ఎంతగా…
Read More

నిన్ను చేరని

నిన్ను చేరని నా గెలుపు కోసం నా సుఖం కోసం నా సంతోషం కోసం నా ఆశలు నెరవేరాలని కోరుకుంటూ నా కోసం ఎన్నో త్యాగాలు చేసి, నాకంటూ ఒక ఉనికిని ఏర్పరిచి, నా గెలుపు లో భాగమై , నా ప్రతి కదలికలో తోడువై నిన్ను నీవు మరచి, నాకోసం శ్రమిస్తూ నిన్ను నువ్వు పట్టించుకోకుండా నాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నీ వద్దకు ... ఇదిగో వస్తున్నా... నేను గెలిచాను అంటూ నా గెలుపును చూపాలని, నా ఆశ నెరవేరిందని అంటూ గెలుపు గుర్రాలపై నిను చేరాలని పరుగులు తీస్తూ వస్తున్నా నేనీ ఉదయానా... - అర్చన
Read More

స్త్రీ

స్త్రీ   ఎన్నో ఊసులు చెప్పాలనుకుంటా.. కానీ వినేతీరిక నీకెక్కడిది.. నీతో మాట్లడాలని ప్రయత్నించిన ప్రతిసారీ మాటలు శిశిరపత్రాలవుతాయి.. నీ మాటలకైనా హాయిగా నవ్వాలనుకుంటాను కంటిచూపు తోనే కసురులాజ్ఞతో కట్టడిచేస్తావు నువ్వేలోకమంటావు నా శ్వాస నువ్వేనంటావు అంతలోనే ఎన్నో హద్దులు పెడతావు ఏవో ఆంక్షలు విధిస్తావు నీ మాటల మురళీగానానికి రాసలీలలాడిన రాధలా మైమరిచిపోయిన ప్రతిసారి మనసుకు సంప్రదాయల సంకెల వేస్తావు ఆకాశమే హద్దుగా విహరించాలనుకుంటాను నా స్వేచ్ఛా విహంగాన్ని విరిచి పరిధి విధిస్తావు.. నా దేవత నువ్వంటావు నీకోసం ఎన్నో మ్రొక్కులు మ్రొక్కుకున్నానంటావు నా ఉత్సవ విగ్రహానికి వత్సరానికి ఒకసారి అయినా ఊరేగింపు నిషేధిస్తావు హద్దుల పంజరంలో బంధీనైన నా ఊసులు చిలుకపలుకలే మరి... నాలో నేనై నాతోనేను మాట్లాడుకుంటూ... ఊసుల ఉనికికి భాష కూడా అడుగంటి పోయింది నా మనసు మృగతృష్ణలో మాటల చెలమను వెతకడానికి ప్రయత్నించిన ప్రతిసారి మౌనరాగలే వినిపిస్తున్నాయి.. - సలాది భాగ్యలక్ష్మి
Read More

నాకేనా హద్దులు.!

నాకేనా హద్దులు.! నిన్నే ప్రేమించి.. నీకే మనసిచ్చి.. నీకై నా గుండెలో గుడికట్టిన నాకా నువ్ పెడుతున్నావ్ హద్దులు.. సూరీడు రాకముందే.. నీకు చరవాణిలో సందేశం‌ పంపుతా.. నీ నుంచి బదులొచ్చేవరకూ కాచుకుని కూర్చుంటా.. నీ మాటతోనే రోజును మొదలేట్టే నాకా హద్దులు.. నీకు కష్టమొస్తే నాదిగా అనుకుని విలవిల్లాడతా.. ఆ కష్టం నా మీదేసుకుని నిన్ను సంతోషపెడతా.. నీ చిరునవ్వులోనే నా కన్నీటిని మరిచిపోయే నాకా హద్దులు.. నీ వాళ్లని, నీతో ఉన్నవాళ్లని నా వాళ్లతో సమంగానే చూస్తా.. నా వాళ్లను కూడా కాదని నీకోసం ఎందాకైనా వస్తా.. నీ కోసం సచ్చిపోమ్మంటే నిమిషమైనా ఆలోచించని నాకా హద్దులు.. ఎన్ని చేశానే నీ కోసం.. ఎంత ఏడ్చానే నీ‌ జత కోసం.. నన్ను ఏనాడూ నమ్మని నిన్ను నా అమ్మవనుకున్నానే.. నిలువెల్లా కళ్లు చేసుకుని కంటికిరెప్పలా కాసుకుంటున్న నాకా హద్దులు.. నీ కోసం ఇంత కన్నా దిగలేను.. నీపై ఎంత…
Read More

మిన్న

మిన్న మోయలేని భుజకీర్తుల కన్నా మూగిన భజన బృందాల కన్నా పేరుకోసం పాకులాట కన్నా పుడమి రోదన ఆపటం మిన్న ముక్కుమూసే ధ్యానం కన్నా కనులమూతల నటన కన్నా తేనెపూసిన కపటం కన్నా ముక్కుసూటి మాటే మిన్న కలల ప్రపంచంలో తేలేకన్నా కలలు కనమనే ప్రబోధం కన్నా కష్టాలను ప్రేమించండనే బోధన కన్నా నేల నిలిచే చూపు మిన్న సాయమడిగే పెదవుల కన్నా నిందలేసే నైజం కన్నా నీడ వెతికే సుఖం కన్నా నువ్వేమిటో తెలియటం మిన్న - సి. యస్. రాంబాబు
Read More

కాంతార లో “భూతకోలం” వెనుక ఉన్న అసలు కథ ఏంటి?

కాంతార లో "భూతకోలం" వెనుక ఉన్న అసలు కథ ఏంటి? కాంతార దేశాన్ని అంతా తన వైపు చూసేలా చేసింది. ఈ సినిమాని 16 కోట్లతో నిర్మించారు. ఇప్పుడు ఆ సినిమా 250 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాను మీరు అందరూ చూసే ఉంటారు. చూడకపోతే ఒకసారి ధియేటర్ కి వెళ్లి చూడండి ఈ సినిమాతో చరిత్రను సృష్టించారు అని చెప్పవచ్చు. ఇందులో ప్రతీ సన్నివేశం ప్రతీ మలుపు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా కోలం వేసే సీన్లు, అప్పుడు వచ్చే హంటింగ్ బీజీయం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో చూపించిన సాంప్రదాయ పద్ధతులు ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించాయి. అందుకే ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో చెప్పుకోదగ్గది భూత కోలం ఈ భూత కోలం అంటే ఏమిటి? ఇది ఎందుకు చేస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ భూత…
Read More

చిలిపి పనులు

చిలిపి పనులు ఏంటి నిద్ర రావడం లేదా అడిగింది అమ్మ. లేదమ్మా రావడం లేదు. నిద్ర రాకున్నా కళ్ళు మూసుకో అదే వస్తుంది. లేకపోతే రేపు అక్కడ నిద్ర పోతావు. నీ ఇష్టం ఇక అంటూ బెదిరించింది ప్రేమగా, అవును పడుకోవాలి లేదంటే తెల్లారి సంతోషంగా ఉండలేను అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకున్నా అయినా నిద్ర రాదే, రేపెలా వెళ్తానో, ఎలా మాట్లాడాలో, ఎలా గుర్తు పట్టాలో, అసలు నన్ను గుర్తు పడతారా లేదా అనే లక్ష ప్రశ్నల మధ్య నిద్ర అనే చిన్న విషయం మరుగున పడింది. అంతకు ముందు ఏం బట్టలు వేసుకోవాలి, ఏం చెప్పులు వేసుకోవాలి అంటూ హడావుడి పడుతూ అన్నీ సిద్దం చేసుకునే సరికి పదకొండు, అయ్యింది. ఆ తర్వాత మొదలైంది అసలు ఆలోచన ఎలా మాట్లాడాలి అనుకుంటూ గుండెల్లో ఉన్న సంతోషం కళ్ళలో కనిపిస్తుంటే కళ్ళు మూతలు పడకుండా ఆలోచనలు గతం వైపు పరుగులు…
Read More