Month: November 2022

సంక్షిప్త సందేశం

సంక్షిప్త సందేశం ద్వేషించే హృదయాలు కూడా ఉదయాలను ప్రేమిస్తాయి పరిశుద్ధులను చేస్తాయేమోనని ఎదురుచూస్తుంటాయి మనుషులంతా ఒకలా ఉండనట్టు ఉదయాలన్నీ ఒకేలా ఉండవు లాలించేవి విసిగించేవి చురుక్కుమనిపించేవి,చెక్కిలి నిమిరేవి..ఎన్నని.. ఏ ఉదయం వెనక ఏ దుఃఖముందో ఎవరికి ఎరుక మనలా రాగద్వేషాల మూటలా మబ్బులని సందేహపడుతుంటాను అరుణకిరణాలతో అలంకరించుకొని జగతిని లేపే విధినిర్వహణలో ఉంటాయి కదా ఎండాకాలం చిటపటలాడి వానాకాలం లో చినుకు నిచ్చెనలేసి చలికాలపు బద్దకాన్ని కప్పుకుని ఋతువుల మేడలో దర్శనమిస్తుంటాయి ఋతువేదయినా ఆశల్ని పెంచుతూ ఆకలిని దాచుతూ బాధను మింగుతూ ద్వేషాన్ని తుంచుతూ సాగమని ద్వేషించే హృదయాలకు గాలితో సంక్షిప్త సందేశాలు పంపుతాయి - సి. యస్. రాంబాబు
Read More

భారంగా మారిన భాల్యం

భారంగా మారిన భాల్యం ఎవర్ని ప్రశ్నించను? ఏమని ప్రశ్నించను? బలపం పట్టి, బడి బాట లేని... బరువుగా ఉండే బండ బలి కోరె? ఎవర్ని అడగను? ఏమని అడగను? పాదం దాటని చిక్కు ముళ్ల కంచెల్లో... నా పుట్టుకను ఇచ్చిన పుడమిని అడగనా? బడి బాట లేని బాల్యమా...... బంధాలు, బాధ్యతలు తెలియని పని బంధమా ... అద్దాల మేడలను అడగనా? అంతరిక్ష క్షిపణులను అడగనా? నల్లమబ్బుల్లో దాగి నేలను జారిన చినుకును అడగనా? బాల్యం అనే చిగురుటాకులు తెంపేసినా... పరిస్థితుల కథనంలో కథగా మారిన నాయి స్థితికి కారకులు ఎవరు? చెరగని చిరునవ్వు చేరే రోజు ఏది? బడి బాట పట్టి ప్రయాణ పర్వదిన రోజు ఏది? నా చిట్టి చేతులు ఆడే చక్కని ఆటలు..... వేచి చూసే నా కంటిపాపలు... కలవరి పడి కడుపును చీల్చి కన్నవారి కలలకు పునాది పేర్చి... పరవసించే పసిపాపల పర్వదినం.... మాయని మల్లె…
Read More

భారమైన బాల్యం

భారమైన బాల్యం అల్లారుముద్దుగా పెరగాల్సిన బాల్యం.. అజరామరంగా అలరించాల్సిన బాల్యం.. కష్టసుఖాల కడలిలో ఈదుతున్న బాల్యం.. శ్రమకు ఆహరమైన బాల్యం.. అన్నపానీయాలు నోచని బాల్యం. చేయూత కు కరువైన బాల్యం.. భారమైన బరువుకు బలైన బాల్యం. రాళ్ళు రప్ప ల మధ్య నలిగిపోతున్న బాల్యం.. కర్మాగారాల పాలైన బాల్యం. ఇంతలా భావి భారతాన్ని హరిస్తున్న ఈ బూటకపు సమాజం తప్పక చెల్లించును మూల్యం.. - కిరీటి పుత్ర రామకూరి
Read More

చిరు చిరు పాపలం

చిరు చిరు పాపలం 1) చిరు చిరు పాపలం - చిన్నారి బాలలం    నింగికి నేలకు నిచ్చెనలేసే-అల్లరి పిడుగులం //చిరు// 2) పూలదండలో దారంలా-మేమంతా కలిసుంటాం    ఐకమత్యమే బలమని చాటుతు-ఏనుగునైనా బంధిస్తాం. //చిరు// 3) విశ్వమంతా విహరిస్తాం -కొత్తవెన్నోకనిపెడతాం    భవషత్తంత బాలలదేనని -చేతల ద్వారా చూపిస్తాం //చిరు// 4) కల్లాకపటము ఎరుగని మేము -పెద్దలదీవెనలాశిస్తాం    నిన్నకు రేపుకు సంధిగ నిలిచి -చిచ్చరపిడుగుల మనిపిస్తాం //చిరు// - కోటా పెంటయ్య
Read More

పిల్లలు

పిల్లలు పిల్లలం పిడుగులం రేపటి భవితలం ఆడుతూ పాడుతూ కాలాన్ని గడిపేస్తాం భవిష్యత్తు బాటలకు వెలుగునిచ్చే ప్రమిదలం భూగోళాన్ని చుట్టే బుజ్జి అడుగులు నింగినితాకే మా కేరింతలు భయమేస్తే అమ్మఒడిన చేరేములే బామ్మపక్కజెరి కథలు వింటూ బడికెళ్ళము అంటూ మారంచేస్తూ ఆదివారమొస్తే గట్టుమీద చేరి మట్టి ఆటలు ఎన్నో ఆడుకుంటాము అలసటనంతా తీరుస్తాము నవ్వులతో చాచా నెహ్రూ ఇష్టపడెంతగా తప్పటడుగులుసరిచేసుకుంటూ భావి భారతాన్ని నిర్మిస్తాం - హనుమంత
Read More

బండనెత్తిన బాల్యం.!

బండనెత్తిన బాల్యం.! రెక్కడితేగానీ డొక్కాడని నిరుపేద కుటుంబంలో పుట్టి అమ్మానాన్నలకు భారం‌ కాకూడదని బరువెత్తావా బండబారిన ఈ మనుషుల మధ్య రాతిబండను పట్టి లేలేత నీ చేతులు నలిగిపోతున్నా నవ్వుతున్నావా మసిబారిన నీ మోము చూసి కన్నీరొలకని కళ్లుంటాయా కోట్లు ధారబోస్తున్న ప్రభుత్వాలకు నీ శ్రమ కనపడదు పదవికై పరుగెత్తే నేతలకు నీ స్వేదం‌ విలువ తెలియదు ఓ పాలబుగ్గల‌ పసిపాపా..నీకెంత కష్టం వచ్చిందమ్మా నీ తల్లిదండ్రుల ఒడిలో ఒక్క క్షణమైనా సేదదీరేవా?? నేర్చుకోదా గుణపాఠం నినుచూసైనా ఈ సభ్యసమాజం ఆటపాటలతో తోటి పిల్లలు ఆనందంగా గడుపుతుంటే ఎండనకా వాననకా నువ్వీరాళ్లలో అలసిపోతున్నావు బడికెళ్లి పాఠాలు నేర్వాల్సిన ఈ చిరు ప్రాయాన్ని అక్షరాలు‌ దిద్దే స్థోమత లేక మట్టిపాలు చేస్తున్నావు నీ భవిష్యత్తుకు భరోసా ఇవ్వలేని‌ మేమమ్మా పేదలం.! - ది పెన్
Read More

బాల్యం

బాల్యం బాల్యం తాలుకు చేదు గుర్తుకు ఇదో గుర్తు ఎవరన్నారు బాల్యం మధురమని సాహసించగలరా చెప్పేందుకిప్పుడు నా ఈ స్థితి గురించి మాట్లాడాలా? ఈ స్థితికి కారకులైన వారి గురించి ఆలోచించాలా? ఏమీ అర్థం కాని పరిస్థితి నాది. కడుపులో ఆకలి బరువు ముందు మోస్తూన్న తలపై భారం ఏ పాటిది నా ఈ అమాయకపు చూపులున్నవి ప్రకృతి అందాన్ని ఆస్వాదించేందుకు కాదు నా నిస్సహయస్థితిని మీకు తెలిపేందుకే! - బానోతు రామ్ నాయక్
Read More

పిల్లలు

పిల్లలు ప్రేమ, ఆప్యాయతలు, బంధం, భవిష్యత్తు గురించి వెతుక్కునే వయసులో బాధలని, బాధ్యతలని వెతుక్కుంటూ వాటి వెనక పరుగులు పెడుతూ ఎన్నో కష్టాలని, ఎన్నో బాధలని, భరిస్తున్నారు. చిరునవ్వులు చిందించవలసిన ముఖముల పైన కన్నీళ్లు చూస్తున్నాము. ధైర్యం చెప్పడానికి ఎవరూ లేకపోవడం ఒక కారణం అయితే పరిస్థితుల ప్రభావం మరొక కారణం. ఈ యొక్క బాలల దినోత్సవం నుండి అయినా అవి అన్నీ మారితే అదే సంతోషం... - వంశీ
Read More

అక్షర నీరాజనం

అక్షర నీరాజనం తేనెలా మా మనసుల్లో చేరావు కన్నే మనసుతో కన్నెల హృదయాలను కొల్లగొట్టి గూడచారిలా గుండెల్లో నిలిచావు ఇద్దరు మొనగాళ్లు అంటూ అందర్నీ ఆశ్చర్య పరిచావు మీకు సాక్షి నేనేనంటూ అలరించావు మరపురాని కథలెన్నో చెప్పావు స్త్రీ జన్మ గొప్పదని చాటావు ఉపాయంతో అపాయాన్ని దటవచ్చని తెలిపారు ప్రైవేట్ మాస్టారుగా పాఠాలే నేర్పావు అవే కళ్ళతో లోకాన్ని చూడమంటూ చెప్పావు అసాధ్యము కాదేది అంటూ మార్గం చూపావు నిలువు దోపిడి కి దేవుడైన కరగాల్సిందే అన్నావు మంచి కుటుంబాన్ని మించిన సంపద లేదన్నావు సర్కారు ఎక్స్ప్రెస్ లో అమాయకుడిలా ప్రయనించావు అత్త గారు కొత్త కోడళ్ళు ఎలా ఉండాలో చూపావు అల్లూరి ని నేనే అంటూ గుండె ధైర్యం చూపావు ఈనాడుతో సమాజంలో కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయని చూపావు లక్ష్మి నివాసం లో లక్ష్మి కొలువై ఉందన్నావు నేనంటే నేనే నాకెవరూ సాటి లేరు అన్నావు ఉందమ్మా బొట్టు పెడతా…
Read More

బాలల దినోత్సవo

బాలల దినోత్సవo బాలలము మేము బాలలము రేపటి తరo పౌరులం భవిష్యత్తు తరాలకు మేధావులo భావి భారత నిర్మాతలము చాచా నెహ్రూ ముద్దు బిడ్డలం తల్లిదండ్రుల రేపటి ఆశలం కన్నవారి కలలు నిజం చేసే వారసులం ప్రజలకు సేవ చేస్తూ భావి తరాలకు ఆదర్శంగా నిలిచే వాళ్ళం అల్లరి చేస్తూ అందర్నీ అలరించే పిల్లలం అనుకుంటే ఏదైనా చేసే అల్లరి పిడుగులo బుద్ధిగా చదివి తల్లిదండ్రుల పేరు నిలబెట్టే దివ్య జ్యోతులం ... బాలలము మేము బాలలము రేపటి తరం పౌరలం... మా పండగ నేడు మాదే పండగ అల్లరల్లరి చేయక బుద్దిగా ఉంటాం దేశానికి వన్నె తెచ్చే భావి తారలం మేము - అర్చన
Read More