Month: December 2022

హృదయ విహారం

హృదయ విహారం ఏదో.... అలా ఎగురుతున్నాను అల లా..... కొండల్లో.... గుండెల్లో, గుహల్లో లోయల్లో.. లోతుల్లో... పొలాల్లో... పాలల్లో... ఏదో.... అలా ఎగురుతున్నాను ఉదయాల్లో... హృదయాల్లో... నిశి రాత్రి కన్నుల్లో.... సంధ్యా కుంకుమ వన్నెల్లో.. ఏదో.... అలా ఎగురుతున్నాను చీకటిని చుట్టిన వెలుగుల్లో... సింగారించిన మంచు వెన్నెల్లో.. ఏదో.... అలా ఎగురుతున్నాను పిడికిలి లో బిగించిన రక్తంలో... నుదిటిన శ్రమతో పట్టిన స్వేదంతో... ఏదో.... అలా ఎగురుతున్నాను తడి పొడి నిండిన మట్టి వాసన లో. మానవత్వం నిండిన మనస్సుల్లో... ఏదో.... అలా ఎగురుతున్నాను నులి వెచ్చని దేవుని తోడు నీడ నిండిన దేర్యం లో... అంతా వ్యాపించే కోరికలో వాయువే వేణువైన గానం లో.. ప్రాణం లో.. అలా... అలలా.... ఆనందో బ్రహ్మ లా అనంతమైన అంతర్యామి లో అలా... నీలి వినీల విశ్వం లో.... అలా ... అలలా.... ఎగురుతున్నాను - అల్లావుద్దీన్
Read More

ఎవరు పార్ట్ 6

ఎవరు పార్ట్ 6 నేను ఏది ఏమైనా ఈ ఉదయం చాలా బాగుంది, నేను తాగుతున్న కాఫీలా. అలా అలా తాకి వెళ్లే చల్ల గాలి, చూడగానే మనసుకి హాయి కలిగించే పచ్చని కొండలు, వాటి అందాన్ని దాచే పొగమంచు. వింతగా అనిపించింది. ఎప్పుడూ ఉండే కొండలే, రోజు చూసే పొగమంచే, అలవాటైన కాఫీయే కానీ కొత్త అనుభూతి. “ఏంటి, కళ్ళు తిరిగి పడిపోయినప్పటి నుండి వ్యాయామం మానేసినట్టు ఉన్నావు.” వెనకనుండి అలీ. “అలాంటి ప్రత్యేకమైన రోజులు మళ్ళీ మళ్ళీ రావు” “అర్థం కాలేదు” అలీ “మీకు వ్యాయామం చేయాలని ఉందా?” అని మాట దాటేశాను. అలీ “పరుగెత్తటాలు నా వల్ల కాదు కానీ, వాతావరణం బాగుంది కదా అలా నడుచుకుంటూ వెళదాం.” నడక ఆరంభించాము. అలీ “భాయ్, నేను ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను.” “నీకు నచ్చినన్ని రోజులు ఉండు, నువ్వు అతిథిలాగా మొహమాటపడద్దు.” అలీ “అతిథి…
Read More

ఎరుపెక్కిన ఉదయం

ఎరుపెక్కిన ఉదయం అన్నా ఏదైనా పని ఉంటే ఇయ్యన్న అంటూ బేలగా అడుగుతున్నా అమ్మాయి వైపు తెలిపారా చూసాడు నాయుడు. ఛామన ఛాయ లో ఉన్న కండపుష్టి బాగానే ఉంది. ఒడ్డు పొడవు కూడా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది ఎవరమ్మా నువ్వు? ఏం పని చేయగలవు అంటూ అడిగాడు నాయుడు అయ్యా మాది పక్క ఊరు అక్కడ పనులు లేక ఇక్కడికి బతకడానికి వచ్చాము అంటూ అడిగింది సరస్వతి. ఏ పనైనా అంటే అన్ని పనులు చేస్తావా అంటూ వంకరగా నవ్వడు నాయుడు. ఇవన్నీ తనకు అలవాటే అన్నట్టుగా సరస్వతి అన్ని పనులు చేస్తానయ్యా ఏదైనా ఇప్పించండి బాబు అంది ప్రాధేయ పడుతున్నట్లుగా, సరే సరే వెళ్ళు వెళ్లి ఆ ఇటుక బట్టిలలో ఉన్న ఇటుకలు సమానంగా పెట్టు పో అన్నాడు నాయుడు. కూలి మూడువందలు ఇస్తా అంటూ సరస్వతి వెనకాల ఉన్న పన్నెండేళ్ళ పద్మను చూస్తూ ఓహో మీరిద్దరూ పనికి…
Read More

నిర్ణయం

నిర్ణయం ఏ బట్టలు కొనాలా? ఏ రిసార్ట్ కి వెళ్ళాలా? ఏ బ్రాండ్ మందు ఆర్డర్ చేయాలా? ఎలాంటి ఫుడ్డు తినాలా? ఎక్కడైతే బాగుంటుంది? గంజాయి కొట్టాలా? పబ్బుకి వెళ్లాలా లేదా ఇంట్లోనే బిర్యానీలు వండుకొని మందు ముందు పెట్టుకుని తాగుతూ పాటలు పెట్టుకుని డాన్స్ చేయాలా? అని ఆలోచిస్తూ రోడ్లమీద తిరుగుతూ కొత్త సంవత్సరం కోసం రకరకాల బట్టలు, మందు కొంటూ కొత్త సంవత్సరాన్ని బాగా ఎంజాయ్ చేయాలని పాత సంవత్సరానికి వీడుకోలు పలకాలనే ఉద్దేశంతో రోడ్లన్నీ కిటకిట లాడుతూ ఉన్నాయి. బట్టల దుకాణాలు బంగారం దుకాణాలు హోటల్లు, రిసార్ట్స్, పబ్బులు అన్నీ ముందే రిజర్వ్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు జనాలు. ఎంతమంది జనాలు వస్తే అంత లాభం అనుకుంటూ షాపుల వాళ్ళు రండి రండి అంటూ ఆఫర్స్ మీద ఆఫర్స్ పెడుతూ ఉన్నారు. అసలు ఇప్పటికే తాగే వాళ్ళు తాగుతున్నారు ఊగే వాళ్ళు ఊగుతున్నారు తినేవాళ్లు తింటూ ఉన్నారు…
Read More

దారి

దారి అందుకోలేని ఆకాశంలా ఆనందం ఊరిస్తుంటుంది ఆలోచనల వంతెనపై మనసు పచార్లు చేస్తుంటుంది దరిచేరిన తాయిలాలేవీ కోరికల దాహం తీర్చలేక చతికిలబడుతుంటాయి దారి మూసుకుపోతుంది ఆశకు ప్రాణంపోసి చీకటిలో నడుస్తుంటావు కీచురాళ్ళ ధ్వనుల సంగీతంతో మేల్కొన్న మనసు దారి కనుగొంటుంది - సి.యస్.రాంబాబు
Read More

ఎవరు పార్ట్ 5

ఎవరు పార్ట్ 5 అలీ నీళ్లు చల్లి లేపాడు. లేవగానే తాగటానికి నీరు ఇచ్చి, నేను పైకి లేచిన వెంటనే “ఏంటి వ్యాయామమా ?” వీడికి అలా అర్థం అయ్యిందా! “ఆ... అలాంటిదే. నువ్వు... ఇక్కడ” “నేను ఒక పని ఉండి వచ్చాను” బట్టలు దులుపుకుంటూ “అందరూ పని ఉండే వస్తారు. ఆ పని ఏంటి అని?” “నేను నాటక రచయితను. ఊరు మారితే ఆలోచనలు మారతాయి అని కొత్త కొత్త ప్రదేశాలు చూస్తూ ఈ ఊరు వచ్చాను. కానీ ఇక్కడ జనాలు మరీ విచిత్రంగా ఉన్నారు. నీ లాగా.. ” “ఇంకా కొన్ని రోజులు ఇక్కడ ఉండు, నీకు నేను దేవుడిలా కనిపిస్తాను.” అని నాకు నీరు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపి నేను ఇంటికి వెళ్తుండగా “నాకు ఇక్కడ నివసించటానికి ఒక ఇల్లు కావాలి” ఇతను మాట్లాడుతున్నదానికి అడుగుతున్నదానికి సంబంధం లేదు అనిపించింది. కానీ నాతో ఎవరన్నా ఉంటె నాకు…
Read More

ఊసుల బాసలు

ఊసుల బాసలు దివి నుండి వెలుగు నీవై.. భువి నిండిన అణువు నీవై.. మిన్ను లోను మన్ను లోను.. జోలలు పాడే వాయువు లోను‌‌. గతంగా మిగిలిన జ్ఞాపకంలోను సాగిపోయే భవిష్యత్తు లోను. నిన్న నిమిషంలోను‌ రేపటి క్షణంలోను... నిత్యారాధన ఆరాధ్యం నీవై... నీలోని వెతికే నేను గానో నాలో నిండిన నవ్వు గానో నువ్వు గానో.. కలవని కథల మజిలీ అయినా ఆ ప్రేమే కరుణిస్తే మరుజన్మ గానో.. కాలం దీవిస్తే కడసారి అయినా ఎదురు అవుతావేమో అని చిన్న ఆశతో "నీకై ఎదురు చూసే నీ నేను"" చూసిన క్షణం పెదవి దాటని మౌనం మాటాలడే కనులు మనసుతో ఊసుల బాసలు..... - సీతా మహాలక్ష్మి
Read More

నాన్న

నాన్న చిన్నప్పటి నుండి నన్ను కంటికి రెప్పలా కాచుకుని.. నా వెన్నంటే ఉండి నాకు దైర్యాన్ని నింపుతూ.. నా ప్రతి అడుగులో తొడుంటూ.. నా అల్లరి భరిస్తూ... నా తప్పులని క్షమించి.. నా తప్పులని సరి చేస్తూ.. నా గెలుపు ఓటమి లో.. అన్నింటా నా వేలు పట్టుకుని నేనున్న అని దైర్యాన్నీ ఇస్తూ.. కష్టం అనేది నా దరి చేరకుండా.. ఎంతో అందంగా నా జీవితాన్ని.. తీర్చి దిద్దిన నాన్న.. నా ఎదుగుదల గురించి.. నా భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కని... ఎంత కష్టం వచ్చిన ఎలా ఎదుర్కోవాలో నేర్పించిన నాన్న... నీ కూతురి జీవితం గురించి నువు కన్న కలలు నిజం అయ్యే సమయం లో నా చేయి వదిలి.. నన్ను ఒంటరి చేసి..నన్ను దిక్కు తోచని స్థితిలో.. తెగిన గాలిపటం వలె నన్ను వీడి అనంత లోకాలకు చేరిన నాన్న... ఏ ఆధారం తో నేను…
Read More

జై జావాన్

జై జావాన్ ఎన్నో ఆశలతో ఎన్నో కలలతో నీ చేయి పట్టుకుని నీతో ఏడడుగులు వేసి నీ ఇంట్లో అడుగు పెట్టాను.. అనుకోలేదు ఏనాడు ఇంత మంచి మనసు కల వాడు నాజీవితం లోకి వస్తాడు అని.. నాతో నా చేయి పట్టుకుని నడిపించేవాడు అవుతాడని.. ఎంతో ఎదురు చూసాను.. నీ లాంటి ఒక మంచి తోడు నాకు రావాలని.. కానీ ఇంటిని ఆలిని వదిలి.. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. దేశ రక్షణే.. నీ ధ్యేయంగా.. దేశ గౌరవమే నీ లక్ష్యంగా... దేశం కోసం మాకు ఎక్కడో దూరంగా నీ ప్రాణాలు పణంగా పెట్టీ బతుకు తున్నావు .  నువ్వు క్షేమంగా ఇల్లు చేరాలని నీ కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నీ కోసం ఎదురు చూస్తున్న నీ భార్య... దేశం కోసం రాత్రి పగలు తేడా లేకుండా ఇల్లు ఆలి పిల్లలు అని లెక్క చేయకుండా తన…
Read More

సృష్టి

సృష్టి నా అందమైన శత్రువు ఈ ప్రపంచం ఎందుకంటే.. ఈ సృష్టి ని ఆస్వాదించే ప్రతి క్షణం, మనసుకి ఎంతో హాయి అద్భుతమైన ఆనంద భావనా... ఇక్కడ ఎన్నో వేల కోట్ల జీవరాశులు అందులో ప్రత్యేకమైన వారే ఈ "మనుషులు"... గజిబిజి గందర గోళ ప్రపంచం లో ప్రతి మనిషి జననం మరియు నడవడిక మన తల్లితండ్రుల నుండి కొంత నేర్పిన పూర్తిగా బయట ప్రపంచం నుండి నేర్చుకోవాలి.... ఎంతో మంది ఊహా తెలిసినప్పటికీ నుండి వచ్చే వాళ్ళు, వెళ్ళే వాళ్ళు ఎందరో... వారి నుండి నేర్చుకుంటూ నేర్పిస్తూ ముందుకు సాగాలి ఈ అందమైన ప్రపంచం ఒక్కో సమయంలో మంచిగా మనతోనే ఉన్నట్లుగా, ఒక్కో సమయంలో బద్ద శత్రువై కనిపిస్తుంది.... ఇక్కడ మంచి, చెడు, కష్టం, సుఖం దుఃఖం సంతోషం ఆనందం బాధ బాధ్యత, ఓపిక సహనం పట్టుదల, సాధన, సంపాదన, ఎత్తులు, పై ఎత్తుల చదరంగం, అన్నీ రుచి చూపిస్తుంది.…
Read More