Month: December 2022

ఎవరు పార్ట్ 1

ఎవరు పార్ట్ 1 అరగరాగా అలీ అనే ఒక అతను అప్పుడే కొత్తగా కట్టిన రైల్వే స్టేషన్ ముందు బయట టాయిలెట్ పోసుకుంటూ, ఎవరైనా గమనిస్తున్నారా అని అటు ఇటు చూస్తూ ఉంటాడు. అంతలో ఒక గెడ్డం వాడు ఒక బ్యాగ్ వేసుకుని, మనిషి లాగే రెండు చక్రాల రిక్షా దిగి అతని బ్యాగ్ కూడా అలీ బ్యాగ్ పక్కన పెడతాడు. అతని మొహం కన్నా జుట్టు ఎక్కువ ఉండటం వల్ల, అతను చూడటానికి వింతగా కనిపించాడు అలీకి. ఆ రిక్షా వాడికి డబ్బులు ఇచ్చి అతను బ్యాగ్ తీస్కుని స్టేషన్ వైపు పరిగెడతాడు. అతను ఎందుకు ఆలా పరిగెడుతున్నాడో అర్థం కాక అలీ జిప్ పెట్టుకుంటూ తన బ్యాగ్ తీసుకుంటాడు. ఆ బ్యాగ్ అతనిది కాదు అని చూసుకుని అలీ ఆ గెడ్డం వాడి వెనకాల పరిగెడతాడు. అలీ: “ఏయ్.... ఏయ్... అది నా బ్యాగ్”. గెడ్డం అతను ఇంకా…
Read More

అందమైన శత్రువు

అందమైన శత్రువు ఏమి తెలియని నా జీవితం లో అందమైన శత్రువు .. నువ్వే..! ఎన్ని తిప్పలు పెట్టినా.. ఎంత విసిగించినా.. ఎంత కోప్పడ్డా.. నీ కళ్ళల్లో కనిపించే నా మీద ప్రేమ అన్నీ.. మరచిపోయేలా చేస్తుంది.. నా జీవితానికి ఆధారం నువ్వు కాదు.. మనపై మనమీద మనకుండే అంతులేని ప్రేమ.. అన్నీ గెలిచేలా.. చేస్తుంది.. అందుకే.. నువ్వంటే అంత ప్రేమ.. ఎంత ప్రేమొచ్చిన.. అలక అలిగితే తీర్చవు.. బుజ్జగించవు సరికదా.. ఏమిటి ఇంకా నువ్వు చిన్నపిల్లవా..అని ప్రశ్నించి ప్రేమను దాచేస్తావ్.. అందుకే నువ్వు నా అందమైన శత్రువు.. ముద్దుగా తిట్టినా.. మొరటుగా మొట్టికాయలు వేసినా.. నీమీద.. ఎంతో ప్రేమను కురిపిస్తూ.. కరిగి కన్నీరైపోతాను.. చివరికి.. నాలో నేనే తలుచుకుంటూ నవ్వుకుంటాను.. అందుకే నువ్వంటే గౌరవం.. నువ్వంటే అమితమైన ఇష్టం.. చచ్చేంత ప్రాణం! - గాయత్రీభాస్కర్ 
Read More

రాక్షసి

రాక్షసి నువ్వు నాకు ఎంతో ఇష్టం. నువ్వు నాతో ఉంటే నాకు అసలు సమయమే తెలీదు. నువ్వు నేను చిన్ననాటి స్నేహితురాలు అయిన, కొన్ని కారణాల వల్ల మనం విడిపోయాము. ఎన్నో ఏళ్ల తర్వాత మనం కలవడం. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని , మనం చిన్నపిల్లలం అయిపోయాము... నువ్వే నా అల్లరి రాక్షసి... నువ్వే నాకు ధైర్యం నూరిపోసావు... నువ్వు నాకు అందమైన శత్రువువి.. ⁠- మాధవి కాళ్ల
Read More

అందమైన శత్రువు

అందమైన శత్రువు నా పరిచయం ఎలా చేసుకోవాలో ఏమి అని చెప్పాలో తెలియటం లేదు. ఎంతమంది లో వున్న ఎంతమందికి తెలిసినా కొందరు స్వార్ధం కోసం ఉపయోగిస్తే చాల తక్కువ మంది నన్ను నన్ను గా నేను ఏంటో తెలుసుకొని ఎదుటి వారికీ అందిస్తున్నారు. ఈ కాలం లో నిజాయతి గా నన్ను వారిలో ఉంచుకొనే వారు కరువై అందమైన అబద్ధం గా నన్ను చిత్రీకరించి ధన మాన ప్రాణాలను తీస్తున్నారు ఇస్తున్నారు అసలు నన్ను తమలో ఉంచుకొని స్వలాభం, స్వార్ధం కోసం ఉపయోగిస్తున్న ఏమి చేయలేని నిస్సహాయస్థితి లో వున్నాను. ఎన్నో ఊహలతో భవిష్యత్తు గురించి కలలతో నాలో ఇమిడిపోతున్న ఎందరినో ఈ మానవాళి లో వున్న కుతంత్ర భావాలతో నన్ను పావుగా వాడుకొని నా విలువ తగ్గిస్తున్నారు. ఎటువంటివారు అయినా ఏదో ఒక సమయం లో నన్ను తలుచుకొని నాకు పెట్టుకొన్న ముద్దు పేరు.. అందమైన శత్రువు ఇంతకీ…
Read More

వచ్చింది వచ్చింది..

వచ్చింది వచ్చింది.. వచ్చింది వచ్చింది.. నిన్ను వీడని నీడను నేనే.. అంటూ అక్క పోయి చెల్లిని పంపిచింది... మరువలేని మహమ్మారి.. మనల్ని విడిచి ఉండను అంటుంది.. మనం చేసుకునే పనులు చాలక మనకే పనుల్ని చెప్పడానికి వచ్చింది.... బ్రహ్మం గారు చెప్పిన మాటలును గుర్తు చేయడానికి, మన కనీస ధర్మాలను పాటించమని చెప్పడానికి ఆఘమేఘాలు మీద... అక్క మీద అలిగి.. చెల్లి ఇంకొసారి వణికించడానికి వచ్చింది.. అయినా మనం తక్కువ ఏంటి? అక్కా , చెల్లి దాని తల్లి ఎవరు రాని... ఎదురు నిల్చి ఎగరగొట్టేదాం.... కరాలు కడిగి, కనీస దూరం పాటించవోయి... రిలాక్స్ అయి రిమిక్స్ విందాం అనుకునే లోగ.. రయ్యి రయ్యి మంటూ రంకెలేస్తూ వచ్చేసింది.. మహమ్మారి ని మడుగున పెట్టే సూచనలును తిరిగి గుర్తు చేయడానికి వచ్చింది... అదేనండి... ఓమిక్రాన్ Bf7 - తోగారపు దేవి
Read More

కలలు.. కాంతులు..

కలలు.. కాంతులు.. కలలు తాగని రాత్రులన్నీ కలత నిండిన వనాలేగా వెతలు పండిన పొలాలన్నీ మేటవేసిన మనుషులేగా దారితప్పిన మనసులన్నీ ధ్వంస రచనకు వ్యూహమల్లగ చీకటే మిగిలింది జగతిన చిన్నబోయెను జ్ఞానమార్గము నీరుగారెను ఆశలన్నియు మోడువారెను ప్రేమవృక్షము ఖేదమేమో కెలకసాగెను మోదమేమో మసకబారెను దుఃఖపడకోయ్ సోదరా కాలమెన్నడు జడము కాదు మార్పు తెచ్చే రోజు ఉంటది నిన్ను వెతికే తీరుతుందది బొమ్మ బొరుసు రెండు ఉంటయి బతుకు పోరులో వెంట ఉంటయి బాధపెట్టే రోజు వెంటే అభయమిచ్చే ఆశ ఉంటది - సి. యస్. రాంబాబు
Read More

నమ్మకం

నమ్మకం "హాయ్! కీర్తి ఎలా ఉన్నావే? ఎంత కాలం అయిందే" అని ఎంతో సంతోషంతో చెప్పుతుంది రమ్య. "అవునే చాలా ఆనందంగా ఉంది మన చిన్నతనంలో ఎక్కడికి వెళ్ళినా మన కలిసే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావ్. నీకు పెళ్లి అయ్యిందా?" అని అడిగింది కీర్తి. "నీకు మన చిన్ననాటి విషయాలు చాలా బాగా గుర్తు ఉన్నాయే... ఈ గుడికి కొద్ది దూరంగా ఉంటున్నాము. మన చదువు పూర్తి అయిన తర్వాత నాన్న అనారోగ్యం కారణం వల్ల చనిపోయారు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. నేను అమ్మని తీసుకొని సిటీకి వచ్చేశాము. తమ్ముడిని హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాను. నీకు పెళ్లి అయ్యిందా?" అని అడిగింది రమ్య. "అవునా! ఇంత జరిగిందా? అని చెప్పి కొంచం బాధ పడింది. నాకు పెళ్ళి అయ్యి ఆరు నెలల అయింది. మేము కూడా పక్కనే ఉంటున్నాము. రా మా ఇంటికి తీసుకొని వెళతాను" అని చెప్పింది కీర్తి.…
Read More

ఓ పల్లెటూరి కథ

ఓ పల్లెటూరి కథ మీ అందరికి తెలుసు పల్లెటూరి మాటతీరు ఎట్లా ఉంటుందో అని... సూరమ్య, రాములమ్మ అనే ఇద్దరి ముసలివాళ్లు ఉండేవారు. వీరి ఇద్దరి ఇల్లులు ఎదురేదురుగా ఉంటాయి. సూరమ్మ ఇంటి పక్కన పంకజం ఉంటుంది. తను తగువుల ముచ్చి.. తగువులు పెట్టే మనిషి. సూరమ్మ మొగుడు తాగుబోతు.. సూరమ్మ కి కోడి ఉండేది. దాన్ని ప్రేమగా పెంచుకునేది.. ఇలా ఉండగా ఒకరోజు సూరమ్మ.. పొద్దు పోతుంది. ఇంకా నా కోడి రావడం లేదు అని... దారవాత.. ఎక్కడ నక్కిపోనావే... దొనకాసోడికే.. నెతికి నెతికి సచ్చిపోనాను గదే... అంటూ ఓ! గంగవ్వ నా కోడిని గాని సూసినవేటి... ఓ! నరస్సయ్య నా కోడి గాని మీ కోళ్లతో వచ్చేసినదేటి?.. అంటూ వీధిలో వాళ్ళని అడుగుతూ ఉంటే.. ఇంతలో ఇదంతా గమనిస్తున్న పక్కింటి పంకజం. అసలే తగువుల ముచ్చి... సూరమ్మ ని పిలిచి ఏటి అయినాదే? అలా అరుస్తుండావు? అని అడిగితే..…
Read More

ఈ చెప్పుడు మాటలు

ఈ చెప్పుడు మాటలు ఇవి విషమనసుల నిజస్వరూపాలకి నిదర్శనాలు.. మంచికి కంచె వేసి మానసిక వేదనలకి వేదింపులకు వేదికలు.. వినే వారి చెవులకు సోపానాలు విందైన పసందులు.. నమ్మకాలకు అపనమ్మకాలకు మధ్య పరీక్ష పెట్టే నిప్పు కణికలు.. ఇవి లేని దేశం లేదు ఇవి అనుభవించని కుటుంబం లేదు.. వీటి బారినపడని మనసు లేదు.. ఎంతైనా ఎంత ఎంత అని ఎత్తు పైఎత్తులు గా ఎదుగునో ఈ చెప్పుడు మాటలు.. బతుకు బాటలో ఇవి వేసే సవాళ్ళకు ఎదుర్కొనే సత్తా కలిగించుకుని ముందుకు నడవడమే మనిషి మనసు కి ఇచ్చుకునే మానసిక ధైర్యం... మాటలు స్ఫూర్తిని ఇచ్చి జీవితాలను నిలపెట్టగలవు.. చెప్పుడు మాటలు అంతరాయాల గాయాలను రగిల్చి జీవితాలను కొల్లగొట్ట గలవు.. చెప్పుడు మాటలు ఎంత ఎత్తు ఎదిగిన కొద్దీ కాలమే (నిజాలు నిజాయితీ అనేవి ఎప్పటికైనా తెలుస్తోంది కాబట్టి).. మంచి మాటలు మరణం తర్వాత కూడా జీవిస్తాయి... - సీతా…
Read More

నమ్మకం

నమ్మకం "లోకులు కాకులు అంటారు.. మనం ఏం చేసినా మన మనసుకి తెలిసే చేస్తాం కదా.. మన మీద ఉన్నవి లేనివి కలిపించి చెప్పే ఏ మాట నమ్మక్కర్లేదు.. మన మీద నమ్మకం ఉంటే చాలు.. చెప్పుడుమాటలు చెవికి ఎక్కవు.. ఎక్కించుకోలేం కూడా.." అనసూయమ్మ గారూ ఇలా చెప్పింది నాతో..! కానీ ఆవిడ చెప్పింది కూడా నిజమే కదా.. నమ్మకం ఉంటే చాలు.. ఎవరు ఏం చెప్పినా వినక్కర్లేద్దు.. కోపాలు తెచ్చుకోవక్కర్లేద్దు అనుకుని నా పనిలో నేను నిమగ్నమైపోయాను - గాయత్రీభాస్కర్
Read More