Month: February 2023

ఆనందమైన జీవితంలో అపశృతి

ఆనందమైన జీవితంలో అపశృతి ఏమ్మా అంతా రెఢీ నా అంటూ వచ్చారు రామారావు గారు. హా అంత రెఢీ అండి ఇంకా వాళ్ళు రాలేదే అంది అనురాధ. వస్తారు లే సరిగ్గా ముహూర్తానికి వచ్చేస్తారు ఇప్పుడే ఫోన్ చేశాను దగ్గర్లోనే ఉన్నాం అన్నారు అన్నారు రామారావు గారు. ఓహ్ అవునా సరే అయితే దివ్య నువ్వు ఇంకేదైనా ఉంటే సరి చేసుకో నేను వెళ్లి టిఫిన్స్, టీ అయ్యాయా చూస్తాను అంటూ దివ్యకు చెప్పి వెళ్ళింది అనురాధ. హా సరే అమ్మ అంది దివ్య. దివ్య, రామారావు అనురాధ దంపతుల ఒక్కగానొక్క కూతురు, కొడుకు పుట్టి చనిపోయాడు. దాంతో దివ్యనే గారాబంగా పెంచారు. దివ్య కూడా పిచ్చిపిచ్చి పెనులేమీ చేయకుండా తల్లిదండ్రులు చెప్పినట్టుగా నడుచుకుంటూ డిగ్రీ వరకు చదువుకుంది. ఇప్పుడు డిగ్రీ అయిపోగానే నీకు పెళ్లి చేస్తాము అన్నారు అందుకు కూడా దివ్య ఒప్పుకుంది ఆనందంగా. ఇప్పుడు అదే హడావుడి ఇంట్లో…
Read More

సాయిచరితము

సాయిచరితము పల్లవి నిను చూడాలని నిను చేరాలని తపియించేము సాయీదేవా కరుణించవయా సాయీదేవా చరణం దైవ స్వరూపమై భువి చేరితివని నమ్మితిమయ్యా రక్షించవయా కాల పరీక్షకు నిలువము మేము మన్నించవయా సాయిదేవా మా దోషములను పరిహరించినచో పురివిప్పునుగా మాతనువంతా చరణం శత్రువు మిత్రుడు అందరు ఒకటే అని భావించి ఆదరించెదవు నిన్నే తలచి నిను ధ్యానించిన చిత్తముకెంతో శాంతి కదయ్యా చివరకు మిగిలేదేమీలేదని తెలిసిన మాకు నీ కరుణొకటే చాలు కదయ్యా భవసాగరముల బాధే పెరిగెను అయినా మేము బాధేపడక నీ లీలలు మే చదివితిమయ్యా చరణం నీ కృపతోటే ఎందరెందరో ధన్యులుకాగా అది తెలుసుకుని నిను ప్రార్థించి వేడిన మాకు అభయమునొసగి దారే చూపిన భక్త వరదుడవు నీవేకాదా నీ నీడందున ఉండిన చాలు వేరేదేమి కోరము మేము కాపాడేందుకు గురువుండునని నమ్మితిమయ్యా సాయీదేవా ఈ సత్యమునే మరువక మేము సాగెదమయ్యా.. సాయీదేవా - సి.యస్.రాంబాబు
Read More

కవల సహోదరులు

కవల సహోదరులు అనగనగా వీరాపురం అనే ఒక పల్లెటూరు ఉండేది. అచ్చట చంద్రయ్య అనే రైతు తన కుటుంబంతో నివసిస్తుండేవాడు. ఆయనుకు ఇద్దరు అబ్బాయిలు. బాగా చదువుకుంటారు. ఇద్దరు కవల సహోదరులు. వారి పేర్లు సదానందం మరియు చిదానందం. పక్క ఊరు నర్సాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుకుంటున్నారు. దసరా పండుగ సెలవలు వచ్చాయి. పదిహేను రోజులు ఆనందంగా గడపటానికి ఇంటికి వచ్చారు. తల్లితండ్రులు చాల ఆనంద పడ్డారు. ఎందుకు పడరు? కవల పిల్లలంటేనే ఇంటికొక అందం! అమ్మ శాంతమ్మ రకరకాల పిండివంటలు చేసారు పిల్లల కోసం. ఈ సంవత్సరం వర్షాలు బాగానే పడ్డాయి. పొలం పనిలో చంద్రయ్య ఇంటినుండి బయటకి వెళ్ళటం మొదలు పెట్టారు. వారికి పొలంలో ఒక నుయ్యి ఉన్నది. నీరు కోసం బావి నుండి చోదకయంత్రం (మోటారు) పెట్టి, గొట్టం ద్వారా నీరు తీసి పొలానికి పంపిణి చేస్తారు. వీరాపురం గ్రామం నుండి…
Read More

తప్పదిక

తప్పదిక కలలన్నీ ఇంకిపోవ బతుకంతా బెంగ కలతేమో తీరకుంది చీకటేమో చుట్టుచేరె తప్పదిక సాగాలోయ్! రాత్రంతా కలతనిద్ర బరువెక్కెను ఙ్ఞాపకాలు బాటేమో కానరాక తల్లడిల్లు మనసును నీవే ఇక సాకాలోయ్ సాకుతు సాగాలోయ్ కుదుపులతో జీవితం గమ్యాన్ని చేరదిక కనిపించని శక్తేదో నిన్నుచేర వచ్చువరకు తప్పదిక సాగాలోయ్! పదాలన్ని వెక్కిరించ కవితేమో కుదరిదంక ఇంకిపోవు భావనలను చెదిరిపోవు కలలను పోగుచేయాలోయ్ ముందుకు సాగాలోయ్! నీవంక చూడరెవరు నీవెంట రారెవరు నీకు నీవు తోడుగా నీ నీడే వెంటరాగ సాగాలోయ్..తప్పదిక సాగాలోయ్ తప్పుకాదు వైఫల్యము ఒప్పుకాదు విజయము బేరీజుల రివాజుతో బేషరతుగ సాగాలోయ్ తప్పదిక సాగాలోయ్ - సి.యస్.రాంబాబు
Read More
స్నేహం ఏవో ఊసులాడి ఎన్నో పంచుకొని ఏదో హాయినిచ్చే స్నేహాన్ని తెలుపగలమా అప్రయత్నంగా. అనుకోని దారిన కలిసి నిస్వార్థంగా. ఆపదలో సాయం చేసే స్నేహాన్ని తెలుపగలమా అపార్థ భావనలకు ఈర్ష, ద్వేషాలకు చోటివ్వని దారిలోని స్నేహాన్ని తెలుపగలమా సంతోషం. భరువనిపించే భాదలో అడగకుండానే జత కట్టే అడుగుల్లోని స్నేహాన్ని తెలుపగలమా ధనిక, పేద కులము, మతము భాషా, వేషాలనే గతుకుల్లేని వంతెన స్నేహం. - హనుమంత
Read More

నాతిచరామి

నాతిచరామి గతంలో రాసిన ఇంటింటి రామాయణం లో భాగంగా ఇదొక భాగం, ఇది నాతిచరామి అనే శీర్షిక కు సరిపోతుంది అని భావిస్తూ, మీ అభిప్రాయం తెలుపండి. దాని గురించి, దాని భర్త నరయ్య గురించి ఆలోచిస్తూ కూర్చున్న నేను మాలచ్చి తండ్రి భద్రయ్య మా అమ్మగారి ఊర్లో పెద్ద పాలేరు అప్పుడన్ని గోవులు, బర్రెలు, వ్యవసాయనికి చెదోడు వాదోడుగా ఉండేవాడు, మా చిన్నప్పుడు మాకేం కావాలన్నా నిమిషంలో తెచ్చి పెట్టె వాడు ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే భద్రయ్య రాత్రి కాగానే మాత్రం బాగా తాగేసి, తన పాక లో ఉన్న తన భార్య పంకజంని బండ బూతులు తిడుతూ ఊగిపోయేవాడు భద్రయ్య ... అంత తిడుతున్నా కూడా పంకజం ఒక్క మాట కూడా బయటకు రాకుండా, వాడి వాగుడు అంతా అయ్యాక నులక మంచం లో పడుకుంటే వాడికి అన్నం కలిపి పెట్టేది ఎంతో ప్రేమగా. మా పెళ్లిళ్లు…
Read More

ప్రేమంటే ఇదే

ప్రేమంటే ఇదే ఏదో... ఆలోచనల్లో వున్న శరత్ గారు.. వాళ్ళావిడ వీల్ చైర్ నుండి వచ్చిన బెల్ శబ్దం తో ఉలిక్కిపడి వెంటనే పడక గది నుండి వరండాలోకి పరుగు లాంటి నడక తో వచ్చారు.. ఆవిడ ఆకలి వేస్తోంది అంది.. వెంటనే ఫ్రిజ్ లో వున్న పిండి తీసి అట్లు వేసి ఇచ్చారు.. 30 సం.. క్రితం వెన్నుపూస విరిగిపోవడం వల్ల అప్పటి నుండి ఆమె ఆ వీల్ చైర్ కే పరిమితం అయ్యారు.. ఆవిడ పడుకుంటాను అంటే వెంటనే మంచం మీదకి జాగ్రత్తగా పడుకోబెట్టి.. ఆమె నిద్ర పోయె వరకూ అక్కడే వుండి ఆయన ఆమెనే చూస్తూ... గతం అంతా గుర్తు చేసుకున్నారు.. శరత్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.. ముగ్గురు అన్నదమ్ములు. తండ్రి రిటైర్డ్ govt ఉద్యోగి.. అనుకోకుండా తల్లి అనారోగ్యంతో మరణించింది.. శరత్ తండ్రి నీవు పెళ్లి చేసుకో.. ఇంటికో ఆడ దిక్కు వుంటుంది…
Read More

ఆదిత్య హృదయం

ఆదిత్య హృదయం నీకై వేచేము నీడగ నిలిచేవని పయనము నీదయ్యా పలుకే మాదయ్యా లేదు మాకు శాంతయ్యా చికాకు చినుకుల్లో తడిసేము చూడయ్యా వెలుగై రావయ్యా కొండా కోనలలో పల్లె పట్నాలన్నీ తిరుగుతు ఉంటావు నవ్వుతూ చూస్తావు అలుపే లేకుండా అవనిని చుడతావు నువు లేకుంటేను మాకేమొ బెంగయ్యా తిరుగుట సంబరమై అంబరాభరణమై సాక్షీభూతుడివే ఆదిత్య హృదయుడివే - సి.యస్.రాంబాబు
Read More

ధరాభారం

ధరాభారం పక్కింటివాళ్ళు ఏదో బాస్కెట్ అంట అక్కడినుంచి కూరగాయలు తెచ్చుకుంటున్నారు. చూడు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో అంది అమ్మ. మనం కూడా అలా తెచ్చుకుందామా అంటూ అడిగింది.సరే వాళ్ళు ఏమేమి కూరగాయలు తెచ్చుకున్నారు ఎంత బిల్ అయిందో ఒకసారి అడగమ్మ అన్నాను నేను.అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుగా వెళ్లి ధరల పట్టికను తీసుకొని వచ్చింది.ఇప్పుడు ఆ ధరల పట్టిక తీసుకొని చూడు అన్నాను టమాట కేజీ 80 ఉల్లిగడ్డ కేజీ 60 ఉల్లిపాయ కేజీ 120 వంకాయ కేజీ 70 అంటూ మొత్తం ధరల పట్టికను చదివింది. అమ్మ ఇప్పుడు చెప్పు మొత్తం బిల్లు ఎంత అయింది అంటూ అడిగాను.మొత్తం కలిపి 2000 అంటూ కళ్ళు తేలేసింది అమ్మ. ఏమిటి కూరగాయలకు 2000 అది కూడా వారానికి సరిపోతాయి వాళ్ళు మనలాగే ఐదుగురు కదా అంది అమ్మ. అవునమ్మా వాళ్ళ ఇంట్లో అందరూ పని చేస్తారు కాబట్టి తీరిక ఉండదు…
Read More

ఎడారిలో ప్రయాణం

ఎడారిలో ప్రయాణం హాయిగా సాగుతున్న నా జీవితంలోకి మెరుపులా వచ్చావు మైమరపింప చేసావు కన్నవారిని తోడబుట్టిన వారిని మరచిపోయేలా నీ ప్రేమతో నన్ను కట్టి పడేసావ్, ఆ మైకంలో నేను నన్ను కన్న వారిని తోడబుట్టిన వారిని చుట్టాలందరినీ మరచి నీకోసం నీ వెంట నడిచాను తీసుకువెళ్లి ఏడడుగులు నడిపించావు కొన్నాళ్ల మన ప్రయాణంలో సరిగమలు ఎన్నో రుచి చూపించావు.... ఆ రుచి ఫలితంగా మనమిద్దరం మనకు ఇద్దరు అంటూ ఎగిరి గంతేసే లోపు మళ్లీ వస్తానంటూ వెళ్లావు క్షణాలు యుగాలుగా యుగాలు రోజులుగా రోజులు నెలలుగా నెలలు సంవత్సరాలుగా గడిచిపోతున్న నీ జాడ కానరాకఈ కుళ్ళుబోతు సమాజంలో ప్రతి ఒక్కడి చూపును తట్టుకుంటూ ఇద్దరు పిల్లలతో ఎంతమంది చుట్టాలున్నా ఎవరూ దరిచేరినియక, కన్నవారు సైతం నువ్వు చచ్చావ్ అంటూ శాపనార్ధాలు పెట్టాక తిరిగి వారికి ముఖం చూపించలేక, నా చిన్నారి పిల్లల్ని ఎలా సాకాలో తెలియక ఈ నవ నాగరిక…
Read More