Month: February 2023

సాయిచరితము

సాయిచరితము పల్లవి అలసిన మనసుకు ఆశవు నీవే సాయి వెలిసిన బతుకుకు శ్వాసవు నీవే సాయి చరణం నీడవు నీవని నమ్మితిమయ్యా తోడువు నీవని తలచితిమయ్యా పదమే కడుతూ ప్రార్థన చేసి వేడితిమయ్యా సాయి..వెతలే తీర్చవ సాయి చరణం నీవే తప్ప దైవము కలదా నీ ధ్యానమునే చేసిన చాలును దిగులు గుబులు మాయము కావా నీ దీవెనయే రక్షణమాకు సాయి చరణం ఊపిరి నీవే ఊహవు నీవే ఊయలలూపే శక్తివి నీవే కారడివందున జీవితమున్నది కాపాడేందుకు కదలిరావయా సాయి చరణం నిర్మలరూపుడు సాయినాధుడు ఆతని చరితము మనకు వేదము నిత్యము మనము పఠనము చేసిన మనమునకెంతో శాంతము కలుగును భాయీ - సి.యస్.రాంబాబు
Read More

బంగారు తల్లి

బంగారు తల్లి పుట్టింట్లో గారాబంగా పెరిగిన బంగారు తల్లి. పుట్టింటి మురిపాల తల్లి.. ఘల్లు ఘల్లు మని గజ్జెలు కట్టి ఇల్లంతా సందడిగా తిరిగే ఓ బుట్ట బొమ్మ... కాళ్ళకు పారాణి పెట్టీ అత్తింట్లో అడుగు పెట్టావు.. పుట్టింటి పరువుని అత్తింటికి గౌరవాన్ని కాపాడే ఓ ఇంటి దేవత... ఇంటికి దీపం ఇల్లాలు అంటారు.. ఆలీగా, కోడలిగా, ఆ ఇంటికి వారసులను ఇచ్చే ఓ మాతృమూర్తి.. నీవు ఎక్కడ ఉంటే అక్కడ సిరులు పండే సిరుల తల్లి.. ఎందుకమ్మా చినబోయావు.. ఎందుకమ్మా మూగబోయావు.. ఎందుకమ్మా తల్లడిల్లుతున్నవూ ఎటు పోయాయి నీ సందడి గంతులు.. ఎటు పోయాయి నీ చిరనవ్వులు.. ఎటు పోయాయి నీ కలలు.. కన్న వారి కల తీర్చాలని.. పెళ్లి చేసుకొని నీ కలలు మర్చిపోయావా..? అత్తింటి కట్టు బాట్లకు లోబడి.. నిన్ను నువ్వు కొల్పోయావా..? నిన్ను వంటింటికి పరిమితం చేసి ఇదే నీ సామ్రాజ్యం అని.. వంటింటి యువరానిగా…
Read More

యోధ ఎపిసోడ్ 13

యోధ ఎపిసోడ్ 13 రాత్రైంది .. ఉరుములు, మెరుపుల శబ్దాల దాటికి ఒకసారిగా ఉలిక్కిపడుతూ స్పృహలోకి వచ్చాడు పార్ధు. చుట్టూ ఎటు చూసిన చీకటే! దానికి తోడు బయట నుండి పెళ్ పెళ్ మంటూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్న భయంకరమైన పిడుగులు, ఉరుముల కాంతి ఆ గెస్ట్ హౌస్ లోకి చొచ్చుకుని వస్తుంది. కింద తడుముతుంటే, తనకి మెత్తగా ఒక పరుపులాంటిది తగలడంతో, తను మంచం మీద ఉన్నట్టు గ్రహించాడు. "అదేంటి..! కొద్ది సేపటి క్రితం నేను స్పృహ కోల్పోయి పడిపోయింది రూం బయట కదా! ఇక్కడికెలా వచ్చాను?, నన్నసలు ఈ బెడ్ మీదకెవరు తీసుకొచ్చారు? " అంటూ తనలో తానే ప్రశ్నలు సంధించుకుంటున్నాడు. అలా తను అనుకుంటున్నాడో..? లేదో..? అదంతా విని ఎగతాళి చేసినట్టుగా "హా..హాహాహ్హ... హాహ్హహ్హ..." అంటూ ఆడ, మగ కలగలిపిన స్వరంతో కూడిన నవ్వులు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ, ఆ రూం గోడలకి ప్రతిధ్వనిస్తూ మరింత భయకరంగా పార్ధుకి వినిపిస్తున్నాయి. భయంతో పార్ధుకు మింగుడు పడడం…
Read More

ఓ రమ్య కథ

ఓ రమ్య కథ భారీగా కట్నం, నగలు ఇచ్చి రమ్య పెళ్లి చేశారు పెద్దలు వద్దన్నా వినకుండా, రమ్య డిగ్రీ చేసి, ఐ ఏ ఎస్ కావాలని అనుకుంది. కానీ పెద్దలు మాత్రం చదివిన డిగ్రీ చాలు అంటూ పెళ్లి చేశారు. రమ్య ముందుగానే నెమ్మది మనిషి దానికితోడు పెద్దలంటే గౌరవం కాబట్టి తు.చా తప్పకుండా వింటుంది వారి మాటలను. పెద్దలు తన గురించే చెప్తారు కాబట్టి తను అందుకు ఒప్పుకుంది.. పెళ్లి జరిగాక కానీ అసలు విషయం బోధపడలేదు రమ్యకి. భర్త, మామ ఇద్దరూ కలిసి కూర్చుని తాగడం, అత్త కిట్టీ పార్టీలు అంటూ బయట తిరగడం. ఆడపడుచులు ఏమి పట్టించుకోకుండా 24 గంటలు ఫోన్లలో తలదూర్చి చాటింగ్స్, ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటూ ఉండడం గమనించింది. తాను ఉన్న వాతావరణం వేరు ఇప్పుడు ఈ వాతావరణం వేరు కాబట్టి ఎలాగైనా తనే సర్దుకుపోవాలి అని మనసులో గట్టిగా నిర్ణయించుకుంది.…
Read More

ఇల్లాలు జీవితం

ఇల్లాలు జీవితం ఇల్లాలు ఇంటికి దీపం అంటారు... కానీ ఇల్లాలు జీవితంలో ఎలాంటి వెలుగు ఉండదు.. ప్రతీ రోజూ, ప్రతీ క్షణం తను తన కుటుంబం కోసం బతకాలే కానీ తన గురించి ఏ రోజూ తను ఆలోచించదు. బరువు, బాధ్యత కలిగిన ఆమె జీవితం.. పిల్లలు, భర్త, అత్త, మామలతోనే సాగిస్తూ ఉంటుంది.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కూడా పొందదు.. ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి ఆమె ప్రతి పనిలోనూ తను ఎంతో ఓర్పు, సహనం పాటిస్తూ ఉంటుంది.. తనకు ఉన్ననెర్పరితనంతో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటుంది ఇల్లాలు.. ఇంట్లో సంతోషాల పండగ ఇల్లాలి ఆనందంతోనే మొదలు... కానీ ఇల్లాలు ఎప్పుడూ ఆ వంటింటికి మాత్రమే పరిమితం. అందరి అవసరాలు తీర్చే యంత్రంలా తనని తాను మార్చుకుంటుంది. అందరి సంతోషాల కోసం తన సంతోషాన్ని త్యాగం చేస్తుంది.. చివరికి తనకంటూ ఆ ఇంట్లో ఒక స్థానం ఉంది అని మర్చిపోతుంది...…
Read More

ఇల్లాలు

ఇల్లాలు ఇల్లాలు సంతోషంగా ఉంటే ఇల్లంతా వెలుగులే ఇంటికి దీపం ఇల్లాలు అంటారు చక్కదిద్దే నైపుణ్యం బంధాలకు బలం అందరి అవసరాల అవగతం అందంగా తీర్చిదిద్దే నైపుణ్యం కష్టసుఖాలు కలిమిలేములు సరితూచే ధైర్యం ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపే నేర్పు సంస్కృతి సంప్రదాయాలకు నెలవు త్యాగానికి మరో పేరు అభిమానమే ఆభరణములుగా ఆదాయ వ్యయాల రూపకర్తగా వెలకట్టని సేవా భావం కుటుంబంమే ప్రపంచం అనుకుని సంసార బాధ్యతల్ని చక్కదిద్ది ప్రతినిత్యం జ్యోతిలా వెలుగుతూ వెలుగులు ప్రసరించే తల్లే ఇల్లాలు అది ఈతరం అయినా ఏతరం అయినా ఇంటికి దీపం ఇల్లాలే కదా....... - జి జయ
Read More

పొగచూరిన బతుకులు

పొగచూరిన బతుకులు మావిని ఛేదించుకొని మానవిగా మర్త్యలోకం లోకి అడుగు పెట్టాను.. పురిటి నుంచి మొదలుపెట్టి మెట్టింట్లో అడుగు పెట్టే వరకు పటిష్టమైన శిక్షణను పొంది. సుశిక్షితురాలైన ఇల్లాలుగా మారి పెళ్లి పేరుతో వంటింటి సామ్రాజ్యానికి రారాణిగా మారాను. ఒకప్పుడు తడికట్టెలతో పొగ చూరిన వంటింటితో.  గిన్నెలు కడుగుతూ, పప్పులు రుబ్బుతూ, వడ్లను దంచుతూ, వండుతూ వారుస్తూ, ఎంగిలి విస్తర్లు ఎత్తుతూ, నిరంతరం వచ్చి పోయే అతిధులకు చవులూరించేలా అరిసెలు, గారెలు, మినుపుండలు, మిఠాయిలు వండి పెడుతూ ఎదురులేని మహారాణిగా వెలుగొందాను.. ఇక ఇప్పుడు మానవ మేధస్సు మహోన్నతంగా వెలుగుతున్న అత్యాధునిక సాంకేతిక యుగంలో.. నా పాదం పైకి ఎత్తాను.. వంటగది గడపను ఇకనైనా దాటాలని.. అయితే నా శ్రమను, నా ఆశలను, కోరికలను గమనించారేమో.. పొగ చూరిన వంటిల్లు స్థానంలో అందమైన టైల్స్ తో అపురూపమనిపించే.. ఇంటీరియల్ పనితనంతో కూడిన వంటింట్లో చిటికలో వెలిగే గ్యాస్ స్టవ్ తో గ్రైండర్,…
Read More

మెరిసే నక్షత్రం

మెరిసే నక్షత్రం గాలికి ఊగే చిగురాకులు హృదయ కోవెల చిరుగంటలయితే స్నేహంగా కోయిల కోటితలపుల రాగమయ్యింది! పల్చటి పొగమంచు తెర రాత్రి జ్ఞాపకాలను ఉడ్చేస్తోంది నిద్రలేమి నగరం ఆవులిస్తుంటే అగరుధూపం నడుమ వేడి చాయ్ ఉదయాన్ని వెలిగిస్తోంది! దూరంగా బైరాగి పాట బతుకు అర్థాన్ని మెతుకులా అందిస్తోంది మెరిసే నక్షత్రమై మనసు అక్షరమాలలల్లుతోంది - సి.యస్.రాంబాబు
Read More

యోధ ఎపిసోడ్ 12

యోధ ఎపిసోడ్ 12 ఆ రోజు ఆదివారం. అప్పటికే తెల్లారడంతో, కిందపడి ఉన్న పార్దుకి మెలుకువ వచ్చింది. తన తల మీద ఎవరో కొట్టినట్లు, అంతా పట్టేసినట్లు దిమ్ముగా ఉంది. తనకి తానుగా అక్కడి నుండి లేవలేని స్థితిలో ఉన్నాడు. ఎవరి సహయాన్ని ఐనా కోరదాం అంటే, తన నోట్లో నుండి సరిగా మాటలు కూడా రావడం లేదు. చుట్టూ చూస్తున్నాడు, ఎవరూ కనిపించడం లేదు. తనలో తానే శక్తిని కూడగట్టుకుని మెల్లగా బెడ్ మీదకి చేరుకున్నాడు. అక్కడే పక్కనున్న వాటర్ త్రాగి, అసలు ఓపిక లేని పార్ధు, మంచం మీద పడుకుని, అంతకుముందు జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటూ, పదే పదే తన స్నేహితులను తలుచుకుంటూ బిగ్గరగా అరుస్తూ ఏడుస్తున్నాడు. తన స్నేహితులను కోల్పోవడానికి, చివరికి తను అలా అక్కడ అనాధగా మిగిలిపోవడానికి కూడా కారణం తనేనన్న ఆలోచన తనని వేధిస్తుంది, మరింత బాధిస్తుంది. "అవేశ్... ప్రియా... గోపాల్... గౌతమి... విశాల్...…
Read More

జీవితం ఓ వింత నాటకం

జీవితం ఓ వింత నాటకం విధి ఆడే ఓ వింత నాటకం జీవితం..! ప్రతీ ఘట్టం విభిన్నం, వైవిధ్య భరితం..! ఒక్కో పాత్ర నేర్పుతుంది ఒక్కో గుణపాఠం..! కల్పితం కాదు ఇది అబద్దాల రణరంగం..! బ్రతికినంత కాలం పరువు కోసం ఆరాటం..! చేజారిపోకుండా కాపాడుకోవడమే అంతిమ లక్ష్యం..! యమపాశమై ప్రాణాలను కూడా పట్టుకుపోతున్నా, కనిపించని పరువు కోసం పరుగులు పెడుతూ, కనికరం వీడి కదులుతుంది మానవ హృదయం..! ఉందా అసలుందా..? పరువనేది ఉంటుందా..? ఉంటే..! పరువుంటే..! ఎపుడైనా నీకేదురైతే..! అడగాలనుకున్నది అడిగెయ్..! అది అబద్దమైతే కడిగెయ్..! నీ ఆలోచనల్లోంచి..! ఎవరేమంటే నీకేంటి..! ఎవరేమనుకుంటే నీకేంటి..! బ్రతుకు నీది..! భవిత నీది..! కష్టం నీది..! నష్టం నీది..! మరి ఇష్టమెందుకు ఇంకెవరిదో..? ఎవరికోసమో భయపడితే..! ఎవరికోసమో బ్రతికెస్తే..! నువ్వెందుకు..? నీకు మనసెందుకు..? - రమ్య పాలెపు
Read More