aksharalipi

3275 Posts

రథసప్తమి విశిష్టత

*రథసప్తమి విశిష్టత* 🌷🌷🌷🌷🌷🌷🌷🌷 🌷పురాణాలను ... ఇతిహాసాలను పరిశీలిస్తే సూర్యారాధనకి కాలంలో గల ప్రాధాన్యత అర్థమవుతుంది. అలాంటి సూర్యభగవానుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే రోజుగా 'రథసప్తమి' చెప్పబడుతోంది. లోకాన్ని ఆవరించిన చీకట్లను పారద్రోలి వెలుగును ప్రసాదించడం కోసం సూర్యుడు వేయి కిరణాలను ప్రసరింపజేస్తూ వుంటాడు. ఈ వేయి కిరణాలలో ఏడు కిరణాలు అత్యంత విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి. ఇందుకు సంకేతంగానే సూర్యుడు ఏడు గుర్రాలను కలిగిన రథంపై దర్శనమిస్తూ వుంటాడు. సూర్యుడు తొలిసారిగా ఈ రథాన్ని అధిరోహించి తన బాధ్యతలను చేపట్టిన రోజే 'రథసప్తమి' గా చెప్పబడుతోంది. 🌷ఈ విషయాన్ని లోకానికి తెలియజేయడం కోసమే ఈ రోజున బ్రాహ్మీ ముహూర్తంలో ఆకాశంలోని నక్షత్రాలు రథం ఆకారాన్ని సంతరించుకుని కనిపిస్తుంటాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సూర్యుడు తన ధర్మాన్ని నిర్వర్తించడం కోసం బయలుదేరాడనటానికి సూచనగా ... ఆయనకి ఆహ్వానం పలుకుతూ ప్రతి వాకిట్లోను ఈ రోజున రథం ముగ్గులు కనిపిస్తుంటాయి. సూర్యభగవానుడికి 'అర్కుడు'…
Read More

అభిమతమే…

అభిమతమే... ఒడిదుడుకూ అలజడులే.. ఒద్దిక కుదరని మురిపములే.. ఉదయించడమే నైజములే.. ఉడికించడమే తన విధులే.. మదిలో కూడే సంగమమే.. మోహావేశపు పరిచయమే.. కోరికలాడే ఆటకు సుమలతమే.. తపనల తీరం దారులకై.. అన్వేషించుట అభిమతమే..!! - భాను శ్రీమేఘన
Read More

ఆశ

ఆశ రేపటి స్వప్నం... నిన్నటి గతం... గతించిన కాలానికి ఆయువు... రాబోవు కాలానికి ఆయుధం... నిరాశ నిస్పృహలకు చెరమగీతం పాడేది... ధైర్యానికి పట్టుకొమ్మ... ఎన్నాళ్ళో వేచిన సమయానికి ముగింపు... జీవుని జీవాన్ని నిలబెట్టేది... మానసిక సంఘర్షణలకు నెలవు... మనిషికీ ఊతం... నిరాశలను తరిమికొడుతుంది... జీవితాన్ని నిలబెడుతుంది... - గోగుల నారాయణ
Read More

సందడి

సందడి వేకువజామున కోవెలగంటను నేనై నీ గుండెగూటిలో సందడి చేయాలని ఆశ తొలిపొద్దు వేళ నులివెచ్చని రవికిరణం నేనై నీ చెక్కిలిపై శృతి చేయాలని ఆశ నిండు పున్నమి వేళ పండువెన్నెల నేనై ప్రణయరాగాలు పలికించాలని ఆశ ఆశ తీరేనా అవధులు లేని ఆనందం సొంతమయ్యేనా - మల్లి ఎస్ చౌదరి 
Read More

గాన కోకిలకు అశ్రు నివాళి

గాన కోకిలకు అశ్రు నివాళి.. ఎన్నో పాటలతో తన మృధు మధుర గళం తో ఇన్నాళ్ళు ఉర్రుతలూగించిన గాన కోకిల మన మధ్యనుండి సెలవు తీసుకున్నారు . లత గారు  28-09-1929 జన్మించారు. తన గానం తో ఇన్నాళ్ళు ఎన్నో భాషలలో  తన సత్తా చాటిన లతా మంగేష్కర్ తన ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల కొన్నాళ్లుగా అసుపత్రి లో చికిత్స పొందుతూ 06-02-2022  ఈ రోజున  మనందర్నీ దుఖ సాగరం లో ముంచుతూ  ఈ   లోకాన్ని వదిలి వెళ్ళారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మన అక్షరలిపి అశ్రు నివాళి అర్పిస్తుంది ...💐💐💐💐💐💐💐💐💐💐💐
Read More

ఓ ఆశాచంద్రికా… 

ఓ ఆశాచంద్రికా...  ముసిరిన చిమ్మ చీకట్లని చీల్చుకుంటూ  వేకువను చూపించే రవికిరణం నీవు. కష్టాల కడగండ్ల సాగరాన్ని దాటమంటూ జీవన తీరానికి దారిచూపే తెరచాప నీవు. నిరాశా నిస్పృహల మండుటెడారిలో మది దాహార్తిని తీర్చేటి నీటిచెలమ నీవు. మోడువారిన జీవితాన కొత్త బంధాలు చివురించేలా నింగి నుండి జాలువారే తొలకరి నీవు. జయమ్ము నిశ్చయమ్మురా అని సాగేలా మది గగనంలో వినిపించే ఆకాశవాణివి నీవు. "ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి" అని విరచించిన కవివరేణ్యుడు 'సిరివెన్నెల' గళ నిగళం నీవు.     - శివ.KKR
Read More

ఆశా ప్రపంచం

ఆశా ప్రపంచం ఒకరి ఆశతో, ప్రపంచాన్ని చూశావు. కొందరి ఆశలతో, ప్రపంచంలో పెరిగావు. నీ ఆశతో, ఒక ప్రపంచాన్ని సృష్టించుకోవాలి. నీ ఆశలతో, ఒకరి ప్రపంచానికి వెలుగు నివ్వాలి. అందరి ఆశలతో ప్రపంచం నడుస్తుంది. నీ ఆశ నిన్ను నడిపించాలి. ఆశతో బతకాలి. ఆకాశంలో కాదు. ఆశ లేనిదే జీవనం లేదు. అత్యాశ పడితే జీవితమే లేదు. - బి రాధిక
Read More

పంచాంగము 06.02.2022

పంచాంగము 06.02.2022 *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - శిశిరఋతువు* *మాఘ మాసం - శుక్ల పక్షం* తిధి : *పంచమి* ఉ7.06వరకు వారం : *ఆదివారం* (భానువాసరే) నక్షత్రం: *రేవతి* రా8.29 వరకు యోగం: *సాధ్యం* రా8.15 వరకు కరణం: *బాలువ* ఉ7.06 & *కౌలువ* రా7.20 వర్జ్యం: *ఉ8.04 - 9.43* దుర్ముహూర్తం : *సా4.22 - 5.07* అమృతకాలం: *సా5.59 - 7.38* రాహుకాలం : *సా4.30 - 6.00* యమగండ/కేతుకాలం: *మ12.00 - 1.30* సూర్యరాశి: *మకరం* చంద్రరాశి: *మీనం* సూర్యోదయం: *6.35*  సూర్యాస్తమయం: *5.53* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 
Read More

ఫుల్ టైమ్ పాస్ ఎంటర్ టైనర్ లూప్ లపేట!!!!

ఫుల్ టైమ్ పాస్ ఎంటర్ టైనర్ లూప్ లపేట!!!! రేటింగ్ :  ౩/5 బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ మంచి ఊపు మీద ఉంది ఆమె నటించిన సినిమాలు వరస పెట్టి ఓటిటిలలో రిలీజ్ అవుతున్నాయి. ఆమె మాంచి కథా బలం అలాగే తన పాత్రలో కొత్తదనం ఉన్న సినిమాలు ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు దూసుకు పోతుంది. రీసెంట్ గా ఆమె నటించిన లూప్ లపేట కూడా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. కథ : ఈ సినిమా 1998లో వచ్చిన జర్మనీ సినిమా అయిన రన్ లోల రన్ అనే సినిమా నుంచి ఇన్స్పైర్ అయి తీయడం జరిగింది. ఇక కథగా చెప్పుకుంటే సావి (తాప్సీ) మీద తండ్రి ఎన్నో కలలు పెట్టుకుని రన్నర్ గా ఆమె సక్సెస్ అవ్వాలని కోరుకుంటాడు కానీ ఆ పరుగు పందెంలో ఆమె అనుకోకుండా…
Read More

ఆరోగ్యం అంటే….

ఆరోగ్యం అంటే.... అనారోగ్యానికి ఔషదం అవసరం. ఔషదం ఆరోగ్యాన్ని అందించదు. ఆరోగ్యంగా వుంటే, ఔషదం అవసరం రాదు. ఆరగించినవి అరిగించుకుని, ఆదమరిచి నిదురపోతే, అదే ఆరోగ్యం. -బి రాధిక
Read More